డైలాగ్స్ లేని ఓ సినిమా కి సెన్సార్ చేయమంటే.. దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు ఏం చేసారో తెలుసా..?

డైలాగ్స్ లేని ఓ సినిమా కి సెన్సార్ చేయమంటే.. దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు ఏం చేసారో తెలుసా..?

by Anudeep

Ads

ఏ సినిమా కి అయినా సెన్సార్ సర్టిఫికెట్ తప్పనిసరి. అశ్లీలత, అధిక శాతం లో హింస వంటి కంటెంట్ ను సెన్సార్ వారు ప్రోత్సహించరు. ఇవి సమాజం పై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉన్నందున వీటిని ప్రోత్సహించరు. అయితే, సెన్సార్ వారు ఓ సినిమాను విచిత్రమైన రీసన్ తో రిజెక్ట్ చేసారు. అదేంటో తెలుసా.. సింగీతం శ్రీనివాసరావు దర్సకత్వం వహించిన “పుష్పక విమానం” సినిమా.

Video Advertisement

pushpaka 2

కేవలం ఈ సినిమా లో డైలాగ్ లు లేని కారణం గా సెన్సార్ వారు రిజెక్ట్ చేశారట. అసలు సింగీతం శ్రీనివాసరావు కు ఈ సినిమా తీయాలన్న ఆలోచన రావడానికి గల కారణం “భాగ్య చక్రం” మూవీ. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న టైం లో ఓ కమెడియన్ హీరో తో ఇక్కడ చీకటి గా ఉంది భయమేస్తోంది అని చెప్పాల్సి ఉందట. ఆ టైం లో అది డైలాగ్ లేకుండా మౌనం గా చెప్పిస్తే బాగుంటుందని ఆ సినిమా రచయిత దర్శకుడి పింగళి కి చెప్పారట. అది విన్న సింగీతం శ్రీనివాసరావ్ కు ఓ సినిమా మొత్తం ఇలానే డైలాగ్స్ లేకుండా తీయాలని అనిపించిందట.

pushpaka vimanam

చాలా సంవత్సరాల తరువాత ఆ ఆలోచనకు రూపం వచ్చి “పుష్పక విమానం” సినిమా ను తీశారు. ఈ కథ గురించి చెప్పగానే కమల్ హాసన్ కూడా ఈ సినిమా చేయడానికి అంగీకారం తెలిపారు. ఈ సినిమా హీరోయిన్ కోసం దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు నీలం కొఠారిని సంప్రదించాలనుకున్నారు. అందుకోసం ఆయన ముంబై కి వెళ్లారు. అయితే ఈ సినిమా కి మాటలు లేని కారణం గా, ఆమె ఇందులో నటించడానికి ముందు కు రాలేదు. తర్వాత, ఇండియన్ ఎక్స్ప్రెస్ వారు సింగీతం శ్రీనివాసరావు కు సన్మానం చేయాలనుకున్నారు. అందుకోసం ఈ కార్యక్రమానికి శ్రీనివాసరావు హాజరు అయ్యారు. ఈ కార్యక్రమానికి యాంకర్ గా అమల బాధ్యత తీసుకున్నారు.

pushpaka vimanam

ఈ ప్రోగ్రాం లో యాంకర్ గా చేసిన అమల ను “పుష్పక విమానం” సినిమా కి హీరోయిన్ గా తీసుకోవాలని సింగీతం శ్రీనివాసరావు భావించారు. అయితే అప్పటికి అమల ఇండస్ట్రీ కి కొత్త. అయినప్పటికీ సింగీతం శ్రీనివాసరావు ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేసారు. బెంగళూరు లో ఓ విమాననానికి పుష్పక్ అనే పేరు ఉండేది. దానితో, ఈ సినిమా పేరు ను “పుష్పక విమానం” అని అనుకున్నారు. ఇంతా చేసాక, ఈ సినిమా లో మాటలు లేని కారణం గా సెన్సార్ చేయడానికి బోర్డు వారు ఒప్పుకోలేదు. అయితే, సందర్భానుసారం గా సినిమా సీన్ల మధ్యలో రేడియో లో వస్తున్నట్లు ఓ పాటను పెట్టారు. అలా సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా 1987 లో రిలీజ్ అయింది. అప్పట్లో ఈ సినిమా మంచి టాక్ నే తెచ్చుకుంది.


End of Article

You may also like