కమెడియన్ వేణు దర్శకత్వం లో దిల్ రాజు నిర్మించిన బలగం చిత్రం ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా అందరినీ సర్ప్రైజ్ చేస్తూ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఎమోషనల్ కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.
చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించి.. జాతీయ స్థాయిలో అవార్డుల్ని సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రం లో కొమరయ్య చిన్న కొడుకుగా నటించి.. అందరి కంట కన్నీళ్లు పెట్టించారు నటుడు మధుసూధన్ అలియాస్ మైమ్ మధు. చక్రవాకం సీరియల్లో తన అద్భుతమైన నటనతో బుల్లితెర ప్రేక్షకులకు చేరువైన మైమ్ మధు.. బలగం సినిమాలో బలమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అయితే నటుడిగా కంటే మైమ్ తోనే ఎక్కువ గుర్తింపు పొందారు మధు. ఈ రంగం లో ఎన్నో ప్రత్యేకతలు సంపాదించారు. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ చిన్న చిన్న పాత్రలే చేసారు మధు. ఇక ఇటీవల వచ్చిన ఆకాశవాణి, బలగం చిత్రాల్లో మంచి పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించారు. తాను ఏ పాత్రనైనా అవలీలగా చేయగలనని నిరూపించుకున్నాడు మైమ్ మధు.

మైమ్ మధు మైమ్‌లో ప్రొఫెషనల్ యాక్టర్. మైమ్ యాక్టింగ్‌లో శిక్షణ పొందిన ముధుసూధన్ మైమ్ యాక్టింగ్‌లో పరిణితి సాధిస్తూ మైమ్ మధుగా మారారు. దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చిన మైమ్ మధు.. హ్యూమన్ రీసెర్చ్ నుంచి స్కాలర్ షిప్ అందుకున్నారు. మైమ్ ప్రదర్శనల ద్వారా ఫెలోషిప్, స్కాలర్ షిప్స్ అందుకుని ఎడ్యుకేషన్ పూర్తి చేశాడు. అలాగే అమెరికన్ మైమ్ థియేటర్స్ నుంచి స్కాలర్ షిప్ అందుకున్న తొలి భారతీయుడిగా గుర్తింపు పొందారు.

హైదరాబాద్ కు వచ్చిన తర్వాత వివిధ కళాశాలల్లో నటనలో శిక్షణ ఇచ్చారు మధు. అప్పుడే చక్రవాకం సీరియల్ లో నటించారు. ఈ సీరియల్లో దాదాపు 500పైగా ఎపిసోడ్లలో నటించారు మధు. అంతే కాకుండా ఈయన పలువురు స్టార్ హీరోలకి డబ్బింగ్ కూడా చెప్పారు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా శ్రావణసమీరాలు సీరియల్‌కి గానూ.. నంది అవార్డ్ అందుకున్నారు. ఇండియన్ మైమ్ అకాడమీ స్థాపించి అనేక మందికి నటులకు మైమ్‌లో శిక్షణ ఇచ్చారు మధు. ప్రస్తుతం వరుస సినీ అవకాశాలతో బిజీ గా ఉన్నారు.

అంతగా పాపులర్ అయిన నాగరాజు సినిఇండస్ట్రీలో రాణిస్తాడని అందరు అనుకున్నారు. కానీ అతడు హఠాత్తుగా కనిపించకుండా పోయాడు. సుమారు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ కనిపించాడు. ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలోని కష్టాల గురించి చెప్తూ కంటతడి పెట్టుకున్నాడు. నాగరాజు గురించి అతని మాటల్లోనే ఇప్పుడు తెలుసుకుందాం..
సింగర్ నాగరాజు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనిత అనే యువతిని ప్రేమించానని, అయితే తమ వివాహానికి అనిత ఇంట్లో వాళ్లు అంగీకరించకపోవడంతో విడిపోయామని తెలిపాడు. ఆ బాధతోనే ‘అనిత ఓ అనిత’ పాటను రాశానని, ఈ సాంగ్ రాయడం కోసం నెల రోజుల సమయం పట్టిందని తెలిపారు. తాను ఆ పాట రాయడానికి ముందు ఆర్కేస్ట్రాలో గాయకుడిగా చేసేవాడినని అన్నారు. తాను రాసిన మొదటి పాట ‘అనిత’ సాంగ్ ను తానే పాడినట్లు తెలిపారు.
అప్పట్లో నేను మరణించానని రూమర్స్ కూడా వచ్చాయి. ఆ సమయంలో చాలా బాధ పడ్డానని తెలిపారు. అప్పుడు హైదరాబాద్ అంతా కొత్తగా అనిపించింది. దాంతో భయపడి మా ఊరికి వెళ్లిపోయాను. అనితకు వేరే వ్యక్తితో పెళ్లి జరిగింది. నాకు దేవిక అనే అమ్మాయితో వివాహం జరిగింది. మాకు ఇద్దరు పిల్లలు. పెద్దబాబుకి చెవిటి, మూగ. చిన్నబాబు కూడా పెద్దవాడిలానే సైగలే చేస్తాడని అన్నారు. కొంతకాలం పాటు పాన్‌షాపుతో నెట్టుకొచ్చానని, కళామతల్లి కాపాడుతుందని ఫ్యామిలీతో పాటు హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యామని తెలిపారు. ప్రస్తుతం తాను అనిత-2 పాటను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.


ఆయన మాట్లాడుతూ మహేష్ ఎంతో ప్రమాదకరమైన పర్సన్ అని, ఆయనతో ఒక్కసారి మూవీ చేస్తే, ఇంకో హీరోతో చేయాలనిపించదని అన్నారు. అంతలా మహేష్ మాయ చేస్తాడని, దాంతో మళ్లీ ఆయనతోనే మూవీ చేయాలని కోరుకుంటారని అన్నారు. అలా మహేష్ తో ఒక్కడు, సైనికుడు, అర్జున్ చిత్రాలను చేశానని తెలిపారు.
ఈ విధంగా ఈ జనరేషన్ హీరోలలో ఒకే దర్శకుడితో వరుసగా 3 చిత్రాలు చేసిన హీరోని చూశారా అని అడిగారు. ఇక మహేష్‌తో మాత్రమే చిత్రాలు చేస్తే బాగుండదనే ఉద్దేశ్యంతో విరమం తీసుకున్నానని ఆయన తెలియచేసారు. ఇక దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం సినిమా ఈ నెల 14 న ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ చిత్రంలో సమంత, దేవ్ మోహన్ జంటగా నటించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, మధుబాల కీలక పాత్రలలో నటించారు.
Also Read:
ఈ టీజర్ లో అల్లు అర్జున్ తగ్గేదేలే మ్యానరిజంలో చేతికున్న చిటికిన వేలు గోరు పెద్దగా ఉన్నట్టుగా చూపించారు. ఆ వీడియోలో విజువల్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ రంగులో ఉండడం, ఆ గోరు మాత్రమే రంగులో హైలైట్ గా చూపించారు. దీనితో దర్శకుడు సుకుమార్ బ్రిలియెన్స్ కనిపించింది. దాంతో ఆసక్తికర ప్రశ్న కూడా తలెత్తింది. అది దేనికి సూచన అంటూ చర్చిస్తున్నారు.
అయితే ఆ తరువాత విడుదల చేసిన పుష్ప ఫస్ట్ లుక్ తో ఆ గోరు విషయంలో క్లారిటీ వస్తుంది. ఫస్ట్ లుక్ లో బన్నీ అమ్మవారి వేషధారణలో కనిపించారు. ఆ వేషధారణ కోసమే గోరు పెంచారని తెలుస్తోంది. చిత్తూరు ప్రాంతంలో ఉన్న అమ్మవారి ఆచారం ప్రకారంగా మొక్కు తీర్చడం కోసం పురుషులు అమ్మవారిలా వేషం ధరిస్తారని, ఇప్పటికీ కూడా ఆ ఆచారం ఉందని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. దీనితో ఈ విషయం వైరల్ గా మారింది.
Also Read: 






























