మాస్ మహారాజా రవితేజ, అందాల భామ శ్రీలీల కాంబినేషన్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా నక్కిన త్రినాథ రావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ధమాకా. రిలీజ్‌కు ముందు మ్యూజికల్‌గా అంచనాలు పెంచిన ఈ చిత్రం ఓ మోస్తారు అంచనాలతో విడుదలైంది. 23 డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి ఆట నుంచి సక్సెస్ టాక్‌తో దూసుకెళ్లింది. ట్రేడ్ వర్గాల అంచనాలకు మించి ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించింది.
ధమాకా సినిమా ప్రేక్షకులను అలరించడానికి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోల్స్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన కారణమని చెప్పవచ్చు. పాటలకు తగినట్టుగా శ్రీలీల వేసిన స్టెప్పులు, ఎప్పటిలానే రవితేజ మేనరిజం సినిమాను మరో మెట్టు ఎక్కించాయి. తన రెండో చిత్రం తోనే శ్రీలీల తనలోని నటిని, డాన్సర్ ని ప్రేక్షకులకి పరిచయం చేసేసింది. అలాగే రెగ్యులర్ కథ అయినప్పటికీ.. త్రినాథ రావు సినిమాను రూపొందించిన విధానం సగటు ప్రేక్షకుడిని కట్టి పడేసిందని చెప్పవచ్చు.

క్రాక్ తర్వాత వచ్చిన రవితేజ చిత్రాలు ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ ప్లాప్ కావడం తో రవి తేజ ఈ చిత్రం పైనే ఆశలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా అయ్యి రవితేజ క్రేజ్ తగ్గలేదని నిరూపించింది. ‘ధమాకా’ చిత్రం లో పాత రవి తేజ ని చూసినట్టుందని ఫాన్స్ సంబరపడ్డారు. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కించారు.

అయితే ఈ సూపర్ హిట్ మూవీ లో కూడా కొన్ని మిస్టేక్స్ చేశారు మేకర్స్. వీటిని గుర్తించిన నెటిజన్లు ఎక్కడ ఎక్కడ ఏం తప్పు చేశారు, ఏ సీన్ ఎక్కడ నుంచి కాపీ కొట్టారో చూపిస్తూ అనేక మీమ్స్ క్రియేట్ చేసారు. అలాగే యూట్యూబ్ లో కూడా ఈ మిస్టేక్స్ కి సంబంధించిన వీడియోలో అప్లోడ్ చేశారు. ఆ మిస్టేక్స్ ఏవో కింద ఉన్న వీడియో లో చూసేయండి..
watch video :




కమల్ హాసన్ నటించిన ‘ఇంద్రుడు చంద్రుడు’ అనే చిత్రంతో జయలలిత ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అప్పట్లో సహాయక పాత్రలలో, నెగెటివ్ పాత్రలలో ఆమె నటన అద్భుతంగా అని చెప్పవచ్చు. ఆమె కెరీర్ గొప్పగా ఉన్న సమయంలోనే మలయాళ దర్శకుడు వినోద్ ను ప్రేమించింది. ఇంట్లో వాళ్ళు అంగీకరించకపోవడంతో వాళ్ళను ఎదురించి దర్శకుడు వినోద్ ను వివాహం చేసుకుంది. వినోద్ తో తాను 25 చిత్రాలు చేశానని, ఒకసారి జరిగిన గొడవలో ఆయన తనను సేవ్ చేయడంతో అతనికి దగ్గర అయ్యానని తెలిపింది.
అలా 7 సంవత్సరాలు ప్రేమించుకున్నామని, హఠాత్తుగా పెళ్లి చేసుకుందామని ఫోర్స్ చేశాడు. అతని ప్రవర్తన మా ఫ్యామిలీ మెంబర్స్ కి నచ్చలేదు. దాంతో అతనితో పెళ్లి వద్దని ఇండస్ట్రీలో కూడా చాలా మంది చెప్పారు. కానీ ప్రేమ గుడ్డిది. రక్తంతో ప్రేమలేఖలు వ్రాసాడు, విషం తాగుతా అని బెదిరించి, పెళ్లికి ఒప్పించాడు. కానీ మా ఇంట్లోవాళ్ళు పెళ్లికి అంగీకరించలేదు. దాంతో వాళ్ళను ఎదురించి డైరెక్టర్ వినోద్ ని పెళ్లి చేసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళు నేను సంపాదించిన ఆస్తిని నా పేరెంట్స్ పేరు మీద రాయించుకున్నారు. ఎందుకంటే వినోద్ మీద నమ్మకం లేకపోవడంతో అలా చేశారు.
అయితే పిల్లలు పుట్టిన తరువాత ఇస్తామని చెప్పారు. ఆరోజు వాళ్ళు అలా చేయడం నాకు ఉపయోగపడింది. పెళ్లి అయ్యాక ఇద్దరం 6 మాసాలు కూడా కలిసి లేము. అతను ఆస్తి కోసమే నన్ను వివాహం చేసుకున్నాడని తెలిసింది. నా ఆస్థి కోసం ఎంతగానో వేధించాడు. యాసిడ్ పోస్తానని వేధించేవాడు. అలా మేము సంవత్సరం గడవక ముందే విడిపోయాం. అప్పటి నుండి ప్రేమ కోసం చస్తాం అనేవారిని చూస్తే చిరాకు, కోపం వస్తుంటుంది. ఎందుకంటే ఆ ప్రేమే నా లైఫ్ ని నాశనం చేసిందని జయలలిత వెల్లడించింది. ఆమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: 
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18




దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన ‘విక్రమార్కుడు’ చిత్రంలో చిన్న క్యారెక్టర్ ఆది కూడా 5 నిమిషాలు మాత్రమే తెర మీద కనిపించే పాత్రలో ప్రకాశ్ రాజ్ ను తీసుకున్నాడు. ఇక ఆ ఒక్క సినిమాలో మాత్రమే రాజమౌళి దర్శకత్వంలో ప్రకాశ్ రాజ్ కనిపించాడు. అంత మంచి నటుడు ప్రకాశ్ రాజ్ ని రాజమౌళి ఎందుకు తీసుకోరు అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఈ విషయన్ని రాజమౌళిని ఒక సందర్భంలో అడుగగా ఇలా చెప్పుకోచ్చారు.
ప్రకాశ్ రాజ్ ఇప్పటి దాకా చేయని క్యారెక్టర్ ఏది లేదు. ఆయన ఇప్పటికే దాదాపుగా అన్ని రకాల పాత్రల్లో కనిపించారు. తన చిత్రంలో కూడా మళ్ళీ అలాంటి పాత్రలో నటిస్తే ఆడియెన్స్ కి బోర్ కొడుతుంది. అందువల్ల ఆయనను తీసుకోలేదు.ఇప్పటి దాకా ప్రకాశ్ రాజ్ చేయని క్యారెక్టర్ ఏదైనా వస్తే ఖచ్చితంగా ఆయనతో నా మూవీలో తీసుకుంటానుని రాజమౌళి వెల్లడించారు.
అయితే రాజమౌళి చూపించే ఎలివేషన్స్ లకి ప్రకాశ్ రాజ్ లాంటి నటుడు విలన్ గా చేస్తే చూడాలని చాలా మంది అనుకుంటారు. అలాగే రాజమౌళి చిత్రాల్లో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ లో ప్రకాశ్ రాజ్ నటిస్తే బాగుండేదని ఆయన ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక రాబోయే రాజమౌళి చిత్రాల్లో అయిన ప్రకాశ్ రాజ్ కి నటించే అవకాశం వస్తుందో వేచి చూడాలి.











బాలు తండ్రి హరికథా కళాకారుడు అవడంతో ఆయన సంగీతం పై ఆసక్తిని ఏర్పరుచుకున్నారు. అయితే బాలు తన తల్లీ ఇష్టం మేరకు ఇంజనీరింగ్‌లో చేరారు. అయినప్పటికీ పాటల పోటీలలో పాల్గొనేవారు. 1964లో ఆయన మొదటి అవార్డు అందుకున్నారు. అనంతరం ఇళయరాజాతో కలిసి మ్యూజిక్ బ్యాండ్ ను మొదలుపెట్టారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఎస్పీ కోదండపాణి బాలసుబ్రమణ్యంకు అవకాశం ఇచ్చారు. పైన కనిపిస్తున్న ఫోటో అప్పుడు తీసినదే.
ఆ సమయంలో వారు ఒక గాన గంధర్వుడుని సంగీత ప్రపంచానికి అందిస్తున్నామని అనుకోని ఉండరేమో. పైన ఫోటోలో బాలుకి షేక్ హ్యాండ్ ఇస్తున్న వ్యక్తి అప్పటి హాస్యనటుడు పద్మనాభం. ఇక బాలుకి ఎడమ వైపు ఉన్నవ్యక్తి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ పి కోదండ పాణి. ఈ ఇద్దరు బాలసుబ్రమణ్యంకు తొలి అవకాశం ఇచ్చారు. పద్మనాభం ప్రొడ్యూసర్ గా మారి నిర్మించిన ‘శ్రీ శ్రీ మర్యాద రామన్న’ సినిమాలో బాలు మొదటి పాటను పాడారు.
Also Read: 

దర్శకుడు వంశీ ఈ సినిమాలో హీరోగా జగపతి బాబుని తీసుకోవాలని భావించారు. అప్పటికే ఫ్యామిలీ హీరోగా పాపులర్ అయిన జగపతి బాబు దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పారంట. కథ విన్న జగపతి బాబు కారణం ఏమిటో కానీ, ఈ సినిమాలో నటించడానికి అంగీకరించలేదు.
ఆ తరువాత వంశీ రవితేజకు కథ చెప్పి, ఒప్పించారు. హీరోయిన్ గా కళ్యాణిని తీసుకున్నారు. అలా తెరకెక్కిన సినిమా సూపర్ హిట్ గా నిలిచి, డైరెక్టర్ వంశీని తిరిగి సినిమాలు చేయడానికి ఆయనకి నమ్మకాన్ని ఇచ్చింది. వంశీ తాను రాసుకున్న కథని అలాగే స్క్రీన్ మీద చూపించి అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. అయితే ఈ చిత్రం తరువాత ఆయన డైరెక్షన్ చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేదనే చెప్పవచ్చు. అలా ఆయన సినిమాలను చేయడం మెల్లిగా తగ్గించారు.
Also Read: