కేంద్ర ప్రభుత్వం 69 వ చలనచిత్ర జాతీయ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి తెలుగు ఇండస్ట్రీ అత్యధిక అవార్డులను పొందిన విషయం తెలిసిందే. ఇక తమిళ సినిమా జై భీమ్ కు జాతీయ అవార్డులలో చోటు దక్కలేదు.
ఒకప్పుడు జాతీయ పురస్కారాల్లో తమిళ చిత్రాలకు మంచి ప్రాధాన్యం ఉండేది. కానీ ఈసారి కోలీవుడ్ నుండి జై భీమ్, సార్పట్ట, కర్ణన్, వంటి మంచి చిత్రాలు పోటీలో ఉన్నప్పటికీ వీటికి జాతీయ అవార్డులలో చోటు దక్కలేదు. ముఖ్యంగా సూర్య నటించిన జై భీమ్ మూవీకి ఒక్క అవార్డ్ కూడా రాకపోవడం, అందరినీ విస్మయపరిచింది. దీనిపై సినీ ప్రముఖుల దగ్గర నుండి నెటిజెన్ల వరకు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఏపీ మాజీ సీఐడీ ఛీఫ్ పీవీ సునీల్ కుమార్ ఫేస్ బుక్ లో జైభీమ్ మరియు పలాస సినిమాల గురించి పోస్ట్ చేశాడు. ముందుగా జై భీమ్ సినిమా గురించి ” ప్రశ్నించడం నేర్పే సినిమాకి అవార్డ్ ఇవ్వడం అంటే పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకోవడం కాదా? కాలు మీద కాలు వేసుకోవడం నేర్పే సినిమా మంచి సినిమా అవుతుందా ? అసలు వాళ్ళు కూచోవడమే నేరం అని అనుకుంటుంటే ? విశ్వనాధుడి సినిమాలు చూడండి.. శూద్రులు, దళితులు ఎలా చేతులు కట్టుకు వినయభారంతో మెలికలు తిరగాలో నేర్పిస్తాయి.
ఇలాంటి వాటికి కదా ఉత్తమ చిత్రాలనే పేరు పడింది. సిన్న తల్లులూ న్యాయం కోసం పోరాడండి అని చెప్పే ప్రమాదకర సందేశాన్ని అంగీకరిస్తారని ఎలా అనుకున్నారు ? మత్తులో ముంచే ప్రశ్న అనేదే తల ఎత్తనీయని, మనలను భయ పెట్టేవే బహు మంచి సినిమాలు మరి మన సినిమాలకు అవార్డ్ రావాలంటే?” అంటూ రాసుకొచ్చాడు. ఆ తరువాత మరో పోస్ట్ లో ” జై భీం కి అవార్డ్ ఇవ్వకూడదు అన్నది ఒక కాన్షియస్ డెసిషన్, మీరందరూ మరచిపోయినట్టున్నారు.
గత సంవత్సరం కూడా దళిత వాదం వైపు నిలబడ్డ, దళిత పౌరషం, రోషం చూపించిన పలాస సినిమాకి అవార్డ్ రాలేదు. కలర్ ఫోటో అని ఒక పెసిమిస్టిక్, చెత్త సినిమాకి అవార్డ్ ఇచ్చారు. ఈ ఉప్పెన సినిమాకి బాబు అది మూలాల్లోకి వెళితే… మన మాదిగ సోదరులు చేసి ఇచ్చే చెప్పుతో మనమే కొట్టుకోవాలి. మన సమస్యల మీద మన కళల మీద మనకి అనుకూలంగా మనం ఓట్లేసిన వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారా ? వాళ్ళు కదా మాట్లాడాలి మనం మాత్రమే సోషల్ మీడియాలో ఎందుకు చించుకోవాలి ?” అంటూ రాసుకొచ్చాడు.

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం రూల్స్ రంజన్. ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్ ఏ.ఎమ్ రత్నం పెద్ద కుమారుడు కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా నుంచి 4 వారాల క్రితం ‘సమ్మోహనుడా’ సాంగ్ విడుదల అయ్యింది. ఈ సాంగ్ ను శ్రీయాగోషల్ పాడగా, అమ్రిష్ కంపోజ్ చేశారు. రిలీజ్ అయిన మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చిన ఈ పాట యూట్యూబ్ లో కూడా అంతగా వ్యూస్ పొందలేదు.
అయితే పోను పోను, ఈ పాట సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అమ్రిష్ ట్యూన్, శ్రీయా గోషల్ వాయిస్ నెటిజెన్ల ఆకట్టుకుంటోంది. విడుదల అయిన వారం తర్వాత ఈ సాంగ్ యూట్యూబ్‌లో సంచలనంగా మారి, 15మిలియన్ వ్యూస్‌ను పొందింది. యూట్యూబ్ లో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది.
ఇక సోషల్ మీడియా ఈ సాంగ్ రీల్స్‌లో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. అయితే ఫేస్ బుక్ లో సిగ్మా మీమ్స్ అనే పేజీలో ఈ పాటతో పాటు ఒరిజినల్ హిందీ సాంగ్ ను కూడా షేర్ చేశారు. 2013లో విడుదలైన ఫక్రే అనే హిందీ మూవీలోని సాంగ్ ట్యూన్ నే ‘సమ్మోహనుడా..’ కోసం కాపీ చేశారని కామెంట్స్ చేస్తున్నారు.
పుష్ప రాజ్ పాత్రకి గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ అవార్డు రావడంతో తెలుగు ఇండస్ట్రీలో ఆనందం వెల్లివిరిసింది. ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అల్లు అర్జున్ పేరే మారుమ్రోగుతుంది. నేషనల్ అవార్డ్ తో పాన్ ఇండియాలో అల్లు అర్జున్ రేంజ్ రెట్టింపు అవుతుందని టాక్.
జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వచ్చిన సందర్భంలో సినీ ప్రముఖులు అల్లు అర్జున్ ను సోషల్‌లో మీడియాలో విష్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు అల్లు అర్జున్ కు అభినందనలు తెలిపారు. అల్లు అర్జున్ మహేష్ బాబుకు రిప్లై ఇస్తూ, థ్యాంక్యూ అంటూ నలుపురంగులో ఉన్న హార్ట్ సింబల్ షేర్ చేశాడు.
బ్లాక్ కలర్ హార్ట్ సింబల్ షేర్ చేయడంతో నెటిజెన్లు అల్లు అర్జున్ ను ట్రోల్ చేస్తున్నారు. మహేష్ బాబుకు మాత్రమేకాకుండా మరికొందరికి కూడా బ్లాక్ కలర్ హార్ట్ సింబల్ తో థాంక్యూ చెప్పారు. అల్లు అర్జున్ ను ట్రోల్ చేస్తుండడంతో ‘మిలాగ్రోమూవీస్’ అనే ట్విట్టర్ యూజర్ బ్లాక్ హార్ట్ సింబల్ అంటే ప్రేమ మరియు ఆప్యాయతను సూచిస్తుందని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.






ప్రముఖ మలయాళ నటుడు హీరోగా నటించిన సినిమా ‘ఇరట్టా’. థియేటర్లలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. హీరోయిన్ అంజలి కీలక పాత్రలో నటించింది. కథ విషయానికి వస్తే, కేరళలో వాగమన్ అనే ఊరిలో ఉన్న పోలీస్ స్టేషన్లో జరిగే ఒక కార్యక్రమానికి మినిస్టర్ అతిథిగా వస్తుండడంతో పోలీసులు ఏర్పాట్లు చేస్తుంటారు. ఇంతలో తుపాకీ పేలిన సౌండ్ రావడంతో అందరూ అక్కడికి వెళ్ళి చూస్తారు. అక్కడ ఏఎస్ఐ వినోద్ (జోజు జార్జి) చనిపోయి ఉంటాడు.
ఎవరు వినోద్ చంపారో తెలియదు. దాంతో పోలీస్ స్టేషన్ ను లాక్ చేసి, అక్కడ ఉన్నవారిని బయటకు వెళ్లనియకుండా చేసి, విచారిస్తూ ఉంటారు. వినోద్ చనిపోయిన సంగతి వినోద్ కవల సోదరుడు అయిన డీఎస్పీ ప్రమోద్ (జోజు జార్జి సెకండ్ రోల్) కు తెలుస్తుంది. వెంటనేప్రమోద్ అక్కడికి చేరుకుంటాడు? ఇంతకీ వినోద్‌ను చంపింది ఎవరు? ప్రమోద్, వినోద్ లు మధ్య గొడవ ఏంటి ? మాలిని (అంజలి) ఎవరు? అనేది మిగతా కథ.
రోజు పేపర్ లో కానీ, న్యూస్ లో కానీ కొన్ని డిస్టర్బింగ్ ఇన్సిడెంట్స్ చూస్తుంటాము. దర్శకుడు రోహిత్ ఎంజీ కృష్ణన్ అలాంటి వార్తలలో ఒక పాయింట్ తీసుకుని, ఆ పాయింట్ చుట్టూ క్రైమ్ థ్రిల్లర్ ను రాసుకున్నారు. పోలీస్ స్టేషన్లో వినోద్ చనిపోయే సీన్‌తోనే మూవీ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత పోలీసులు అనుమానితులను విచారించగా, ఒక్కొక్కొరు వినోద్‌తో వారికున్న గొడవల గురించి చెప్పడం. ఫ్లాష్‌బ్యాక్ తో వినోద్ హత్య వెనుక కారణాలను రివీల్ చేయడం ఆకట్టుకుంటుంది.
ఆఖరికి వినోద్‌ను ప్రమోద్ హత్య చేసినట్లుగా అనుమానించడంతో ప్రమోద్ ఆ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకుంటాడు. ప్రమోద్ మిస్టరీని చేధించే సన్నివేశాలను డైరెక్టర్ ఊహలకు అందని విధంగా రాసుకున్నారు. జోజో జార్జ్ ఈ మూవీని నిర్మించారు. డ్యూయల్‌లో రోల్లో జోజు జార్జ్ నట విశ్వరూపం చూపించాడు. అంజలికి ఒక్క డైలాగ్ ఉండదు. మిగిలినవారు తమ పాత్రకు తగ్గట్టు నటించారు. రెగ్యులర్ గా వచ్చే క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలతో పోలిస్తే డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించే సినిమా. క్లైమ్యాక్స్ లో ట్విస్ట్ మాత్రం ఆడియెన్స్ మనసుల నుండి సులభంగా పోదు.

అలనాటి హీరో V. K నరేష్ తనయుడు నవీన్ విజయకృష్ణ, అయినా ఇష్టం నువ్వంటే, రెండు జెళ్ళ సీత, నందిని నర్సింగ్ హోమ్ వంటి చిత్రాల్లో నటించిన మంచి సక్సెస్ ని అందుకోలేక సినీ ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఎన్ని అవకాశాల కోసం ట్రై చేసిన చాన్స్ రాకపోవడంతో సినీ ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోయాడు.









చంద్రయాన్ 3 సక్సెస్ అయినందుకు రెబల్ స్టార్ ప్రభాస్ తన సోషల్ మీడియా ఖాతాలో ఇస్రోను అభినందించాడు. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ప్రభాస్ ఇస్రోను ట్యాగ్ చేశాడు. దాంతో దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులలో జోష్ మొదలైంది. ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాల్లో తమ సంతోషాన్ని తెలుపుతున్నారు. అయితే ప్రభాస్ అభిమానులు అక్కడికే పరిమితం కాకుండా చంద్రయాన్ 3 మిషన్ విజయాన్ని ప్రభాస్ నటిస్తున్న సలార్ తో లింక్ చేస్తున్నారు.
చంద్రయాన్ 3 విజయం కావడం ప్రభాస్ సలార్ మూవీకి కి కలిసి వస్తుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. దానికి కారణం ఏమిటంటే 2019 జులైలో చంద్రయాన్ 2 లాంచ్ అయ్యింది, కానీ విఫలం అయ్యింది. అదే ఏడాది ఆగస్ట్ లో రిలీజ్ అయిన సాహో మూవీ కూడా నిరాశ పరిచింది. చంద్రయాన్ 3 సక్సెస్ అయ్యింది. సలార్ కూడా ఇదే ఏడాది రిలీజ్ కానుండడంతో ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి హిట్ అవుతుందని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.
సలార్ మూవీకి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. సలార్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ మూవీ సెప్టెంబర్ లో విడుదల కానుంది. ఆదిపురుష్ వంటి డిజాస్టర్ మూవీ తర్వాత ఈ చిత్రం రిలీజ్ అవుతుండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ మూవీ భారీ విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నారు.