సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘శాకుంతలం’. డైరెక్టర్ గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకతవం వహించాడు. మహా కవి కాళిదాసు ఐదవ శతాబ్దంలో రచించిన అభిజ్ఞాన శాకుంతలం కథ ఆధారంగా గుణశేఖర్ ఈ సినిమాని తెరకెక్కించాడు. నీలిమ గుణ, దిల్ రాజు ఈ మూవీని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ఈ సినిమా ద్వారా మలయాళ నటుడు దేవ్ మోహన్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు.ఈ సినిమా ఏప్రిల్ 14న తెలుగు, తమిళ, కన్నడ,మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ నేపద్యంలో సమంత తన సోషల్ మీడియా ఖాతాలో తన కన్నా ముందు శకుంతల పాత్రను పోషించిన నటీమణులకు సంబంధించిన ఫోటోను షేర్ చేసింది. మరి సమంతాకన్నా ముందు శకుంతల పాత్రలో వివిధ భాషలలో నటించి, ఆకట్టుకున్న హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
1. డోరతి కింగ్డన్ – శకుంతల:
సుచేత్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన శకుంతల సినిమాలో ‘డోరతి’శకుంతలగా నటించారు.1920 లో వచ్చిన ఈ చిత్రం హిందీలో తెరకెక్కింది.
2. కమలాబాయి – శకుంతల:
సర్వోత్తం బాదామి దర్శకత్వం వహించిన శకుంతల తెలుగు చిత్రంలో కమలాబాయి శకుంతల పాత్రలో నటించారు. ఈ చిత్రం 1932 లో రిలీజ్ అయ్యింది.
3. MS సుబ్బులక్ష్మి – శకుంతలై:
తమిళంలో ఎల్లిస్ ఆర్ దుంగన్ దర్శకత్వం వహించిన శకుంతలై సినిమాలో MS సుబ్బులక్ష్మి శకుంతలగా నటించారు. ఈ చిత్రం 1940 లో విడుదల అయ్యింది.
4. జయశ్రీ – శకుంతల:
హిందీలో వి శాంతారామ్ దర్శకత్వంలో తెరకెక్కిన శకుంతల సినిమాలో జయశ్రీ శకుంతల పాత్రలో నటించారు.ఈ చిత్రం 1943 లో రిలీజ్ అయ్యింది.
5. సంధ్య – శకుంతల:
హిందీలో వి శాంతారాం దర్శకత్వంలో వచ్చిన స్త్రీ అనే సినిమాలో సంధ్య శకుంతలగా నటించారు. ఈ చిత్రం 1961 లో రిలీజ్ అయ్యింది.
6.కేఆర్ విజయ – శకుంతల:
మలయాళంలో కుంచాకో దర్శకత్వంలో తెరకెక్కిన శకుంతల సినిమాలో కేఆర్ విజయ శకుంతలగా నటించారు. ఈ చిత్రం 1965 లో విడుదల అయ్యింది.
7. బి సరోజాదేవి – శాకుంతల:
తెలుగులో కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన శాకుంతల సినిమాలో బి సరోజాదేవి శకుంతలగా నటించారు.ఈ చిత్రం 1966 లో రిలీజ్ అయ్యింది.
8. జయప్రద – కవిరత్న కాళిదాస:
కన్నడలో రేణుకా శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన కవిరత్న కాళిదాస చిత్రంలో జయప్రద శకుంతలగా ఆకట్టుకున్నారు. ఈ చిత్రం 1983 లో విడుదల అయ్యింది.
9. పాయల్ శెట్టి – శాకుంతలం ఓటీటీ మూవీ:
సంస్కృతం లో దుష్యంత్ శ్రీధర్ దర్శకత్వం వహించిన శాకుంతలం చిత్రంలో పాయల్ శెట్టి శకుంతల పాత్రలో నటించారు. ఈ 2021లో ఓటీటీలో విడుదల అయ్యింది.
10.సమంత – శాకుంతలం
గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత శకుంతలగా నటినంచిన చిత్రం ‘శాకుంతలం’ ఏప్రిల్ 14న ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదలకానుంది.

Also Read: “విక్కీ కౌశల్” కంటే ముందు… “కత్రినా కైఫ్” రిలేషన్షిప్లో ఉన్న 5 మంది హీరోలు..!







ముందు ఏదో అనుకున్నప్పటికి, ఆ ఆత్మ ఊహించని ప్రశ్నలకు కూడా జవాబు చెప్తుంది. అంతేకాకుండా ఆ ఆత్మ ఇంట్లో వారిలో ఒక్కరి ప్రాణం కావాలనుకుంటోందని తెలుస్తుంది. ఆ తర్వాత కథలో ఏం జరిగింది అనేదే ఈ చిత్రం. ఫస్టాఫ్ పర్వాలేదు అనిపించింది. అయితే సెకెండ్ ఆఫ్ మాత్రం అంత ఆసక్తికరంగా సాగలేదు. ఆ తరువాత క్లైమాక్స్ కు ముందు కాసేపు బాగుంటుంది.
అయితే సినిమాకి ముగింపు ఇవ్వలేదు. ఏం జరిగిందో పార్ట్ 2 లో చూడండి అన్నట్టు చెప్పడంతో ప్రేక్షకులు ఊహించిన రేంజ్ లేదని చెప్పవచ్చు. థియేటర్స్ లో జనాల మధ్యన కూర్చుని చూసినపుడు కొన్ని సన్నివేశాలకి నవ్వుకునే అవకాశం ఉంటుంది. ఓటీటీలో చూసినపుడు మాత్రం అలాంటి అనుభూతి అయితే రాలేదు.
ఈ సినిమా విజయం సాధించడంతో ఆ సింగర్స్ కి కూడా ఎంతో గుర్తింపు వచ్చింది. వారు ఈ సినిమా కన్నా ముందు బుల్లితెర పై ప్రసారం అయిన ‘రేలారే రేలా’ప్రోగ్రామ్ లో పాటలు పాడారు. రంగస్థలం సినిమా తరువాత వారు వరుస అవకాశాలతో ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారని అంతా అనుకున్నారు. మరి ఏమయ్యిందో తెలియదు కానీ ఆ తరువాత ఆ సింగర్స్ ఎ సినిమాలోనూ పాడలేదు. వారు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారనేది చాలామందికి తెలియదు. అయితే ఆ సింగర్స్ ఎవరో ఇప్పుడు ఏం చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం..
ఈ మూవీలో ‘లచ్చవ్వ’ పాత్రను చూసి కంటతడి పెట్టని వారు లేరని చెప్పవచ్చు. లచ్చవ్వ ఏడుస్తూ మూవీ చూసిన అందర్నీ ఏడిపించేసింది. ఈ క్యారెక్టర్ లో అంతలా ఒదిగిపోయి నటించిన నటి పేరు రూపలక్ష్మి. హీరోయిన్ తల్లిగా, హీరోకి మేనత్త పాత్రలో నటించిన రూప లక్ష్మి బుల్లితెర పై సీరియల్ నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుని, ప్రస్తుతం సినిమాల్లోనూ నటిస్తోంది. ఇక ‘బలగం’చిత్రంతో వెండితెర పై కూడా గుర్తింపు తెచ్చుకుంది.
రూపలక్ష్మి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఫ్యామిలీ గురించి కూడా తెలిపారు. తన తండ్రి రైతు అని, ఆయనకు ఆరుగురు సంతానం అని, తనను ఒక లెక్చరర్‌కి దత్తతగా ఇచ్చారని తెలిపారు. అయితే తాను ఇప్పటికకి కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటానని చెప్పారు.అయితే సినిమాలో లచ్చవ్వ పాత్రలో గ్రామీణ మహిళగా కనిపించిన రూపలక్ష్మి నిజ జీవితంలో స్టైలిష్ లుక్‌లో కూడా ఉంటారు.అంతేకాకుండా ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటారంట. బలగం మూవీతో క్రేజ్ తెచ్చుకున్న రూపలక్ష్మి తన స్టైలిష్ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
19.
20.
21.
22.
23.
24.
25.
26.





దూరదర్శన్ ఛానెల్ లో చిన్నచిన్న పాత్రలలో నటించానని ఆయన తెలిపారు. విజయ్ యాదవ్ తనకు ఎక్కువగా అవకాశాలు ఇప్పించారని చెప్పారు. తనది 86 వ బ్యాచ్ అని, అప్పట్లో దూరదర్శన్ మాత్రమే ఉండేదని అన్నారు. చేశారు. తన జీవితంలో ఎంతో బాధాకరమైన ఇన్సిడెంట్స్ చాలా జరిగాయని కోట జయరాం వెల్లడించారు. సినిమాలలో నటించే ఆర్టిస్టులు చాలా అదృష్టవంతులని అన్నారు.
ఒక మూవీ షూటింగ్ సమయంలో నేను బాగా నటిస్తుండడంతో జయరాం పై ఫోకస్ చేస్తానని కెమెరామేన్ చెప్తే, దానికి కో డైరెక్టర్, ఆయన పై ఎందుకు పక్కనే ఉన్న కుక్క పై పెట్టు అన్నాడట. అతను అన్న ఆ మాటకు చాలా బాధ కలిగిందని, కుక్కకు ఉన్న మర్యాద ఆర్టిస్ట్ కి లేదా అని ఆవేదనగా చెప్పుకొచ్చారు. కోట జయరాం ఇండస్ట్రీలో తనకు జరిగిన అవమానాల గురించి చెప్పిన విషయలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిజానికి బలగం చిత్రంలో ఐలయ్య పాత్రను తన స్నేహితుడు చేయాల్సిందట. అతను చేయనని చెప్పడంతో ఆపాత్ర జయరాం దగ్గరకు వచ్చిందట. డైరెక్టర్ వేణు కోట జయరాంని ఆడిషన్ చేసిన, 3 నెలల తరువాత బలగం సినిమాలో ఎంపిక అయినట్లు తెలిపారు. అలా బలగం సినిమాలో తనకు అవకాశం వచ్చిందని జయరాం వెల్లడించారు.
సమంత, దేవ్ మోహన్ నటనని మెచ్చుకుంటున్నారు. 3D ఎఫెక్ట్ బాగున్నాయని అంటున్నారు. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ నటన ఆకట్టుకుందని అంటున్నారు. మొదటిసారి కెమెరా నటించినప్పటికి ఎలాంటి భయం లేకుండా బాగా నటించిందని, అర్హ కనిపించేది కాసేపయినా తన నటనతో ఆశ్చర్యపరిచిందని అంటున్నారు. ఇక మణిశర్మ అందించిన సంగీతం బాగుందని అంటున్నారు. అయితే కొందరు ‘శాకుంతలం’ బాగుందని చెప్తుంటే, కొందరు బాగోలేదని చెబుతున్నారు.
కొందరు ఈ మూవీ యావరేజ్ అని అంటున్నారు. కొందరు రొటీన్ సన్నివేశాలు బోర్ కొట్టించాయని అంటున్నారు. ప్రస్తుతానికి ఈ చిత్రానికి మిక్స్ డ్ టాక్ వస్తోంది. సినిమాలో చాలా పాత్రలు ఉన్నప్పటికి ఎవరికీ కూడా సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని అంటున్నారు. కాగా ప్రీమియర్స్ తో మూవీ అసలు టాక్ ను అంచనా వేయలేమని చెబుతున్నారు.
”మౌనంగా నిలబడినప్పటికి మీ కళ్ళు చాలా మాట్లాడతాయి. మీ కళ్ళు మీ మనసుకు అద్దం లాంటిది. అవి ఏం చెప్తున్నాయో నేను అర్థం చేసుకోగలను. వాటికి ఒక వ్యక్తిత్వం ఉంది. మీ కళ్ళలో ఎప్పుడూ ఏదో ఉంటుంది. మీరు ఎప్పుడు తెరపై కనిపించినా నేను మీ కళ్ళనే చూస్తూ ఉంటాను. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మీ కళ్ళే చెప్తాయి. శకుంతలని మీ కళ్ళు చాలా అర్థం చేసుకున్నాయి. శకుంతలగా మీ అమాయకత్వం, మీ జాలి నాకు ప్రపంచంలో ఉన్న మంచితనాన్ని కాపాడాలనే ధైర్యాన్ని ఇచ్చాయి.
మీరు ఏడుస్తున్నప్పుడు చాలా బాధగా కనిపిస్తారు. అలా చూసినప్పుడు నాలాంటి వాళ్ళకి అది ఒక సీన్, మీరు ఒక నటి అనే విషయం గుర్తుకి రాదు. బహుశా ఇందుకు కారణం మన మధ్య ఉన్న బంధం ఏమో. మేము మీ సంతోషం గురించి ప్రార్థించే అంత దగ్గర అయ్యాము. మీరు మా కుటుంబమే సామ్.

తారకరత్న, అలేఖ్య రెడ్డి ప్రేమించుకుని, పెద్దలను ఎదురించి వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు. ఇప్పుడిప్పుడే జీవితంలో ఆనందంగా ఉంటున్న సమయంలో తారకరత్న గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం అలేఖ్యను ఎంతగానో కృంగదీసింది. ఎంతగా అంటే తారకరత్న మరణించి 2 నెలలు అవుతున్నప్పటికి అలేఖ్య ఇంకా భర్త జ్ఞాపకాల నుండి బయటకు రాలేకపోతున్నారు.
అలేఖ్య రెడ్డి తాజాగా సోషల్ మీడియాలో తారకరత్న పిల్లలతో సరదాగా ఆడుకుంటున్న హ్యాపీ మూమెంట్స్ కి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను షేర్ చేస్తూ, ఎమోషనల్ పోస్ట్ చేశారు. అలేఖ్య రెడ్డి నిన్ను తలచుకోకుండా ఒక్క క్షణం అయినా ఉండలేకపోతున్నా అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసినవారు అలేఖ్య రెడ్డి ఈ బాధ నుండి బయటకు రావాలని కోరుకుంటున్నారు.
ఇక నందమూరి తారకరత్న జనవరి 27న నారా లోకేష్ మొదలుపెట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ పాదయాత్ర మొదలైన కాసేపటికే తారకరత్న గుండెపోటు రావడంతో స్పృహ కోల్పోయారు. దగ్గరలోని ఆసుపత్రిలో చేర్చారు. తరువాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాల హాస్పటల్ లో చేర్చారు. ఆయన అక్కడే ట్రీట్మెంట్ పొందుతూ ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు.