నేచురల్ స్టార్ నాని, ‘మహానటి’ బ్యూటీ కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కింది. మార్చి 30న పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తొలి రోజే రూ. 38 కోట్లు వసూలు చేసి నాని కెరీర్లోనే డే 1 హైయెస్ట్ గ్రాసర్ గా ఈ మూవీ నిలిచింది.
అయితే తాజాగా దసరా మూవీ ఒక వివాదంలో చిక్కుకుంది. తమను కించపరిచేలా ఈ సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అంగన్వాడిలు ఆందోళనకు దిగారు. సమాజానికి ఎంతో సేవ చేస్తోన్న అంగన్వాడి టీచర్లను దసరా మూవీలో దొంగలుగా చిత్రీకరించారని అంగన్వాడి టీచర్లు ఆవేదన వ్యక్తంచేశారు.. వెంటనే ఆ సీన్లను తొలగించడంతో పాటు సినిమా బృందం తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

దసరా మూవీ లో కీర్తి సురేష్ ఈ చిత్రంలో వెన్నెల అనే క్యారెక్టర్ చేసింది. ఆమె ఒక అంగన్ వాడీ కార్యకర్త. ఒకానొక సమయంలో తను పిల్లల కోసం ఇవ్వాల్సిన కోడిగుడ్లను అమ్ముకుంటుంది. అంతేకాదు, మరికొన్ని గుడ్లను తీసుకెళ్లి తమ కుటుంబ సభ్యులకు ఇస్తుంది. దీంతో ఈ విషయం పై వివాదం మొదలైంది. దసరా’ సినిమాలోని ఆ సీన్లను తొలగించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని వారు తేల్చి చెప్పారు.

ఇక ఇటీవలి కాలంలో సినిమాలు ఎంత పాపులర్ అవుతున్నాయో సినిమాల చుట్టూ నెలకొన్న వివాదాలు అంతే పాపులర్ అవుతున్నాయి. సినిమాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు తమను కించపరిచేలా ఉన్నాయంటూ నిరసనలు తెలపడం మనం చూస్తున్నాం. ఇక ఇప్పటి వరకు ఈ వివాదం పై యూనిట్ ఇంతవరకు స్పందించలేదు. ఇక ఈ మూవీ విడుదలైన రెండు రోజుల్లోనే రూ. 50 కోట్ల మార్క్ క్రాస్ చేసి, ప్రస్తుతం రూ.100 కోట్ల వైపుగా దూసుకెళ్తోంది.

విజయ్ తన ఖాతాలో తన ఫోటోను షేర్ చేయడంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విజయ్ కి ఫాలోయింగ్ ఎంతలా ఉందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పవచ్చు. ఆయన పోస్ట్ చేసిన గంటలోనే మిలియన్ల కొద్ది లైకులు, వేలలో కామెంట్లు వచ్చాయి. ఖాతా మొదలుపెట్టిన 99 నిమిషాల్లో మిలియన్ ఫాలోవర్స్ చేరిన మొదటి ఇండియన్‌గా విజయ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా అయితే ఈ విషయంలో మూడోస్థానంలో ఉన్నారు. మొదటి రెండు స్థానాల్లో బీటీఎస్ వీ- 43 నిమిషాలు, ఎంజెలీనా జోలీ- 59 నిమిషాలు ఉన్నారు.
విజయ్‌ని కళ్యాణి ప్రియదర్శన్, హీరోయిన్ కీర్తి సురేష్ లాంటి హీరోయిన్లు అప్పుడే ఫాలో చేస్తున్నారు. ఈ విధంగా సెలెబ్రిటీలు కూడా విజయ్‌ని ఇంస్టాలో ఫాలో అవుతున్నారు. విజయ్ కి ప్రస్తుతం 4.3 మిలియన్ ఫాలోవర్స్ కలిగి ఉన్నారు. అయితే విజయ్ ఇంతవరకు ఒక్కరిని ఫాలో అవ్వలేదు. విజయ్ ఇటీవల వారసుడు సినిమాతో ప్రేక్షకుల పలకరించాడు. విజయ్ చిత్రాలు ఎలా ఉన్నాప్పటికి కోలీవుడ్ లో ఆడుతాయని వారసుడు నిరూపించింది. యావరేజ్ మూవీని సైతం ఆయన అభిమానులు బ్లాక్ బస్టర్‌గా మారుస్తుంటారు.
అలా ఆయన చిత్రాలన్ని 100, 200 కోట్ల క్లబ్బులో అడుగుపెడుతూనే ఉన్నాయి. ఇక వారిసు, బీస్ట్ చిత్రాలు యావరేజ్ టాక్ వచ్చినప్పటికి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనకరాజ్దర్శకత్వంలో లియో చిత్రాన్ని చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మరియు డిజిటల్ రైట్స్ గురించి కూడా ఎన్నో ప్రచారాలు వస్తున్నాయి.
Also Read:
ఇద్దరు పురాణాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారని, అలా మాట్లాడుకుంటూ ప్రపంచాన్ని కూడా మరిచిపోతారని తెలిపింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం చాలా గొప్పదని, ఒకరంటే మరొకరికి అమితమైన గౌరవం అని చెప్పారు. మా వారు తన బుక్స్ ని ఎవరికి కూడా ఇవ్వడానికి ముందుకు రారు. కానీ పవన్ అడిగితే వెంటనే కాదనకుండా ఇస్తారు. ఇక వీరిద్దరు ఒకరికి ఒకరు ఇచ్చుకునే గిఫ్ట్స్ అంటే అవి కూడా బుక్స్, పెన్స్ అని తెలిపారు.
పవన్ కళ్యాణ్ కి మా ఇంట్లో చేసే వంటకాలను చాలా ఇష్టపడుతారు. ఉదయం పూట పవన్ మా ఇంటికి వచ్చినట్లయితే అడిగి మరీ ఉప్మా చేయించుకుని తింటారు. ఇక లంచ్ సమయంలో అయితే శాఖాహార వంటకాలు, ఆవకాయ చాలా ఇష్టంగా తింటారు. రవ్వలడ్డులను కూడా అడిగి తీసుకుంటారు. దానికి పవన్ సిగ్గుపడరు. మా ఫ్యామిలీ మెంబర్ లా కలిసిపోతారని సౌజన్య శ్రీనివాస్ తెలిపారు. ఆమె క్లాసికల్ డ్యాన్సర్. అయితే ఈమధ్యే ప్రొడ్యూసర్ మారి సితార బ్యానర్‌తో కలిసి చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇటీవల కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా వచ్చిన ‘సార్’ సినిమాకు సహ నిర్మాతగా ఉన్నారు.
Also Read: 

















అందువల్లనే తెలంగాణలోని కొన్ని గ్రామాలలో ఒకప్పటిలా ఊరి ప్రజలంతా ఒక్క చోట కలిసి చూసేలా తెరలు కట్టి ఈ చిత్రాన్ని చూస్తున్నారు. ఈ విధంగా ఒక వైపు థియేటర్లలో, ఇంకోవైపు ఓటీటీలో విజయవంతంగా దూసుకుపోతోన్న ఈ చిత్రానికి అవార్డులు రావడం కూడా ప్రారంభమైంది. ఈ చిత్రానికి కొద్ది రోజుల క్రితం ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ఆటోగ్రఫీ కేటగిరీలో లాస్ఏంజిల్స్ ఫోటోగ్రఫీ పురస్కారాలు వచ్చిన విచ్చేయం తెలిసిందే. అంతే కాకుండా ఈ చిత్రానికి తెలుగు వేదిక నుండి ఉగాది పురస్కారాలలో నంది అవార్డునూ పొందింది. అయితే తాజాగా ‘బలగం’ చిత్ర ఖాతాలో మరో అంతర్జాతీయ అవార్డు కూడా చేరింది.
ఉక్రెయిన్ దేశానికి చెందిన ఒనికో ఫిలిం అవార్డ్స్ లో భారతదేశం నుండి ఉత్తమ ఫీచర్ సినిమాగా ‘బలగం’ పురస్కారం అందుకుంది. ఇక ఈ విషయాన్ని ఈ చిత్ర దర్శకుడు వేణు వెల్డండి సామాజిక మధ్యమంలో షేర్ చేశాడు. తమ సినిమాకి ఇప్పటి వరకు 4 పురస్కారాలు రావడం పట్ల చాలా ఆనందంగా ఉందన్నాడు. తన చిత్ర యూనిట్ వల్లనే ఇది సాధ్యమైందని మూవీ యూనిట్ లో వారికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రియదర్శి సోషల్ మీడియాలో ‘ఇంట గెలిచి రచ్చ గెలుస్తున్నాం’ అంటూ ఈ విషయాన్ని షేర్ చేశాడు.
Also Read: 













తన అన్నయ్య చక్రి ఉన్న సమయంలో ఎటువంటి గొడవలు లేవని, అయితే ఆయన మరణించిన తరవాత తమ ఫ్యామిలిలో ఆస్తి గొడవలు ప్రారంభం అయ్యాయని తెలిపారు. అన్నయ్య చక్రి పోయిన బాధలో ఉన్నప్పుడే మొదలైన గొడవలతో తాము నరకం అనుభవించామని తెలిపారు. అన్నయ్య సంపాదించిన ఆస్తుల్లో ఆయన భార్య కొన్నింటిని అమ్మేసిందని తెలిపారు. ఆమె అమెరికా వెళ్లిందని, మళ్ళీ వివాహం చేసుకుని, అక్కడే సంతోషంగా సెటిల్ అయ్యిందని వెల్లడించారు. తమకు చెందిన కొన్ని ఆస్తులు ఇప్పటికి కోర్టు కేసుల్లోనే ఉన్నాయని చెప్పారు.
ఇదిలా ఉంటే 2014లో చక్రి గుండె పోటుతో కన్నుమూశారు. ఆయనకు ఊబకాయ సమస్య ఉండేదని, ఆ కారణంతోనే చిన్న వయసులోనే చక్రి గుండెపోటుతో మరణించారు. ఇక ఆయన మరణించిన వెంటనే వారి ఫ్యామిలిలో ఆస్తుల గొడవలు ప్రారంభం అయ్యాయి. చక్రి భార్య ఆయన ఫ్యామిలీ మెంబర్స్ తనను వేధిస్తున్నట్టుగా ఆరోపించారు. ఇంకో వైపు చక్రి ఫ్యామిలీ మెంబర్స్ కూడా చక్రి భార్య పై ఆరోపణలు చేసిన విషయం అందరికి తెలిసిందే.
Also Read: