చెప్పవే చిరుగాలి సినిమా లో వేణు సరసన నటించిన హీరోయిన్ అభిరామి గుర్తుందా..? టెలివిజన్ వ్యాఖ్యాత గా వ్యవహరించిన అభిరామి 1995 లో సినీ కెరీర్ ను మొదలు పెట్టింది. చెప్పవే చిరుగాలి సినిమా తరువాత ఆమె అంత గా తెలుగు తెరపై కనిపించలేదు.
చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చేసిన అభిరామి, 2004 వ సంవత్సరం లో ఉన్నత చదువుల కోసం యునైటెడ్ స్టేట్స్ కి వెళ్ళిపోయింది. ఆ తరువాత మళ్ళి 2013 లోనే ఇండియా కి వచ్చింది.

కథాపురుషన్ అనే మలయాళ సినిమా లో బాల నటి గా అభిరామి వెండితెర పైన కనిపించింది. ఆ తరువాత, పత్రం, న్జంగల్ సంతుస్తరను , మెర్కారా, శ్రద్ధ, మిలీనియం స్టార్స్ , మెలెవర్యతే మలఖక్కుట్టికల్ , మేఘసందేశం వంటి మలయాళ సినిమాలు చేసింది.

ఆ తరువాత తమిళ, కన్నడ సినిమాలలో కూడా నటించి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంది. రక్తకన్నీరు, లాలి హాడు వంటి కన్నడ సినిమాల్లో నటించింది. మిడిల్ క్లాస్ మాధవన్ , చార్లీ చాప్లిన్, దోస్త్, కర్మేఘమం, సమస్థానం వంటి తమిళ సినిమాలలో కూడా నటించింది.

తెలుగు లో అభిరామి చాలా తక్కువ పాత్రలను చేసింది. చెప్పవే చిరుగాలి సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. చెప్పవే చిరుగాలి కంటే ముందు ఆమె థాంక్యూ సుబ్బారావు సినిమాలో నటించింది. చార్మినార్ అనే మరో సినిమా లో కూడా అభిరామి నటించింది. ఇది కాకుండా, లేటెస్ట్ గా రవితేజ “అమర్ అక్బర్ ఆంటోని” సినిమా లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా అభిరామి నటించింది. ఈ సినిమా లో అభిరామి హీరో తల్లి పాత్రను పోషించింది.

అయితే, సినిమాల్లోనే కాకుండా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా అభిరామి తన సత్తా చాటింది. కమలహాసన్ ‘విశ్వరూపం’, ‘విశ్వరూపం 2’ సినిమాలలో అభిరామి హీరోయిన్ పూజ కుమార్ కు తమిళ్ లో డబ్బింగ్ కూడా చెప్పారు. ప్రస్తుతం తెలుగు లో సినిమాలు తక్కువే చేశారు. అప్పటికి, ఇప్పటికీ అభిరామి ఎలా మారిపోయారో ఈ కింద ఫోటోలలో చూడండి.




ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్,సీనియర్ హీరోయిన్స్ మధుబాల, గౌతమి, అనన్య నాగళ్ల, సచిన్ ఖేడ్కర్, కబీర్ బేడీ, వర్షిణీ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె ‘అల్లు అర్హ’ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ప్రీమియర్ షోలు కూడా వేశారు. ఈ మూవీ ప్రీమియర్ చూసిన ఆడియెన్స్ సమంత శకుంతలగా చాలా నాచురల్ గా నటించిందని మెచ్చుకుంటున్నారు.
అయితే సోషల్ మీడియాలో కొందరు శకుంతలగా సమంత కన్నా, అలనాటి హీరోయిన్ జయప్రద బాగా నటించిందని, నిజంగా శకుంతల అంటే ఆమెలా ఉండాలని కామెంట్స్, పొస్ట్ పెడుతున్నారు. హీరోయిన్ జయప్రద ‘కవిరత్న కాళిదాసు’ అనే కన్నడ సినిమాలో శకుంతలగా నటించింది. దుష్యంతుడి పాత్రలో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ నటించారు. ఆ సినిమాకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘శాకుంతలం’ సినిమాలో నటించిన సమంతతో పొలుస్తున్నారు.








































ఈ మూవీ చూసిన చాలామంది ఆడియెన్స్ ఈ సినిమా ‘ఆరెంజ్’ అనే టైటిల్ ఎందుకు పెట్టారనేది అర్థం కావడం లేదని కామెంట్ చేశారు. ఈ సినిమాకి ఆ పేరు ఎందుకు పెట్టారనే విషయం ఎవరికి తెలియదు. తాజాగా ఈ మూవీ దర్శకుడు భాస్కర్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో టైటిల్ పెట్టడం వెనుక ఉన్న కారణం ఇలా చెప్పుకొచ్చారు. “చిత్రం థీమ్ ప్రకారం మూవీ టైటిల్‌ను సెలెక్ట్ చేశాను. ప్రేమ అనేది కొన్ని రోజుల తర్వాత తగ్గుతుంది. అప్పుడు వేరొక వ్యక్తిని లవ్ చేయమని చెప్పడమే ఆరెెంజ్ మూవీ థీమ్. ఒకరి పట్ల ప్రేమ అనేది ఎల్లపుడూ ఒకేలా ఉండదు.
ఆ బంధంలో అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి. వీటినే సూర్యోదయం మరియు సూర్యాస్తమయంతో పోల్చాం. సూర్యూడు సన్ రైజ్, సన్ సెట్ లలో ఆరెంజ్ రంగులో కనిపిస్తాడు. సన్ రైజ్ ప్రేమ మొదలవడాన్ని సూచిస్తుంది. ఆ సమయంలో సూర్యూడు ప్రకాశవంతంగా ఉంటాడు. అలానే సన్ సెట్ లవ్ ముగింపుకు సూచన. అందువల్ల మా సినిమాకి ‘ఆరెంజ్’ అనే టైటిల్ పెట్టాం. మూవీ యూనిట్ అంతా టైటిల్ ఓకే చెప్పారు.” అని బొమ్మరిల్లు భాస్కర్ వెల్లడించారు.
ఈ సినిమాని అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగబాబు నిర్మించారు. ఈ మూవీలో హీరోయిన్ గా జెనీలియా నటించింది. ఒక మంచి ప్రేమ కథగా పేరు తెచ్చుకున్నా అప్పటి ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. కానీ ఇప్పటి జనరేషన్‌కు మాత్రం ఈ మూవీ చాలా కనెక్ట్ అయింది. మొదటిసారి రిలీజ్ అయినపుడు డిజాస్టర్ అనిపించుకున్న ఈ చిత్రం అందరు ఆశ్చర్యపోయేలా రీరిలీజ్‌లో హిట్ అయ్యింది. ఇప్పటి వరకు టాలీవుడ్ లో రీరిలీజ్ సినిమాలలో ఆల్ టైమ్ రికార్డ్ గా నిలిచింది.
జల్లికట్టు సినిమా 93వ అకాడెమీ అవార్డుల రేసులో నిలిచింది. చివరి రౌండ్ కు అర్హత సాధించలేకపోయింది. 2021 ఆస్కార్ కోసం మొత్తం 27 చిత్రాలు పోటీపడగా, మలయాళ సినిమా ‘జల్లికట్టు’ను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసింది. మలయాళ ఇండస్ట్రీ నుండి ఆస్కార్ కు వెళ్ళిన మూడవ సినిమాగా నిలిచింది.
సినిమా అనగానే ముందుగా అడిగే ప్రశ్న అందులో హీరో ఎవరు అనే. దాదాపుగా ప్రతి సినిమాలోనూ హీరోదే ప్రధాన పాత్రగా ఉంటుంది. ఆ హీరో పేరుతోనే సినిమాని జనాల్లోకి తీసుకెళ్తుంటారు. కానీ ‘జల్లికట్టు’ సినిమాలో హీరో అనే పాత్ర లేదు. హీరోని పెట్టకుండా సినిమాని తీయడానికి ఎంతో ధైర్యం కావాలి. దర్శకుడు ఈ విషయంలో సక్సెస్ అయ్యాడు.
2019లో విడుదలైన ఈ సినిమా భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్ర కథ గురించి చెప్పాలంటే కసాయి కొట్టు నుండి తప్పించుకున్న ఒక దున్నపోతు ఊర్లో ఎంతటి వినాశనం సృష్టించిందనేది స్టోరి. ఇక ఈ మూవీ అంతా దున్నపోతు చుట్టూ తిరిగుతుంది. కానీ ఈ సినిమాలో దున్నపోతును ఉపయోగించలేదు. చిత్రయూనిట్ యానిమేట్రానిక్స్ టెక్నిక్ ద్వారా దున్నపోతును చూపించారంట. ఇలా ఒక్కో దున్నపోతుకు దాదాపు 20 లక్షలు ఖర్చు అయ్యినట్టు తెలుస్తోంది.
‘జల్లికట్టు’ అనేది కసాయి నుండి తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఒక దున్నపోతు ఉత్కంఠగా పరిగెత్తే కథను చెప్పే సినిమా. దున్నపోతును పట్టుకోవడానికి మనుషులు వెంట పడటం చూస్తే ఆదిమ మానవుల నాటి పశు ప్రవృత్తి మనిషి జీన్స్ లో ఇంకా ఉందని, అవకాశం వచ్చినప్పుడు అది బయిటకు వస్తుందని అర్దమవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.

#9

#12
#13
#14
#15
#16
#17
#18






