డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి దాకా RC15 అనే వర్కింగ్ టైటిల్ తో మూవీ షూట్ జరుపుకుంటోంది. ఈ సినిమాకి ‘గేమ్ చేంజర్’ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు సొంత బ్యానర్ లో ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఈరోజు (మార్చి 27) గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా పేరును రీవిల్ చేస్తూ వీడియోను రిలీజ్ చేశారు. ఇండియన్ జేమ్స్ కామెరూన్ గా పేరుగాంచిన దర్శకుడు శంకర్ ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ కు కోసం ప్రొడ్యూసర్ దిల్ రాజుతో భారీగానే ఖర్చు పెట్టించాడంట. ఈ టైటిల్ గ్లింప్స్ కోసం 70 లక్షల రూపాయలు ఖర్చు అయినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ కోసం శంకర్ నెల రోజుల పనిచేశాడని తెలుస్తోంది.
ఇక దీని కోసం శంకర్ 11 వెర్షన్లు సిద్ధం చేయించాడని సమాచారం. చివరగా వాటిలో ఒకటి ఖరారు చేసి నేడు విడుదల చేశారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి కూడా డైరెక్టర్ శంకర్ భారీగానే ఖర్చు పెట్టించాడు. పాన్ ఇండియా మూవీ కావడంతో ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రానికి 200 కోట్ల బడ్జెట్ అనుకుంటే దర్శకుడు శంకర్ ఇప్పటిదాకా దాదాపు 280 కోట్లు ఖర్చు పెట్టించినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికి వరకు డెబ్బై శాతం మాత్రమే అయ్యింది.
ఆగస్టు వరకు ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యే ఛాన్స్ ఉంది. ఇక అప్పటి వరకు ఈ మూవీ బడ్జెట్ ఎంత అవుతుందో చూడాలి మరి. ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. కియార అద్వానీ, అంజలి కథానాయకలుగా నటిస్తున్నారు. ఈ మూవీలో శ్రీకాంత్, జయరామ్, రాజీవ్ కనకాల కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ తరువాత చరణ్ చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Also Read: “రామ్ చరణ్ పోస్టర్ అని చెప్పి యష్ ఫోటో రిలీజ్ చేశారు ఏంటి..?” అంటూ… రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్” ఫస్ట్‌లుక్ పోస్టర్‌పై 15 మీమ్స్..!








తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం అగ్ర సంగీత దర్శకుడిగా కొనసాగుతున్న దేవి శ్రీ ప్రసాద్ తండ్రిగారే ఈ గొర్తి సత్యమూర్తి. ఆయన ఏపీలోని తూర్పుగోదావరిలోని వెదురుపాక అనే గ్రామంలో మే 24న 1953లో జన్మించారు. సత్యమూర్తి దర్శకేంద్రుడు కే. కే.రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన ‘దేవత’ సినిమాతో రచయితగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక అప్పటి నుండి బావా మరదళ్లు, ఖైదీ నంబర్ 786, కిరాయి కోటిగాడు, పోలీస్ లాకప్, అభిలాష,ఛాలెంజ్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి కథలు అందించారు.
1980, 90లలో విడుదల అయిన బంగారు బుల్లోడు, భలే దొంగ, నారీ నారీ నడుమ మురారి, అమ్మ దొంగా, చంటి, శ్రీనివాస కళ్యాణం, పెదరాయుడు, మాతృదేవోభవ, రౌడీ అన్నయ్య లాంటి ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలకి రచయితగా చేశారు. సత్యమూర్తి 400కు పైగా చిత్రాలకు రచయితగా చేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో మరచిపోలేని చిత్రాలు అయిన అభిలాష, ఖైదీ నెం 786, ఛాలెంజ్ లాంటి సినిమాలకి రైటర్ ఆయనే. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గుడుంబా శంకర్, జానీ సినిమాలకి రచయితగా చేశారు. ఆయన చెన్నైలో డిసెంబర్ 14, 2015లో కన్నుమూశారు.
Also Read:
అన్నదమ్ముల మధ్య గోడవకు కారణమైన సారధి ఎవరో కాదు మంచు ఫ్యామిలికి చాలా దగ్గరివాడని తెలిపారు. అంతే కాకుండా మోహన్ బాబు పర్సనల్ పనులన్ని చూసేది ఆ సారధే అని అన్నారు. మోహన్ బాబు ఎప్పుడో ఆస్తులన్నిటిని పంచి ఇచ్చారని, ఇక మంచు విష్ణు మోహన్ బాబు యూనివర్సిటీ పనులను తీసుకున్నారని, కానీ ఒక విషయంలో క్లారిటీ రావాల్సి ఉందని చెప్పారు.
దాని కోసమే విష్ణుకి సారధితో చిన్నపాటి గొడవ అయ్యిందని చిట్టిబాబు తెలిపారు. సారధి క్లారిటీ ఇవ్వకుండా తప్పించుకుని తిరిగేసరికి, విష్ణు ఆ విషయం గురించే సారధి ఇంటికి వెళ్లాడని అన్నారు. సారధి ఇంటి దగ్గర గొడవ అయ్యిందని, అయితే ఆ టైమ్ లో మోహన్ బాబుకి కాల్ చేస్తే గొడవ అయ్యేది కాదని అన్నారు.
సారధి ఇంటికి వెళ్లి మంచు విష్ణు గొడవ చేయడం తప్పు. ఇక ఈ విషయన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పెట్టడం మంచు మనోజ్ తప్పని చిట్టిబాబు తెలిపారు. మోహన్ బాబు ఏ సమస్య అయిన బయటికి రాకుండా నాలుగు గోడల మధ్యనే సరి చేసేవాడు. ఇప్పుడు కొడుకులు ఇద్దరు దాన్ని క్రాస్ చేసి, మంచు ఫ్యామిలిని విమర్శించే వాళ్లకి ఛాన్స్ ఇచ్చారని అన్నారు.
Also Read: 




కమల్ హాసన్ నటించిన ‘ఇంద్రుడు చంద్రుడు’ అనే చిత్రంతో జయలలిత ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అప్పట్లో సహాయక పాత్రలలో, నెగెటివ్ పాత్రలలో ఆమె నటన అద్భుతంగా అని చెప్పవచ్చు. ఆమె కెరీర్ గొప్పగా ఉన్న సమయంలోనే మలయాళ దర్శకుడు వినోద్ ను ప్రేమించింది. ఇంట్లో వాళ్ళు అంగీకరించకపోవడంతో వాళ్ళను ఎదురించి దర్శకుడు వినోద్ ను వివాహం చేసుకుంది. వినోద్ తో తాను 25 చిత్రాలు చేశానని, ఒకసారి జరిగిన గొడవలో ఆయన తనను సేవ్ చేయడంతో అతనికి దగ్గర అయ్యానని తెలిపింది.
అలా 7 సంవత్సరాలు ప్రేమించుకున్నామని, హఠాత్తుగా పెళ్లి చేసుకుందామని ఫోర్స్ చేశాడు. అతని ప్రవర్తన మా ఫ్యామిలీ మెంబర్స్ కి నచ్చలేదు. దాంతో అతనితో పెళ్లి వద్దని ఇండస్ట్రీలో కూడా చాలా మంది చెప్పారు. కానీ ప్రేమ గుడ్డిది. రక్తంతో ప్రేమలేఖలు వ్రాసాడు, విషం తాగుతా అని బెదిరించి, పెళ్లికి ఒప్పించాడు. కానీ మా ఇంట్లోవాళ్ళు పెళ్లికి అంగీకరించలేదు. దాంతో వాళ్ళను ఎదురించి డైరెక్టర్ వినోద్ ని పెళ్లి చేసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళు నేను సంపాదించిన ఆస్తిని నా పేరెంట్స్ పేరు మీద రాయించుకున్నారు. ఎందుకంటే వినోద్ మీద నమ్మకం లేకపోవడంతో అలా చేశారు.
అయితే పిల్లలు పుట్టిన తరువాత ఇస్తామని చెప్పారు. ఆరోజు వాళ్ళు అలా చేయడం నాకు ఉపయోగపడింది. పెళ్లి అయ్యాక ఇద్దరం 6 మాసాలు కూడా కలిసి లేము. అతను ఆస్తి కోసమే నన్ను వివాహం చేసుకున్నాడని తెలిసింది. నా ఆస్థి కోసం ఎంతగానో వేధించాడు. యాసిడ్ పోస్తానని వేధించేవాడు. అలా మేము సంవత్సరం గడవక ముందే విడిపోయాం. అప్పటి నుండి ప్రేమ కోసం చస్తాం అనేవారిని చూస్తే చిరాకు, కోపం వస్తుంటుంది. ఎందుకంటే ఆ ప్రేమే నా లైఫ్ ని నాశనం చేసిందని జయలలిత వెల్లడించింది. ఆమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: 
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18



