బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీదేవి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కేవలం తెలుగు చిత్రాల్లో మాత్రమే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులకి దగ్గరయ్యారు శ్రీదేవి.
చిరంజీవితో పాటు తెలుగు చిత్రాల్లో నటించి తిరుగులేని క్రేజ్ పొందారు శ్రీదేవి. పైగా శ్రీదేవి తో సినిమా తీయాలని దర్శక నిర్మాతలు కూడా ఎదురుచూసేవారు. కానీ ఓ నిర్మాత మాత్రం శ్రీదేవిని షూటింగ్ టైం లోనే చెడామడా తిట్టేశారట.
ప్రస్తుత కాలంలో కిస్సింగ్ సీన్లు, రొమాంటిక్ సీన్లు లేకుండా సినిమాలు రావడం లేదనే చెప్పాలి. గతంలో కూడా ఇలాంటివి ఉండేవి. హీరోయిన్లు ఒప్పుకుంటే.. రొమాంటిక్ సన్నివేశాలు పెట్టడానికే ట్రై చేసేవారు. కానీ నిర్మాత కాట్రగడ్డ మురారి మాత్రం తన సినిమాల్లో ఒక్క బూతు సన్నివేశం కూడా లేకుండా చూసుకునేవారట. దర్శకుడు అవ్వాలని వచ్చిన మురారి కొంతకాలం అసిస్టెంట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత నిర్మాతగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
అప్పట్లో మురారి నిర్మాణం వహించిన సినిమా అంటే కచ్చితంగా అది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయ్యుంటుంది అని నమ్మేవారు. అయితే.. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాలో కృష్ణం రాజు, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారట. ఆ సినిమాకి మురారి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. అయితే, ఈ సినిమాలో ఓ సన్నివేశం ఉంది. శ్రీదేవి పైట కొంగుని తొలగించి కృష్ణం రాజుని హగ్ చేసుకుని ముద్దు పెట్టాల్సి ఉంటుంది. ఆ సీన్ షూటింగ్ జరుగుతున్న టైంలోనే వచ్చిన మురారి.. ఆ సీన్ ని చూసి నా సినిమాలో ఇలా చేస్తావా అంటూ శ్రీదేవిని తిట్టేశారట. డైరెక్టర్ చెప్పినట్లే చేశాను అని చెప్పడంతో.. ఇంకెక్కడైనా చేసుకో.. నా సినిమాలో కాదు అని మందలించారట.





























నాగ చైతన్య తొలి చిత్రం జోష్. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రాధ కుమార్తె కార్తీక హీరోయిన్ గా తెలుగులో పరిచయం అయింది. కానీ కార్తీక ఆ సినిమా తరువాత పెద్దగా గుర్తింపును పొందలేకపోయింది
నాగ చైతన్య రెండవ సినిమా ఏమాయ చేసావే. ఈ చిత్రంతో సమంత హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ సినిమా తరువాత ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ చిత్రాలలో కలిసి నటించారు. సమంత, నాగ చైతన్యలు 2021లో విడాకులు తీసుకొన్న విషయం తెలిసిందే
నాగ చైతన్య నటించిన బెజవాడ మూవీతో అమలా పాల్‌ను టాలీవుడ్ కి పరిచయం అయ్యింది.ప్రస్తుతమ ఆమె దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.
నాగ చైతన్య నటించిన ఒక లైలా కోసం చిత్రంతో పూజా హెగ్డే తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్గా రాణిస్తోంది.
నాగ చైతన్య నటించిన ‘ప్రేమమ్’ చిత్రం ద్వారా మడోనా స్టెబాస్టియన్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.
నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో వచ్చిన ‘సాహసం శ్వాసగా సాగిపో’మూవీతో మంజిమా మోహన్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.
నాగ చైతన్య నటించిన ‘సవ్యసాచి’సినిమాతో నిధి అగర్వాల్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ప్రస్తుతం సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.
నాగ చైతన్య, సమంత నటించిన మజిలీ చిత్రం ద్వారా దివ్యాంశ కౌశిక్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.
Also Read: 















