దేశం గర్వించదగ్గ స్థానం లో ఉన్న ఈ అమ్మాయి…ఆ నటుడి కూతురని తెలుసా.? ఎవరో చూడండి..!

దేశం గర్వించదగ్గ స్థానం లో ఉన్న ఈ అమ్మాయి…ఆ నటుడి కూతురని తెలుసా.? ఎవరో చూడండి..!

by Anudeep

Ads

హీరో విజయ్..ప్రస్తుతం ఈయన సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ లో కనిపిస్తున్నారు. ఈయన 1992 లోనే తలైవాసల్ అనే సినిమా తో పరిచయం అయ్యారు. ఆ సినిమా మంచిపేరు తెచ్చిపెట్టడం తో ఆ సినిమా పేరే ఇంటి పేరు గా మారిపోయింది. ఆ తరువాత 2010 లో “యుగపురుషన్” అనే సినిమా లో గురు అనే పాత్రలో జీవించి మంచి పేరు కొట్టేసారు విజయ్. తెలుగు లో కూడా చాలా సినిమాలలో ఈయన సపోర్టింగ్ రోల్స్ చేసారు. గగనం, భాగమతి, మరో చరిత్ర లాంటి సినిమాల్లో కీలక పాత్ర పోషించారు.

Video Advertisement

ఈయన డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. జెడి చక్రవర్తి వంటి నటులకు కూడా ఈయన డబ్బింగ్ చేసారు. ఈయనకు ఒక కుమార్తె జయవీణ, చిన్న కుమారుడు జైవంత్. వీరిద్దరూ స్విమ్మింగ్ లో నిష్ణాతులు. ఇద్దరు స్విమ్మింగ్ లో ఛాంపియన్లు గా నిలిచారు. అయితే, ఈయన కుమార్తె జయవీణ ఇప్పటికే పలు పథకాలను గెలుచుకుంది. చిన్న వయసులోనే తొమ్మిది మీటర్ల లోతు ఉన్న స్విమ్మింగ్ పూల్ దూకేసి అందరిని ఆశ్చర్యం లో ముంచెత్తారు. చిన్నతనం లోనే ఆమె లో ని స్విమ్మింగ్ నైపుణ్యాన్ని గమనించిన విజయ్ ఆమెను బాగా ప్రోత్సహించారు.

thalaivasl vijay daughter 2

జయవీణ శ్రీ రామ చంద్ర యూనివర్సిటీ నుంచి బిఎస్సి స్పోర్ట్స్ సైన్సెస్ లో డిగ్రీ పట్టా పొందారు. స్విమ్మింగ్ లో ఆమె మూడు బంగారు పతకాలను, రెండు వెండి పతకాలను, ఒక రజత పతాకాన్ని సాధించారు. ఇటీవల చండీఘర్ లో జరిగిన ఆలిండియా యూనివర్సిటీ ఛాంపియన్ షిప్ లో పాల్గొన్న ఆమె ఈ పథకాలను సాధించారు.

ఎక్కడ స్విమ్మింగ్ పోటీలు జరిగినా, ఆమె పాల్గొని విజయం సాధిస్తారు. 2011 లోనే రాంచి లో ఇండియాన్ నేషనల్ గేమ్స్ లో ఆమె పాల్గొన్నారు. ఇందులో 200 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ స్విమ్మింగ్ పోటీ ఆమె పాల్గొన రజత పథకాన్ని గెలుచుకున్నారు. అప్పటికి ఆమె వయసు పన్నెండు సంవత్సరాలు. అంత చిన్న వయసు లో ఆమె ఇంతటి విజయాన్ని సాధించింది.

thalaivasl vijay daughter 3 .jpg.crdownload

అప్పట్లోనే ఆమె పేరు మారుమ్రోగిపోయింది. విజయ్ చిన్న కుమారుడు జైవంత్ కూడా స్విమ్మింగ్ లో ఛాంపియన్ షిప్ సాధించాడు. ఇటీవలే నేపాల్ రాజధాని ఖాట్మండు లో కూడా నిర్వహించబడిన 13వ సౌత్ ఆసియన్స్ గేమ్స్ లో స్విమ్మింగ్ లో జయవీణ వెండిపథకాన్ని గెలుచుకున్నారు. తన పిల్లలిద్దరూ స్విమ్మింగ్ లో నైపుణ్యాన్ని ప్రదర్శించడం పట్ల తనకెంతో సంతోషం గా ఉంటుందని విజయ్ చెబుతుంటారు. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించడమే తన కూతురి లక్ష్యమని ఆయన తెలిపారు. ఇటువంటి వారిని ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తే… ఇండియా కు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్స్ వస్తాయని విజయ్ ఆశాభావం వ్యక్తం చేసారు.


End of Article

You may also like