నందమూరి బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రాలలో సమరసింహారెడ్డి చిత్రం ఒకటి. ఫ్యాక్షన్ నేపద్యంతో వచ్చిన హై వోల్టేజ్ మూవీలో సిస్టర్ సెంటిమెంట్ అందరిని ఆకట్టుకుంది. సొంత చెల్లెల్లు కాకపోయినా ఇచ్చిన మాట కోసం వారి బాధ్యతలను తీసుకున్న అన్నగా బాలయ్య నటన ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఆ అక్కాచెల్లెళ్లలో సరస్వతిగా బాలనటి సహస్ర అద్భుతంగా నటించింది.
అలాగే బాలయ్యకు ఆ అమ్మాయికి మధ్య వచ్చే సీన్స్ కంటతడి పెట్టిస్తాయి. అయితే బాలనటి సహస్ర ఈ మూవీ కన్నా ముందు ఎన్నో చిత్రాల్లో నటించింది. రౌడీ అల్లుడు, ముగ్గురు మొనగాళ్లు, హిట్లర్, మేజర్ చంద్రకాంత్, సమర సంహారెడ్డి లాంటి సినిమాలలో నటించింది. దాదాపు అగ్ర హీరోలందరితోనూ కలిసి నటించింది. ఆమె నటించిన చివరి చిత్రం సమరసింహ రెడ్డి. ఆ తరువాత చదువు పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో సినిమాలకు స్వస్తి పలికి, ఉన్నత విద్యాభ్యాసం చేసింది. సహస్ర తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపింది.
తన తండ్రిది వరంగల్ అని, హైదరాబాద్ లో స్థిరపడ్డారని, తను ఏడాదిన్నర వయసు నుండే మాట్లాడేదాన్ని అని తెలిపింది. ఒక పార్టీలో నన్ను చూసి సినిమాలలో ఛాన్స్ ఇచ్చారని తెలిపింది. నాతోపాటు అమ్మ, అమ్మమ్మ షూటింగ్ కు వచ్చేవారు. హీరో భానుచందర్ గారు నటించిన ‘ఉద్యమ నా తొలి సినిమా. నేను చిన్నపిల్లను అవడంతో హీరోలంతా నాతో బాగుండేవారు. రామ్‌చరణ్ వల్ల ఇంటికి వెళ్లినపుడు టెడ్డీబేర్‌తో ఎక్కువగా ఆడుకునేదాన్ని. చెన్నైలో ఒకసారి షూటింగ్‌కు వెళ్ళిన సమయంలో రామ్‌చరణ్ ఉప్మా చేసి పెట్టారని తెలిపింది. అది నా లైఫ్ లో మర్చిపోలేని క్షణాలు.
ఇక సమరసింహారెడ్డి సినిమా ఆఖరి రోజు షూటింగ్ లో ప్రొడక్షన్ టీమ్‌లో ఉన్నవారందరికి వెండి రింగ్స్ ఇచ్చాను.
ఎన్టీఆర్ గారు అయితే రండి, కూర్చోండి అని నాతో మాట్లాడేవారు. రెండవ సారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్ మీటింగ్ ను ఆపి, నాతో భోజనం చేశారు. మేజర్ చంద్రకాంత్ చిత్రం షూటింగ్ సమయంలో మనోజ్, నేను కలిసి షూటింగ్ కు వెళ్లేవాళ్లమని చెప్పారు. సమరసింహారెడ్డి సినిమా తరువాత స్టడీస్ మీద దృష్టి పెట్టాలని సినిమాలు చేయడం మానేశాను. నేను మాస్టర్స్ ఇన్ బయోటెక్నాలజీ చేశాను. ప్రస్తుతం బిజినెస్ చేస్తున్నానని తెలిపింది. చెప్పుకొచ్చింది.
Also Read: పవన్ కళ్యాణ్ గురించి త్రివిక్రమ్ సతీమణి సౌజన్య చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలు..

బలగం సినిమాలో అంతగా సీన్లు లేకున్నా, ఒక్క డైలాగ్ లేకున్నా, సౌదామిని తన సిగ్గు పడుతూ, ఇన్నోసెంట్ నటనతో ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇటీవల సౌదామిని ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ అడిషన్ కు వెళ్లినపుడు డైరెక్టర్ వేణు సిగ్గు పడమని చెప్పారని, తాను అలాగే చేయడంతో తనను ఆ పాత్రకు వెంటనే ఎంపిక చేశారు. ఈ చిత్రం కోసం కేకులు బాగా తిని 10 కిలోలు బరువు పెరిగానని తెలిపారు. నా మొదటి చిత్రం ఇదేనని చెప్పారు.
తనకు ఫన్ జోనర్ చిత్రాలు అంటే ఇష్టమని అన్నారు. చిన్నతనం నుండే ఆర్టిస్ట్ కావాలని అనుకున్నానని తెలిపారు. బీఎస్సీ మొదటి సంవత్సరంలోనే కోవిడ్ కారణంగా ఆగిపోయిందని చెప్పారు. అవకాశాల కోసం ఎక్కడికి వెళ్ళిన తన అన్నయ్యను తీసుకెళ్ళేదానినని చెప్పుకొచ్చారు. కొందరు నీ ఫేస్ కి హీరోయిన్ అవుతావా అని అనేవారని దామిని తెలిపారు. హీరోలలో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ అభిమాన హీరోలు అని అన్నారు.
దర్శకుడు వేణు ఈ సినిమాలో ఛాన్స్ ఇవ్వడం వల్లే ఇంత గుర్తింపు వచ్చిందని సౌదామిని వెల్లడించారు. జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కాల్ చేసి అప్రిషియేట్ చేశారని, తమ సినిమాలో మంచి పాత్ర ఇస్తామని అన్నారని తెలిపారు. సౌదామిని చెప్పిన ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.




అక్కినేని నాగార్జున కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అఖిల్ కి హీరోగా మొదటి సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత పలు చిత్రాలు చేసినప్పటికి వాటిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మాత్రమే హిట్ గా నిలిచింది. ప్రస్తుతం అఖిల్ భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలోని డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఏజెంట్ సినిమాలో నటించాడు. స్పై థ్రిల్లర్ సినిమాగా రూపొందిన ఈ చిత్రం నేడు రిలీజ్ అయ్యింది.
రీసెంట్ గా ఈ మూవీ ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అఖిల్ ఈ మూవీకి సంబందించిన చాలా విషయాలను మీడియాకు వెల్లడించారు. ఇక ఈ మూవీకి హీరో అఖిల్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయాన్ని ఈ మూవీ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర వెల్లడించారు.
నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీకి అఖిల్ పారితోషికం తీసుకోకుండానే వర్క్ చేసినట్లు తెలిపారు. ఈ మూవీ నిర్మాణంలో అఖిల్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఇద్దరు భాగమయ్యారని నిర్మాత వెల్లడించారు. మా సినిమా కోసం వర్క్ చేసిన వారంతా వారి మొత్తం రెమ్యూనరేషన్ తీసుకుంటే మూవీ బడ్జెట్ వంద కోట్లు అయ్యేదని అన్నారు. అయితే అఖిల్, సురేందర్ రెడ్డి రెమ్యూనరేషన్ తీసుకోకుండా తమ రెమ్యూనరేషన్‌ని మూవీ నిర్మాణంలో పెట్టుబడిగా పెట్టారని తెలిపారు.
ఇక ఈ చిత్రానికి బడ్జెట్ ఏమాత్రం సమస్య కాదని థియేటర్ మరియు డిజిటల్ పరంగా మూవీ సేఫ్ లోనే ఉంటుందని ప్రొడ్యూసర్స్ బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని తెలిపారు. మొత్తానికి హీరో అఖిల్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి రెమ్యూనరేషన్ తీసుకోకుండానే ఏజెంట్ చిత్రానికి పనిచేశారు. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తే, వచ్చిన లాభాల్లో వీరికి కొంత వాటా వస్తుందని అంటున్నారు.
అయితే ఇప్పటివరకు మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ కూడా విభిన్నం గా ఉన్నాయి. దీన్ని బట్టి ఇది భవిష్యత్ కాలానికి సంబంధించిన కథ అని తెలుస్తోంది. తన తండ్రిని వెతకడం కోసం ప్రభాస్ ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు.. అతడికి దీపికా, అమితాబ్ బచ్చన్ ఎలా సహాయం చేసారు అన్నదే ఈ సినిమా కథ అని నెట్టింట పలు కథనాలు వస్తున్నాయి. పూర్తి టెక్నాలజీ ఆధారిత చిత్రం అని తెలుస్తోంది. దీన్ని బట్టి కొన్ని ఊహాజనిత ఫోటోలని కూడా నెట్టింట మనం చూడొచ్చు.



బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, స్టార్ హీరో అయిన సల్మాన్ బయటికి వస్తే తమ అభిమాన స్టార్ తో సెల్ఫీలు తీసుకోవడం కోసం, సల్మాన్ తో షేక్ హ్యాండ్ కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇటీవల సల్మాన్ ఖాన్ చంపేస్తామంటూ ఎక్కువగా బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో సల్మాన్ సెక్యూరిటీని బాగా టైట్ చేశారు.
ఇక సల్మాన్ కు సెక్యూరిటీ ఇవ్వాలంటే ట్రైనింగ్ తీసుకుని ఉండాలి. గత ఇరవై ఐదు ఏళ్లుగా సల్మాన్ కి షేరా అనే వ్యక్తి బాడీగార్డ్ గా పని చేస్తున్నాడు. ఇతను సల్మాన్ కి చాలా నమ్మకస్తుడు. షేరా హాలీవుడ్ హీరో విల్ స్మిత్, జస్టిన్ బీబర్, మైక్ టైసన్, జాకీ చాన్, మైఖేల్ జాక్సన్‌ల వంటి చాలా మంది ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు ముంబైకి వచ్చిన సమయంలో వారికి కూడా సెక్యూరిటీగా ఇచ్చేవారు. ఈ విషయలను బట్టి షేరా ఇచ్చే భద్రత, అతనికున్న పేరును అర్థం చేసుకోవచ్చు.
ఎంతో నమ్మకమైన బాడీగార్డ్ అయిన షేరాకు శాలరీ గురించి తెలిస్తే షాక్ అవుతారు. సల్మాన్ కు ఇంత నమ్మకమైన సెక్యూరిటీ ఇస్తున్న షేరాకు నెలకు దాదాపు 15 లక్షల వరకు జీతం ఇస్తారని తెలుస్తోంది. అది మాత్రమే కాకుండా షేరా ‘టైగర్ సెక్యూరిటీ సర్వీసెస్’ అనే సంస్థను స్టాపించాడు. ప్రస్తుతం దానికి సీఈఓగా ఉన్నాడు. షేరాకున్న ఆస్తుల విలువ సుమారు వంద కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓ బాడీగార్డ్ హీరోల రేంజ్ లో ఆస్తులను సంపాదించడం అంటే ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ప్రస్తుతం అతను ఓ సెలబ్రిటీగా మారారు.














