ప్రేమ కథ చిత్రాలను ఆడియెన్స్ ఆదరిస్తూనే ఉంటారు. ప్రేమ కథలతో వచ్చిన సినిమాల్లో ప్రధానంగా చెప్పుకునే జాబితాలో ‘సంపంగి’ సినిమా కూడా ఉంటుంది. 22 సంవత్సరాల క్రితం, 2001లో విడుదలైన ‘సంపంగి’ మూవీ చాలా మందికి ఇప్పటీకి గుర్తుండే ఉంటుంది.
ఒక ముస్లిం అమ్మాయి, హిందూ అబ్బాయి ప్రేమించుకుంటే ఎలా అనే కాన్సెప్ట్ కు ఫ్యామిలీ ఎమోషన్స్ కు జత చేసి దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. ఈ మూవీ అప్పటి యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో హీరోగా నటించిన దీపక్ ప్రస్తుతం ఎలా ఉన్నాడో? ఏం చేస్తున్నాడో ఇప్పుడు చూద్దాం..
సంపంగి మూవీలోని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రానికి సనా యాదిరెడ్డి డైరెక్షన్ చేశారు. ఈ చిత్రం ద్వారా దీపక్ బజ్వా తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టారు. ఈ మూవీ విజయం సాధించింది. దాంతో దీపక్ కు వరుస ఆఫర్స్ వచ్చాయి. ని తోడు కావాలి, ప్రేమలో పావని కళ్యాణ్, కనులు మూసినా నీవాయే వంటి చిత్రాలలో నటించి, తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యారు.
ఆ తరువాత హీరోగా అవకాశాలు తగ్గడంతో ‘భద్ర’ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాడు. అలా దీపక్ అరుంధతి, మిత్రుడు, కింగ్, లాంటి పెద్ద సినిమాలలో నటించారు. డిల్లీలో పుట్టి పెరిగిన దీపక్, అతని అసలు పేరు అర్జన్ బజ్వా. ఇండస్ట్రీలోకి రాకముందు మోడల్ గా గుర్తింపు పొందాడు. వివిధ ప్రకటనలో పెద్ద స్టార్స్ తో కలిసి నటించాడు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి వెళ్ళిన దీపక్ గురు, ఫ్యాషన్ సినిమాలతో పాపులర్ అయ్యాడు.
వరుస ఆఫర్లతో బాలీవుడ్ లో నటుడుగా రాణిస్తున్నారు. ఆ మధ్యన వచ్చిన దళపతి విజయ్ హీరోగా నటించిన తమిళ మూవీ బిగిల్ లో కనిపించారు. ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. దీపక్ మొదటి సినిమా ‘సంపంగి’ వచ్చి ఇప్పటికి 22 సంవత్సరాలు అవుతున్నప్పటికి అతనిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. అప్పటి లాగే ఫిట్ గా ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దీపక్ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంటాడు.
https://www.instagram.com/p/CgW2-IQBw3F/?hl=en
Also Read:“విరూపాక్ష” సినిమాలో హీరోయిన్ పాత్రకి డబ్బింగ్ చెప్పిన… అమ్మాయి ఎవరో తెలుసా..?

రీసెంట్ గా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మేకప్ మెన్ వాసు కొప్పిశెట్టి మాట్లాడుతూ బాలయ్య వాడే విగ్గుల గురించి చాలా విషయాలను తెలిపారు. బాలకృష్ణ గారి కోసం చెన్నైలేదా ముంబై నుండి విగ్గులను తెప్పిస్తామని, ఇప్పుడు హైదరాబాదులో చాలా రకాల విగ్గులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. అయితే బాలయ్య వాడే విగ్గులు చాలా ఖరీదు ఉంటాయని అన్నారు. బాలయ్య నాసిరకంగా ఉండే విగ్గులను అసలు వాడరని వెల్లడించారు. అందువల్ల బాలకృష్ణ ఉపయోగించే విగ్గుల కోసం లక్షల్లో ఖర్చు పెడతామని వాసు తెలిపారు.
అంతే కాకుండా సినిమా సినిమాకి బాలయ్య నటించే పాత్రను బట్టి, సన్నివేశాలను బట్టి విగ్గులు మార్చాల్సి వస్తుందని కాబట్టి వాటి కోసం అయ్యే ఖర్చును కూడా ప్రొడ్యూసర్స్ భరిస్తారని తెలియచేసారు. కాగా, బాలకృష్ణ చిత్రాలలో విగ్ సెంటిమెంట్ ఉంటుందనే టాక్ కూడా ఉంది. బాలయ్య విగ్గు సెట్ అయితే ఆ మూవీ హిట్ అనే సెంటిమెంట్ పై ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి.
ఈ సెంటిమెంట్ గురించి మేకప్ మెన్ వాసు కొప్పిశెట్టి మాట్లాడుతూ బాలయ్య గారు అలాంటి వాటిని నమ్మరని, బాలయ్యకు విగ్గు సెట్ అయితే మాత్రం ఆ చిత్రంలో చూడటానికి బాగా కనిపిస్తారని చెప్పారు. అందు వల్లనే ఆ చిత్రాలు హిట్ అవుతాయనీ వెల్లడించారు. వాసు కొప్పిశెట్టి బాలయ్య విగ్గుల గురించి చెప్పిన ఈ విషయలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.




















లెజెండరీ దర్శకుడు మణిరత్నం చాలా కాలం తర్వాత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2’ అనే పీరియాడిక్ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలు, ట్రైలర్ తో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రిష, కీలక పాత్రలలో నటిస్తున్నారు. ప్రముఖ నవల పొన్నియన్ సెల్వన్ ఆధారంగా ఈ సినిమాను రెండు భాగాలుగా తీశారు.
గతంలో వెయ్యి ఏళ్ల క్రితం రాచరిక పాలన కాలంలో మహిళలకు స్థానం లేదని హిస్టరీ పాఠాలలో చదువుకున్నాము. కానీ అవి తప్పని నిరూపించే చారిత్రక మహిళా ఉన్నారు. ఆమె కుందవై. పదవ శతాబ్దంలో చోళ సామ్రాజ్యం వేగంగా విస్తరిస్తున్న సమయంలో రాజు సుందర చోళుడు సామ్రాజ్యాన్ని విస్తరిస్తుంటే, ఆదిత్య కరికాలన్ చోళ సామ్రాజ్య ఖ్యాతిని దక్షణ భారతదేశంలో విస్తరించాడు. తరువాత రాజరాజచోళుడి పాలనలో చోళ ఖ్యాతి ఇండియా దాటి ఖాంబోడియా వరకు విస్తరించింది. అయితే రాజరాజచోళుడి ఖ్యాతి వెనుక ఒక మహిళా చాణిక్య ఉన్నారు.
ఆమె కుందవై. రాజు సుందర చోళుడికి ముగ్గురు పిల్లలు. ఆదిత్య కరికాలన్ , కుందవై, అరుళ్‌మొళి వర్మన్ (రాజరాజచోళ). చోళులకాలంలో మగవారితో సమనంగా ఆడవారు నిర్ణయాలు తీసుకునేవారు. కుందవై తల్లి మహాదేవి కూడా రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. ఆమె శిక్షణలో కుందవై కూడా శక్తివంతమైన మహిళగా రాజకీయాలు నడిపారు. ఈ నవలను రాసిన రచయిత కాస్తంత కల్పితాన్ని జోడించాడు. వాస్తవంగా ఆదిత్య కరికాలన్ కంటే చాలా చిన్నవాడు అరుళ్‌మొళి, ఆదిత్యుడు మరణించిన తరువాత కుందవై తమ్ముడిని చూసుకుంది.
సంక్షోభ పరిస్థుతులలో ఉన్న సమయంలో రాజ్యాన్ని తన తెలివితేటలతో కాపాడుకున్న పవర్ ఫుల్ మహిళ. రాజకీయాలు, ఆధ్యాత్మిక, సౌందర్యం, ఎదురులేని చాణక్యం అన్ని కలగలసిన అరుదైన వ్యక్తిత్వం కుందవై. రాజరాజచోలుడు చిక్కుల్లో ఉన్న ప్రతిసారీ తల్లిలా ఆదుకుంది. తంజావూరు బృహధీశ్వర ఆలయ నిర్మాణంలో కుందవై పాత్ర కీలకమైనది. అక్కడ గోడలపై చోళుల శిల్పాలతో పాటుగా, కుందవై శిల్పాలు కనిపిస్తాయి.
కుందవై ఇతర రాజ్యాలతో సయోధ్య, యుద్ధ విషయాలలో ఆమె నిర్ణయాలకు ఎదురులేదు. ఆమె తెలివితేటలను సామంత రాజులు ఎంతో గౌరవించేవారు. తమ కుమార్తెలను శిక్షణ కోసం కుందవై దగ్గరకు పంపించేవారు. ఆమెను వివాహం చేసుకోవడానికి ఎనద్రో రాజులు పోటీ పడేవారు. ఆమె రాజరాజచోలుడి మిత్రుడైన వంధ్యదేవున్ని పెళ్లి చేసుకుందని కల్కి రాసిన నవలలో ఉంది. మరి కొన్ని కథనాల ప్రకారం ఆమె వివాహం చేసుకోలేదని తెలుస్తోంది. ఆమె చాలా కాలం పాలయారైలో ఉండేవారు.
ఇప్పటికి అక్కడ ఉండే చాలా కుటుంబాలు ఆమెను ఆడపడుచుగా పూజిస్తారు. కుందవైని నాచియార్ గా పూజిస్తారు. శైవ నాయనర్ల సాహిత్యాన్ని సేకరించి భద్రపరచింది. ఆ సాహిత్యం ఇప్పటికి భద్రంగా ఉందంటే కుందవై కారణం అని అంటారు. రాజరాజచోళుడికి చరిత్రలో ఇంతగొప్ప స్థానం ఉందంటే దాని వెనుక కుందవై కృషి ఎంతో ఉంది. కానీ ఆమె గురించి చరిత్ర పాఠాలలో ఎక్కడ ప్రస్తావించలేదు.
ఆమె ఆధునికంగా ఆలోచించేది. రాజ్యంలో శాంతి ఉండాలంటే అన్ని సంస్కృతులను గౌరవించాలని చెప్పి, ఆచరించింది. అందుకు అనుగుణంగా ఆమె నిర్మించిన శైవ, వైష్ణవ, జైన ఆలయాలను తమిళనాడులో చూడవచ్చు. ఆమె రాజకీయాలలోనే కాకుండా సంగీత, సాహిత్యంలో జ్ఞాని. ఒకప్పుడు పాండ్య, లంక, చాళక్య రాజ్యాల నుండి చోళ రాజ్యానికి ముప్పు ఉండేది. అయితే ఆ మూడు రాజ్యాల పై రాజ రాజ చోళుడు పట్టు సాధించి, ముమ్మడి చోళుడిగా ఖ్యాతి చెందాడు. ఆ ఖ్యాతి వెనుక ఉన్న మహిళా శక్తి కుందవై.
హీరోల తరువాత హీరోయిన్ల పారితోషికం, వారి తర్వాత స్థాయిలో విలన్ క్యారెక్టర్ పోషించేవారు రెమ్యునరేషన్ తీసుకుంటారు. అయితే హీరోల కన్నా ఎక్కువ పారితోషికం హీరోయిన్లు తీసుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది. అప్పట్లో ఎన్టీఆర్ అత్యధిక పారితోషికం తీసుకునే కాలంలో ఇద్దరు హీరోయిన్లు సీనియర్ ఎన్టీఆర్ ను కన్నా ఎక్కువగా ఇద్దరు హీరోయిన్లు పారితోషికం తీసుకుని సంచలనం సృష్టించారు. అయితే ఈ విషయం ఎక్కువ మందికి తెలియదు. ఆ ఇద్దరు హీరోయిన్ల గురించి చూద్దాం..
1. భానుమతి:
2. అంజలి దేవి:
అంతే కాకుండా తన రెమ్యునరేషన్ తానే నిర్ణయించేవారని తెలుస్తోంది. కాగా అప్పటికే టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్న సావిత్రి, రాజసులోచన వంటి హీరోయిన్లు మాత్రం పారితోషికం తక్కువగా తీసుకునే వారంట.
అక్కినేని అఖిల్ ప్రస్తుతం భారీ హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అఖిల్ ఈ మూవీకి ముందు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంతో డీసెంట్ హిట్ నుఅందుకున్నారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’ తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ కోసం అఖిల్ చాలా కష్టపడ్డారు. యాక్షన్, బాడీ, డాన్స్ ఇలా అన్ని రకాలుగా అఖిల్ చాలా శ్రమించారని తెలిస్తోంది.
రిలీజ్ దగ్గర పడుతున్న క్రమంలో మేకర్స్ ఈ మూవీ నుండి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తున్నారు. మూవీ ప్రమోషన్స్ అఖిల్ విభిన్నంగా నిర్వహిస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా అఖిల్ 171 అడుగుల ఎత్తు నుండి జంప్ చేసి ఆడియెన్స్ ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మూవీ గురించి మరో అప్డేట్ వచ్చింది. తాజాగా ‘ఏజెంట్’ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కంప్లీట్ చేసుకుందని మేకర్స్ తెలిపారు.
సెన్సార్ బోర్డు ‘ఏజెంట్’ సినిమాకి U/A సర్టిఫికెట్ ను జారీ చేశారు. ఈ మూవీలో భారీ యాక్షన్ మరియు వయలెన్స్ ఉండటం వల్ల U/A సర్టిఫికెట్ ను ఇచ్చారు. అంటే కుటుంబంతో కలిసి ఈ మూవీ చూడవచ్చు. 12 సంవత్సరాల లోపు పిల్లల తమ పేరెంట్స్ తో కలిసి చూడొచ్చు. ఇక ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 36 నిమిషాలు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలకు ఇది ఫర్ఫెక్ట్ రన్ టైమ్.
ఈ చిత్రం అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుందని మూవీ యూనిట్ భావిస్తున్నారు. ఈ మూవీకి వక్కంతం వంశీ కథను అందించారు. మలయాళ మెగా స్టార్ మమ్ముుట్టీ ముఖ్యపాత్రలో నటించారు. ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించారు. ఏప్రిల్ 28న తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీలలోనూ విడుదల చేయబోతున్నారు.
ఓయ్, అమ్మమ్మగారిల్లు సినిమాల తరువాత షామిలీ మళ్ళీ టాలీవుడ్ లో కనిపించలేదు. ఆమె ప్రస్తుతం ఏం చేస్తోంది? ఆమె లక్ష్యం ఏమిటి? మళ్లీ సినిమాలలో నటిస్తుందా లాంటి ప్రశ్నలకు తాజాగా ఆమె సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం షామిలీ నాట్య కళలు, చిత్రలేఖనం పై ఇంట్రెస్ట్ ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఆమె ఇలా చెప్పుకొచ్చారు. ‘‘నేను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం భాషల్లో సుమారు యాబైకి పైగా సినిమాలలో నటించాను.
కొన్ని సినిమాలలో హీరోయిన్గా కూడా నటించాను. అయితే నాకు చిత్రలేఖనం పై ఉన్న ఇంట్రెస్ట్ తో ఈ రంగంలో దృష్టి పెట్టానని, నా టాలెంట్ ను నిరూపించుకుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నా. అమెరికాకు వెళ్ళి చిత్రలేఖనం లో ట్రైనింగ్ తీసుకున్నాను. చెన్నై, బెంగుళూరులలో జరిగిన పెయింటింగ్ కి సంబంధించిన ఎగ్జిబిషన్లలో నేను వేసిన పెయింటింగ్స్‌ను ప్రదర్శించాను. త్వరలో సొంతంగా ఒక పెయింటింగ్ ఎగ్జిబిషన్ చెన్నైలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను.
సినిమాల్లో మళ్ళీ నటించే విషయం పై ఆలోచించలేదు. నా లక్ష్యం పెయింటింగ్ ఎగ్జిబిషన్. అది పూర్తయితే మళ్లీ నటిస్తానో లేదో ఇప్పుడే ఏం చెప్పలేను. నేను ప్రస్తుతం ఏ మూవీకి సైన్ చేయలేదు” అని షామిలీ తెలిపింది. ఇక ఆమెకు పెయింటింగ్ అంటే ఎంత ఆసక్తో షామిలీ ఇన్‌స్టాగ్రమ్ ఫాలోవర్స్ కి బాగా తెలుసు. ఆమె పెట్టె పెయింటింగ్ పోస్ట్‌లకు కామెంట్స్ వస్తుంటాయి. ప్రస్తుతం ఆమె దృష్టి అంతా పెయింటింగ్ ఎగ్జిబిషన్ పైనే మీదనే ఉంది.
ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు కార్తిక్ వర్మ దండు మొదటిసారి దర్శకత్వం వహించి విజయం సాధించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో రూ.21 కోట్లు వసూల్ చేసింది. ‘విరూపాక్ష’ ప్రీ-రిలీజ్ బిజినెస్ దాదాపు రూ.22 కోట్లు చేసింది. అంటే ఈ మూవీ బ్రేక్ ఈవెన్‌కు చాలా దగ్గరగా ఉంది. ఈ మూవీ హీరోయిన్ సంయుక్త మీనన్ తెలుగులో వరుసగా హిట్లతో ముందుకెళ్తోంది. ఇక విరూపాక్షతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.
విరూపాక్ష మూవీ స్టోరీ పర్వత ప్రాంతంలోని రుద్రవనం అనే ఊరి నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ ఆటిట్యూడ్ కలిగిన ‘నందినీ’ అనే పల్లెటూరి అమ్మాయిగా నటించింది. గ్రామంలో పుట్టి పెరిగిన నందిని చాలా ఎనర్జిటిక్ ఉంటుంది. ఈ పాత్రలో సంయుక్త మీనన్ తన నటనతో మరోసారి ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కు తెలుగులో డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ పేరు హరిణి రావు. తన గాత్రంతో హీరోయిన్ పాత్రకు మరింత అందాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు.
ఆమె ఈ చిత్రానికి ముందు ‘అవతార్ 2’ చిత్రంలో కిరి అనే పాత్రకి డబ్బింగ్ చెప్పింది. అలాగే అక్షయ్ కుమార్ నటించిన ‘రామసేతు’ చిత్రానికి కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేశారు. ఆ చిత్రంలో హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హరిణి రావు తెలుగు వర్షెన్ కి డబ్బింగ్ చెప్పారు. దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న ‘కాంతర’ తెలుగు వర్షెన్ లో హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పారు. హరిణి రావు ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. ఆమె అక్కడ వర్క్ చేస్తూనే టాలీవుడ్ లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో పలు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.











1.శాకుంతలం:
2.వారసుడు:
3. ఆచార్య:
4.బ్రహ్మోత్సవం:
5.శ్రీకారం:
6.వరుడు:
7.ఇంటిలిజెంట్:
8.గోరింటాకు:
9.సన్ ఆఫ్ ఇండియా:
10.టక్ జగదీష్:
11.థాంక్యూ:
12.శ్రీనివాస కళ్యాణం:
2018లో విడుదలైన ఈ మూవీ సీరియల్ టాక్ తో ప్లాప్ గా నిలిచింది. ఈ మూవీని నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై నిర్మించారు.