బిగ్ బాస్ సీజన్ 7వ సీజన్ ఇటీవల గ్రాండ్ గా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటికే బిగ్ బాస్ మొదలయ్యి రెండు వారాలు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. తొలి వారం హీరోయిన్ కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ కాగా, రెండవ వారం షకీలా ఎలిమినేట్ అయ్యింది.
అయితే బిగ్ బాస్ హౌస్ లో అంతమంది పోటీదారులు ఉన్నప్పటికీ రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియాలో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం రైతుబిడ్డ నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారాడు. పల్లవి ప్రశాంత్ ఆస్తుల గురించిన వార్త వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ సంచలనంగా మారాడు. సెలెబ్రెటీ కానప్పటికీ. సాధారణ వ్యక్తిగా బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన ప్రశాంత్ ఓటింగ్ లో దూసుకుపోతున్నాడు. షో ప్రారంభం అయ్యి, రెండు వారాలు పూర్తి కాగా, రెండుసార్లు ప్రశాంత్ నామినేషన్స్ లో నిలిచాడు. కానీ టోటల్ ఓటింగ్ లో నలబై శాతం ఓట్లు అతనికే వస్తున్నాయని సమాచారం.
పల్లవి ప్రశాంత్ బలమైన కంటెస్టెంట్ అని హౌజ్ మెంబర్స్ ఇప్పటికే పసిగట్టారు. దాంతో జనాల్లో రైతుబిడ్డ పై సింపథీ పోగొట్టడానికి ట్రై చేస్తున్నారు. అందుకే రెండవ వారం నామిషన్స్ లో రితికా రోజ్, అమర్ దీప్ చౌదరి, ప్రియాంక, తేజా, శివాజీతో పాటు కొందరు ప్రశాంత్ పై అటాక్ చేశారు. సింపథీ మాటలు మాట్లాడవద్దని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా ప్రశాంత్ కున్న క్రేజ్ తగ్గకపోగా మరింతగా పెరిగిందని తెలుస్తోంది.
పల్లవి ప్రశాంత్ తెలంగాణకు చెందిన వ్యక్తి. రైతుబిడ్డగా పాపులర్ అయిన ప్రశాంత్ ఫ్యామిలీ కాస్త డబ్బు ఉన్న ఫ్యామిలీ అని సమాచారం. పల్లవి ప్రశాంత్ కి దాదాపు 26 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉందని అంటున్నారు. అది మాత్రమే కాకుండా సొంత ఊరిలో పెద్ద ఇల్లుతో పాటుగా, కాస్ట్లీ లగ్జరీ కారు కూడా ఉందని టాక్. ప్రశాంత్ పొలం, హౌజ్ విలువ కోట్లలో ఉంటుందని అంటున్నారు. ప్రశాంత్ వ్యవసాయ వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తాయని టాక్. ఈ న్యూస్ లో నిజమెంతో తెలియదు కానీ నెట్టింట్లో వైరల్ గా మారింది.
Also Read: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన 7/జి బృందావన్ కాలనీ హీరో..? ఇప్పుడు ఎలా ఉన్నారంటే..?





























బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన రతిక రోస్ అచ్చమైన తెలుగమ్మాయి. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాకు చెందిన అమ్మాయి. నటన పై ఆసక్తితో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. కానీ సినిమాలలో అవకాశాల కోసం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. చాలా చిత్రాలలో చిన్న చిన్న పాత్రలలో నటించింది. కానీ ఆమె అనుకున్న విధంగా లీడ్ రోల్స్ మాత్రం రాలేదు.
రతిక రోస్ 2016లో మొదట స్టాండప్ కమెడియన్ కెరీర్ ను ప్రారంభించింది. అడపాదడపా సినిమాలలో నటిస్తున్నప్పటికి చెప్పుకోదగ్గ క్యారెక్టర్లలో నటించలేదు. బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది అనే మూవీలో ఒక పాత్రను చేసింది. బెల్లంకొండ గణేష్ హీరోగా వచ్చిన ‘నేను స్టూడెంట్ సర్’ మూవీలో పోలీసాఫీసర్‌గా నటించింది. ఈ పాత్రతో ఆమెకు గుర్తింపు వచ్చింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ లో అడుగుపెట్టింది. ఆ టైమ్ లో ఆమె తనను ప్రియగా పరిచయం చేసుకుంది. ఈటీవీలో ప్రసారం అయిన పటాస్ ఎలాంటి విజయం అందుకుందో తెలిసిందే. ఈ షోలో కామెడియన్స్ కి సినిమాలలో అవకాశాలు వచ్చాయి.
అలా ప్రియ తన స్టాండప్ కామెడీతో ఆడియెన్స్ ని నవ్వించి, పాపులర్ అయ్యింది. ఆ తర్వాత గ్యాప్ తీసుకుని మోడలింగ్ వైపు వెళ్ళింది. అలా ఈ తెలుగు అమ్మాయికి టాలీవుడ్ లో కాకుండా కోలీవుడ్ లో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది. ఆ తరువాత మరో మూవీ చేసింది. కానీ ఆ మూవీ రిలీజ్ కు ముందే ఆగిపోయింది.




























#2
#3
#4
#5
#6
#7
#8
#9