ఇప్పటివరకు తను లావుగా ఉన్నానంటూ అవహేళన చేసిన వాళ్లకు, తన ఫిజిక్ ని కారణంగా చూపించి వదిలి వెళ్ళిన అతని ప్రియురాలుకు తనదైన శైలిలో వినూత్నంగా జవాబు ఇచ్చాడు ఓ యువకుడు.
నడుం బిగించి చెమట చిందించి కష్టపడి 144 కిలోల నుండి 74 కిలోలకు చేరుకున్నారు. అది కూడా కేవలం ఒక సంవత్సరం ఎవరిలో మాత్రమే. ఆ యువకుడి మార్పుకు సంబంధించిన పలు వీడియోలు ఇప్పుడు నెట్లో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో చాలామంది ఎందరికో అతని వెయిట్ లాస్ జర్నీ స్ఫూర్తిదాయకమని చెప్తున్నారు.
గతంలో టిక్ టాక్ వీడియోస్ చేసే పవి గత ఏడాది జనవరి కి ముందు సుమారు 144 కిలోల బరువుతో ఇబ్బంది పడేవాడు. అతని గర్ల్ ఫ్రెండ్స్ సైతం అతనితో ఉండడానికి ఇబ్బందిగా ఫీల్ అయి వదిలి వెళ్ళిపోయింది. అప్పటివరకు తన లావుని సీరియస్ గా తీసుకొని పవి ఆ ఇన్సిడెంట్ తో చాలా కలత చెందాడు. దానితో ఎలాగైనా బరువు తగ్గాలి అని నిశ్చయించుకున్న అతను కఠిన దీక్షతో అనుకున్నది సాధించాడు. తన ప్రయత్నానికి నాందిగా జిమ్ లో చేరిన అతను రోజుకు గంటలకు కష్టపడి ఏకంగా 70 కిలోల బరువు తగ్గాడు.
ఈమధ్య తన పాత ఫోటోను ఇప్పుడు తగ్గి కండలు పెంచిన తన కొత్త ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన అతను ” ఇప్పుడు నాకు నేనే ఒక కొత్త వ్యక్తిలా కనిపిస్తున్నాను…. ఒకప్పుడు ఎంతో నీరసంగా ఉండేవాడిని…. జనం సైతం నన్ను హేళనగా చూసేవాళ్ళు……. కానీ ఇప్పుడు నా జీవితం తిరిగి వచ్చింది……ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటున్నాను”అని తన అనుభూతిని అందరితో పంచుకున్నాడు.
నేడు మన సమాజంలో ఎందరో ఈ స్థూలకాయంతో బాధపడుతున్నారు….. అందులో కొందర అయిన అతనిని ఆదర్శంగా తీసుకొని…. తమ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారని విమర్శకుల ఆశ.
https://www.instagram.com/p/CZxAKhLgPJ3/