బాబీ సింహా తమిళ ఇండస్ట్రీలో టాలెంటెడ్ యాక్టర్ గా మంచి గుర్తింపు ఉంది. తెలుగువాడు అయిన బాబీ సింహా కోలీవుడ్ లో నటుడుగా రాణిస్తూ, పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. తెలుగు, మలయాళ సినిమాలలో కూడా అడపాదడపా నటిస్తూ, ఆ భాషలలో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.
లేటెస్ట్ గా బాబీ సింహా సలార్ మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించారు. సలార్ మూవీలో రాజమన్నార్ అల్లుడిగా, రాధా రామ భర్తగా కీలక పాత్రలో బాబీ సింహా నటించారు. బాబీ సింహా బ్యాక్ గ్రౌండ్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
బాబీ సింహా అసలు పేరు జయసింహ. 1983లో హైదరాబాద్‌లోని మౌలాలీలో నవంబర్ 6న బాబీ సింహా జన్మించారు. వారి కుటుంబం ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లా, మోపిదేవికి చెందినవారు. 1995లో కొడైకెనాల్‌కు వెళ్లిపోయారు. నాలుగో తరగతి వరకు మౌలాలీలో, ఆ తరవాత టెన్త్ క్లాస్ వరకు కృష్ణా జిల్లా మోపిదేవిలోని ప్రియదర్శిని విద్యాలయం తెలుగు మీడియం పాఠశాలలో పూర్తి చేసారు. ఆ తరువాత కోయంబత్తూర్‌లోని పయనీర్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో చదువు పూర్తి చేశాడు.
2005లో, కోయంబత్తూర్ లో ఓ కార్యక్రమంలో పాల్గొనగా, అక్కడికి ముఖ్య అతిధులు వచ్చిన సుందర్ సి, ఇ. రాందాస్ కోలీవుడ్ లో నటుడిగా ట్రై చేయమని సూచించారు. సింహా డిగ్రీని పూర్తి చేసి, యాక్టర్ గా అవకాశాల కోసం చెన్నైకి వెళ్ళాడు. తన ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి మార్కెటింగ్, బీమా మరియు బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్‌లో పని చేస్తుండేవాడు. బాబీ సింహా నటించిన తొలి సినిమా మాయ కన్నడి 2007 లో గుర్తింపు లేని పాత్రలో కనిపించాడు.
మొదట్లో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించాడు. ఆ తరువాత పిజ్జా, నేరమ్, సూదు కవ్వమ్ వంటి తమిళ సినిమాలలో నటించారు. జిగర్తాండ మూవీతో మంచి గుర్తింపు లభించింది. అతని పాత్రకు విమర్శకుల ప్రశంసలను పొందింది. ఆ మూవీకి గాను బాబీ సింహాకు జాతీయ ఉత్తమ సహాయ నటుడి అవార్డు వచ్చింది. ఈ పాత్రలో టాలీవుడ్ లో ‘గద్దలకొండ గణేష్’ మూవీలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించారు. జిగర్తాండ మూవీ తరువాత వరుస సినిమాలలో నటిస్తూ, రాణిస్తున్నారు.
Also Read: సలార్ మూవీలో ఈ మిస్టేక్ గమనించారా..? చూసుకోవాలి కదా డైరెక్టర్ గారూ..?

ప్రభాస్ రెబల్ స్టార్ కృష్ణంరాజు తమ్ముడు మరియు నిర్మాత ఉప్పలపాటి సూర్య నారాయణ రాజు కుమారుడు. పెదనాన్న వారసుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయానికి కృష్ణంరాజు ఫేడ్ అవుట్ కావడంతో ఆయన క్రేజ్ ప్రభాస్ కు అంతగా పనిచేయలేకపోయింది. 2002 లో ఈశ్వర్ తో ప్రభాస్ హీరోగా కెరీర్ ను ప్రారంభించాడు. ఆ మూవీ యావరేజ్ గా నిలిచింది. రెండవ మూవీ రాఘవేంద్ర ఫ్లాప్ గా నిలిచింది. 2004లో వచ్చిన వర్షం మూవీతో ఫస్ట్ హిట్ ను ప్రభాస్ అందుకున్నారు.
ఆ తరువాత అడివి రాముడు, చక్రం చిత్రాలు నిరాశ పరిచాయి. అదే సమయంలో అల్లు అర్జున్, రవితేజ విజయాలతో దూసుకుపోతున్నారు. దాంతో ప్రభాస్ వైపు చూసేవారు లేకుండాపోయారు. సరిగ్గా ఆ సమయంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఛత్రపతి’ మూవీతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తరువాత బుజ్జిగాడు, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమాలతో విజయాలతో దూసుకెళ్లాడు.
మిర్చి మూవీతో ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న మాస్ బ్లాక్ బస్టర్ ను కొరటాల శివ అందించారు. ఆ తరువాత వచ్చిన బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న ప్రభాస్, తాజాగా సలార్ తో మరో విజయాన్ని అందుకున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ రేర్, అన్ సీన్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అవేమిటో మీరు చూసేయండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.

























ఫీల్ గుడ్ మలయాళ మూవీ ‘హోమ్’ కి రోజిన్ థామస్ దర్శకత్వం వహించారు. ఇంద్రన్స్, మంజు పిళ్లై, శ్రీనాథ్ భాసి, దీపా థామస్, నస్లెన్ కె. గఫూర్, జానీ ఆంటోని, కైనకరి థంకరాజ్ వంటివారు ఈ చిత్రంలో నటించారు. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2021లో ఆగస్టు 19న విడుదలైంది.
ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, 60 ఏళ్ల ఒలివర్ ట్విస్ట్ (ఇంద్రాన్స్)ఇద్దరు కొడుకులకు తండ్రి. పెద్ద కొడుకు ఆంటోనీ (శ్రీనాథ్ బాసి), చిన్న కొడుకు చార్లెస్( నస్లెన్ కె. గఫూర్). ఆంటోనీ దర్శకుడు. అతను తీసిన మొదటి మూవీ పెద్ద విజయం సాదిస్తుంది. కానీ కానీ రెండవ మూవీకి స్టోరీ రాయలేక, ఏకాగ్రత కుదరక ఇబ్బందులు పడతాడు. మవతి మూవీ కథ రాసిన తన ఇంట్లోనే రాయాలని భావించి, ఇంటికి వస్తాడు. పెద్ద కొడుకు ఇంటికి రావడంతో ఒలివర్ చాలా సంతోషపడతాడు. తన మిత్రులతో ఆంటోనీ గురించి గొప్పగా చెప్పుకుని ఆనందపడతాడు.
అయితే ఆంటోనీ మాత్రం తన తండ్రి ఒలివర్ తో ఒక్కసారి కూడా ప్రేమగా మాట్లాడడు. ఎల్లప్పుడు ఫోన్ చూస్తూ ఉంటాడు.తండ్రి ఏం మాట్లాడినా ఫోన్ చూసుకుంటూ ఆంటోనీ ‘ఊ ఊ’ అని అంటుంటాడు. అయితే తన కొడకులు ఇద్దరు ఎందుకు ఆ స్మార్ట్ ఫోన్‌కి బానిసలా మారి, తమ చుట్టూ ఉన్నవాళ్ళను పట్టించుకోవడం లేదని అనుకుంటాడు. ఒలివర్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలని, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి గురించి తెలుసుకుంటుంటాడు. ఆ తరువాత తండ్రి కొడుకుల మధ్య ఏం జరిగింది? ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి అనేది మిగిలిన స్టోరీ.
రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాలతో తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుని, పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. ప్రభాస్ ‘ఈశ్వర్’ మూవీతో 2002లో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అయితే 2004లో వచ్చిన వర్షం సినిమాతో ప్రభాస్‌కు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
2005లో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి మూవీతో మాస్ ఆడియెన్స్ కి చేరువయ్యాడు. ఇక ఆ తర్వాత చేసిన చిత్రాలు దాదాపు హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. బహుబలి చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే, ప్రభాస్, వైస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న పాత మరియు రేర్ ఫోటో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
2007 లో ప్రభాస్, నయనతార జంటగా నటించిన ‘యోగి’ మూవీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా వి.వి వినాయక్ తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ఆశించిన విజయాన్ని పొందలేకపోయింది. ఇక ఈ చిత్రాన్ని వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిళ నిర్మించారు. యోగి మూవీకి షర్మిళ బడ్జెట్ పెట్టి, నిర్మాతగా వ్యవహరించారు. ఆ మూవీ షూటింగ్ సమయంలో ప్రభాస్, నయనతార ఒకసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, విజయమ్మతో దిగిన ఫొటో దిగారు. ఆ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.

