యంగ్ హీరో విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఖుషి’. ఈ చిత్రాన్ని దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని వై.రవి శంకర్, నవీన్ ఎర్నేని సంయుక్తంగా నిర్మించారు. హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతంలో వచ్చిన ఈ మూవీ సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచాయి.
ఇటీవల కాలంలో ఏ తెలుగు మూవీకి రానంత బజ్ ఖుషి సినిమాకు వచ్చింది. సెప్టెంబర్ 1న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఖుషి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఖుషి టీజర్, పాటలు,ట్రైలర్ కి ఆడియెన్స్ నుండి మంచి స్పందన లభించింది. విజయ్, సమంతల మధ్య వచ్చే సీన్స్ యూత్ తో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని టీజర్, ట్రైలర్ల చూస్తే తెలుస్తోంది. మూవీ రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా ఉంది.
అయితే ఈ మూవీ మొదటి రివ్యూ వచ్చేసింది. అది ఇచ్చింది ఎవరో కాదు. ఓవర్సీస్ సెన్సార్ మెంబర్ గా చెప్పుకుంటూ సోషల్ మీడియాలో రివ్యూలు పెట్టె ఉమైర్ సంధు. తాజాగా ‘ఖుషి’ సినిమా చూసినట్టుగా చెప్పిన ఉమైర్ సంధు, ఈ మూవీ రివ్యూను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
ఆ ట్వీట్ లో “అవుట్ డేటెడ్ మరియు బోరింగ్ లవ్ స్టోరీ.విజయ్ దేవరకొండ సమంతల మధ్య కెమిస్ట్రీ పండలేదు. ఈ సినిమాలో సమంత వయసు మీద పడినట్టుగా కనిపిస్తోంది. సాగదీసిన కథాంశం, డల్ స్క్రీన్ప్లే మరియు దర్శకత్వం, కథ చాలా వీక్ గా ఉందని, ఈ మూవీకి వెళ్లకుండా మీ డబ్బులు ఆదా చేసుకోండి” అని ఉమైర్ సంధు పేర్కొన్నాడు. ఫైనల్ గా ఈ మూవీకి రేటింగ్ 5 కి గాను 2 ఇస్తున్నట్టు ఆ ట్వీట్ ద్వారా వెల్లడించాడు.
Also Read: OG కొత్త పోస్టర్లో… “పవన్ కళ్యాణ్” చేతికి ఉన్న టాటూ అర్థం ఏంటో తెలుసా..?

సోదర సోదరీమణుల ప్రేమ, అనుబంధానికి గుర్తుగా రక్షా బంధన్ పండుగను జరుపుకుంటారు. రాఖీ పౌర్ణమి నాడు అక్కాచెల్లెల్లు తమ అన్నదమ్ములకు రాఖీ కట్టి, వారి ఆశీర్వాదం తీసుకుంటారు. అయితే ఈ ఏడాది వచ్చిన పౌర్ణమి తిథి ఆగస్ట్ 30వ తారీఖు 10 గంటల 58 నిముషాల నుండి 31 వ తారీఖు ఉదయం 7 గంటల 5 నిముషాల వరకు ఉంది.. రాఖీని మంచి ముహూర్తంలో కట్టడం వల్ల సోదరుడికి మంచి జరుగుతుందని, భద్రకాలంలో రాఖీని అస్సలు కట్టకూడదని చెబుతున్నారు.
భద్రకాలంలో రాఖీ కడితే ఆ సోదరుడు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు. శాస్త్రాల ప్రకారం, భద్రకాలంలో సోదరుల చేతికి సోదరీమణులు రాఖీ కట్టకూడదని, భద్ర కాలం పూర్తి అయిన తర్వాతే రాఖీ కట్టాలని అంటున్నారు. భద్ర కాలం ఆగస్టు 30 బుధవారం ఉదయం 10:58 గంటలకు మొదలై రాత్రి 9:01 వరకు ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో సోదరులకు రాఖీ కట్టడం మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు.
రాఖీ పండుగను రాత్రి9:02 గంటల నుంచి 12 వరకు జరుపుకోవచ్చని అంటున్నారు. అదే సమయంలో ఆగస్ట్ 31 రాఖీ కట్టేందుకు శుభ ముహూర్తమని పలువురు పండితులు చెబుతున్నారు. ఆగస్ట్ 31రోజు ఉదయం 5 గంటల 58 నిముషాల నుండి 7 గంటల 5 నిముషాల వరకు రాఖీ కట్టవచ్చని చెబుతున్నారు.
న్యూమరాలజీ ప్రకారం, యూనివర్స్ లోని సూపర్ పవర్ సందేశాన్నితెలియజేయడానికి యాదృచ్ఛికంగా కనిపించే మూడు లేదా నాలుగు సంఖ్యల రిపిటెడ్ అంకెలను ఎంజెల్ నంబర్లు అంటారు. నంబర్లు మాత్రమే కాకుండా రీపిటెడ్ గా ఒకేవరుసలో కనిపించేది ఏడి అయినా దానిని యూనివర్స్ నుండి వచ్చే సందేశంగా భావించాలని చెబుతున్నారు. ఉదాహారణకు 3 నల్లపురంగులో ఉండే పిల్లులు ఒకే వరుసలో కనిపించినా కూడా, అది ఫుచర్ లో కచ్చితంగా లైఫ్ లో జరిగే మార్పుకు సూచనగా భావించాలట.
ఇలా కనిపించిన ప్రతిసారీ అది యూనివర్స్ అందించే మెసేజ్ కాకపోవచ్చట. అయితే కొన్నిసార్లు పూర్వికులు నుండే సందేశం కూడా కావచ్చు. మరి కొన్నిసార్లు ఆధ్యాత్మిక వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్ కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎంజెల్ నంబర్లు ప్రతి రోజూ మనకు కనిపించకపోవచ్చు. అయితే ఎక్కడైనా, ఎప్పుడైనా ఈ ఎంజెల్ నంబర్స్ కనిపించి మెసేజ్ అందించవచ్చట.
111 లేదా 11:11 అర్ధం..
తెలుగువారి ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటి చెప్పిన మహా నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుగారికి జాతీయ గుర్తింపు లభించింది. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆయన బొమ్మతో 100 రూపాయల స్మారక నాణెంను ముద్రించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఈ నాణెంను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబు, ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు, ఎన్టీఆర్ కుటుంబీకులు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, సినీ మరియు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
తెలంగాణలోని మింట్ కాంపౌండ్లో ఈ నాణేన్ని తయారుచేశారు. అయితే వ్యక్తి స్మారకార్థం రూపొందించిన మొదటి నాణెం ఎన్టీఆర్దే కావడం విశేషం. ఈ నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింకుతో తయారు చేశారు. ఈ నాణెంను నేడు (మంగళవారం) ఉదయం 10 గంటల నుంచి అమ్మకానికి అందుబాటులోకి తెచ్చారు.
మొదటి విడతగా పన్నెండు వేల ఎన్టీఆర్ స్మారక నాణేలను ముద్రించారు. డిమాండ్ పెరిగితే మరిన్ని తయారు చేస్తారని తెలుస్తోంది. ఎన్టీఆర్ చిత్రంతో వచ్చిన నాణెంను కొనడానికి ఎంతోమంది తెలుగువారు ఆసక్తి చూపుతున్నారు. ఈ నాణెం ధర 3500 నుండి 4000 వరకు ఉంటుందని మింట్ అధికారులు చెప్తున్నారు. ఈ నాణేన్ని కావాలనుకునవారికి, ప్యాక్ చేసి అందిస్తారు కాబట్టి ధరలో స్వల్ప తేడాలు ఉండవచ్చని వారు వెల్లడించారు.
“ఈ మధ్యకాలంలో చాలామంది ఆడవారి వస్త్రధారణ చాలా చండాలంగా ఉంటుంది. చాలామంది వారి వీపు మొత్తం కనపడేలాగా మరియు ఇంకొందరైతే వారి స్థన భాగాలు కూడా కనపడేలాగా వస్త్రధారణ ఉంటుంది. ఇలా వేసుకొని ఎవరిని చెడగొట్టడానికి?” అని కోరాలో అడిగిన ప్రశ్నకు
అలానే ఉదయమే ఆచమనం చేసుకుంటూ ఒక పెద్దాయన కనిపించారు, ఒక్క దిగువన ఉన్న పంచె తప్ప వంటిపైన కనీసం కండువా లేదు, ఆయనను చూసాను వెళ్ళిపోయాను. ఇక్కడా కనిపించారు. మొన్నీ మధ్య శ్రీశైలం వెళ్ళినప్పుడు ఒక సాధువు జటలతో సుమారు ఒక్క కౌపీనం మాత్రమే ధరించి ఒక కోవెల దగ్గర కళ్ళుమూసుకుని కూర్చున్నాడు. అక్కడ ఎంతోమంది మహిళలు వచ్చి ఆయన దగ్గర సాగిలపడి మొక్కి వెళుతున్నారు. ఆయన ఇసుమంతైనా కదలలేదు, అలానే అక్కడున్న ఆడవారికి మనోవికలనం రాలేదు.
నాకు కొద్దిగా సరిగ్గా అనిపించలేదు, కానీ ఆలోచించినప్పుడు ఆడవారికి కూడా రాని ఆలోచన నాకెందుకు వచ్చిందని, అప్పుడర్థమైంది తేడాగా ఆలోచించిన నా బుర్రదని. ఇక్కడ సమస్యల్లా బట్టలు కాదు బుద్ధి, ఉదాహరణకు హడావిడిగా మీ అమ్మ గారికి ఆరోగ్యం బాలేక మందులు పట్టుకుని వస్తున్నారు, మెట్రో దగ్గర ఎస్కలేటర్ లో మీతో పాటు ఒక అమ్మాయి సుమారు మీరు చెప్పిన విధంగా ఉందనుకుందాం అప్పుడు మీ మనసు ఆమె గురించి ఆలోచిస్తోందా?? లేక మీ అమ్మ గారి గురించి ఆలోచిస్తోందా?? ఇక్కడా అంతే.
వస్త్రధారణ వల్ల ఏ మనిషి చెడిపోడు మైలపట్టిన మనసువల్ల తప్ప, మీరు కొంచెం మీ మనసును మీ అత్యవసరమైన పైన పెట్టండి అనవసరమైనవేవి కనపడవు. ఒకవేళ మీ కన్ను చూసినా అది రెస్పాండ్ అవ్వదు ఎందుకంటే అది మీ ప్రాధాన్యత కాదు కాబట్టి” అని వివరించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ‘బ్రో’ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించగా, పవన్ కళ్యాణ్ టైమ్ దేవుడు టైటాన్ పాత్రలో నటించి, మెప్పించారు. ఈ పాత్ర అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న వరుస చిత్రాలలో ‘ఓజీ’ ఒకటి. ఈ చిత్రానికి ప్రభాస్ తో ‘సాహో’ లాంటి భారీ బడ్జెట్ సినిమాని తీసిన దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. సుజీత్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అనే విషయం అందరికీ తెలిసిందే.
ఈ సినిమాని నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ‘ఓజీ’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 2న ఈ మూవీ గ్లింప్స్ లేదా టీజర్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఫస్ట్ లుక్ లేదు అంటూ ఆకలితో ఉన్న చిరుత కోసం వెయిట్ చేద్దాం అని ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్ లో గన్ పట్టుకున్న చేతి పై ఒక టాటూ కనిపిస్తోంది. దీంతో ఆ టాటూ అర్ధం ఏమిటా అని నెటిజెన్లు సెర్చ్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ టాటూకు అర్ధం ఫైర్ పవర్ అని ఒక ట్విట్టర్ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పవన్ బర్త్ డే రోజు టీజర్ లేదా గ్లింప్స్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.
పై ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి పేరు జాసన్ సంజయ్. ప్రముఖ ప్రొడక్షన్ హౌజ్ అయిన లైకా ప్రొడక్షన్స్ ద్వారా జాసన్ సంజయ్ డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేయబోతున్నాడు. లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై త్వరలో నిర్మించబోయే కొత్త చిత్రానికి జాసన్ సంజయ్ దర్శకత్వం వహించబోతున్నారని లైకా సంస్థ అధినేత అయిన సుభాస్కరన్ అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన అగ్రిమెంట్ జరిగినట్లు వెల్లడిస్తూ, ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఈ విషయం తెలిసిన అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోయాయి. అంత పెద్ద స్టార్ హీరో తనయుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడని అనుకుంటే, దర్శకుడిగా మారబోతున్నారా అని జాసన్ సంజయ్ అనూహ్య నిర్ణయం పట్ల షాక్ అవుతున్నారు. ఇప్పుడు ఈ విషయం, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతలా చర్చకు దారితీయడానికి కారణం జాసన్ సంజయ్ స్టార్ హీరో తనయుడు కావడమే. ఆయనెవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి. సౌత్ ఇండస్ట్రీలో ఆయనకుండే క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
విజయ్ సినిమాల కోసం అటు కోలీవుడ్ లో, ఇటు టాలీవుడ్ లోను ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ ఏడాది మొదట్లోనే వారసుడు మూవీతో విజయం అందుకున్నవిజయ్ దళపతి, ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లియో సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తయిందని తెలుస్తోంది. ఇక హీరో విజయ్ తండ్రి ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ అనే విషయం తెలిసిందే. జాసన్ సంజయ్ తాత మార్గంలో దర్శకుడిగా మారబోతున్నారు.
ఫోన్ను ఎక్కువసేపు ఉపయోగించినపుడు మొబైల్ వేడిగా అవడం అందరూ గమనించే ఉంటారు. ఫోన్ వేడి కాగానే దాని ఎఫెక్ట్ ఫోన్ వెనుక భాగంలో వెంటనే కనిపిస్తుంది. అటువంటి కండిషన్ లో ఫోన్ కవర్ లోపలివైపు కరెన్సీ నోట్లు ఉన్నట్లయితే, ఆ సమయంలో ఫోన్ నుండి వేడి బయటకు రిలీజ్ కాలేదు. దాని వల్ల బాగా వేడి అయిన ఫోను పేలిపోయే ప్రమాదం ఏర్పడుతుంది.
అందువల్లనే మొబైల్ కు బిగుతుగా ఉండే కవర్లను వాడకూడదని నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే బిగుతుగా ఉండే కవర్ ఫోన్ పేలిపోయేలా చేస్తుందని చెబుతున్నారు. ఇక కరెన్సీ నోట్లను తయారీ చేయడం కోసం కాగితంను ఉపయోగిస్తారు. అంతేకాకుండా అనేక రకాలైన కెమికల్స్ ను కరెన్సీ నోట్ల తయారీలో ఉపయోగిస్తారు. ఎక్కువసేపు ఫోన్ వాడినపుడు ఫోన్ వేడెక్కుతుంది. ఆ సమయంలో అది బయటకు రాకుండా రసాయినాలతో తయారుచేసిన కరెన్సీ నోట్లు అడ్డు పడడం వల్ల ఆ పోన్ పేలిపోవడానికి ఎక్కువ అవకాశం కలుగుతుంది.
అందువల్ల ఎవరు పొరపాటున అయినా సరే ఫోన్ కవర్లో కరెన్సీ నోట్లను పెట్టకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఫోన్ కవర్ బిగుతుగా ఉన్నకూడా ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కాబట్టి అందరూ కూడా ఫోన్ కవర్ కొనుగోలు చేసేటపుడు జగ్రత్తగా మొబైల్కు గాలి తగిలేలా ఉండే కవర్ను ఎంపిక చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
అప్పటిదాకా ప్రేమకథలు మరియు కమర్షియల్ సినిమాలు చేస్తున్న నాగార్జునను దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అన్నమయ్య సినిమాతో ప్రేక్షకులకు సరికొత్తగా పరిచయం చేశారు. ఈ మూవీ ప్రకటించిన సమయంలో అన్నమయ్యగా నాగార్జున అంటే ఎంతోమంది విమర్శించారు. కానీ మూవీ రిలీజ్ అయ్యి, అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఆ తరువాత అన్నమయ్య పాత్రలో నాగార్జునను తప్ప మరెవరిని ఊహించలేమనే ప్రశంసలు వచ్చాయి. ఈ మూవీలో శ్రీ వెంకటేశ్వరస్వామిగా సుమన్ అదే స్థాయిలో పేరు, ప్రఖ్యాతులను పొందారు.
సుమన్ కెరీర్లో బిగ్గెస్ట్ సినిమాగా అన్నమయ్య నిలిచింది. శ్రీ వెంకటేశ్వరస్వామిగా సుమన్ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసులో నిలిచిపోయారు. అయితే ఈ పాత్రకు ముందుగా అనుకున్నది సుమన్ ని కాదట. ఈ మూవీలో అన్నమయ్య వెంకటేశ్వరస్వామి పాదాలను మొక్కే సన్నివేశం ఉండడంతో రాఘవేంద్రరావు పెద్ద స్టార్ ని తీసుకోవాలని భావించి, హీరో శోభన్ బాబును సంప్రదించారట. కానీ అప్పటికే ఆయన సినిమాలు మానేసారు. పాత్ర నచ్చినప్పటికి, తిరిగి నటించాలని లేకపోవడంతో రిజెక్ట్ చేయలేక యాబై లక్షల పారితోషికం అడిగారంట.
అప్పట్లో అది చాలా పెద్ద మొత్తం అవడంతో వద్దనుకున్నారంట. ఆ తరువాత నందమూరి బాలకృష్ణను ఆ పాత్ర కోసం సంప్రదించారంట. కానీ నందమూరి, అక్కినేని అభిమానుల మధ్య గొడవలు వస్తాయేమో అని వద్దనుకున్నారట.
అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, జంటగా నటించిన ఆర్య 2 మూవీలో నవదీప్, బ్రహ్మానందం, శ్రద్ధా దాస్ కీలక పాత్రలలో నటించారు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ మూవీలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. కమర్షియల్ గా హిట్ కాకపోయినా ఈ మూవీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఈ మూవీలో అల్లు అర్జున్ ఫ్రెండ్ పాత్రలో నవదీప్ నటించారు.
నవదీప్ చిన్నప్పటి పాత్రలో నటించిన బాల నటుడి పేరు అనుదీప్. పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ అబ్బాయి ఇప్పుడు పెద్దగా అయ్యాడు. అనుదీప్ నటుడిగా కొనసాగుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలలో నటించిన బ్రో మూవీలో అనుదీప్ నటించాడు. ఈ మూవీ ఇటీవల విడుదల అయిన విషయం తెలిసిందే.
బ్రో మూవీలో సాయి ధరమ్ తేజ్ చెల్లిని పెళ్లి చేసుకోవాలనుకునే యువకుడిగా, తనికెళ్ళ భరణి కుమారుడిగా నటించిన అబ్బాయి అనుదీప్. సినిమా చివరిలో ఆ అబ్బాయి నిజస్వరూపం బయటపడడంతో సాయి ధరమ్ తేజ్ చేతిలో దెబ్బలు తినే పాత్రలో నటించాడు. పెద్దయ్యాక అనుదీప్ నటించిన తొలి మూవీ ఇదే.