ఎట్టకేలకు పెళ్లి కుదిరింది అన్న సంతోషం లో ఉన్నాడేమో ఆ వరుడు తన స్నేహితులతో కలిసి ఫుల్లుగా మందు కొట్టేసాడు. ముహూర్త సమయం దగ్గరపడుతోంది అనగా పెళ్లి మంటపానికి వచ్చాడు. వచ్చాడన్న మాటే గాని.. వచ్చిన దగ్గరనుంచి తూలుతూనే ఉన్నాడు. తాగిన మైకం లో తూలుతూనే వచ్చి వధువు ఎదురుగా నిలబడ్డాడు.
దండ వేయమని పూజారి దండ ఇస్తే.. తాగిన మైకం లో ఆ దండని పక్కన ఉన్న అత్త మీద వేయబోయాడు. అతని స్నేహితులు వారించి వధువు వైపు కు తిప్పారు. దండ వేయబోతుండగా మరోసారి తూలిపడ్డాడు. అతని స్నేహితుల సాయం తో ఎట్టకేలకు ఆ దండ ను ఆమె మెడలో వేసాడు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో సమయం లో పెళ్లి కూతురు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ను చూసి నవ్వుకుంటున్నారు. ఈ వీడియో ను మీరు ఈ కింద చూడవచ్చు.
View this post on Instagram