సినిమాలు అన్నాక హిట్లు, ఫ్లాపులు కామన్.హిట్ వస్తే సినిమా చేసిన నటులతో పాటు దర్శకుడికి మంచి పేరు వస్తుంది. నిర్మాతకు కాసుల వర్షం కురుస్తుంది. అయితే కొన్నిసార్లు సినిమాలు డిజాస్టర్లు కావడంతో నిర్మాతలు కోలుకోలేని దెబ్బతింటారు. అలాంటి సందర్భాల్లో హీరోలు, హీరోయిన్లు తమ రెమ్యునరేషన్ డబ్బులు తిరిగి ఇవ్వడం. లేదంటే మరో సినిమాలో డబ్బులు తీసుకోకుండా నటించడం చేస్తారు.
ఇప్పుడు అలా రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిన నటులు.. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం..
#1 రజనీకాంత్
బాబా మూవీ రిలీజ్ అయ్యాక డిస్ట్రిబ్యూటర్స్ బాగా లాస్ అవ్వడం తో రజనీకాంత్ తన రెమ్యూనరేషన్ లో చాలా భాగం వాళ్ళకి ఇచ్చేశారట.

#2 సూపర్ స్టార్ కృష్ణ
సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో సినిమాలకు తన రెమ్మ్యూనరేషన్ వాపస్ ఇచ్చారు. తన సినిమా బోల్తాకొట్టిందంటే నిర్మాతలను ఆదుకోవడంలో ముందుంటారు కృష్ణ. అందుకే ఆయన్ను నిర్మాతల హీరో అనేవారు.

#3 బాల కృష్ణ
బాలకృష్ణ నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా ఆశించిన రిజల్ట్ రాబట్టకపోవడంతో బాలయ్య బాబు తన పారితోషికాన్ని రివర్స్ ఇచ్చేశారు.

#4 పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జానీ, కొమురంపులి సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దీంతో ప్రొడ్యూసర్ల అంచనాలు తలక్రిందులై భారీ నష్టం వాటిల్లింది. ఈ సమయంలో తాను తీసుకున్న రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేశారు పవన్ కళ్యాణ్.

#5 మహేష్ బాబు
మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా ఖలేజా సినిమా ఇలాగే బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. దీంతో నిర్మాతకు భారీగా నష్టం వాటిల్లడంతో ఆ సమయంలో మహేష్ బాబు తన రెమ్యునరేషన్ అంతా తిరిగి ఇచ్చేశారు.

#6 రామ్ చరణ్
రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఆరెంజ్ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై అట్టర్ ఫ్లాప్ కావడంతో తను కూడా తీసుకున్న పారితోషికాన్ని తిరిగి ఇచ్చేశారు రామ్ చరణ్.

#7 సమంత
రీసెంట్ గా సమంత లీడ్ రోల్ లో వచ్చిన శాకుంతలం సినిమా డిజాస్టర్ అయింది. దీంతో ఈ సినిమాకు గాను తాను తీసుకున్న పారితోషికం మొత్తం వాపస్ చేసిందట.

#8 విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చింది. తీరా విడుదల తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీలా పడింది. దీంతో తన పారితోషకాన్ని వెనక్కి ఇచ్చారు విజయ్ దేవరకొండ.

#9 రవితేజ
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఈ సినిమాకు గాను తాను తీసుకున్న పారితోషికాన్ని తిరిగి ఇచ్చేశారు రవితేజ.

#10 సాయి పల్లవి
సాయి పల్లవి నటించిన పడి పడి లేచే మనసు సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో తన రెమ్యునరేషన్ ను సాయి పల్లవి వెనక్కి ఇచ్చింది.

#11 జూనియర్ ఎన్టీఆర్
నరసింహుడు మూవీ ప్లాప్ కావడం తో జూనియర్ ఎన్టీఆర్ తన రెమ్యూనరేషన్ ని తిరిగి ఇచ్చేసాడు.


ఈ చిత్రాన్ని దాదాపు 80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం కనీసం 10 కోట్ల షేర్ సాధించలేకపోయింది. ఏజెంట్ సినిమా ఈ సంవత్సరం అతి పెద్ద డిజాస్టర్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం పై అంతటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్కినేని ఫ్యాన్స్ కూడా చాలా నిరాశ పడ్డారు. సాధారణ ప్రేక్షకులు సైతం మూవీ పై కామెంట్లు చేస్తున్నారు. విడుదల అయిన దగ్గర నుంచి మూవీ పై రకరకాలగా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ రిజల్ట్ పై ప్రొడ్యూసర్ అనిల్ సుంకర స్పందించారు.
ఏజెంట్ అపజయానికి బాధ్యత వహిస్తూ ఆడియెన్స్ కి క్షమాపణలు చెప్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సారాంశం ఏమిటి అంటే “ఏజెంట్ మూవీ ఫెయిల్యూర్ కి సంబంధించిన పూర్తి నిందను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ మూవీ మాకు పెద్ద టాస్క్ అని తెలిసినప్పటికీ, విజయం సాధించాలనే పట్టుదలతో ముందుకెళ్లాం. అయితే బౌండెడ్ స్క్రిప్ట్ తమ దగ్గర లేకుండా సినిమాని మొదలు పెట్టి పెద్ద పొరపాటు చేశాం. కోవిడ్‌తో సహా చాలా సమస్యలు రావడం వల్ల విఫలమయ్యాం.
ఫెయిల్యూర్ కు ఎలాంటి సాకులు చెప్పాలని మేము అనుకోవట్లేదు. అయితే ఈ కాస్ట్లీ తప్పు నుండి నేర్చుకుని, మళ్ళీ ఇలాంటి తప్పులను ఎప్పటికీ రిపీట్ కాకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాం. మాపై ఎంతో నమ్మకం ఉంచిన అందరికి మనస్పూర్తిగా క్షమాపణలు తెలియచేస్తున్నాను. రాబోయే సినిమాల విషయంలో పక్కా ప్రణాళికతో కష్టపడి నష్టాలను భర్తీ చేస్తామని తెలియజేస్తున్నాం” అని ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ట్వీట్ చేశారు.












అక్కినేని అఖిల్ ఏప్రిల్ 28 న ఏజెంట్ చిత్రం ద్వారా ఆడియెన్స్ ముందుకు వచ్చారు. సురేందర్ రెడ్డి డైరెక్టర్ కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాల ఏర్పడ్డాయి. అయితే ఈ మూవీకి నెగెటివ్ టాక్ రావడంతో మూవీ పై తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. కాగా అఖిల్ తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. అఖిల్ నెక్స్ట్ మూవీ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఉండబోతుందంట. ఈ చిత్రం ద్వారా అనీల్ అనే కొత్త డైరెక్టర్ టాలీవుడ్ కి పరిచయం కానున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని సమాచారం.
ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ నుండి ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్న అనీల్ గతంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి ఒక స్టోరీ చెప్పాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అనీల్ సాహో, రాదేశ్యామ్ చిత్రాలకు డైరెక్షన్ విభాగంలో పని చేశాడు. సాహో సమయంలోనే యూవీ ప్రొడ్యూసర్లకు ఒక ఐడియా చెప్పడం, వాళ్ళు ఒకే అనడం జరిగిందంట.
ఆ స్టోరీని ప్రభాస్ తో చేయాలని నిర్మాతలు భావించారంట. అయితే సాహో, రాధే శ్యామ్ సినిమాల ఫలితాల కారణంగా అనీల్ చెప్పిన స్టోరీ ప్రభాస్ తో చేయడం సరి కాదని భావించి, అఖిల్ తో ఆ మూవీ చేయనున్నారని టాక్. ప్రభాస్ కోసం తయారుచేసిన స్టోరీతోనే అనీల్ హీరో అఖిల్ తో మూవీ చేస్తున్నాడా ? లేదా వేరే కథతో చేస్తున్నాడా? అనేది తెలియాల్సి ఉంది.
యంగ్ హీరో అఖిల్ మంచి హిట్ కోసం ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాడు. తాజాగా రిలీజ్ అయిన ‘ఏజెంట్’ మూవీకి ప్లాప్ టాక్ వచ్చింది. దీంతో తదుపరి చేయబోయే చిత్రం విషయంలో అఖిల్ చాలా జాగ్రత్తగా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంతో అయినా అఖిల్ కు హిట్ వస్తుందని యూవీ ప్రొడ్యూసర్స్ భావిస్తున్నారంట.


అక్కినేని అఖిల్, సురేందర్ రెడ్డి కలయికలో వచ్చిన ఈ పాన్ ఇండియా మూవీ తెలుగుతో పాటు కన్నడ, తమిళ, హిందీ మలయాళ భాషల్లో కూడా ఒకేసారి విడుదల అయ్యింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా సాక్షి వైద్య నటించగా, మలయాళ మెగా స్టార్ మమ్ముట్టి ముఖ్యమైన పాత్రలో నటించారు. బాలీవుడ్ నటుడు డినో మోరియా విలన్ గా కనిపించారు. ఈ చిత్రం కోసం అఖిల్ అక్కినేని చాలా కష్టపడ్డాడు. పూర్తిగా తన లుక్ నే మార్చుకున్నాడు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ రిలీజ్ అయిన అన్ని చోట్ల నెగెటివ్ టాక్ వస్తోంది.
డైరెక్టర్ సురేందర్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన తీరు పై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. హీరో, డైరెక్టర్ ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. కొందరు అయితే డైరెక్టర్ సురేందర్ రెడ్డికి చేతకాకే ఇటువంటి చిత్రాన్ని తీశారంటూ తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. కొందరు హీరో అఖిల్ నటన పై ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి కథను అందించిన రైటర్ వక్కంతం వంశీని నెట్టింట్లో తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం ఈ మూవీ స్టోరీ కోసం వంశీ భారీగా రెమ్యునరేషన్ తీసుకునట్లు వార్తలు రావడమే.
వక్కంతం వంశీ గతంలో కిక్, ఉసరవెల్లి, ఎవరు, రేసుగుర్రం వంటి పలు హిట్ సినిమాలకు కథలు సమకూర్చారు. మంచి రచయితగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఏజెంట్ సినిమా స్టోరి కోసం వక్కంతం వంశీ 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దాంతో సోషల్ మీడియాలో వక్కంతం వంశీని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.


ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ నేతృత్వంలో తమ స్వగ్రామం అయిన నిమ్మకూరులో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటిలో పాల్గొన్న బాలయ్య మాట్లాడుతూ తెలుగువారి హృదయాలలో ఎన్టీఆర్ శాశ్వతంగా నిలిచిపోయారని అన్నారు. ఎన్టీఆర్ కు జన్మనిచ్చిన భూమి అయిన నిమ్మకూరు గ్రామాన్ని పర్యాటక స్థలంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. తమ నాయనమ్మ కట్టించిన ఒక దాబాను కూడా ఎన్టీఆర్ కి అంకితమిస్తున్నామని తెలిపారు.
అన్నగారు అని తెలుగువారు అప్యాయంగా పిలుచుకునే ఎన్టీఆర్ పుట్టిన ఇల్లు ఇప్పటికి నిమ్మకూరులో అలాగే ఉంది. ఆ ఇంట్లో ఆయనకు సంబంధించిన ఫోటోలు, కొన్ని వస్తువులు ఉన్నాయి. ఇక ఈ ఇంటి బాగోగులను హరికృష్ణ కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాకముందే నటుడిగా ఉన్న సమయంలోనే స్వగ్రామం కోసం తన వంతు కృషి చేశారని స్థానికులు తెలిపారు. తన పలుకుబడిని ఉపయోగించి రోడ్డు వేయించారని, వంతెన కట్టించారని అక్కడివారు అన్నారు. ఇక ముఖ్యమంత్రి అయిన తరువాత రెసిడెన్షియల్ స్కూల్, దేవాలయం, హాస్పటల్ కట్టించారని చెప్పారు.
రెసిడెన్షియల్ విద్యాసంస్థల వల్ల నిమ్మకూరుకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటికి కూడా ఈ స్కూల్ లో వందల మంది విద్యార్ధులు చదువుతున్నారు. రెసిడెన్షియల్ స్కూల్ ఇంచార్జ్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈ స్కూల్ లో చదివిన వారిలో డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఎఎస్, ఐపీఎస్, ఇస్రో పనిచేస్తున్నవారు కూడా ఉన్నారని తెలిపారు. మహిళల శిక్షణ మరియు ఉపాధి కోసం నిమ్మకూరులో నైపుణ్యాభివృద్ధి మరియు మహిళా సాధికారత కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పథకాలతో పాటు, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఎన్టీఆర్ తన కుమారుడు హరికృష్ణ నిమ్మకూరులోనే చదివించారు. హరికృష్ణతో కలిసి చదువుకున్నవారు ఇప్పటికి ఇక్కడ ఉన్నారు. అలాగే హరికృష్ణ కుటుంబ సభ్యులు తరుచుగా ఇక్కడికి వస్తుంటారు. శతజయంతి ఉత్సవాలలో భాగంగా బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు నిమ్మకూరులో ఎన్టీఆర్ కి నివాళులు అర్పించిన విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కూడా నిమ్మకూరులో స్థలం కొన్నట్టు తెలుస్తోంది.
ఎన్టీఆర్ హయాంలోనే బందర్ కాలువ వంతెన, వాటర్ ట్యాంక్, రోడ్డు మంజూరు చేయించారని, పనులన్నీ కూడా ఏడాదిలోనే పూర్తి అయ్యాయని స్థానికులు అప్పటి సంగతులను వెల్లడించారు. ఇలా నందమూరి తారక రామారావు గారు తనకు జన్మనిచ్చిన గ్రామం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.