ప్రస్తుతం ఉన్న చాలా మంది సినిమా తారలు సీరియల్స్ లో నటించి వచ్చిన వారే. అలాంటి వారిలో ఒక్కడే జూనియర్ ఎన్టీఆర్. మనలో చాలా మందికి ఎన్టీఆర్ సీరియల్ లో నటించిన విషయం తెలీదు.
ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి కూడా కళారంగంలోనే ఉన్నాడు. చదువు కంటే కూడా ఎక్కువగా డాన్సులు, నటన విషయంపైనే ఫోకస్ చేసాడు. చిన్నతనం లోనే ‘బాల రామాయణం ‘ లో నటించాడు ఎన్టీఆర్. ఆ విషయం అందరికి తెలుసు. కానీ.. ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే బుల్లితెర పై ఓ సీరియల్ లో నటించాడట. అదే ‘భక్త మార్కండేయ’.

బహుశా ఈ విషయం ఎక్కువ మందికి తెలిసుండకపోవచ్చు. ‘భక్త మార్కండేయ’ అనే పేరుతో అప్పట్లో ఓ సీరియల్ టెలికాస్ట్ అయ్యేది. ఈటీవీలో ప్రసారమయ్యే ఈ సీరియల్ లో లీడ్ రోల్ అయిన మార్కండేయ పాత్రని ఎన్టీఆర్ పోషించాడు. శివుడి భక్తుడిగా చిన్న వయసులోనే చాలా అద్భుతంగా ఆ పాత్రని పోషించాడు ఎన్టీఆర్. అటు తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాల రామాయణం’ లో ఎన్టీఆర్… శ్రీరాముని పాత్రని పోషించిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత మూడేళ్ళకు హీరో అయ్యాడు తారక్. 2000లో నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ చిత్రాన్ని ‘ఉషాకిరణ్ మూవీస్’ వారు తెరకెక్కించారు. అలా మొదటిగా బుల్లితెరపై కనిపించిన ఎన్టీఆర్ ఆ తర్వాత తర్వాత ‘బిగ్ బాస్’ అంటూ మరోసారి ప్రేక్షకులకు చేరువయ్యాడు. తర్వాత ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ని కూడా హోస్ట్ చేసాడు ఎన్టీఆర్.






రాజశేఖర్ ఒక రోజు జీవిత దగ్గరకు వెళ్లి మీకు నా పై ఆసక్తి చూపిస్తున్నారేమో అని అడిగారట. దాంతో రాజశేఖర్ ముక్కుసూటితనం జీవితకు బాగా నచ్చిందంట. ఇక రాజశేఖర్ ను పెళ్లికి ఒప్పించేందుకు, అలాగే రాజశేఖర్ ను పెళ్లి చేసుకోవడానికి ఎంతగానో కష్టపడినట్లు జీవిత తెలిపారు. దర్శకుడు రాఘవేంద్రరావుకు ఈ విషయం తెలిసి, రాజశేఖర్ విలన్ లా అనిపిస్తున్నాడు. అతన్ని నమ్మవద్దని, అతనితో జాగ్రత్తగా అని చెప్పారంట.
అయినా జీవిత రాజశేఖర్ ను వదలకుండా బ్రిడ్జి పై నుండి కిందకు తోసేసి, అనంతరం హాస్పటల్ లో చేర్పించి తనకు సేవలు చేసి తన తల్లిదండ్రులను ను పెళ్లికి ఒప్పించిందని రాజశేఖర్ తెలిపారు. ఇంకా జీవిత మాట్లాడుతూ వేరే అమ్మాయిని రాజశేఖర్ వివాహం చేసుకోవాలనుకున్న సమయంలో ఎంతో బాధపడ్డానని తెలిపింది. ఆ అమ్మాయి కారులో రాజశేఖర్ పక్కన కూర్చున్నప్పుడు వెనక సీట్ లో కూర్చున్న నేను చాలా బాధపడ్డానని జీవిత తెలిపింది. ఇక తాను వివాహం చేసుకోకపోయినా నాతోనే ఉంటానని చెప్పిందని, అది నచ్చిందని రాజశేఖర్ వెల్లడించారు.
Also Read: 








ఆమె పేరు రాశి సింగ్. ఆది సాయికుమార్, సురభి హీరోహీరోయిన్లుగా నటించిన ‘శశి’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఈ చిత్రం 2021లో విడుదల అయ్యింది. ఆమె వృత్తి రీత్యా ఎయిర్ హోస్టెస్. ఆమెకు చిన్నప్పటి నుంచి నటన పై ఉన్న ఇష్టంతో టను చేసే పనిని వదిలి ఇండస్ట్రీకి వచ్చింది. పోస్టర్, రత్నం సినిమాలలోనూ నటించింది. ఇటీవల శివ కందుకూరి హీరోగా తెరకెక్కిన ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ సినిమాలో రాశి సింగ్ హీరోయిన్ గా నటించింది.
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎవరి మీద ఆదారపడకూడదని, ఏదైనా నేర్చుకోవలనే ఉద్దేశ్యంతో ఎయిర్ హోస్టెస్ వృత్తిని ఎంచుకున్నానని తెలిపింది. ఎయిర్‌లైన్స్‌లో పని చేశానని, దాని కోసమే తాను హైదరాబాద్‌కు మారాల్సి వచ్చిందని తెలిపింది. ఆ క్రమంలో తెలుగు సినీ పరిశ్రమకు రావడం వెనుక నా ఉద్యోగం కూడా ఒక కారణం అని అన్నారు. నటిని కావాలనే తన కలను నిజం చేసుకోవడానికి ఇండస్ట్రీకి వచ్చానని తెలిపింది. అవకాశం వస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌గారి పక్కన నటించాలనేది తన కల అని అన్నారు.
రాశి సింగ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటుంది. ఆమెకు ఫాలోవర్స్ కూడా వేలల్లో ఉన్నారు. ఇక సోమవారం ఉప్పల్ స్టేడియంలో మెరిసిన ఈ బ్యూటీ గురించి తెలుసుకోవడానికి నెటిజెన్లు ఆన్లైన్ లో తెగ వెతుకుతున్నారు.
ముఖ్యంగా బిచ్చగాడు సినిమాలోని మదర్ సెటిమెంట్ అందరిని కదిలించింది. క్లాస్ మాస్ భేదం లేకుండా అన్నీ వర్గాల ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో ముందుగా తెలుగు హీరో శ్రీకాంత్ ను అనుకున్నారట. ఈ విషయన్ని శ్రీకాంత్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
శ్రీకాంత్ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలను ఇలా చెప్పుకొచ్చారు. విజయ్ ఆంటోని తాను హీరోగా నటించిన ‘మహాత్మ’ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా చేశారు. అప్పటి నుండి విజయ్ తో పరిచయం ఉందని అన్నారు. తరువాత విజయ్ తమిళంలో ‘పిచ్చైకారన్’ మూవీ చేశాడని అన్నారు. విజయ్ ఫ్రెండ్ అవడంతో బిచ్చగాడు మూవీని తమిళంలో చూసానని, ఆ మూవీ తనకు బాగా నచ్చింది.
ఆ మూవీని తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నామని తెలిపారు. ఈ మూవీ గురించి చర్చించినపుడు తనకు ఇవ్వాల్సిన పారితోషికంతో పాటు మూవీకి బడ్జెట్ అధికం అవుతుండటంతో ఈ మూవీని రీమేక్ చేయలేదని అన్నారు. లేకపోతే బిచ్చగాడు చిత్రంలో నేనే నటించేవాడినని శ్రీకాంత్ వెల్లడించారు. ఇక అధిక బడ్జెట్ కారణంగా మేకర్స్ తమిళ సినిమాని తెలుగులోకి డబ్ చేసి ‘బిచ్చగాడు’ టైటిల్ తో రిలీజ్ చేశారని శ్రీకాంత్ తెలిపారు.

