డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన నటులెందరో.. అలాగే ఇండస్ట్రీకి డైరెక్టర్ కావాలనుకుని వచ్చి నటులైన వారు కూడా చాలామంది . అసిస్టెంట్ డైరెక్టర్స్ గా ఉంటూనే నటులుగా మారిన వారున్నారు నేచురల్ స్టార్ నాని కూడా అలా మొదలైంది కి ముందు అసిస్టెంట్ డైరెక్టరే. కమెడియన్ సత్యా కూడా డైరెక్టర్ కావాలని ఇండస్ట్రీకి వచ్చి, అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే నటుడిగా మారారట.. అంతేకాదు జబర్దస్త్ ని ఎందుకు వదిలేయాల్సొచ్చింది.భవిష్యత్లో ఏం చేయాలనుకంటున్నారు అనే కొన్ని ఆసక్తికర విషయాలు..

నిఖిల్ తో నటించిన స్వామిరారా చిత్రం సత్యకి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ చిత్రంలో చిల్లర దొంగతనాలు చేసుకునే వారిగా నిఖిల్, సత్య , పూజా రామచంద్రన్ ల నటనకి ప్రేక్షకులు ఫుల్ ఫిదా అయ్యారు..ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించి కొంచెం బ్రేక్ తీసుకున్నాడు. మత్తు వదలరా సినిమా ద్వారా మళ్లీ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సూపర్ కామెడి పండించారు. ఇటీవల వచ్చిన చిత్రాల్లో మత్తువదలరా లో సత్యా కామెడికి కడుపుబ్బా నవ్వుకున్నారు ప్రేక్షకులు..జక్కన కూడా సత్యా కామెడిని మెచ్చుకున్నారంటే అర్దం చేసుకోవచ్చు. తన జీవితంలో మర్చిపోలేని ప్రశంస రాజమౌలిది అని చెప్పుకొచ్చాడు సత్యా.

ఇక ప్రస్తుతం ఉన్న చాలామంది కమెడియన్స్ లానే సత్యా కూడా ఒకప్పుడ జబర్దస్త్ లో తన స్కిట్స్ తో నవ్వించినవాడే. ఆ కార్యక్రమం నుండి ఎవరు తప్పుకున్నా ఒక రకమైన క్యూరియాసిటి ఉంటుంది ప్రేక్షకులకి.. ఇటీవల చాలామంది జబర్దస్త్ కి పోటీగా పెట్టిన అదిరింది షో కోసం జబర్దస్త్ ని వదిలేసిన విషయం తెలిసిందే.అయితే సత్య జబర్దస్త్ ని వదిలేయడానికి వరుస సినిమా ఆఫర్లే కారణమట. జబర్దస్త్ ని వదిలేయడం రిస్క్ తో కూడుకున్న వ్యవహారమే కాని లక్కీగా సినిమా అవకాశాలు వచ్చాయి అని వివరించాడు.

నిజానికి డైరెక్టర్ కావాలని ఇండస్ట్రీకి వచ్చాను. ద్రోణ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు ఆ చిత్ర దర్శకుడు సినిమాలో నటించమని ఆఫర్ ఇచ్చారు, కాదనలేకపోయాను అలా ద్రోణ సినిమా ద్వారా నటుడిగా పరిచయం అయ్యా. కాని తర్వాత ఆరేళ్లపాటు ఎలాంటి ఆఫర్స్ లేక ఇబ్బందులు పడ్డాను అంటూ అప్పటి పరిస్తితులను వివరిస్తూ, దర్శకుడు అవ్వాలనేది నా బలమైన కోరిక, అందుకే ఎప్పటికైనా దర్శకుడిగా మారతాను ఒక సినిమా తీస్తాను అని కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చాడు.



కొందరు చేసిన పనిని చెయ్యలేదు అంటూ…చెయ్యని పనిని చేశాను అంటూ వాపోతుంటారు ..అది వాస్తవమే..కానీ చేసిన పనులు ఒప్పుకోవాలి అంటే నిజంగా గట్స్ ఉండాలి అనే చెప్పాలి…అసలు విషయానికి వస్తే కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ వలన సెలెబ్రిటీలు హోమ్ క్వారంటైన్ లో ఉంటున్న సంగతి తెలిసిందే..దొరికిన ఈ కాస్త సమయాన్ని సామజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటున్నారు ..ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఫాన్స్ కి లైవ్ లో చిట్ చాట్ చేసిన హర్ తేజ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు..
మూగ జీవాల మీద ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఎవరైనా మూగ జీవాలకు హాని కలిగించే ఫొటోస్ వీడియో చూశారంటే చాలు…వారి పై ఒక రేంజ్ లో తిడుతుంటారు. పెట్స్ ని ఎవరైనా ఇబ్బంది పెట్టిన సరే.అనవసరంగా కొట్టిన రష్మీ వారి పై ఫైర్ అవుతూ ఉంటారు..తాజాగా రష్మీ ఒక వీడియో పై ఇలా చెబుతూ అందులోని మనుషుల ప్రస్తావన పై నిప్పులు చెరిగారు ఇంతకీ ఆ వీడియో లో ఏముందంటే.
రష్మీ పెట్ లవర్ ని అందరూ చెబుతూ ఉంటారు.వాటి మీద ప్రేమను చూపిస్తూ ఉంటారు కూడా వీధి కుక్కలు ఎక్కడ కనిపించిన వాటికి ఆహరం పెడుతూ ఉంటారు.సోషల్ మీడియా లో ఎవరైనా పెట్స్ కి బాగోలేదనో,ఆహరం కోసమేనా తన వద్ద చెబితే చాలు క్షణాల్లో స్పందిస్తారు.తగిన సహాయం కూడా చేస్తారు.లాక్ డౌన్ కారణంగా కుక్కలకి సరైన ఆహరం దొరకడం లేదు.ఇక తానే స్వయంగా రంగంలోకి దిగింది.బకెట్ పట్టుకుని వీధుల్లో తిరుగుతూ మూగజీవాల ఆకలిని తీర్చింది. వీటికి సంబందించిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి కూడా.
మూగ జీవాలని హింసిస్తున్న ఒక వీడియో రష్మీ దృష్టికి వచ్చింది..ఢిల్లీలోని ఒక కాలనీ లో కొందరు ఆకతాయిలు మూగ జీవులని వెంటాడి వెంటాడి మరి హింసించారు.అడ్డుపడిన వారిని కూడా బెదిరించి తప్పుకున్నారు. కుక్కలని కొట్టిన ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.ఆ వీడియో పై స్పందించిన రష్మీ…’నోరు లేని మూగజీవాలపై మీ బలాన్ని చూపడం మగతనం అనిపించుకోదు’ ఇలాంటి పనులను మనం ఖండించాలి. పెట్స్ ను కాపాడుకోవడం, పోషించడం తప్పు కాదని చెప్పుకొచ్చారు.













ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఎదుటి వారికీ సహాయం చెయ్యడానికి ముందుకు వచ్చిన వారందరికీ నా ధన్యవాదాలు అని తెలిపారు సుమ .మానవత్వం ఇంకా బతికే ఉంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం అంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు ..సుమ కనకాల మంచి మనసును నెటిజన్లు అందరు ప్రశంసిస్తున్నారు ..

