సాధారణంగా ప్రతి ఇంటిలోను ఫ్యాన్ ఉంటుంది. ఇక ఎండకాలంలో కూలర్, ఏసీ లాంటివి కొనుగోలు చేయలేనివారు ఫ్యాన్‌తోనే సరిపెట్టుకుంటారు. ఆ క్రమంలో ఫ్యాన్ ఎక్కువ రోజులు ఆన్‌లో ఉండటంతో ఫ్యాన్ వేగం తగ్గడం జరుగుతుంది. ఇది కూడా సాధారణంగా ఎదురయ్యే సమస్యే. ఇక సమ్మర్ లో ఫ్యాన్ వేగంగా తిరగకపోతే అదొక పెద్ద సమస్య అని చెప్పవచ్చు.
ఫ్యాన్ స్పీడ్ ను 5 నంబర్ లో పెట్టినప్పటికి 1 నంబర్ లో ఉన్నట్లే తిరుగుతుంది. ఈ సమస్య వల్ల వేసవి కాలంలో సరిపడా గాలి రాదు. ఇలా కావడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. ఫ్యాన్ బ్లేడ్లకు బాగా దుమ్ము పట్టి ఉండటం కూడా స్పీడ్ తగ్గడానికి కారణం కావచ్చు. దుమ్ము కూడా ఫ్యాన్ నుండి వచ్చే గాలి ప్రసరణను ప్రభావితం చేస్తుంది.
ఫ్యాన్ బ్లేడ్లను శుభ్రం చేసేముందు స్విచ్ ఆఫ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఫ్యాన్ ఆఫ్ అయిన తర్వాత, ముందుగా పొడి గుడ్డతో ఫ్యాన్ బ్లేడ్లను శుభ్రం చేసి, ఆ తరువాత తడి గుడ్డతో శుభ్రపరచాలి.
ఇలా చేసిన తరువాత పని చేయనట్లైతే, ఫ్యాన్ వేగాన్ని పెంచడం కోసం కెపాసిటర్‌ను మార్చవచ్చు. కెపాసిటర్ సాధారణంగా 70 నుండి 80 రూపాయల మధ్య ఉంటుంది. కెపాసిటర్ ను ఈ-కామర్స్ వెబ్ సైట్లలో కొనుగోలు చేయవచ్చు. అలాగే ఎలక్ట్రిక్ షాప్ లో కూడా లభిస్తుంది.
ఇక కెపాసిటర్ని మార్చడం అనేది కష్టమైన విషయం కాదు. మీరే మార్చవచ్చు. కెపాసిటర్ ఫ్యాన్ మోటర్ మీద ఉంటుంది. ఇక పాత కెపాసిటర్‌ను తొలగించేముందు దానికి ఉన్న వైర్లు ఎలా ఉన్నాయో గమనించాలి. ఆ తరువాత సరిగ్గా అలాగే కొత్త కెపాసిటర్‌ను సెట్ చేయాలి. ఆ తరువాత ఫ్యాన్ ఆన్ చేసి, వేగంగా తిరగడాన్ని గమనించవచ్చు.
Also Read: “లావుగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు ఎందుకు ఇష్టపడరు..?” అని ఒక అమ్మాయి అడిగిన ప్రశ్నకి… ఆ అబ్బాయి చెప్పిన సమాధానం వింటే షాక్ అవ్వాల్సిందే..!

టాప్ డైరక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘దొంగ దొంగ’ చిత్రంతో హీరాకు గుర్తింపు లభించింది. హీరా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీలో కూడా నటించి ఆకట్టుకుంది. ఆమె అన్ని భాషల్లో కలిపి దాదాపు యాబైకి పైగా చిత్రాలలో నటించింది. కమల్ హాసన్, మోహన్‌లాల్, అజిత్, ప్రశాంత్ లాంటి అగ్ర హీరోల పక్కన హీరోయిన్ గా నటించింది. అయితే హీరా హఠాత్తుగా సినిపరిశ్రమకి దూరమైంది.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, హీరా ప్రేమించుకున్నారని, కానీ ఆ ప్రేమ వివాహం దాకా వెళ్లలేదనే ప్రచారాలు అప్పట్లో బాగా వినిపించాయి. అందువల్లనే హీరా ఇండస్ట్రీకి దూరం అయ్యిందని టాక్. అమెరికాకు వెళ్లి, అక్కడే సెటిల్ అయ్యిందంట. అయితే హీరో అజిత్‌తో లవ్ ఫెల్యూర్ అవడంతో ఇప్పటికీ ఆమె సింగిల్‌గానే ఉందని సమాచారం. సామాజిక మధ్యమాలలో కూడా హీరాకు ఖాతా లేదు.
Also Read:
చత్రిపతి శేఖర్ జక్కన్న తొలి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 నుండి సింహాద్రి, చత్రపతి, సై, విక్రమార్కుడు, మర్యాద రామన్న, మగధీర, ఈగ, ఆర్ఆర్ఆర్ సినిమాలలో నటించాడు. ఇప్పటి దాకా రాజమౌళి 12 సినిమాలను తీయగా శేఖర్ 9 చిత్రాల్లో ఉన్నాడు. ప్రభాస్ హీరోగా వచ్చిన చత్రపతి చిత్రంలో శేఖర్ ప్రభాస్ ఫ్రెండ్ గా నటించి గుర్తింపు పొందాడు. అప్పటి నుండి ఈ సినిమా పేరే నుంచి ఆయన పేరుగా మారి చత్రపతి శేఖర్‌గా పాపులర్ అయ్యాడు.
కాగా జక్కన్న చిత్రాలలో శేఖర్ ఎక్కువగా నటించడానికి కూడా ఒక రీజన్ ఉందంట. రాజమౌళి మొదటిసారి డైరెక్షన్ చేసిన శాంతి నివాసం సీరియల్ టైమ్ లో శేఖర్‌తో పరిచయం ఏర్పడిందంట. అదే స్నేహంగా మారినదంట. అయితే శేఖర్ రాజమౌళిని ఎప్పుడు కూడా ఛాన్స్ ఇవ్వమని అడగలేదట. అయితే తనకు నటుడిగా సపోర్ట్ చేయాలని జక్కన్న తన చిత్రాలలో ఛాన్స్ ఇస్తుంటారని శేఖర్ ఒక సందర్భంలో తెలిపారు.
సినిమా ప్రారంభించిన తరువాత రాజమౌళి పిలుస్తాడని, అప్పటి దాకా ఆ మూవీ ఏమిటి, అందులో తన క్యారెక్టర్ ఏమిటనేది తనకు తెలియదని చెప్పారు. మొదటి సీరియల్ సమయంలో ఏర్పడిన పరిచయం, స్నేహానికి అంతగా ఇచ్చే విలువ గురించి తెలిసి నెటిజన్స్ రాజమౌళికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
Also Read:
ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్,సీనియర్ హీరోయిన్స్ మధుబాల, గౌతమి, అనన్య నాగళ్ల, సచిన్ ఖేడ్కర్, కబీర్ బేడీ, వర్షిణీ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె ‘అల్లు అర్హ’ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ప్రీమియర్ షోలు కూడా వేశారు. ఈ మూవీ ప్రీమియర్ చూసిన ఆడియెన్స్ సమంత శకుంతలగా చాలా నాచురల్ గా నటించిందని మెచ్చుకుంటున్నారు.
అయితే సోషల్ మీడియాలో కొందరు శకుంతలగా సమంత కన్నా, అలనాటి హీరోయిన్ జయప్రద బాగా నటించిందని, నిజంగా శకుంతల అంటే ఆమెలా ఉండాలని కామెంట్స్, పొస్ట్ పెడుతున్నారు. హీరోయిన్ జయప్రద ‘కవిరత్న కాళిదాసు’ అనే కన్నడ సినిమాలో శకుంతలగా నటించింది. దుష్యంతుడి పాత్రలో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ నటించారు. ఆ సినిమాకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘శాకుంతలం’ సినిమాలో నటించిన సమంతతో పొలుస్తున్నారు.
ఈ మూవీ చూసిన చాలామంది ఆడియెన్స్ ఈ సినిమా ‘ఆరెంజ్’ అనే టైటిల్ ఎందుకు పెట్టారనేది అర్థం కావడం లేదని కామెంట్ చేశారు. ఈ సినిమాకి ఆ పేరు ఎందుకు పెట్టారనే విషయం ఎవరికి తెలియదు. తాజాగా ఈ మూవీ దర్శకుడు భాస్కర్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో టైటిల్ పెట్టడం వెనుక ఉన్న కారణం ఇలా చెప్పుకొచ్చారు. “చిత్రం థీమ్ ప్రకారం మూవీ టైటిల్‌ను సెలెక్ట్ చేశాను. ప్రేమ అనేది కొన్ని రోజుల తర్వాత తగ్గుతుంది. అప్పుడు వేరొక వ్యక్తిని లవ్ చేయమని చెప్పడమే ఆరెెంజ్ మూవీ థీమ్. ఒకరి పట్ల ప్రేమ అనేది ఎల్లపుడూ ఒకేలా ఉండదు.
ఆ బంధంలో అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి. వీటినే సూర్యోదయం మరియు సూర్యాస్తమయంతో పోల్చాం. సూర్యూడు సన్ రైజ్, సన్ సెట్ లలో ఆరెంజ్ రంగులో కనిపిస్తాడు. సన్ రైజ్ ప్రేమ మొదలవడాన్ని సూచిస్తుంది. ఆ సమయంలో సూర్యూడు ప్రకాశవంతంగా ఉంటాడు. అలానే సన్ సెట్ లవ్ ముగింపుకు సూచన. అందువల్ల మా సినిమాకి ‘ఆరెంజ్’ అనే టైటిల్ పెట్టాం. మూవీ యూనిట్ అంతా టైటిల్ ఓకే చెప్పారు.” అని బొమ్మరిల్లు భాస్కర్ వెల్లడించారు.
ఈ సినిమాని అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగబాబు నిర్మించారు. ఈ మూవీలో హీరోయిన్ గా జెనీలియా నటించింది. ఒక మంచి ప్రేమ కథగా పేరు తెచ్చుకున్నా అప్పటి ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. కానీ ఇప్పటి జనరేషన్‌కు మాత్రం ఈ మూవీ చాలా కనెక్ట్ అయింది. మొదటిసారి రిలీజ్ అయినపుడు డిజాస్టర్ అనిపించుకున్న ఈ చిత్రం అందరు ఆశ్చర్యపోయేలా రీరిలీజ్‌లో హిట్ అయ్యింది. ఇప్పటి వరకు టాలీవుడ్ లో రీరిలీజ్ సినిమాలలో ఆల్ టైమ్ రికార్డ్ గా నిలిచింది.
జల్లికట్టు సినిమా 93వ అకాడెమీ అవార్డుల రేసులో నిలిచింది. చివరి రౌండ్ కు అర్హత సాధించలేకపోయింది. 2021 ఆస్కార్ కోసం మొత్తం 27 చిత్రాలు పోటీపడగా, మలయాళ సినిమా ‘జల్లికట్టు’ను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసింది. మలయాళ ఇండస్ట్రీ నుండి ఆస్కార్ కు వెళ్ళిన మూడవ సినిమాగా నిలిచింది.
సినిమా అనగానే ముందుగా అడిగే ప్రశ్న అందులో హీరో ఎవరు అనే. దాదాపుగా ప్రతి సినిమాలోనూ హీరోదే ప్రధాన పాత్రగా ఉంటుంది. ఆ హీరో పేరుతోనే సినిమాని జనాల్లోకి తీసుకెళ్తుంటారు. కానీ ‘జల్లికట్టు’ సినిమాలో హీరో అనే పాత్ర లేదు. హీరోని పెట్టకుండా సినిమాని తీయడానికి ఎంతో ధైర్యం కావాలి. దర్శకుడు ఈ విషయంలో సక్సెస్ అయ్యాడు.
2019లో విడుదలైన ఈ సినిమా భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్ర కథ గురించి చెప్పాలంటే కసాయి కొట్టు నుండి తప్పించుకున్న ఒక దున్నపోతు ఊర్లో ఎంతటి వినాశనం సృష్టించిందనేది స్టోరి. ఇక ఈ మూవీ అంతా దున్నపోతు చుట్టూ తిరిగుతుంది. కానీ ఈ సినిమాలో దున్నపోతును ఉపయోగించలేదు. చిత్రయూనిట్ యానిమేట్రానిక్స్ టెక్నిక్ ద్వారా దున్నపోతును చూపించారంట. ఇలా ఒక్కో దున్నపోతుకు దాదాపు 20 లక్షలు ఖర్చు అయ్యినట్టు తెలుస్తోంది.
‘జల్లికట్టు’ అనేది కసాయి నుండి తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఒక దున్నపోతు ఉత్కంఠగా పరిగెత్తే కథను చెప్పే సినిమా. దున్నపోతును పట్టుకోవడానికి మనుషులు వెంట పడటం చూస్తే ఆదిమ మానవుల నాటి పశు ప్రవృత్తి మనిషి జీన్స్ లో ఇంకా ఉందని, అవకాశం వచ్చినప్పుడు అది బయిటకు వస్తుందని అర్దమవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
1.ధోని:
2.అమిత్ మిశ్రా :
3.దినేష్ కార్తీక్ :
4.ఇషాంత్ శర్మ :
5.అంబటి రాయుడు :
దానివల్ల ఇదే అంబటి రాయుడు ఆఖరి ఐపీఎల్ సీజన్ అని అందరు భావిస్తున్నారని చెప్పవచ్చు.
జాబ్ చేస్తూ చదువుకుంటూ, ఇప్పుడిప్పుడే తన ఫ్యామిలికి అండగా ఉంటున్నాడు. అతను ఇపుడు చివరి సెమిస్టర్ చదువుతున్నాడు. ఇంకో 10 రోజుల్లో సాయేశ్ ఎమ్మెస్ పూర్తి అవబోతుంది. ఈనేపథ్యంలో అతను ఇంటికి వెళ్ళడానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నాడు. కానీ బుధవారం అర్దరాత్రి 12.50 గంటలకు గ్యాస్ స్టేషన్లో అతను విధులు నిర్వహిస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు సాయేశ్ పై కాల్పులు జరిపి అతని దగ్గర ఉన్న డబ్బును ఎత్తుకెళ్లారు. తీవ్రంగా గాయపడిన సాయేశ్ ను సిబ్బంది ఓస్థానిక ఆసుపత్రికి తరలించారు.
సాయేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతు కన్నుమూశాడు. త్వరలోనే ఇంటికి వస్తా అని చెప్పిన సాయేశ్, అంతలోనే కన్నుమూయడంతో ఆ ఫ్యామిలిలో విషాదం నెలకొన్నది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వీరా సాయేశ్ హెచ్-1బీ వీసాను కూడా తీసుకున్నాడు. అతను అందరితో చాలా కలివిడిగా ఉండేవాడని, ఎవరైనా అడిగితే లేదనకుండా సాయం చేసేవాడని అతని స్నేహితులు వెల్లడించారు. కాగా పోలీసులు కాల్పులు జరిపిన నిందితుల ఫొటోలను విడుదల చేశారు.
అతని స్నేహితులలో ఒకరు మాట్లాడుతూ అంత్యక్రియల కోసం సాయేశ్ మృతదేహాన్ని ఇండియాకి పంపుతున్నామని, దాని కోసం ఆర్ధిక సహాయం అవసరం అని చెప్పారు. డబ్బును సేకరించడం కోసం వారు GoFundMe ని క్రియేట్ చేశారు. వారు మాట్లాడుతూ ”డబ్బు సాయేశ్ ని తిరిగి తీసుకురాదని, కానీ అతని కుటుంబం కోసం మేము చేయగలిగేది ఇదే ” అని తెలిపారు.
క్రికెట్ లీగ్స్ లో ప్రపంచంలోనే అత్యంత ధనిక లీగ్ అంటే ఐపీఎల్. అయితే పైకి కనిపిస్తుందంతా కూడా నాణేనికి ఒకవైపే అని చెప్పవచ్చు. మరోవైపు డిని వెనుకళా అనేక చీకటి కోణాలు కూడా ఉన్నాయి. అవే బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్, మద్యం, డ్రగ్స్ వంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా కనపడతాయి. కానీ ఐపీఎల్ మెరుపుల మధ్య ఇలాంటివి బయటకు కనిపించవు. అయితే ఆ చీకటి కోణాల గురించి ఇప్పుడు చూద్దాం..
ఫిక్సింగ్:
శ్రీశాంత్ అప్పటికి భారత జట్టులో కీలక ఆటగాడుగా ఉన్నాడు. అంతేకాక ఇండియా గెలిచిన టీ20 మరియు వన్డే ప్రపంచ కప్ జట్లలో శ్రీశాంత్ మెంబర్ గా ఉన్నాడు.అటువంటి ఆటగాడు ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడంటే యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. ఇక ఈ వివాదంలో ఏం ఎస్ ధోని పేరు వినిపించింది. దాంతో రాజస్థాన్, చెన్నై జట్ల పై 2 సంవత్సరాల పాటు నిషేధం విధించారు. ఆ ముగ్గురు క్రికెటర్ల పై జీవితకాల నిషేధం వేశారు.ఆ తర్వాత నిషేధం తొలగించారు.
పార్టీలు:
బ్లాక్‌మనీ:
ఛీర్ లీడర్స్ లైఫ్:
వాస్తవానికి ఐపీఎల్‌ను మొదలు పెడుతున్నది ఇండియాలోని యువ ఆటగాళ్లను ప్రొత్సహించడానికి, మట్టిలో ఉన్న మాణిక్యాలను బయటకు తీయడానికి అని బీసీసీఐ తెలిపింది. కానీ ఇది డబ్బుతో ముడిపడిన లీగ్ అని కొన్ని రోజుల్లోనే అందరికీ అర్ధం అయ్యింది. ఒకరిద్దరూ ప్లేయర్స్ ఐపీఎల్ ద్వారా బయటకు వచ్చినప్పటికి, ఈ లీగ్ ప్రధాన ఉద్దేశం అయితే డబ్బే అని సగటు క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు క్రికెట్ నిపుణులు కూడా భావిస్తున్నారు.
దర్శి గ్రామంలో పిఆర్ డిపార్ట్మెంట్ లో సూరె వెంకటరామిరెడ్డి సీనియర్ సహాయకుడిగా పని చేస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ఆయన అనారోగ్య బారిన పడడంతో, వైద్య పరీక్షలు చేయగా కాలేయ వ్యాధి ఉన్నట్లు తెలిసింది. ఆ వ్యాధితో బాధ పడుతున్న ఆయన చికిత్స చేయించుకోవడం కోసం హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పటల్ లో చేరారు. అక్కడ వైద్యులు టెస్ట్ చేసి, తప్పనిసరిగా కాలేయ మార్పిడి చేయాలని వెంకటరామిరెడ్డి ఫ్యామిలీకి చెప్పారు.
వెంకటరామిరెడ్డి కుమార్తె హర్షిత తన తండ్రి వ్యాధితో బాధపడుతుండటం చూడలేక డాక్టర్లను ట్రీట్మెంట్ గురించి సంప్రదించారు. వెంకటరామిరెడ్డి కుమార్తె హర్షిత తన తండ్రి ఆ వ్యాధితో బాధపడుతుండటం చూడలేక డాక్టర్లను ట్రీట్మెంట్ గురించి సంప్రదించారు. వైద్యులు కాలేయ మార్పిడి గురించి చెప్పగానే తన కాలేయంలోని కొంత భాగాన్ని ఇవ్వడానికి ఆమె ముందుకొచ్చింది. దాని కోసం భర్త ప్రకాశ్ రెడ్డిని కూడా ఒప్పించింది.
హర్షిత కోరిక మేరకు, ప్రకాశ్ రెడ్డి కూడా కాలేయ మార్పిడికి ఒప్పుకున్నాడు. దాంతో హర్షిత వెంకటరామిరెడ్డికి తన కాలేయంలోని కొంత భాగాన్ని ఇచ్చింది. కాలేయ మార్పిడిని డాక్టర్లు విజయవంతంగా పూర్తి చేశారు. దాంతో వెంకటరామిరెడ్డి ఆరోగ్యవంతుడిగా మారారు. తన తండ్రిని కాపాడడం కోసం కాలేయ దానం చేసిన హర్షిత పై ప్రశంసలు, అభినదనలు వెల్లువెత్తాయి.