అక్కినేని యువ కథానాయకుడు నాగచైతన్య మొదటిసారి దూతా వెబ్ సిరీస్ తో ఓటిటి లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఎప్పుడూ వైవిధ్యాన్ని కోరుకునే నాగచైతన్య దూతతో ఒక కొత్త ప్రయోగాన్ని చేశాడని చెప్పాలి. నాగచైతన్యతో మనం, థాంక్యూ మూవీలను తెరకెక్కించిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో ఈ దూత వెబ్ సిరీస్ వచ్చింది. అమెజాన్ ప్రైమ్ లో స్టీమ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులు ఆకట్టుకుందో లేదో చూద్దాం…!
చిత్రం: దూత
నటీనటులు: నాగచైతన్య, ప్రియా భవాని శంకర్, పార్వతి తిరువోతూ, తరుణ్ భాస్కర్, రోహిణి, తనికెళ్ల భరణి తదితరులు.
దర్శకుడు: విక్రమ్ కె కుమార్
నిర్మాత:శరత్ మారార్
సంగీతం: ఇషాన్ చాబ్రా
సినిమాటోగ్రఫీ: మికోలాజ్ సైగులా
విడుదల తేదీ:డిసెంబర్ 1

కథ:
సాగర్ (నాగచైతన్య) మొదట జర్నలిస్టుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి అనంతరం సమాచార్ పత్రికకు చీఫ్ ఎడిటర్ గా ఎదుగుతాడు. దీంతో సాగర్ చాలా ఉప్పొంగిపోతాడు. అయితే తన జీవితంలో వరుస విషాదాలు చోటు చేసుకోవడంతో అతని ఆనందం ఎక్కువ కాలం నిలవదు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్ని వార్తాపత్రికలు క్లిప్పింగ్ లు ఈ విషాదాలను ముందుగానే అంచనా వేస్తాయి. మరి అది ఎలా సాధ్యమైంది, సాగర్ కి తన ప్రొఫెషన్ లో శత్రువులు ఎవరైనా ఉన్నారా? మరి చివరిగా ఆ వార్తాపత్రికలు వెనుక రహస్యాన్ని సాగర్ ఎలా చేదించగలిగాడు? అనేది దూత వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:
దర్శకుడు విక్రమ్ కె కుమార్ సినిమాలు చూస్తే ఒక చిన్న పాయింట్ తీసుకుని దాని చుట్టూరు కథనం అల్లి ప్రేక్షకులను థ్రిల్ చేస్తాడు. దూత కథ ఏమిటనేది అయిదారు ఎపిసోడ్ ల తర్వాత గాని క్లారిటీ రాదు.అప్పటివరకు కథ గురించి ఆలోచించే అవకాశాన్ని ప్రేక్షకులకు డైరెక్టర్ ఇవ్వలేదు. ఏదో ఒక మ్యాజిక్ చేస్తూ ముందుకు వెళ్లాడు. మొదటి ఎపిసోడ్ లో కాసేపటికి కథలోకి వెళ్ళాడు. కళ్ళ ముందు కనిపించే పాత్రలతో ప్రయాణం చేసేలా చేశారు. ఫ్లాష్ బ్యాక్ వచ్చేవరకు ఉత్కంఠను కంటిన్యూ చేశారు. దూతలో దెయ్యం లేదు కానీ కంటికి కనిపించని అతీంద్రియ శక్తి ఉందని చెప్పారు. రెగ్యులర్ హర్రర్ నేపథ్యంలో సంగీతంతో భయపట్టే ప్రయత్నం చేయలేదు కానీ కంటికి కనిపించని పాత్రలను ఫీలయ్యేలా చేశారు.

చిన్న చిన్న చమక్కులతో, మెరుపులతో ఆసక్తి సన్నగిల్లకుండా చూశారు. కొన్ని సీన్లలో విక్రమ్ డీటెయిల్ సామాన్య ప్రేక్షకులను సైతం గమనించేలా ఉంటుంది.ఐదారు ఎపిసోడ్లు వరకు సస్పెన్షన్ మెయింటైన్ చేసి తర్వాత కథను ముగింపు దశకు తీసుకురావడానికి డైరెక్టర్ చాలా స్వేచ్ఛ తీసుకున్నాడు. క్యారెక్టర్ లను కనెక్ట్ చేసిన విధానం కాస్త సినిమాటిక్ టైప్ లో ఉంటుంది. ఒక్కో ఎపిసోడ్ నిడివి 40 నుంచి 50 నిమిషాల మధ్య ఉండడం కూడా కాస్త మైనస్ అని చెప్పాలి. ఈ దూత సీరీస్ చూస్తునంత సేపు విక్రమ్ కుమార్ తీసిన 13B ఛాయలు కనిపిస్తాయి. మీడియాలో అవినీతి కొత్త కాదు కానీ దాన్ని ప్రధాన అంశంగా తీసుకున్న డైరెక్టర్ క్లాస్ పీక లేదు. జర్నలిజం, రాజకీయం, పోలీసు వ్యవస్థల్లో ఉన్న మంచి చెడులను చూపించారు.

ఇక టెక్నికల్ గా చూసుకుంటే దూత ఉన్నత స్థాయిలో ఉంది. సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్ లో ఉంది. సంగీతం కూడా కథకి తగ్గట్టుగా ఉంది.నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక నటీనటుల విషయానికొస్తే నాగచైతన్యది పాజిటివ్ రోల్ అని చెప్పలేము, అలాగని నెగిటివ్ కూడా కాదు. గ్రేషేడ్స్ ఉన్నాయి.యాక్టింగ్ స్కోప్ ఎక్కువగా ఉంది. లుక్స్ నుంచి ఎక్స్ప్రెషన్ వరకు చైతన్య ఇంప్రెస్ చేశాడు. పార్వతి నటన ఆకట్టుకుంటుంది, ఎస్పీ క్రాంతి గా ఒదిగిపోయింది. మిగతా పాత్రలు పరిమితమే కానీ ఉన్నంతలో బాగా నటించారు. ఇతర సపోర్టింగ్ ఆర్టిస్టులు కూడా కొన్నిచోట్ల ఆశ్చర్యపరుస్తారు.
రేటింగ్: 3/5
ఫైనల్ గా : దూత మొదలైన 15 నిమిషాల్లో ఆ ప్రపంచంలోకి ప్రేక్షకులు వెళతారు. థ్రిల్లర్ జానర్ ఫిలిమ్స్ ను ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు ఇది మంచి ఆప్షన్. నిడివి కాస్త ఎక్కువైనా కూడా డీసెంట్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంటుంది.
Watch Trailer:




నాగ చైతన్య ఇటీవల నటించిన కస్టడీ మూవీ నిరాశపరిచింది. తరువాత తనకు ప్రేమమ్ మూవీతో హిట్ ఇచ్చిన దర్శకుడు చందూ మొండేటితో సినిమాను ప్రకటించారు. నిర్మాత
సముద్రంలో చేపల్ని వేటాడే బోట్ డ్రైవర్ పాత్రలో నాగ ఛైతన్య నటిస్తున్నారని తెలుస్తోంది. ఇది యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ అని సమాచారం. 2018లో గుజరాత్ విరావల్ నుండి చేపల కోసం వేటకు వెళ్ళిన 21 మంది మత్స్యకారులను పాకిస్థాన్ కోస్ట్ గార్డ్స్ అదుపులోకి తీసుకున్నాయి. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరపడంతో పాక్ చెరనుండి ఆ మత్స్యకారులు బయటబడ్డారు. ప్రస్తుతం ఆ స్టోరీని ఆధారంగా తీసుకునే ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
పాక్ కోస్ట్ గార్డ్స్ అదుపులోకి తీసుకున్న మత్స్యకారుల్లో కె మత్స్యలేశంకు చెందిన మత్స్యకారుడు గణగల్ల రామరావు ఒకరు. గుజరాత్ నుండి సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళిన రామరావు పాకిస్తాన్ కోస్ట్ గార్డులకు చిక్కి, పాకిస్థాన్ లో రెండు సంవత్సరాలు జైలు జీవితాన్ని గడిపాడు. అక్కడి నుండి ఎలా బయటికి వచ్చాడు అనే కథ ఆధారంగానే చందూ మొండేటి ఈ సినిమాని రూపొందిస్తున్నారు. కె.మత్స్యలేశం గ్రామానికి వెళ్ళి, మత్స్యకారులతో మూవీ యూనిట్ చర్చించారు. ఆ ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
జెమినీలో గత వారం ఈ సినిమా ప్రసారం కాగా, దారుణమైన రేటింగ్ వచ్చింది. ఈ సినిమాకి కేవలం 3.41 రేటింగ్ వచ్చింది. హీరో నిఖిల్ నటించిన కార్తికేయ మూవీకి 7.88 రేటింగ్ వచ్చింది. కార్తికేయ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు వసూల్ చేసి, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక అదే టైమ్ లో సీతారామం స్టార్ మాలో టెలికాస్ట్ అయ్యింది. ఈ సినిమాకు మంచి రేటింగ్స్ అందుకుంది. మొదటిసారి ప్రసారం చేయగా 8.73 టీఆర్పీ రావడం విశేషం. ఈ సినిమా రేటింగ్ ప్రభాస్ రాధే శ్యామ్ ఫస్ట్ టైం టిఆర్పి కంటే కూడా ఎక్కువే.
ఇక ఈ మూడు సినిమాలలో సీతారామం సినిమాకే ఎక్కువ టీఆర్పీ రేటింగ్ వచ్చింది. రెండోసారి టెలికాస్ట్ చేయబడిన సర్కారు వారి పాట 6.8 రేటింగ్ వచ్చింది. అయితే ఒకప్పుడు TRP రేటింగ్ 20 పాయింట్ల కంటే ఎక్కువ ఉండేది. ప్రస్తుతం పుష్ప సినిమా టాప్ ప్లేస్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం జనాలు టీవీల్లో మూవీస్ చూసేందుకు అంతగా ఆసక్తి పెట్టడం లేదని తెలుస్తోంది. దాంతో టీఆర్పీ రేటింగ్స్ 10కి తగ్గిపోయింది.
ఇక అమెజాన్ కంటెంట్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కొంచెం సందేహం వచ్చిన రీషూట్స్,రీ ఎడిటింగ్స్, డిస్కషన్స్ లాంటివి తప్పకుండా చేస్తారు. అయితే ‘దూత’వెబ్ సిరీస్ విషయంలోనూ అలాంటిదే జరుగుతోందని తెలుస్తోంది. అదీ కాకుండా ప్రస్తుతం దర్శకుడు విక్రమ్, నాగచైతన్య ఫామ్ లో లేరు. ఇద్దరు థాంక్యూ సినిమాతో చేతులు కాల్చుకున్నారు. బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చింది. అందువల్ల ‘దూత’వెబ్ సిరీస్ ని విడుదల చేయడం వల్ల బజ్ ఉండకపోవచ్చని అమెజాన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
నాగచైతన్య నటించే సినిమా ఏదైనా హిట్ అయిన్నప్పుడు కానీ, ‘దూత’ పై మంచి బజ్ వచ్చాక కానీ ఈ సిరీస్ ను విడుదల చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం అమెజాన్ లో కంటెంట్ కి సమస్య లేదు. దాంతో ఈ వెబ్ సిరీస్ ను హోల్డ్ లో ఉంచారని సమాచారం. అయితే అమెజాన్ సంస్థ ఈ సిరీస్ విడుదల అవనప్పటికి ‘దూత2’ కోసం స్క్రిప్ట్ రాయమని విక్రమ్ కుమార్ ని కోరిందని తెలుస్తోంది. అంటే దూత రెండవ సీజన్ కూడా ఉంటుందని క్లారిటీ అయితే వచ్చేసింది. నాగచైతన్య ప్రస్తుతం ‘కస్టడీ’అనే మూవీలో నటిస్తున్నారు.









