భారత్ క్రికెట్ అభిమానులకు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పై ఉన్న అభిమానం తెలియనిది కాదు. అతని ఆటలోని ప్రత్యేకత అందరినీ ఆకట్టుకుంటుంది. నాయకుడిగా జట్టును నడిపించే తీరు ఇప్పటికి అందరికీ గుర్తుండే ఉంటుంది. ధోనిని మించిన కెప్టెన్ ఇండియాకి రాడు లేడు అంటే అది అతిశయోక్తి కాదు.
ధోనికి ఉన్న ఆదరణను చూసి పలు కంపెనీలు ఆయనను తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుని వారి ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకుంటూ మరిన్ని లాభాలు సంపాదిస్తూ ఉంటాయి. అయితే తాజాగా హైదరాబాదుకు చెందిన తెలుగు సంస్థ మ్యాక్సీవిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ తన బ్రాండ్ అంబాసిడర్ గా ధోని ని నియమించుకుంది.

ఈ సందర్భంగా మ్యాక్సీవిజన్ ఐ హాస్పిటల్ గ్రూప్ సీఈవో సుదీర్ మాట్లాడుతూ మ్యాక్సీవిజన్ లో మొత్తం 40+ హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రతిరోజు వేలాది మంది రోగులకు కంటికి సంబంధించిన సేవలు అందిస్తున్నాం. మారుతున్న జీవనశైలిలో భాగంగా చాలామంది గ్లూకోమా, రెటీనా వంటి సమస్యల వల్ల బాధపడుతున్నారు. మ్యాక్సీవిజన్ కంటి సంరక్షణ ప్రోత్సహించే లక్ష్యంతో ఆన్ లైన్, ఆఫ్ లైన్, ఆన్ గ్రౌండ్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఎంఎస్ ధోని వంటి ప్రముఖ వ్యక్తి ఇందులో భాగమవడం హర్షనీయమని అన్నారు.

స్పష్టమైన దృష్టితో క్రీడలు, జీవితంలో విజయాలు సాధించవచ్చు అని మ్యాక్సీవిజన్ ఐ హాస్పిటల్ బ్రాండ్ అంబాసిడర్ ఎంఎస్ ధోని అన్నారు. తరచూ కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా వాటిని సంరక్షించుకోవచ్చు అని అన్నారు. ఈ రంగంలో మ్యాక్సీవిజన్ అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. ఎంఎస్ ధోని తెలుగు సంస్కృతి బ్రాండ్ అంబాసిడర్ గా చేయడం తో ఆయన తెలుగు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కెరీర్ స్టార్టింగ్ నుండి కూడా ధోని నేషనల్ ,ఇంటర్నేషనల్ బ్రాండ్లకు అంబాసిడర్ గా ఉన్నారు.క్రికెట్ నుండి రిటైర్ అయిపోయిన కూడా ధోని కున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదనడానికి ఇదే నిదర్శనం.
Also Read:ఇదేందయ్యా ఇది…ఇలా కూడా అవుట్ అవుతారా.? బాంగ్లాదేశ్ వాళ్ళు ఇలా పగపట్టేసారు ఏంటి.?



మనోజ్ కి ఐపీఎస్ అధికారి అవ్వాలని కలలుంటాయి. కానీ 12వ తరగతిలో ఫెయిల్ అవుతాడు. ఎందుకంటే బోర్డు పరీక్షల్లో ఉపాధ్యాయులు మాస్ కాపీయింగ్ చేయించకుండా డి.ఎస్.పి దుష్యంత సింగ్ (ప్రియాంషు ఛటర్జీ) అడ్డుకుంటాడు. నువ్వు ఐపీఎస్ కావాలంటే ఎలాంటి అర్థమార్గాలు తొక్కకూడదని డిఎస్పి మందలించాడు కూడా.తర్వాతి సంవత్సరం థర్డ్ క్లాస్ లో పాస్ అవుతాడు. ఇక అమ్మమ్మ పొదుపు చేసిన పెన్షన్ డబ్బులు తీసుకుని సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి ఢిల్లీ వెళ్తాడు. అతనికి పట్టుదల ఉంటుంది కానీ, అందుకు తగ్గ అధ్యయన నైపుణ్యాలు ఉండవు.





దీంతో నందు ఫోన్ లాగేసుకుంటాడు, ప్లీజ్ అంకుల్ నా ఫోన్ నాకు ఇచ్చేయండి అని అడుగుతుంది. తులసి ఆంటీ తో మాట్లాడాలి నువ్వు మోసగాడివి అని అరుస్తుంది.ఆ మాటతో నందు రాక్షసుడిలా మారతాడు హనీ పైకి చెయ్యి లేపుతాడు. చెంప పగిలిపోతుంది బుద్ధిగా చెప్పినట్టు విను, నన్ను రాక్షసుడును చేయకు నా కోపం నీపై కాదు, మీ తులసి ఆంటీ పై నిప్పులు కుంపటి తెచ్చి ఇంట్లో పెట్టింది. ఇల్లు తగలబడి పోతున్న పట్టించుకోవడం లేదు.






కమర్షియల్ చిత్రాలతో పాటు లేడీ ఓరియంటల్ చిత్రాల్లో మెప్పించిన అనుష్క బాహుబలి తర్వాత జోరు తగ్గించిందని చెప్పాలి. ప్రస్తుతం సినిమాలు చేయకుండా ఖాళీగా ఉంటున్నారు. చాలా రోజుల తర్వాత ఆమె నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా తాజాగా అలరించింది.









