“పొన్నియన్ సెల్వన్” ఫస్ట్ రివ్యూ..! సినిమాకి హైలైట్ ఏవంటే..?

“పొన్నియన్ సెల్వన్” ఫస్ట్ రివ్యూ..! సినిమాకి హైలైట్ ఏవంటే..?

by Mohana Priya

Ads

ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న సినిమా పొన్నియన్ సెల్వన్. ఈ సినిమా ఎప్పుడో మొదలయ్యింది. కానీ చాలా కారణాల వల్ల షూటింగ్ అలస్యమైంది. ఈ సినిమా ట్రైలర్ నిన్న విడుదల అయ్యింది. చోళుల కాలానికి చెందిన విషయాల చుట్టూ ఈ సినిమా ఉంటుంది. కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు.

Video Advertisement

ఈ సినిమాలో విక్రమ్, జయం రవి, కార్తీ హీరోలుగా నటిస్తున్నారు. త్రిష, ఐశ్వర్య రాయ్ బచ్చన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరు మాత్రమే కాకుండా మలయాళ నటుడు జయరామ్, ప్రకాష్ రాజ్, విక్రమ్ ప్రభు, పార్తిబన్, కిషోర్, ప్రభు, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదల అయిన ట్రైలర్ లో వీరందరూ కూడా కనిపిస్తున్నారు. ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

story of king ponniyin selvan

అయితే ఈ సినిమా ఇంకా కొన్ని రోజుల్లో విడుదల అవుతోంది. సినిమా బృందం అంతా ప్రమోషన్స్ పనిలో ఉన్నారు. ఎన్నో చోట్ల మీడియాకి సినిమా బృందం ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా మొదటి రివ్యూ వచ్చేసింది. ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధు ఈ సినిమా రివ్యూ చెప్పారు. సోషల్ మీడియాలో ఉమైర్ సంధు ఈ సినిమా గురించి ఈ విధంగా రాశారు. సినిమా గురించి మాట్లాడుతూ “ఫస్ట్ రివ్యూ PS1. మంచి ప్రొడక్షన్ డిజైన్, విఎఫ్ఎక్స్ ఉన్న చాలా గొప్ప సినిమా ఇది. చియాన్ విక్రమ్, కార్తీ చాలా బాగా నటించారు.”

ponniyin selvan review by umair sandhu

“ఐశ్వర్య రాయ్ కం బ్యాక్ ఇచ్చారు. చూడడానికి కూడా చాలా బాగున్నారు. మొత్తంగా చాలా మంచి సీన్స్ ఉన్న ఒక డీసెంట్ చారిత్రాత్మక సినిమా” అని రాశారు. ఉమైర్ సంధు అంతకుముందు చాలా సినిమాలకి రివ్యూలు ఇచ్చారు. అందులో కొన్ని పాజిటివ్ గా ఇచ్చారు. కొన్ని నెగిటివ్ గా ఇచ్చారు. ఉమైర్ సంధు అంతకుముందు విజయ్ హీరోగా నటించిన బీస్ట్ సినిమా చాలా బాగుంది అంటూ రివ్యూ ఇచ్చారు. కానీ ఆ సినిమా ఫలితం ఏమో వేరే లాగా ఉంది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఇలా అన్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకోవాలి అంటే సినిమా విడుదల అయ్యేంతవరకు ఆగాల్సిందే.


End of Article

You may also like