యంగ్ హీరో రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘స్కంద’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ సెప్టెంబర్ 15న రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు.
ఈ ఈవెంట్ లో మేకర్స్ స్కంద మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. బోయపాటి శీను సినిమా పై ఉండే అంచనాలు తగ్గకుండా మాస్ గా చూపించారు. ఇస్మార్ట్ శంకర్ మూవీకి భిన్నంగా హీరో రామ్ ఎనర్జీ నెక్స్ట్ రేంజ్ లో చూపించారు. అయితే స్కంద మూవీలోని ఒక సీన్ వార్తలోకి ఎక్కింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం స్కంద. ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్‌వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు నట సింహం నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఈ ఈవెంట్ లో స్కంద ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇది ఎప్పటిలానే బోయపాటి శైలిలో ఊరమాస్ గా తెరకెక్కింది.
హీరో రామ్ ను పవర్ ఫుల్ మాస్ హీరోగా చూపించారు. పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ బ్లాక్స్ తో ట్రైలర్ ను కట్ చేశారు. రామ్ పోతినేని గెడ్డంతో రఫ్ లుక్ లో ఉండగా, ఈ మూవి కూడా రెండు ఫ్యామిల ల మధ్య ఉండే పగ, ప్రతీకారం లాంటి అంశాలతో తెరకెక్కినట్టు తెలుస్తోంది. అయితే స్కంద మూవీలోని ఒక సన్నివేశం వార్తల్లో నిలిచింది.
హీరో రామ్ పోతినేని ఒక మనిషిని ఒక ప్లేట్ తో చంపేస్తాడని అని ఆ సీన్ చూస్తే అర్దం అవుతోంది. దాంతో ఆ సీన్ కు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ఇది లాజిక్ లేని సన్నివేశం అంటున్నారు. నెటిజెన్లు ఈ సీన్ ని ట్రోల్ చేస్తున్నారు. ప్లేట్ తో చంపి ఆ రక్తంతో అభిషేకం అని ఒకరు కామెంట్ చేశారు.
Also Read: గుప్పెడంత మనసు సీరియల్ “జగతి” ఇప్పుడు ఎలా మారిపోయిందో చూశారా..? దీనికి కారణం ఏంటంటే..?




గుప్పెడంత మనసు సీరియల్ కు ఎంత పాపులారిటి ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఈ సీరియల్ లో హీరోహీరోయిన్ల క్యారక్టర్ల తరువాత ఎక్కువ పేరు, గుర్తింపు వచ్చిన పాత్ర జగతి. ఆ పాత్ర యొక్క కట్టు, బొట్టుకి ఆమెకు ఎంతోమంది ఫ్యాన్స్ అయ్యారు. ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాత్రను పోషించిన నటి పేరు జ్యోతి రాయ్. అయితే సీరియల్ అంత ట్రెడిషనల్ గా ఉండే జ్యోతి సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్ ఫోటోలతో, వీడియోలతో హల్చల్ చేస్తోంది. ఆమె ఫోటోలు షేర్ చేసిన కాసేపటికే వైరల్ గా మారుతుంటాయి.
జ్యోతి రాయ్ వయసు 38 ఏళ్లు. ఆమెకు పిల్లలు కూడా ఉన్నారు. ఇటీవల జ్యోతి తన భర్తకి డైవర్స్ ఇచ్చిందని, యువ దర్శకుడిని రెండవ వివాహం చేసుకుందని కొన్నిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే వీటి పై జ్యోతి రాయ్ ఘాటుగా స్పందించింది. “మీకు అర్థంకాని విషయం పై విమర్శలు చేయకండి. ఎప్పటికీ మీరు నా లైఫ్ లోకి వచ్చి చూడలేరు, గుర్తుపెట్టుకోండి” అని సోషల్ మీడియాలో కామెంట్ చేసింది.
ఇన్ స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉండే జ్యోతి రాయ్ ఇటీవల వరుసగా తన గ్లామరస్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తోంది. అవి సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజెన్లు, జ్యోతి రాయ్ పై మీమ్స్, ట్రోల్స్ చేస్తున్నారు. ‘హీరోయిన్ అవ్వాల్సిన క్యారెక్టర్ ని సీరియల్ లో తల్లి పాత్ర చేసారు కదా రా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






గత వారం యోగి మూవీని రీరిలీజ్ చేశారు. థియేటర్లు ఈ మూవీలోని ‘ఓరోరి యోగి’ పాటకు ఓ రేంజ్ లో ఊగిపోయాయి. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో ఈ ట్యూన్ ఒరిజినల్ కన్నడ పాట కూడా నెట్టింట్లో ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చింది. దాంతో తెలుగు సాంగ్ నే ఒరిజినల్ సాంగ్ అని అనుకున్నారు. తెలుగు పాటను కన్నడ సినిమా వాళ్ళు కాపీ చేశారనుకున్నారు.
అయితే ఆ సాంగ్ కన్నడలోనే ముందుగా వచ్చింది. కన్నడలో స్టార్ హీరో శివ రాజ్ కుమార్ హీరోగా నటించిన ‘జోగి’ మూవీ 2005 లో రిలీజ్ అయ్యి, బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ సినిమాలోని లవ్ సాంగ్ ట్యూన్‌నే తెలుగువాళ్ళు కాపీ చేశారు. కన్నడలో మూవీలో హీరోహీరోయిన్ల మధ్య వచ్చిన మంచి లవ్ సాంగ్ ను తెలుగులో ఐటం సాంగ్‌గా తెరకెక్కించారు.
ఇంత మంచి సాంగ్ ను ఐటం సాంగ్‌గా మార్చారు కదరా? అని నెటిజెన్లు ఈ పాట పై ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై మీమ్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. కన్నడ ఒరిజినల్ పాట ప్రస్తుతం తెలుగు పాట కన్నా ఎక్కువగానెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. అంతటా కన్నడ సాంగ్ నే వినిపిస్తోంది. ఈ సాంగ్ పై తీసిన రీల్స్, షార్ట్స్ తో కన్నడ పాట ట్రెండింగ్ లోకి వచ్చింది.


మహేష్ బాబు హీరోగా నటించిన ‘ఒక్కడు’ మూవీ 2003లో సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 15న రిలీజ్ అయ్యి, ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మహేష్ కి మాస్ ఇమేజ్ వచ్చింది ఈ చిత్రంతోనే అనవచ్చు. ఈ చిత్రంలో హీరోయిన్ గా భూమిక చావ్లా నటించగా, విలన్ గా ప్రకాశ్ రాజ్ నటించి, మెప్పించారు.
అయితే ఈ మూవీ హిట్ అవడానికి కారణం స్క్రీన్ ప్లేలో చేసిన మార్పులే అని తెలుస్తోంది. దర్శకుడు గుణశేఖర్ ముందుగా అనుకున్న స్టోరీ ప్రకారంగా, కొండారెడ్డి బురుజు దగ్గర హీరో విలన్ ఓబుల్ రెడ్డిని కొట్టే సన్నివేశమే హీరో ఇంట్రడక్షన్ సీన్ గా రావాలి. ఆ సీన్ తర్వాత స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుందట. అయితే ఈ కథ విన్న రచయిత పరుచూరి గోపాలకృష్ణ ముందుగా ఆ సన్నివేశం పెట్టడం సరి కాదని అన్నారంట.
సినిమా మొదట్లోనే అలాంటి పవర్ ఫుల్ సన్నివేశం పెట్టవద్దని గుణశేఖర్ కు సూచించారంట. దాంతో దర్శకుడు గుణశేఖర్ పరుచూరి గోపాలకృష్ణ చేసిన సూచనల ఆధారంగా కథలో కీలకమైన మార్పులు చేసి, ఇప్పుడు మనం చూస్తున్న సినిమాగా తెరకెక్కించారని తెలుస్తోంది. ఆ మార్పుల వల్లే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందట.
దక్షిణాది హీరోయిన్లలో నయనతార లేడి సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. వ్యక్తిగత విషయంలోనూ, సినిమాల విషయంలోనూ ఆమె ఎప్పుడూ తనదైన శైలిలో ముందుకు వెళ్తుంది. ఆమెకు సంబంధించిన విషయం ఏదైనా క్షణాల్లో వైరల్ గా మారుతుంది. అత్యధిక రెన్యుమరేషన్ అందుకుంటున్న హీరోయిన్ గా రికార్డు సృష్టించారు. గత ఏడాది దర్శకుడు విగ్నేష్ శివన్ పెళ్లి చేసుకుని వైవాహిక జీవితం ప్రారంభించిన విషయం తెలిసిందే. సరోగసి ద్వారా కవలలకు తల్లిదండ్రులు అయ్యారు.
ప్రస్తుతం నయనతార బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న జవాన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. ఇది ఇలా ఉంటే నయనతార గతంలో నటించిన ఒక ప్రకటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఈ యాడ్ లో ఆమె గుర్తుపట్టలేనట్టుగా ఉంది. ఆమె కాలేజీలో చదువుతున్న సమయంలో మోడల్‌గా పార్ట్ టైమ్ జాబ్ చేసింది. అలా నయనతార నటించిన ప్రకటనలలో కొన్నింటిని చూసిన దర్శకుడు సత్యన్ అంతిక్కడ్ తాను తీయబోయే మనస్సినక్కరే సినిమాలో కీలక పాత్రకోసం ఆమెను సంప్రదించాడు.
మొదట్లో నయనతార ఆఫర్‌ను రిజెక్ట్ చేసినప్పటికీ, ఆ తరువాత దర్శకుడు వదలకుండా ప్రయత్నించడంతో చివరికి ఆమె అంగీకరించింది. అలా నయనతార 2003లో మలయాళ సినిమా ‘మనస్సినక్కరే’ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ మూవీ హిట్ అవడం, వరుస అవకాశాలు రావడంతో సినిమాలలో నటిస్తూ టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఆమె కాలేజీ రోజుల్లో నటించిన యాడ్ ప్రస్తుతం నెట్టింట్లో షికారు చేస్తోంది.