సినీ పరిశ్రమలో కేవలం హీరోల వారసులే కాకుండా స్టార్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కుమారులు కూడా హీరోలుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. అయితే వారిలో కొందరు విజయం సాధించగా, కొందరు విజయం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో కోదండ రామిరెడ్డి కుమారుడు వైభవ్ రెడ్డి కూడా ఒకరు.
టాలీవుడ్ దర్శకుల గురించి రాయాల్సి వస్తే అందులో కోదండ రామిరెడ్డి గురించి ఎంతో ప్రత్యేకమైన పేజీ రాయాల్సి ఉంటుంది. చిరంజీవికి వరుసగా హిట్లు ఇచ్చి మెగాస్టార్ గా నిలబెట్టింది దర్శకుడు కోదండ రామిరెడ్డి. అలాంటి గొప్ప దర్శకుడు కోదండ రామిరెడ్డి తన చిన్న కుమారుడు వైభవ్ ను హీరోగా పరిచయం చేస్తూ ‘గొడవ’ అనే సినిమాని తెరకెక్కించారు. అయితే అది యావరేజ్ గా నిలిచింది.
ఆ తరువాత తర్వాత దర్శకుడు నాగేశ్వరరెడ్డి డైరెక్షన్ లో ‘కాస్కో’ అనే చిత్రాన్ని చేశాడు. ఆ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత చేసిన చిత్రాలు అంతగా ఆడకపోయేసరికి తెలుగు హీరో అయిన వైభవ్ తమిళ ఇండస్ట్రీకి వెళ్ళిపోయాడు. వైభవ్ తమిళ సినిమాలలో నటించడం ప్రారంభించారు. అయితే కోలీవుడ్ లో ఆయన విజయం సాధించడానికి చాలా సమయం పట్టింది. ఈ క్రమంలో ఆయన హీరోగా నటించిన ‘మియాదామన్’ అనే చిత్రం కోలీవుడ్ లో మంచి విజయం సాధించింది.
ఎంతలా అంటే కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ‘మెర్సల్’ మూవీని కూడా అధిగమించి సూపర్ హిట్ అందుకుంది. ఆ చిత్రంతో కోలీవుడ్ లో వైభవ్ కెరీర్ హీరోగా మలుపు తిరిగింది. ఈ విజయంతో తన కుమారుడిని హీరోగా నిలబెట్ట లేకపోయానని బాధపడుతున్న కోదండరామ్ రెడ్డి సంతోషించారని చెబుతారు. ప్రస్తుతం వైభవ్ కు తెలుగులో అంతగా చెప్పుకునే చిత్రాలు లేనప్పటికీ, కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగే దిశలో సాగుతున్నాడు.
https://www.instagram.com/p/Cm4J7I7pPZw/
Also Read: “దువ్వాడ జగన్నాథం” తో పాటు… సీన్స్ వల్ల “కాంట్రవర్సీ” సృష్టించిన 16 సినిమాలు..!




















రాజశేఖర్ ఒక రోజు జీవిత దగ్గరకు వెళ్లి మీకు నా పై ఆసక్తి చూపిస్తున్నారేమో అని అడిగారట. దాంతో రాజశేఖర్ ముక్కుసూటితనం జీవితకు బాగా నచ్చిందంట. ఇక రాజశేఖర్ ను పెళ్లికి ఒప్పించేందుకు, అలాగే రాజశేఖర్ ను పెళ్లి చేసుకోవడానికి ఎంతగానో కష్టపడినట్లు జీవిత తెలిపారు. దర్శకుడు రాఘవేంద్రరావుకు ఈ విషయం తెలిసి, రాజశేఖర్ విలన్ లా అనిపిస్తున్నాడు. అతన్ని నమ్మవద్దని, అతనితో జాగ్రత్తగా అని చెప్పారంట.
అయినా జీవిత రాజశేఖర్ ను వదలకుండా బ్రిడ్జి పై నుండి కిందకు తోసేసి, అనంతరం హాస్పటల్ లో చేర్పించి తనకు సేవలు చేసి తన తల్లిదండ్రులను ను పెళ్లికి ఒప్పించిందని రాజశేఖర్ తెలిపారు. ఇంకా జీవిత మాట్లాడుతూ వేరే అమ్మాయిని రాజశేఖర్ వివాహం చేసుకోవాలనుకున్న సమయంలో ఎంతో బాధపడ్డానని తెలిపింది. ఆ అమ్మాయి కారులో రాజశేఖర్ పక్కన కూర్చున్నప్పుడు వెనక సీట్ లో కూర్చున్న నేను చాలా బాధపడ్డానని జీవిత తెలిపింది. ఇక తాను వివాహం చేసుకోకపోయినా నాతోనే ఉంటానని చెప్పిందని, అది నచ్చిందని రాజశేఖర్ వెల్లడించారు.
Also Read: 








ఆమె పేరు రాశి సింగ్. ఆది సాయికుమార్, సురభి హీరోహీరోయిన్లుగా నటించిన ‘శశి’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఈ చిత్రం 2021లో విడుదల అయ్యింది. ఆమె వృత్తి రీత్యా ఎయిర్ హోస్టెస్. ఆమెకు చిన్నప్పటి నుంచి నటన పై ఉన్న ఇష్టంతో టను చేసే పనిని వదిలి ఇండస్ట్రీకి వచ్చింది. పోస్టర్, రత్నం సినిమాలలోనూ నటించింది. ఇటీవల శివ కందుకూరి హీరోగా తెరకెక్కిన ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ సినిమాలో రాశి సింగ్ హీరోయిన్ గా నటించింది.
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎవరి మీద ఆదారపడకూడదని, ఏదైనా నేర్చుకోవలనే ఉద్దేశ్యంతో ఎయిర్ హోస్టెస్ వృత్తిని ఎంచుకున్నానని తెలిపింది. ఎయిర్‌లైన్స్‌లో పని చేశానని, దాని కోసమే తాను హైదరాబాద్‌కు మారాల్సి వచ్చిందని తెలిపింది. ఆ క్రమంలో తెలుగు సినీ పరిశ్రమకు రావడం వెనుక నా ఉద్యోగం కూడా ఒక కారణం అని అన్నారు. నటిని కావాలనే తన కలను నిజం చేసుకోవడానికి ఇండస్ట్రీకి వచ్చానని తెలిపింది. అవకాశం వస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌గారి పక్కన నటించాలనేది తన కల అని అన్నారు.
రాశి సింగ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటుంది. ఆమెకు ఫాలోవర్స్ కూడా వేలల్లో ఉన్నారు. ఇక సోమవారం ఉప్పల్ స్టేడియంలో మెరిసిన ఈ బ్యూటీ గురించి తెలుసుకోవడానికి నెటిజెన్లు ఆన్లైన్ లో తెగ వెతుకుతున్నారు.