అనుష్క శెట్టి మూడేళ్ల గ్యాప్ తర్వాత `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్ లో రూపొందుతోన్న ఈ చిత్రంలో `జాతిరత్నాలు` ఫేమ్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్నారు. దీంతో సినిమా ప్రకటించినప్పట్నుంచే దీనిపై ఆసక్తి, అంచనాలు నెలకొన్నాయి. మహేష్‌బాబు అనే నూతన దర్శకుడు దీన్నిరూపొందిస్తున్నారు.
ఈ సినిమాలో నవీన్.. సిద్ధు పోలిశెట్టి అనే స్టాండప్ కమెడియన్ గా, అనుష్క.. అన్విత రవళిశెట్టి అనే చెఫ్ పాత్రలో నటిస్తున్నారు. భాగమతి సినిమాతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన అనుష్క మళ్ళీ ఇన్నాళ్లకు మరో ఆసక్తికరమైన సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతోంది. అలాగే `ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ`, `జాతిరత్నాలు` సినిమాలతో యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల చేత మంచి నటుడుగా ప్రశంసలు అందుకున్న నవీన్ పోలిశెట్టి కూడా కాస్త గ్యాప్ తీసుకొని ఈ చిత్రం తో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు.

అనుష్క, నవీన్ పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటికే చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్లు వదిలి ఆకట్టుకుంటున్నారు. టైటిల్ పోస్టర్ కూడా ఆసక్తిని పెంచింది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ముగింపు దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇక తాజాగా ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేసారు మేకర్స్.

గతంలో వచ్చిన పోస్టర్ ను బట్టి హైదరాబాద్ లో ఉన్న పొలిశెట్టి, లండన్ లో ఉన్న అనుష్క శెట్టిని ఎలా కలిశాడు. ఆ కనెక్షన్ ఎంటనేదే కథగా తెలుస్తోంది. అలాగే టీజర్ అనౌన్స్ మెంట్ పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. స్టాడప్ కమెడియన్ గా నవీన్ పొలిశెట్టి ఎదుగుతున్నట్టుగా.. చెఫ్ గా అనుష్క కూడా ఎదుగుతున్నట్టు పోస్టర్లను బట్టి అర్థమవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్ ని విడుదల చేసారు.
ఇక తాజాగా రిలీజ్ అయిన టీజర్ పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి.. వాటిపై ఓ లుక్కేయండి..
#1

#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10

#11

#12

watch video :













ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత కొద్ది కాలంలోనే తన ప్రతిభతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం వరుసగా ప్రాజెక్ట్స్ చేస్తూ కెరీర్ లో కొనసాగుతున్నారు. ఆమె పర్సనల్ లైఫ్ లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, వాటి ఎఫెక్ట్ తన కెరీర్ పై పడకుండా ఇండస్ట్రీలో రాణిస్తోంది. సమంత తన అందం, నటనతో స్టార్ హీరోల అంత ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. తాజాగా సమంతకు ఒక అభిమాని తన ఇంట్లోనే గుడి కట్టాడు.
సమంత పుట్టినరోజు సందర్బంగా ఏప్రిల్ 28న సమంత గుడిని ప్రారంభించాడు. ఏపీలోని బాపట్ల జిల్లాకు చెందిన సందీప్ కి హీరోయిన్ సమంత అంటే ఎంతో అభిమానం. సమంత నటిగా కంటే ఆమె ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవలు సందీప్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది ప్రాణాలు నిలిచాయి. దీంతో సమంత పై అతనికి మరింత అభిమానం పెరిగింది.
ఆ అభిమానంతోనే హీరోయిన్ సమంతకు తన ఇంట్లోనే గుడి కట్టాడు. సమంత పుట్టినరోజున గ్రాండ్ గా ఆ గుడిని అందరి మధ్య ప్రారంభించాడు. అయితే ఈ గుడి కట్టడం కోసం సందీప్ పెట్టిన ఖర్చు అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తోంది. సుమారు 5-6 లక్షల వరకు ఖర్చు చేసి తన అభిమాన నటి సమంతకు గుడి కట్టించాడట.
ఈ గుడి వీడియో సామాజిక మధ్యమాలలో వైరల్ అవడంతో నెటిజన్లు, ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అయితే గుడి బానే ఉంది. కానీ విగ్రహం అలా ఉందేంటి, ఇంతకీ సమంత ఎక్కడ అని కామెంట్స్ చేస్తున్నారు.
1. వాల్తేరు వీరయ్య:
2. వీర సింహ రెడ్డి:
3. వారసుడు:
4. సార్:
5. రైటర్ పద్మభూషణ్:
6. వినరో భాగ్యము విష్ణు కథ:
7. బలగం
8. దాస్ కా ధమ్కి:
9. దసరా:
10. విరూపాక్ష:
ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రానికి కార్తీక్ వర్మ దర్శకత్వం వహించారు. బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది.

భారీ అంచనాలతో రిలీజ్ అయిన నాని ‘దసరా’ మూవీ అన్ని ప్రాంతాల్లో భారీ కలెక్షన్స్ తో అదరగొట్టింది. ఈ చిత్రం నాని కెరీర్ లోనే మంచి ఒపెనింగ్స్ సాధించింది. అంతే కాకుండా ఓవర్సీస్ ప్రీమియర్స్‌తోనే ఈ చిత్రం 2 మిలియన్ డాలర్స్‌ను వసూల్ చేసి, నాని కెరీర్లో రికార్డ్ సృష్టించింది. వసూళ్ల పరంగా 100 కోట్ల క్లబ్బులో చేరింది. తాజాగా ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఇలా ఉంటే నాని తన 30వ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ మూవీ టైటిల్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది.
సోషల్ మీడియాలో వస్తున్న బజ్ ప్రకారం ఈ చిత్రానికి ‘హాయ్ నాన్న’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అధికారి ప్రకటన రాలేదు. ఇక ఈ మూవీ స్టోరీ ఇదే అంటూ నెట్టింట్లో ఒక టాక్. ఈ మూవీలో నాని జెర్సీ మూవీ తరువాత మరోసారి తండ్రి క్యారెక్టర్ లో చేస్తున్నట్లు తెలుస్తోంది. పేరెంట్స్ విడాకులు తీసుకోగా వారి ఇద్దరి మధ్యలో వారి పాప ఎలా సఫర్ అయ్యిందనేది ఈ మూవీ స్టోరీ అని టాక్.
ఇక ఈ చిత్రానికి కూడా కొత్త డైరెక్టర్ అయిన శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా సీతారామం మూవీతో ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 21న రిలీజ్ కానుంది. బ్లాక్ బస్టర్ ‘దసరా’ మూవీ తరువాత వస్తుండడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
1. అంబికాపతి:
2. పూంపుహార్:
3. రాజరాజ చోళన్:
4. మధురైయై మీట్టా సుందరపాండియన్:
5. ఆయిరతిల్ ఒరువన్- యుగానికి ఒక్కడు:
6. పొన్నియన్ సెల్వన్-1:
7. పొన్నియన్ సెల్వన్-2:
Also Read: 


బాలీవుడ్ లోని పాపులర్ హీరోయిన్స్ లలో ఊర్వశి రౌతేల ఒకరు. ఆమె హీరోయిన్గా నటించడమే కాకుండా ప్రత్యేక సాంగ్స్ లో నర్తించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఊర్వశీ తన గ్లామరస్ ఫోటోలను తరచూ షేర్ చేస్తుంది. అలాగే ఆమెకు సోషల్ మీడియాలో మిలియన్ల కొద్ది ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లోనే కాకుండా దక్షణాది మూవీ మేకర్స్ కూడా ఊర్వశీని తమ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో తీసుకోవాలని భావిస్తున్నారు. ఆమె హసీనో కా దీవానాలో సాంగ్ లో చేసిన డ్యాన్స్ అమితాబ్ బచ్చన్ నుండి ప్రశంసలు అందుకుంది.
అప్పటి నుండి ఆమెను పలువురు బాలీవుడ్ మరియు సౌత్ మేకర్స్ ఊర్వశిని తమ చిత్రాల్లో ఆమెతో డ్యాన్స్ చేయించాలని అనుకుంటున్నారు. అయితే ఆమె ఎంతబాగా డాన్స్ చేస్తుందో, ఆ రేంజ్ లోనే రెమ్యూనరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది. గతంలో సీటీ మార్ మూవీ నిర్మాత తమ మూవీ కోసం ఒక సాంగ్ లో డ్యాన్స్ చేయమని ఊర్వశిని ఆడగగా అందుకు ఆమె కోటి డిమాండ్ చేసిందంట. దీంతో ఆ ప్రొడ్యూసర్ తన ఆలోచనను విరమించుకున్నాడట.
లెజెండ్ మూవీ కోసం 20 కోట్లు తీసుకున్నారని తెలుస్తోంది. బాస్ పార్టీ సాంగ్ కి ఊర్వశి రౌతేల 2 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె ‘ఏజెంట్’ మూవీలో స్పెషల్ సాంగ్ లో మెరిశారు. ‘వైల్డ్ సాలా’ పాటతో యువతను ఉర్రూతలూగించారు. ఇందులో ఆమె ధరిచిన డ్రెస్ కోసం 20 లక్షలు ఖర్చు అయినట్లు సమాచారం. డ్రెస్ కే అంత ఖర్చు అయితే ఆమె భారీగా రెమ్యూనరేషన్ తీసుకోవచ్చని టాక్ వినిపిస్తోంది.




