కార్తీకదీపం తర్వాత అదే స్లాట్ లో వస్తున్న బ్రహ్మముడి సీరియల్ పై అందరికీ అనుమానాలు ఉండేవి. కార్తీకదీపం రేంజ్ కి చేరుకుంటుందా, ఈ సీరియల్ ఎలా ఉండబోతుంది అంటూ. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ బ్రహ్మముడి సీరియల్ ఒక రేంజ్ లో దూసుకుపోతుంది. అందులో నటీనటులు సైతం తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

అందులో కావ్య పాత్ర పోషిస్తున్న దీపిక రంగరాజు అయితే తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయిపోయింది. నిజానికి ఈమె ఒక తమిళ అమ్మాయి. కానీ ఆ ఛాయలు ఎక్కడ కనిపించకపోవడంతో తెలుగు వాళ్ళందరూ వాళ్ళ ఇంటి పిల్లగానే చూస్తున్నారు. ముఖ్యంగా ఆమె చిలిపితనానికి అందరూ ఫిదా అయిపోయారు. ఏ భాష వాళ్ళైనా సరే తమకు నచ్చితే తెలుగు ఆడియన్స్ గుండెల్లో పెట్టి చూసుకుంటారనే సంగతి తెలిసిందే కదా. దీపికకి కూడా ఇదే ఫస్ట్ తెలుగు సీరియల్.

అయినా తడబడకుండా ఎంతో బాగా నటిస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాలని గెలుస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ దీపిక తన చిన్నప్పటి రెండు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాటిని చూసిన ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పటి దీపిక కి, అప్పటి దీపికకి అస్సలు పోలికలు లేవు. ఎవరూ చెప్పకపోతే అది కావ్య ఫోటో అని ఎవరు గుర్తించలేని విధంగా ఉంది ఆ ఫోటో.

అయితే అప్పటి ఫోటోలో కూడా దీపిక చాలా క్యూట్ గా బూరె బుగ్గల తో ఉంది అంటూ ఆడియన్స్ తెగ కామెంట్లు పెడుతున్నారు. అప్పుడు ఏమో గాని ఇప్పుడు మాత్రం అదిరిపోయారు అంటూ తెగ మెచ్చుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలంతా తమ పాత కొత్త ఫోటోలని షేర్ చేయటం కొత్త ట్రెండు ఆ ట్రెండ్ ని మన కావ్య పాప కూడా ఫాలో అయ్యి తన ఫోటోలని షేర్ చేసింది. ఈ మధ్యనే స్టార్ మా పరివారంలో ఉత్తమ డాటర్ అవార్డు కూడా ఈమెకే దక్కడం గమనార్హం.
https://www.instagram.com/reel/C0bxBqeRXZ2/










దీంతో నందు ఫోన్ లాగేసుకుంటాడు, ప్లీజ్ అంకుల్ నా ఫోన్ నాకు ఇచ్చేయండి అని అడుగుతుంది. తులసి ఆంటీ తో మాట్లాడాలి నువ్వు మోసగాడివి అని అరుస్తుంది.ఆ మాటతో నందు రాక్షసుడిలా మారతాడు హనీ పైకి చెయ్యి లేపుతాడు. చెంప పగిలిపోతుంది బుద్ధిగా చెప్పినట్టు విను, నన్ను రాక్షసుడును చేయకు నా కోపం నీపై కాదు, మీ తులసి ఆంటీ పై నిప్పులు కుంపటి తెచ్చి ఇంట్లో పెట్టింది. ఇల్లు తగలబడి పోతున్న పట్టించుకోవడం లేదు.


తెలుగు సీరియల్స్‌లో ప్రస్తుతం ఎక్కువ ప్రాధాన్యత కన్నడ నటీనటులకు ఇస్తున్నారనే విషయం తెలిసిందే. వారికి తెలుగులో నటిస్తే ఎక్కువగా గుర్తింపు, పాపులారిటీ లభిస్తుండడంతో కన్నడ నటీనటులు తెలుగు సీరియల్స్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలా వచ్చిన కన్నడ నటి మేఘనా లోకేష్.
శశిరేఖ పరిణయం సీరియల్ తో తెలుగువారికి పరిచయం అయ్యింది. శశి పాత్రలో నటించిన మేఘనా లోకేష్ అందం, నటన అప్పట్లో బుల్లితెర ఆడియెన్స్ ను మెప్పించింది. ఆ సీరియల్ సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యింది. ప్రస్తుతం మేఘనా పలు సీరియల్స్ లో నటిస్తూనే, జీ తెలుగుఛానెల్ ఈవెంట్లు మరియు షోలలో కూడా సందడి చేస్తోంది. బుల్లితెరపై మేఘనాకు ఒకప్పుడు ఉన్న క్రేజ్ కారణంగా సినిమాలలో నటించే అవకాశాలు కూడా వచ్చాయి. ఆమె హీరోయిన్‌గానూ నటించిది. కానీ విజయం సాధించలేదు.
మేఘనా లోకేష్ తాజాగా ఇన్ స్టా స్టోరీలో ఒక పోస్ట్ షేర్ చేసింది. అందులో మళ్లీ ఈరోజు నాకు చెడు రోజు. ఈ సంవత్సరం నన్ను ఇలా ఎందుకు బాధపెడుతోంది. ఏం అయ్యిందో అని అందరూ ఎక్కువగా ఆలోచించకండి. ప్రస్తుతం ఆ విషయాలను షేర్ చేసుకోలేను. మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను. ఇలాంటివి ఈ సంవత్సరం చాలా జరిగాయి. మీతో షేర్ చేసుకోవాలని అనిపించిందని రాసుకొచ్చారు. అయితే ఏం జరిగిందో మాత్రం చెప్పలేదు. దీంతో ఏమైందని ఆమె ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు.
పెళ్లి దుస్తులతో రెడీ అయ్యి, వచ్చిన రిషీతో జగతి ఒక విషయం చెప్పాలని పిలుస్తుంది. ఏంటమ్మా? అని అడిగిన రిషితో ‘నా తరువాత మహేంద్రకు అన్నీ నువ్వే అవ్వాలి’ అని అంటుంది. ‘మహేంద్రకు ఎల్లప్పుడు నువ్వు తోడు ఉండాలి, ఎప్పుడూ వదిలిపెట్టొద్దు. తోడు ఉండాల్సిన సమయంలో ఎప్పుడు తోడుగా లేను.
ఇక ఇప్పుడు ఉంటానో లేదో తెలియదు. మీ నాన్నకి మంచి భార్యను కాలేకపోయాను. కానీ నువ్వు మాత్రం గొప్ప కుమారుడిగా ఉండి, ఆయనను ఆనందంగా చూసుకో’ అని జగతి ఎమోషనల్ అవుతుంది. అప్పుడు రిషి తప్పక కుండా చూసుకుంటానమ్మా అని చెప్తాడు. ఆ తరువాత రిషి, వసుల వివాహం జరుగుతుంది.
ఇద్దరు దేవయాని వాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకుని, ఆ తరువాత జగతి దగ్గర ఆశీర్వాదం కోసం మోకాళ్ల మీద కూర్చుంటారు. అప్పుడు జగతి రిషీతో ‘ఇక నుండి మెషన్ ఎడ్యుకేషన్ కూడా మీ చేతుల్లోనే పెడుతున్నాను’ అని చెప్తుంది. అది విని షాక్ అయిన దేవయాని, శైలేంద్రలు కోపంతో చూస్తుంటారు. ఆ తరువాత జగతి ఇద్దరి పై అక్షింతలు వేసి, రిషి తల పై చేయి పెట్టి ఆశీర్వాదిస్తూ, అలానే కన్ను మూస్తుంది.


మొదట్లో ఆసక్తికరంగా సాగిన ఇంటింటి గృహలక్ష్మిని అభిమానించే ప్రేక్షకులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. సినియర్ హీరోయిన్ కస్తూరి ప్రధాన పాత్రలో నటించిన ఈ సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్ కూడా తెచ్చుకునేది. అయితే రాను రాను కథలో వచ్చిన మార్పులతో, కొత్త కొత్త క్యారెక్టర్లతో, సాగగదీసిన డైలాగ్స్ తో ప్రేక్షకుల సహనానికి పరిక్ష పెడుతున్న ఈ సీరియల్, ఆ మధ్యన సామ్రాట్ క్యారెక్టర్ ఎంట్రీతో ప్రేక్షకుల నుండి నెగెటివ్ రెస్పాన్స్, విమర్శలు తీవ్రంగా వచ్చాయి. దాంతో ఆ పాత్రను అర్ధాంతరంగా తొలగించారు.
అయితే ఈ సీరియల్ లో గత కొన్నిరోజులుగా ప్రసారం అవుతున్న ఎపిసోడ్ల పై ఆడియెన్స్ మండిపడుతున్నారు. సీరియల్స్ అంటే కుటుంబంలోని వారంతా కలిసి చూస్తారని, అందులో పిల్లలు కూడా ఉంటారని, అలాంటి సీరియల్స్ లో కూడా ఎక్స్ పోజింగ్ హద్దులు దాటుతోందని కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలలో, ఓటీటీల్లో వలె అడల్ట్ కంటెంట్ చూపిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రీసెంట్ గా ప్రసారం అయిన ఎపిసోడ్ లో ఒకవైపు సామ్రాట్ చనిపోయడని, దండ వేసిన సామ్రాట్ ఫొటోను చూస్తూ, తులసి భోరు భోరున ఏడుస్తూ కూర్చుంది. మరో వైపు తులసి కూతురు దివ్యను బీగ్రేడ్ సినిమాలలో చూపించారని కామెంట్స్ చేశారు. ఇలాంటి సన్నివేశాలు చూపిస్తే, ఆడవాళ్ళు, చిన్న పిల్లలతో ఫ్యామిలీ చూస్తారనే ఇంగితం కూడా లేదా అని తిడుతున్నారు.