తెలుగు స్టార్ డైరెక్టర్ సుకుమార్ సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘విరూపాక్ష’ మూవీకి స్క్రీన్ ప్లే అందించిన విషయం అందరికి తెలిసిందే. మాస్టర్ స్టోరీ టెల్లర్ గా పేరుగాంచిన సుకుమార్ యొక్క శిష్యుడు కార్తీక్ దండు చిత్రాన్ని తెరకెక్కించారు.
మూవీలో ఎక్కడ కూడా బోర్ అనిపించని విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడంలో కార్తీక్ విజయం సాధించారు. కాగా ఈ మూవీలో సుకుమార్ పెట్టుబడులు పెట్టాడని చాలా రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ విషయం పై మరో వార్త నెట్టింట్లో షికారు చేస్తోంది. అది ఏమిటో చూద్దాం..
సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21న రిలీజ్ అయ్యి హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇది సాయిధరమ్ తేజ్ కెరీర్లోనే ఎక్కువ వసూళ్లను సాధించే దిశగా వెళ్తోంది. యాక్సిడెంట్ నుండి కోలుకున్న తరువాత సుప్రీం హీరోకు మంచి కమ్ బ్యాక్ సినిమాగా నిలిచింది. అయితే ఈ చిత్రంలో సుకుమార్ ఇన్వెస్ట్ చేయలేదని, ఈ మూవీ స్క్రీన్ ప్లే పై వర్క్ చేసినందుకు గానూ ఆరు కోట్లు తీసుకున్నారని సమాచారం. అలాగే ఈ మూవీకి జరిగిన బిజినెస్ ఆధారంగాను లాభాల్లో సుకుమార్ వాటా తీసుకున్నారని తెలుస్తోంది.
ఈ చిత్రానికి ఎస్విసీసీతో పాటుగా సుకుమార్ రైటింగ్స్ కూడా నిర్మాణంలో భాగస్వామి. ఈ మూవీ స్క్రిప్ట్ కోసం సమయాన్ని వెచ్చించి మరి సుకుమార్ కీలకమైన ట్విస్ట్‌లతో స్టోరిని ఇంట్రెస్టింగ్ గా మలిచాడు. ఈ మూవీ మేకర్స్‌కు లాభాలు రావడంతో సుకుమార్ తన వర్క్ కి 6 కోట్లు తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో సోనియా సింగ్, అజయ్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ కి ‘కాంతార’ మ్యూజిక్ డైరెక్టర్ అజినీష్ లోక్‌నాథ్ సంగీతంతో పాటుగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ను అందించారు.
Also Read: 50 ఏళ్ల వయసుకి దగ్గరగా ఉన్నా…ఇప్పటివరకు “శోభన” ఎందుకు పెళ్లి చేసుకోలేదు తెలుసా.? కారణం ఆ హీరో.?

ఆ తరువాత తర్వాత దర్శకుడు నాగేశ్వరరెడ్డి డైరెక్షన్ లో ‘కాస్కో’ అనే చిత్రాన్ని చేశాడు. ఆ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత చేసిన చిత్రాలు అంతగా ఆడకపోయేసరికి తెలుగు హీరో అయిన వైభవ్ తమిళ ఇండస్ట్రీకి వెళ్ళిపోయాడు. వైభవ్ తమిళ సినిమాలలో నటించడం ప్రారంభించారు. అయితే కోలీవుడ్ లో ఆయన విజయం సాధించడానికి చాలా సమయం పట్టింది. ఈ క్రమంలో ఆయన హీరోగా నటించిన ‘మియాదామన్’ అనే చిత్రం కోలీవుడ్ లో మంచి విజయం సాధించింది.
ఎంతలా అంటే కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ‘మెర్సల్’ మూవీని కూడా అధిగమించి సూపర్ హిట్ అందుకుంది. ఆ చిత్రంతో కోలీవుడ్ లో వైభవ్ కెరీర్ హీరోగా మలుపు తిరిగింది. ఈ విజయంతో తన కుమారుడిని హీరోగా నిలబెట్ట లేకపోయానని బాధపడుతున్న కోదండరామ్ రెడ్డి సంతోషించారని చెబుతారు. ప్రస్తుతం వైభవ్ కు తెలుగులో అంతగా చెప్పుకునే చిత్రాలు లేనప్పటికీ, కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగే దిశలో సాగుతున్నాడు.
బయటకు వెళ్తున్న సమయంలో కాకి కుండలోని నీళ్లు తాగడం కనిపిస్తే వారికి త్వరలో ధనప్రాప్తి కలుగుతుందని అంటారు. అలాగే కాకి ఆహారాన్ని ముక్కుతో పట్టుకుని ఎగరడం కనిపిస్తే, శుభవార్తలు వింటారని భావిస్తారు. పగటి పూట ఉత్తరం వైపున లేదా తూర్పువైపున కాకులు అరిస్తే మంచిదని చెబుతుంటారు. కాకి ఎగిరే సమయంలో మనిషికి తాకితే శుభసూచకం అని, వారికి త్వరలో చాలా డబ్బు వస్తుందని నమ్ముతారు.
కానీ కాకి ఎగిరే సమయంలో తలకు తాకితే ఆ మనిషి శరీరం క్షీణిస్తుందని, ఆర్థికంగా నష్టాలు వస్తాయని, ఆయుష్షు తగ్గుతుందని చెప్తారు. కాకి ఎగురుతూ మనిషి పై రెట్ట వేస్తే చెడు జరుగుతుందని, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. తీవ్రమైన ఆర్థిక నష్టాలు వస్తాయని అంటున్నారు. చాలా కాకులు ఒక వైపునే కూర్చోవడం కనిపిస్తే రాబోయే రోజుల్లో ప్రమాదం రావచ్చని అర్థం. ఇంటి పై కాకులు పదే పదే అరుస్తూ ఉంటే ఆ ఫ్యామిలికి గడ్డుకాలం రాబోతుందని, అంతే కాకుండా కాకులు చావు వార్తను తెస్తాయని విశ్వసిస్తూ ఉంటారు.
Also Read:
రాజశేఖర్ ఒక రోజు జీవిత దగ్గరకు వెళ్లి మీకు నా పై ఆసక్తి చూపిస్తున్నారేమో అని అడిగారట. దాంతో రాజశేఖర్ ముక్కుసూటితనం జీవితకు బాగా నచ్చిందంట. ఇక రాజశేఖర్ ను పెళ్లికి ఒప్పించేందుకు, అలాగే రాజశేఖర్ ను పెళ్లి చేసుకోవడానికి ఎంతగానో కష్టపడినట్లు జీవిత తెలిపారు. దర్శకుడు రాఘవేంద్రరావుకు ఈ విషయం తెలిసి, రాజశేఖర్ విలన్ లా అనిపిస్తున్నాడు. అతన్ని నమ్మవద్దని, అతనితో జాగ్రత్తగా అని చెప్పారంట.
అయినా జీవిత రాజశేఖర్ ను వదలకుండా బ్రిడ్జి పై నుండి కిందకు తోసేసి, అనంతరం హాస్పటల్ లో చేర్పించి తనకు సేవలు చేసి తన తల్లిదండ్రులను ను పెళ్లికి ఒప్పించిందని రాజశేఖర్ తెలిపారు. ఇంకా జీవిత మాట్లాడుతూ వేరే అమ్మాయిని రాజశేఖర్ వివాహం చేసుకోవాలనుకున్న సమయంలో ఎంతో బాధపడ్డానని తెలిపింది. ఆ అమ్మాయి కారులో రాజశేఖర్ పక్కన కూర్చున్నప్పుడు వెనక సీట్ లో కూర్చున్న నేను చాలా బాధపడ్డానని జీవిత తెలిపింది. ఇక తాను వివాహం చేసుకోకపోయినా నాతోనే ఉంటానని చెప్పిందని, అది నచ్చిందని రాజశేఖర్ వెల్లడించారు.
Also Read:
అయితే ఆ వ్యక్తి తన భార్యలకు ఒకరి గురించి ఇంకొకరికి తెలియకుండా చూసుకున్నాడు. ఈ క్రమంలో అమెరికాలోని రాష్ట్రాలలో మాత్రమే కాకుండా పద్నాలుగు వేరే దేశాలలోని మహిళలను కూడా వివాహం చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న ప్రతిసారీ నకిలీ పత్రాలతో, పేర్లు మార్చుకుని సదరు మహిళలతో పరిచయం చేసుకునేవాడు. కొంతకాలం తరువాత ప్రపోజ్ చేయడం, వివాహం చేసుకునేవాడు. పెళ్లి చేసుకున్న కొన్ని రోజుల తరువాత దూర ప్రదేశంలో ఉద్యోగం చేస్తున్నానని, అక్కడికి వెళ్లాలని చెప్పేవాడు.
ఆ తరువాత ఆమెకు సంబంధించిన డబ్బు, నగలను, ఖరీదైన వస్తువులను తీసుకుని పారిపోయేవాడు. పోలీసులకు దొరికే దాకా ఇదే పద్ధతిని కొన్నేళ్ళ పాటు కొనసాగించాడు. ఆఖరికి 1981లో డిసెంబర్ 28న గియోవన్నీ విగ్లియోటో పోలీసులకి దొరికాడు. కోర్టు అతడు చేసిన నేరానికి ముప్పై నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించడంతో పాటుగా, 336,000 డాలర్ల జరిమానా విధించింది. 105 పెళ్లిళ్లు చేసుకుని, అంత మంది యువతులను మోసం చేసిన గియోవన్నీ విగ్లియోటో 61 ఏళ్ల వయస్సులో 1991లో మెదడులో రక్తస్రావం జరిగి, కన్నుమూశాడు.
Also Read:
క్రికెట్ పుట్టిన ఇంగ్లండ్‌లో ‘సర్’ బిరుదును స్థాపించారు. ఇంగ్లండ్ రాణి వారి రాజ్యంలో ఉండేవారిలో దేశానికి లేదా రాజ్యానికి సేవ చేసినందుకు గానూ ఈ బిరుదును ప్రధానం చేస్తారు. దీనిని నైట్‌హుడ్ అంటారు. కళలు, క్రీడలు, ప్రజాసేవలో దేశానికి చేసిన సేవకు గానూ బ్రిటిష్ రాణి ఈ గౌరవాన్ని ప్రధానం చేస్తుంది. అలా బ్రిటీష్ రాణి దేశానికి సేవ చేసిన కొందరికి ఈ నైట్‌హుడ్‌ను ప్రదానం చేసింది. అప్పటి నుండి వారి పేరు ముందు “సర్” అనే బిరుదుతో పిలుస్తారు. ఇక సర్ అనే బిరుదు కొందరికి మాత్రమే దక్కింది.
1926 నుండి బ్రిటిష్ పాలనలో నివసిస్తున్న కొందరు క్రికెటర్లకు సర్ బిరుదును ఇచ్చారు. ఆ సమయంలో అనేక దేశాలు బ్రిటిష్ పాలనలో ఉండేవి. ప్రస్తుతం ఉన్న కామన్వెల్త్ దేశాలన్నీ ఒకప్పుడు బ్రిటిష్ పాలనలో ఉండేవి. అందువల్ల ఇంగ్లండ్ దేశ సంప్రదాయం అయినా సర్ బిరుదు వేరే దేశాల క్రికెటర్లకు కూడా ప్రధానం చేశారు. ఈ బిరుదు ఇవ్వడానికి ప్రత్యేకంగా ప్రమాణాలు ఏమి లేవు. అప్పుడున్న అత్యుత్తమ క్రికెటర్లలో కొందరిని సెలెక్ట్ చేసి, వారికి అధికారికంగా సర్ బిరుదును ఇచ్చారు.
ఇక లెజెండరీ క్రికెటర్లందరికీ ఎందుకు ఇవ్వలేదు అంటే 1926 నుండి బ్రిటిష్ పాలనలో ఉన్న కొన్ని దేశాల క్రికెటర్లకు మాత్రమే ఆ బిరుదును ఇచ్చారు. ఆ కాలంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్‌లు బ్రిటిష్ పాలనలో ఉండేవి. అందువల్ల ఆ దేశ క్రికెటర్లకు ఇచ్చారు. అయితే కాలక్రమేణా, ఆ దేశాలకు స్వాతంత్రం రావడంతో కొన్ని దేశాలు ఈ బిరుదును ఇవ్వడం ఆపేశారు. కొన్ని దేశాలు మరొక బిరుదుతో దానిని భర్తీ చేశాయి. దాంతో ఇంగ్లండ్, వెస్టిండీస్ మాత్రమే తమ లెజెండరీ క్రికెటర్లకు సర్ బిరుదును ఇస్తున్నాయి.
బదులుగా, భారతదేశంలోని గొప్ప వ్యక్తులు ఇప్పుడు పద్మశ్రీ, పద్మవిభూషణ్ మరియు భారతరత్న వంటి ఇతర బిరుదులతో గౌరవించారు. సచిన్ టెండూల్కర్ ఇండియాలో జన్మించాడు, కాబట్టి అతని పేరుకు ముందు భారతరత్న సచిన్ టెండూల్కర్. ఇంగ్లండ్‌లో దేశంలో జన్మించి ఉంటే సర్ సచిన్ టెండూల్కర్ అని పిలిచేవారు. ఏ దేశంలో అయినా క్రికెటర్ రిటైర్ అయిన కొన్నేళ్ల తర్వాతనే గౌరవాలు పొందుతారు.
జడేజా విషయానికి వస్తే 2009 T20 ప్రపంచకప్‌లో అతను దారుణంగా విఫలమయ్యాడు. దాంతో క్రికెట్ ఫ్యాన్స్ అప్పట్లో ‘సర్ జడేజా’ అని ట్రోల్ చేశారు. అలా సర్ జడేజా పేరు పాపులర్ అయ్యింది. ఆ తరువాత దేశవాళీ క్రికెట్లో 2 ట్రిపుల్ సెంచరీలు చేసి జడేజా మళ్ళీ భరత్ జట్టులోకి వచ్చాడు. ఆ తరువాత జరిగిన మ్యాచ్ లలో రాణించాడు. దాంతో నెగెటివ్ సర్ కాస్తా పాజిటివ్ సర్ గా మారింది. కానీ ఇది జడేజాకు ఫ్యాన్స్ ఇచ్చింది. అధికారికంగా వచ్చినది కాదు. ఈ పేరు పాపులర్ కావడానికి మరో కారణం ధోని. అతను ఎప్పుడు ట్వీట్ చేసిన “సర్ రవీంద్ర జడేజా” అని ఉపయోగించేవాడు.
ఆమె పేరు రాశి సింగ్. ఆది సాయికుమార్, సురభి హీరోహీరోయిన్లుగా నటించిన ‘శశి’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఈ చిత్రం 2021లో విడుదల అయ్యింది. ఆమె వృత్తి రీత్యా ఎయిర్ హోస్టెస్. ఆమెకు చిన్నప్పటి నుంచి నటన పై ఉన్న ఇష్టంతో టను చేసే పనిని వదిలి ఇండస్ట్రీకి వచ్చింది. పోస్టర్, రత్నం సినిమాలలోనూ నటించింది. ఇటీవల శివ కందుకూరి హీరోగా తెరకెక్కిన ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ సినిమాలో రాశి సింగ్ హీరోయిన్ గా నటించింది.
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎవరి మీద ఆదారపడకూడదని, ఏదైనా నేర్చుకోవలనే ఉద్దేశ్యంతో ఎయిర్ హోస్టెస్ వృత్తిని ఎంచుకున్నానని తెలిపింది. ఎయిర్‌లైన్స్‌లో పని చేశానని, దాని కోసమే తాను హైదరాబాద్‌కు మారాల్సి వచ్చిందని తెలిపింది. ఆ క్రమంలో తెలుగు సినీ పరిశ్రమకు రావడం వెనుక నా ఉద్యోగం కూడా ఒక కారణం అని అన్నారు. నటిని కావాలనే తన కలను నిజం చేసుకోవడానికి ఇండస్ట్రీకి వచ్చానని తెలిపింది. అవకాశం వస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌గారి పక్కన నటించాలనేది తన కల అని అన్నారు.
రాశి సింగ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటుంది. ఆమెకు ఫాలోవర్స్ కూడా వేలల్లో ఉన్నారు. ఇక సోమవారం ఉప్పల్ స్టేడియంలో మెరిసిన ఈ బ్యూటీ గురించి తెలుసుకోవడానికి నెటిజెన్లు ఆన్లైన్ లో తెగ వెతుకుతున్నారు.
ముఖ్యంగా బిచ్చగాడు సినిమాలోని మదర్ సెటిమెంట్ అందరిని కదిలించింది. క్లాస్ మాస్ భేదం లేకుండా అన్నీ వర్గాల ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో ముందుగా తెలుగు హీరో శ్రీకాంత్ ను అనుకున్నారట. ఈ విషయన్ని శ్రీకాంత్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
శ్రీకాంత్ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలను ఇలా చెప్పుకొచ్చారు. విజయ్ ఆంటోని తాను హీరోగా నటించిన ‘మహాత్మ’ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా చేశారు. అప్పటి నుండి విజయ్ తో పరిచయం ఉందని అన్నారు. తరువాత విజయ్ తమిళంలో ‘పిచ్చైకారన్’ మూవీ చేశాడని అన్నారు. విజయ్ ఫ్రెండ్ అవడంతో బిచ్చగాడు మూవీని తమిళంలో చూసానని, ఆ మూవీ తనకు బాగా నచ్చింది.
ఆ మూవీని తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నామని తెలిపారు. ఈ మూవీ గురించి చర్చించినపుడు తనకు ఇవ్వాల్సిన పారితోషికంతో పాటు మూవీకి బడ్జెట్ అధికం అవుతుండటంతో ఈ మూవీని రీమేక్ చేయలేదని అన్నారు. లేకపోతే బిచ్చగాడు చిత్రంలో నేనే నటించేవాడినని శ్రీకాంత్ వెల్లడించారు. ఇక అధిక బడ్జెట్ కారణంగా మేకర్స్ తమిళ సినిమాని తెలుగులోకి డబ్ చేసి ‘బిచ్చగాడు’ టైటిల్ తో రిలీజ్ చేశారని శ్రీకాంత్ తెలిపారు.
సంపంగి మూవీలోని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రానికి సనా యాదిరెడ్డి డైరెక్షన్ చేశారు. ఈ చిత్రం ద్వారా దీపక్ బజ్వా తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టారు. ఈ మూవీ విజయం సాధించింది. దాంతో దీపక్ కు వరుస ఆఫర్స్ వచ్చాయి. ని తోడు కావాలి, ప్రేమలో పావని కళ్యాణ్, కనులు మూసినా నీవాయే వంటి చిత్రాలలో నటించి, తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యారు.
ఆ తరువాత హీరోగా అవకాశాలు తగ్గడంతో ‘భద్ర’ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాడు. అలా దీపక్ అరుంధతి, మిత్రుడు, కింగ్, లాంటి పెద్ద సినిమాలలో నటించారు. డిల్లీలో పుట్టి పెరిగిన దీపక్, అతని అసలు పేరు అర్జన్ బజ్వా. ఇండస్ట్రీలోకి రాకముందు మోడల్ గా గుర్తింపు పొందాడు. వివిధ ప్రకటనలో పెద్ద స్టార్స్ తో కలిసి నటించాడు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి వెళ్ళిన దీపక్ గురు, ఫ్యాషన్ సినిమాలతో పాపులర్ అయ్యాడు.
వరుస ఆఫర్లతో బాలీవుడ్ లో నటుడుగా రాణిస్తున్నారు. ఆ మధ్యన వచ్చిన దళపతి విజయ్ హీరోగా నటించిన తమిళ మూవీ బిగిల్ లో కనిపించారు. ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. దీపక్ మొదటి సినిమా ‘సంపంగి’ వచ్చి ఇప్పటికి 22 సంవత్సరాలు అవుతున్నప్పటికి అతనిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. అప్పటి లాగే ఫిట్ గా ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దీపక్ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంటాడు.
రీసెంట్ గా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మేకప్ మెన్ వాసు కొప్పిశెట్టి మాట్లాడుతూ బాలయ్య వాడే విగ్గుల గురించి చాలా విషయాలను తెలిపారు. బాలకృష్ణ గారి కోసం చెన్నైలేదా ముంబై నుండి విగ్గులను తెప్పిస్తామని, ఇప్పుడు హైదరాబాదులో చాలా రకాల విగ్గులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. అయితే బాలయ్య వాడే విగ్గులు చాలా ఖరీదు ఉంటాయని అన్నారు. బాలయ్య నాసిరకంగా ఉండే విగ్గులను అసలు వాడరని వెల్లడించారు. అందువల్ల బాలకృష్ణ ఉపయోగించే విగ్గుల కోసం లక్షల్లో ఖర్చు పెడతామని వాసు తెలిపారు.
అంతే కాకుండా సినిమా సినిమాకి బాలయ్య నటించే పాత్రను బట్టి, సన్నివేశాలను బట్టి విగ్గులు మార్చాల్సి వస్తుందని కాబట్టి వాటి కోసం అయ్యే ఖర్చును కూడా ప్రొడ్యూసర్స్ భరిస్తారని తెలియచేసారు. కాగా, బాలకృష్ణ చిత్రాలలో విగ్ సెంటిమెంట్ ఉంటుందనే టాక్ కూడా ఉంది. బాలయ్య విగ్గు సెట్ అయితే ఆ మూవీ హిట్ అనే సెంటిమెంట్ పై ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి.
ఈ సెంటిమెంట్ గురించి మేకప్ మెన్ వాసు కొప్పిశెట్టి మాట్లాడుతూ బాలయ్య గారు అలాంటి వాటిని నమ్మరని, బాలయ్యకు విగ్గు సెట్ అయితే మాత్రం ఆ చిత్రంలో చూడటానికి బాగా కనిపిస్తారని చెప్పారు. అందు వల్లనే ఆ చిత్రాలు హిట్ అవుతాయనీ వెల్లడించారు. వాసు కొప్పిశెట్టి బాలయ్య విగ్గుల గురించి చెప్పిన ఈ విషయలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.