ఆస్కార్ అవార్డులంటే ఒకప్పుడు మనవాళ్లు అందని ద్రాక్షగా భావించే వాళ్లు. గెలవడం వరకు పక్కనపెడితే కనీసం నామినేషన్ వరకు కూడా వెళ్లింది చాలా తక్కువ. అయితే గత సంవత్సరం మూడు భారత చిత్రాలకు ఈ సారి అవకాశం లభించింది. ఆర్ఆర్ఆర్లోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో గా.. ఆల్ దట్ భ్రీథ్స్ అనే డాక్యూమెంటరీ, ది ఎలిఫెంట్ విస్పర్స్ అనే షార్ట్ ఫిల్మ్ ఈ నామినేషన్స్ లో అవకాశం దక్కించుకున్నాయి.
1929లో ఆస్కార్ అవార్డులు ప్రారంభమైనప్పటి నుంచి భారతీయ చిత్రాలు అత్యధికంగా నామినేట్ కావడం ఇదే మొదటి సారి. అయితే ఆస్కార్ నామినేషన్స్ కి వెళ్లడమే గగనం అయ్యిన తరుణం లో కొంత మంది మాత్రం అకాడమీ అవార్డులను సైతం ఒడిసిపట్టుకున్నారు. వాళ్లెవరో ఇప్పుడు చూద్దాం..
#1 భాను అతియా
మహారాష్ట్రా కోల్హాపుర్ కి చెందిన భాను ఆర్టిస్ట్ కావాలనుకున్నారు. కానీ కాస్ట్యూమ్ డిజైనర్ గా మారి ఎన్నో బాలీవుడ్ చిత్రాలకు పని చేసారు. 1982లో తెరకెక్కిన గాంధీ సినిమాతో ఆమె అంతర్జాతీయ గుర్తింపు దక్కించుకున్నారు. విలియం అటెన్ బరో తెరకెక్కించిన ఈ సినిమాకు ఆమెకు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో ఆస్కార్ వచ్చింది.

భారత్‌కు ఇదే తొలి అకాడమీ అవార్డు. 100కిపైగా సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన భాను ఆతియా రెండు జాతీయ పురస్కారాలను కూడా గెలుచుకున్నారు.
#2 సత్యజిత్ రే
భారత చలనచిత్ర రంగ చరిత్రలోనే సత్య జీత్ రే పేరు సువర్ణ అక్షరాలతో లిఖించారు. 1992లో ఆయనకు అకాడమీ అవార్డు లభించింది. హానరీ ఆస్కార్ 1992 లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును గెల్చుకున్నారు రే. అనారోగ్య కారణాల వాళ్ళ ఆయన నేరుగా ఈ పురస్కారాన్ని అందుకోలేదు. సత్యజిత్ రే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెల్చుకున్నారు. 1955లో కెన్నస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ హ్యుమన్ డాక్యుమెంట్ కూడా అవార్డు లభించింది.

#3 రసూల్ పూకుట్టి
2008లో విడుదలైన స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగంలో ఇయాన్ టాప్, రిచర్డ్ ప్రైక్, రసూల్ పూకుట్టికి సంయుక్తంగా ఆస్కార్ అవార్డు లభించింది. రసూల్ హిందీ, తమిళం, తెలుగులో పలు చిత్రాలకు పనిచేశారు. 2009లో వచ్చిన కేరలవా వర్మ పళాసిరాజ అనే సినిమాకు జాతీయ అవార్డును కూడా గెల్చుకున్నారు.

#4 ఏఆర్ రెహమాన్
స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రంలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్ అవార్డులను గెల్చుకున్నారు రెహమాన్. రెండు విభాగాల్లో ఆస్కార్ అవార్డు గెల్చుకున్న మొదటి భారతీయుడిగా ఏఆర్ రెహమాన్ చరిత్ర సృష్టించారు. తమిళం, హిందీ, తెలుగులో చాలా చిత్రాలకు సంగీతాన్ని అందించిన రెహమాన్.. పలు అంతర్జాతీయ సినిమాలకు కూడా స్వరాలను సమకూర్చారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా సినిమాకు గానూ.. నేషనల్ అవార్డు అందుకున్నారు.

#5 గుల్జార్
జయహో.. ప్రపంచవ్యాప్తంగా ఒక ఊపు ఊపేసింది అప్పట్లో.. ఎఆర్ రెహమాన్ ఈ పాట కంపోజ్ చేశారు. ఇందుకు ఆయనకు రెండో ఆస్కార్ తెచ్చిపెట్టింది. ఈ పాటకు ప్రముఖ లిరికిస్ట్ గుల్జర్ లిరిక్స్ రాశారు.బెస్ట్ ఒరిజినల్ సాంగ్ లిరిక్స్ రాసినందుకు గుల్జర్ ఆస్కార్ అవార్డును గెల్చుకున్నారు.

#6 కీరవాణి & చంద్రబోస్
ఇక లేటెస్ట్గా 95 వ ఆస్కార్ అవార్డ్ కార్యక్రమంలో తెలుగు సినిమా ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయ్యి సరికొత్త చరిత్రను సృష్టించింది. నాటు నాటు సాంగ్ కి గాను ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో కీరవాణి, చంద్రబోస్ ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు.

#7 కార్తీకి గాన్ స్లేవ్స్ & గునీత్ మెంగా
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గా ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్‌ను గెలుచుకుంది. ఇది ఇండియా నుంచి నామినేట్ అయిన డాక్యూమెంటరీ షార్ట్ ఫిల్మ్. దీనికి గాను నిర్మాతలు కార్తీకి గాన్ స్లేవ్స్, గునీత్ మెంగా ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు.





మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘రుద్రవీణ’ సినిమాలో శోభన హీరోయిన్ గా నటించింది. ప్రముఖ తమిళ నటుడు జెమిని గణేశన్ కీలక పాత్రలో నటించాడు. అన్ని ప్రశ్నలకి జవాబు దొరికే కోరాలో ‘ఇప్పటి సమాజానికి రుద్రవీణ సినిమా ఏ విధంగా అర్ధం అవుతుంది’ అని అడిగిన ప్రశ్నకి
‘మద్యపానంను మానిపించటం అనేది మూవీలో చూపించినంత సులభం కాదు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక 30 సంవత్సరాలకు పైగా దేశంలో, రాష్ట్రంలో ఆల్కహాల్ వినియోగ గణాంకాలను ప్రత్యేకించి చూపించనవసరం లేదేమో. ప్రస్తుతం ఉన్న సొసైటీ ఆ సన్నివేశాలను చూసి నవ్వుకుంటారేమో, భార్య పిల్లలను పట్టించుకోనివారు, ఎవరో వివాహం చేసుకోకుంటే మద్యం తాగడం మానేస్తాము అంటే అది జరగని విషయం, అందువల్ల మద్యం లేని సొసైటిని ఆశించడం పక్కన పెడదాం.
రుద్రవీణ మూవీలోని ముఖ్యమైన సమస్య అంటరానితనం. నాకు ఈ మూవీలో బాగా నచ్చిన సీన్ బిలహరి బాబాయ్ ఏమ్మా శోభన(లలిత)ను నువ్వు అంటరానిదానివి కదా అని ప్రశ్నిస్తే, కొంచెం బాధపడినా, ఏ అంటుకోవచ్చుగా అంటూ కొట్టినట్టుగా జవాబు చెప్తుంది. ఆ సన్నివేశం చిన్నతనంలో చూసి ఓహో ఇలానే ఉండాలని అనుకునేవాడిని, అలా చెప్తేనే ఊరుకుంటారని నమ్మేవాడిని.
అయితే ఆ మూవీ 80ల ఆఖరిలో వచ్చిన మూవీ కదా, ప్రస్తుతం అంటరానితనం ఏముంది అనుకుంటున్నారా? ఇటీవల జరిగిన ఇన్సిడెంట్ చూసి ఆ మూవీలో చేసినట్లు రియల్ లైఫ్ లో ప్రయత్నిస్తే 30 సంవత్సరాల అనంతరం కూడా సమస్యే అని ఋజువైంది’ అని వెల్లడించారు.
మహేష్ బాబు, కియారా అద్వానీ జంటగా నటించిన సినిమా భరత్ అనే నేను. 2018లో రిలీజ్ అయిన ఈ చిత్రం తొలి షోతోనే సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని అటు మహేష్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులకు గుర్తుండి పోయే సినిమా అని చెప్పవచ్చు. సీఎంగా మహేష్ బాబు అద్భుతంగా నటించారు. సీఎం ను ప్రేమించిన అమ్మాయిగా కియారా అద్వానీ, తండ్రిగా శరత్ కుమార్, విలన్ రోల్ లో ప్రకాష్ రాజ్ ఇలా మూవీలో దాదాపు అన్ని పాత్రలలో నటించిన వారికి పేరు వచ్చింది.
సీఎంను ప్రశ్నించే జర్నలిస్ట్ శుభోదయం సుబ్బారావు పాత్రలో నటించిన నటుడికి మంచి గుర్తింపు వచ్చింది. అతన్ని అందరు శుభోదయం సుబ్బారావుగానే గుర్తిస్తున్నారు. అంతకు ముందు పలు సినిమాలలో నటించినా, రాని గుర్తింపు ఈ మూవీతో వచ్చింది. ఈ పాత్రలో నటించిన నటుడి పేరు రాజశేఖర్ అనింగి. తెలుగు సినిమాలలో విభిన్న పాత్రలు పోషించారు. రాజశేఖర్ 2014లో వచ్చిన షురుయాత్ కా ఇంటర్వెల్ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు.
ఆ తరువాత తెలుగులో గోవిందుడు అందరి వాడేలే, బాహుబలి: ది బిగినింగ్, స్పైడర్, భరత్ అనే నేను, అరవింద సమేత వీర రాఘవ వంటి సినిమాలలో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫీచర్ ఫిల్మ్స్, టీవీ సీరియల్స్, షార్ట్ ఫిల్మ్‌లు మరియు వెబ్‌సిరీస్‌లో నటించారు. ఇండస్ట్రీలోకి రాకముందు రాజశేఖర్ IT, బ్యాంకింగ్ మరియు ఆరోగ్య రంగంలో పనిచేశాడు.







#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15