ఇటీవల కాలంలో మహిళల వస్త్ర ధారణ పై చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. కొందరు విమర్శిస్తున్నారు. మారుతున్న ఫ్యాషన్ బట్టి మహిళల వస్త్ర ధారణలో వచ్చిన మార్పుకు సమాజంలో చాలా వరకు వ్యతిరేకత ఏర్పడుతోంది.
తరచుగా స్త్రీల వస్త్రధారణ గురించి చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అత్యాచారం లాంటి ఘటనలు జరిగినపుడు మహిళల వస్త్రధారణ వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయనే వాదనలు ఎక్కువగా వినిస్తున్నాయి. అయితే కోరాలో ఆడవారి డ్రెస్సింగ్ సెన్స్ గురించి అడిగిన ప్రశ్నకు ఒక నెటిజెన్ ఏమని చెప్పారో ఇప్పుడు చూద్దాం..
“ఈ మధ్యకాలంలో చాలామంది ఆడవారి వస్త్రధారణ చాలా చండాలంగా ఉంటుంది. చాలామంది వారి వీపు మొత్తం కనపడేలాగా మరియు ఇంకొందరైతే వారి స్థన భాగాలు కూడా కనపడేలాగా వస్త్రధారణ ఉంటుంది. ఇలా వేసుకొని ఎవరిని చెడగొట్టడానికి?” అని కోరాలో అడిగిన ప్రశ్నకు ప్రణీత్ నీత్ అనే యూజర్ ఏం చెప్పారంటే, “మొన్నే ఒక గ్రానైట్ ఫ్యాక్టరీ కి వెళ్ళాను అక్కడ ఒకాయన అర్ధనగ్నంగా పనిచేసుకుంటున్నాడు. అక్కడికెళ్లిన పని చూసుకున్నా వచ్చేసా. అక్కడా కనిపించారు.
అలానే ఉదయమే ఆచమనం చేసుకుంటూ ఒక పెద్దాయన కనిపించారు, ఒక్క దిగువన ఉన్న పంచె తప్ప వంటిపైన కనీసం కండువా లేదు, ఆయనను చూసాను వెళ్ళిపోయాను. ఇక్కడా కనిపించారు. మొన్నీ మధ్య శ్రీశైలం వెళ్ళినప్పుడు ఒక సాధువు జటలతో సుమారు ఒక్క కౌపీనం మాత్రమే ధరించి ఒక కోవెల దగ్గర కళ్ళుమూసుకుని కూర్చున్నాడు. అక్కడ ఎంతోమంది మహిళలు వచ్చి ఆయన దగ్గర సాగిలపడి మొక్కి వెళుతున్నారు. ఆయన ఇసుమంతైనా కదలలేదు, అలానే అక్కడున్న ఆడవారికి మనోవికలనం రాలేదు.
నాకు కొద్దిగా సరిగ్గా అనిపించలేదు, కానీ ఆలోచించినప్పుడు ఆడవారికి కూడా రాని ఆలోచన నాకెందుకు వచ్చిందని, అప్పుడర్థమైంది తేడాగా ఆలోచించిన నా బుర్రదని. ఇక్కడ సమస్యల్లా బట్టలు కాదు బుద్ధి, ఉదాహరణకు హడావిడిగా మీ అమ్మ గారికి ఆరోగ్యం బాలేక మందులు పట్టుకుని వస్తున్నారు, మెట్రో దగ్గర ఎస్కలేటర్ లో మీతో పాటు ఒక అమ్మాయి సుమారు మీరు చెప్పిన విధంగా ఉందనుకుందాం అప్పుడు మీ మనసు ఆమె గురించి ఆలోచిస్తోందా?? లేక మీ అమ్మ గారి గురించి ఆలోచిస్తోందా?? ఇక్కడా అంతే.
వస్త్రధారణ వల్ల ఏ మనిషి చెడిపోడు మైలపట్టిన మనసువల్ల తప్ప, మీరు కొంచెం మీ మనసును మీ అత్యవసరమైన పైన పెట్టండి అనవసరమైనవేవి కనపడవు. ఒకవేళ మీ కన్ను చూసినా అది రెస్పాండ్ అవ్వదు ఎందుకంటే అది మీ ప్రాధాన్యత కాదు కాబట్టి” అని వివరించారు.