పెళ్లయిన తర్వాత ప్రతి స్త్రీ కూడా మంగళసూత్రాన్ని ధరిస్తుంది. ఉదయం లేచిన తర్వాత మంగళసూత్రాన్ని కళ్ళకు అద్దుకుని లేస్తూ ఉంటారు మహిళలు. కానీ చాలా మంది మంగళసూత్రం విషయంలో కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పులు ఏమిటో తెలుసుకుంటే మీరు అటువంటి తప్పులుని చేయకుండా చూసుకోవచ్చు.
మహిళ జీవితం పెళ్లి తర్వాత ఎంతో మారుతుంది. చాలా రకాల మార్పులు ఆమె జీవితంలో వస్తాయి. ఆమె ఆలోచన విధానం మొదలు వస్త్రధారణ వరకు చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. పెళ్లి అనేది రెండు మనసులని దగ్గర చేయడమే కాదు రెండు కుటుంబాలని ఒకటి చేస్తుంది.

సుముహూర్తం సమయంలో వధూవరులు ఇద్దరు ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లాన్ని పెడతారు. ఆ తర్వాత వధువు మెడ లో మంగళ సూత్రాన్ని వరుడు కడతాడు. వరుడు కట్టిన మంగళ సూత్రాన్ని ఆ స్త్రీ ఎప్పుడు తొలగించకుండా తన మెడలోనే ఉంచుకుంటుంది. పెళ్లిలో కట్టే మంగళసూత్రం ఎంతో పవిత్రమైనది. ఎప్పుడు కూడా మంగళ సూత్రానికి పిన్నులు వంటివి పెట్టకూడదు. చాలామంది మహిళలు సేఫ్టీ పిన్స్ వంటి వాటిని ఆ మంగళ సూత్రానికి తగిలిస్తూ ఉంటారు.

ఇలా చేయడం వలన తాళిబొట్టుకి ఉండే శక్తి దానికి వెళ్ళిపోతుంది. పైగా ఇది భర్త కి కష్టాలని కూడా తీసుకు వస్తుందట. ఈ అలవాటు మీకు కూడా ఉంటే మానుకోవడం మంచిది. అలానే తాళిబొట్టుని అసలు మహిళలు తీయకూడదు. తాళి బొట్టును తీసేస్తే భర్తకి అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ప్రేమకి నమ్మకానికి గుర్తుగా మహిళ తన భర్త బతికి ఉన్నంత వరకు మంగళ సూత్రాన్ని ధరించాలి.

ఇదిలా ఉంటే మంగళ సూత్రానికి చాలా మంది పూసలు కట్టుకుంటారు. అయితే పూసలు కట్టుకోవడం వలన ఇబ్బంది ఏమీ రాదు. తాళిబొట్టుకి నల్లటి పూసలు, ఎర్రటి పూసలు కట్టడం వలన నరదిష్టి తగలకుండా ఉంటుంది. కనుక తాళిబొట్టుకి పూసలని కట్టుకోవచ్చు. తప్పు లేదు.







ప్రధాన మంత్రి తిమ్మరుసు రాజు అనంతరం సమర్ధుడైన పాలకుడిగా కృష్ణరాయలను భావించి, మేక కళ్ళను తెచ్చి రాజుకు కృష్ణరాయల కళ్ళుగా చూపిస్తాడు. వాటిని చూసి సంతృప్తి చెందిన రాజు ప్రశాంతంగా మరణించాడు. ఆ తరువాత తిమ్మరుసు కృష్ణదేవరాయ చక్రవర్తిగా చేశాడు. అప్పాజీ సహకారంతో కృష్ణదేవరాయ గొప్ప చక్రవర్తిగా ఎదిగాడు. విజయనగర సామ్రాజ్యా కీర్తిని నలు దిశలలో చాటుతూ, గొప్ప చక్రవర్తిగా పేరు గాంచాడు.
అతను అనుకున్నది జరగాలంటే అంటే మహామంత్రి తిమ్మారుసును రాజ్యానికి దూరం చేయాలని భావిస్తాడు. అతని తెలివితోనే విజయనగర సామ్రాజ్యం గొప్పగా మారిందని గ్రహించి రాయలకు తిమ్మారుసును దూరం చేయాలని అనుకుంటాడు. దానిలో భాగంగా రాయలు యుద్ధానికి వెళ్లేముందు కుమారుడు తిరుమల రాయలకు పట్టాభిషేకం చేయమని కుమార్తె లక్ష్మితో చెప్పిస్తాడు. అప్పాజీని అడిగి నిర్ణయం తీసుకుండామని చెప్పినా వినకుండా పదే పదే అడగడంతో కుమారును పట్టాభిషేకానికి రాయలు ముహూర్తం నిర్ణయిస్తారు.
తిమ్మారుసుకి గజపతులు అంటే పగ అనే విషయం మీకు తెలుసు. లక్ష్మీ కుమారుడు రాజు అవడం ఇష్టం లేకపోవడం వల్లే చంపాడని చెప్తాడు. మిమ్మల్ని చంపానని చెప్పి, తరువాత రాజును ఎలా చేశాడో, అలాగే మీ కొడుకుని చంపి మీ తమ్ముడు అచ్యుత రాయలను రాజును చేయాలనుకున్నాడని అంటాడు. కుమారుడు చనిపోయిన బాధలో ఉన్న రాయలు దానిని నమ్మి తిమ్మారుసును బంధించమని, అది రాజద్రోహంగా భావించి తనను పెంచి పెద్ద చేసిన తిమ్మరుసు రెండు కళలు పొడిచేయమని ఆజ్ఞాపిస్తాడు.
అయితే కొంతకాలానికి గజపతుల వల్లే ఇది జరిగిందని తెలుసుకుని తిమ్మారుసుని క్షమించమని వేడుకుని రాజ్యానికి తీసుకురాగా, ఆయన ఇంకా మంత్రిగా ఉండలేనని తిరుపతికి వెళ్ళి చివరి రోజులు అక్కడే గడిపాడని శాసనాల ద్వారా తెలుపబడింది. రాయలు తప్పు చేశాననే తీవ్ర వేదనతో అనారోగ్యం పాలయ్యారు మరియు కొంతకాలానికి మరణించారు. ఇదే గొప్ప చక్రవరి అయిన శ్రీకృష్ణ దేవరాయల జీవితంలో చేసిన అతి పెద్ద పొరపాటు అని అంటారు.

1967లో ఎనిమిదో మరియు చివరి నిజాంగా ముకర్రం ఝా ప్రమాణం చేశారు. ఆ తరువాత ఆయనకు తన తాతయ్య నుండి డజనుకు పైగా ప్యాలెస్‌లు, మొగల్ కళాఖండాలు, వజ్రాలు, వంద కిలోల బంగారం, వెండి ఆభరణాలు, విలువైన రాళ్లు వారసత్వంగా సంక్రమించాయి. అయితే, ఆయన మరణించే ముందు రూ.4000 కోట్ల విలువైన ఆస్తిని కోల్పోయారు. ఆ సంపద ఎలా పోయిందనే విషయాన్ని “ద లాస్ట్ నిజాం: రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఇండియాస్ గ్రేటెస్ట్ ప్రిన్స్లీ స్టేట్” లో జాన్ జుబ్రిస్కీ వెల్లడించారు.
అయితే అప్పటికి పరిస్థితులు చాలావరకు మారిపోయాయి. ఎంతో సందపను నిజాం కోల్పోయారు’’ అని చెప్పినట్టుగా ఆ పుస్తకంలో తెలిపారు. ‘‘మా తాతయ్య మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సాయంత్రం ప్యాలస్‌లో ఉండే తోటకు వెళ్లేవారు. అప్పుడు ఆ తోటలోకి ఆయన భార్యలు అందరు వచ్చేవారు. అప్పుడు మా తాతయ్య ఏ రాణి భుజం మీద తెల్లని రుమాలు వేస్తే, ఆమె రాత్రి తొమ్మిది గంటలకు ఆయన గదిలోకి వెళ్ళేవారని’’అని ముకర్రం ఝా తనతో తెలిపినట్లుగా జుబ్రిస్కీ తన పుస్తకంలో రాశారు.
అయితే, ఈ విలాసాల మధ్య ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కుమారులు, మనవళ్ల సంఖ్య భారీగా పెరిగింది. ఆయన మరణించే నాటికి సుమారు వంద మంది దాకా వారసులు ఉండేవారు. అది 2005నాటికి 500 దాటిపోయింది. వీరిలో అనేక మంది ఆస్తిలో వాటా కోరుతూ చివరి నిజాం ముకర్రం ఝా పై కోర్టులో కేసులు వేశారు.
భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ప్రభుత్వం పాట సంస్థానాలన్నీటిని అధీనంలోకి తీసుకోవడం కొనసాగించారు. ఆ సమయంలో ముకర్రం ఝా ఇంగ్లాండ్, యూరప్ లలో వంతెనలు కట్టడం, మందు పాతరాలు పెట్టడం నేర్చుకుంటున్నారు. చివరికి 1967లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చనిపోయిన తరువాత నిజాం వారసుడిగా బాధ్యతలు తీసుకున్న ముకర్రం ఝా ఎన్నో సమస్యలు చుట్టుముట్టాయి. మా తాతయ్య వద్ద 14,718 మంది పని చేసేవారు. అలాగే ఆయన 42 మంది భార్యలు, 100 మంది పిల్లలున్నారు. వీరందరి ఖర్చులు ఎక్కువగా ఉండేవి.
చౌమహల్లా ప్యాలెస్ కాంప్లెక్స్‌లో దాదాపు 6,000 మంది సిబ్బంది ఉండేవారు. మరో 5,000 మంది రక్షణ సిబ్బంది ఉండేవారు. ఇక నిజాం వంట శాలలో రోజుకు 2,000 మందికి భోజనం తయారుచేసేవారు. దానిలో ఎక్కువ శాతం సేవకులు బయట హోటల్ లలో అమ్ముకునేవారని ఒక ఇంటర్వూలో చెప్పారు. నిజాం గ్యారేజీలో రోల్స్ రాయిస్ లాంటి ఖరీదైన కార్లు ఉండేవి. ఈ కార్ల కోసం పెట్రోలకు అప్పట్లోనే సంవత్సరానికి 90,000 అమెరికా డాలర్లు ఖర్చు అయ్యేది అని చెప్పారు.
ఇక 1968లో ముకర్రం ఝాకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మొదటిసారి ఎదురుదెబ్బ తగిలింది. నిజాం సంపదను వారసులంతా సమానంగా తీసుకోవాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసును వేసింది ముకర్రం ఝా సోదరి షెహజాదీ పాషా. ఆ తర్వాత, పశ్చిమ ఆస్ట్రేలియాలో డాక్టర్ గా పనిచేస్తున్న తన కేంబ్రిడ్జ్ ఫ్రెండ్ జార్జ్ హాబ్డేను ముకరం జా కలవడానికి వెళ్లారు. అక్కడ ఆయన జీవితం మరో మలుపు తిరిగింది. ఆయన అక్కడే ఓ ఫామ్ హౌజ్ తీసుకున్నారు. అప్పుడే ఆయనకు గొర్రెలను పెంచే ముర్చిసన్ హౌస్ స్టేషన్ గురించి తెలిసింది.
ఆ తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన హెలెన్ సైమన్స్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. హెలెన్ ఎయిడ్స్‌తో మరణించారు. కుమారుడు, ప్రిన్స్ ఒమర్ జా డ్రగ్స్‌ను ఓవర్ డోస్ తీసుకోవడంతో మరణించారు. ఇక ఆస్ట్రేలియాలో ఆయన ఎస్టేట్ 500 ఎకరాల్లో విస్తరించింది. ఇటు హైదరాబాద్‌లో ఆయన ఆస్తులను ఇతరులు ఆక్రమించడం క్రమంగా పెరిగింది. అయితే ఆస్ట్రేలియాలో ముకర్రం ఝా మిలియన్ డాలర్ల ఆస్తులు కొనుగోలు చేశారు. వీటిలో భారీ బుల్డోజర్లు, ఒక భారీ షిప్, లాండ్మైన్లను కనిపెట్టే యంత్రాలు, ఒక బంగారు గని ఉన్నాయి.
అయితే, ఖర్చులు పెరగడంతో తన దగ్గర ఉన్న విలువైన వజ్రాలు, ఆభరణాలను స్విట్జర్లాండ్ లో విక్రయించారు. ఆ తరువాత ఆస్ట్రేలియాలో ఖర్చులు రోజు రోజుకి పెరడడంతో డబ్బు కోసం ఆయన ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అప్పులు పెరగడంతో ముకరం ఝా దివాళా తీసే స్థితికి వచ్చారు. ఆ సమయంలో భారత ప్రభుత్వం నిజాం ట్రస్టుకు చెందిన విలువైన ఆభరణాలను అమ్మడం పై ఆంక్షలు విధించింది. 1996 లో ఆస్ట్రేలియా, యూరప్‌లలోని ఆస్తులను అమ్మేయాల్సి వచ్చింది. ఆయన నౌకను అక్కడి అధికారులు జప్తు చేసారు. బుల్డోజర్లు, కార్లను వేలం వేశారు.
ఆ ఏడాది ఒకరోజు శుక్రవారం నమాజ్ కు వెళ్తున్నానని సెక్రటరికీ చెప్పి వెళ్లారు. ఆ తరువాత ఆయన ఆస్ట్రేలియాలో కనిపించలేదు. తన మీద ఉన్న కేసులకు భయపడి తుర్కియేకు వెళ్లిపోయారు. ఆయన జీవితాంతం అక్కడే ఉన్నారు. 2002 లో భారత ప్రభుత్వం నిజాం ట్రస్టు నుంచి తీసుకున్న ఆభరణాలకు 22 మిలియన్ డాలర్లు చెల్లించినప్పటికి అది మార్కెట్ విలువలో కేవలం పావు వంతు మాత్రమే చెబుతారు. 2023 ప్రారంభంలో ముకరం ఝా మరణం, తరువాత ఆయనకు హైదరాబాద్ లో అధికార లాంచనాలతో అంత్యక్రియలను నిర్వహించారు.





















ఇటీవల కాలంలో ఇలాంటి గేమ్ షోలు ఇండియాలో ఎక్కువగానే ప్రసారం అవుతున్నాయి. అనేక టీవి ఛానెల్స్ ఇలాంటి గేమ్ షోలను ప్రారంభించాయి. ఈ షోలలో పాల్గొని, గెలవడం ద్వారా డబ్బును గెలుచుకోవచ్చు. బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ 2000లో ప్రారంభించిన “కౌన్ బనేగా కరోడ్ పతి” టీవీ షోకు దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. అదే షోని తెలుగులో “మీలో ఎవరు కోటీశ్వరుడు” పేరుతో 2014 నుంచి మాటీవీలో ప్రారంభం అయ్యింది. తెలుగులో కూడా ఈ షో సక్సెస్ అయ్యింది.
తొలి 3 సీజన్లకి నాగార్జున హోస్ట్, 4వ సీజన్‌కి మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ గా చేశారు. 5 వ సీజన్‌కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా అలరించారు. అయితే ఐదో సీజన్ జెమిని టీవిలో ప్రసారం అయ్యింది. ఈ షో పేరును “ఎవరు మీలో కోటీశ్వరులు” గా మార్చారు. ఈ షోలలో ఇప్పటివరకు చాలా మంది ప్రైజ్ మనీని గెలుచుకున్నారు. అయితే ఈ షోలలో మనీని గెలుచుకున్న పోటీదారులకు మనీని నిజంగానే ఇస్తారా? ఒకవేళ ఇస్తే ఆ మనీని ఎవరు ఇస్తారనే సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది. షోలో గెలిచినవారికి వారికి ఆ షో నిర్మాత డబ్బును ఇస్తారు.
సినిమాలకు ప్రొడ్యూసర్స్ ఎలా ఇస్తారో అలాగే షోను హోస్ట్ చేసిన వ్యక్తికి, అలాగే గెలిచిన కంటెస్టెంట్ కి కూడా నిర్మాతనే డబ్బును ఇస్తారు. ఈ షో మధ్యలో వచ్చే ప్రకటనల ద్వారా నిర్మాతలకు అధిక మొత్తంలో డబ్బు వస్తుంది. ఈ షో రాత్రి పూట మాత్రమే టెలికాస్ట్ చేస్తారు. ఏ భాషలో అయినా సరే ఈ షో రాత్రి పూట వస్తుంది. అందుకు కారణం ఏంటంటే ఆ సమయంలో టిఆర్పి చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో టిఆర్పి ఎక్కువగా ఉంటే యాడ్స్ కూడా ఎక్కువగా వస్తాయి.