బలమైన కథ, గ్రాండ్ విజువల్స్, భారీ హంగులతో సినిమాను రూపొందిస్తే భాష, ప్రాంతాలతో సంబంధం లేకుండా దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులంతా ఆదరిస్తారని ‘బాహుబలి’తో రుజువైంది. ఈ సినిమాతో ఎస్.ఎస్.రాజమౌళి పాన్ ఇండియా లెవెల్లో సూపర్ సక్సెస్ కావడంతో చాలా మంది ఫిల్మ్ మేకర్స్‌కి తమ కలల ప్రాజెక్ట్‌లు తెరకెక్కించడానికి ధైర్యం వచ్చింది.
అలాంటి ఒక ధైర్యంతోనే దిగ్గజ దర్శకుడు మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ నవలను వెండితెరపై ఆవిష్కరించాలని నిర్ణయించుకున్నారు. కల్కి కృష్ణమూర్తి రచించిన ‘పొన్నియన్ సెల్వన్’ అనే నవలను తెరకెక్కించాలని 4 దశాబ్దాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. దీనిని రెండు భాగాలుగా తెరకెక్కించాలని భావించిన మణిరత్నం.. మొదటి భాగం ‘పొన్నియిన్ సెల్వన్: 1’ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

తమిళ్ తో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళంలో ఈ సినిమాను ఏక కాలంలో సెప్టెంబర్ 30ని ఈరోజు విడుదల చేశారు. విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ, జయరామ్, ప్రభు, పార్తిబన్, ప్రకాష్ రాజ్ వంటి భారీ తారాగణం నటించిన ఈ మూవీకి మొదటి షో నుండే మిశ్రమ స్పందన వచ్చింది.

ఇక ఇది ఇలా ఉంటే ఈ చిత్రంలో విక్రమ్ కూడా అద్భుతంగా నటించారు. విక్రమ్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలు చేసి విక్రమ్ మంచి నటుడనిపించుకున్నారు. పైగా నటనంటే చాలా ఇష్టం విక్రమ్ కి. అందుకే భిన్నంగా ఉండే పాత్రలను ఎంచుకుంటూ ఉంటారు. విక్రమ్ తమిళంలో టాప్ హీరోలలో ఒకరు. ప్రేక్షకులు ఈయన నుండి ఏం కోరుకుంటారో అటువంటి పాత్రలనే అతను చేస్తారట. సెట్స్ లో కూడా విక్రమ్ చాలా సరదాగా ఉంటారు.

తెలుగులో వచ్చిన నాన్న చిత్రంలో కూడా విక్రమ్ ఎంతో అద్భుతంగా నటించారు. అయితే ‘నాన్న’ చిత్రం మీకు గుర్తుందా..? అందులో ఒక చిన్న పాప విక్రమ్ కి కూతురు గా నటిస్తుంది. అయితే ఆ పిల్ల ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ సినిమాలో విక్రమ్ కి క్రష్ పాత్ర చేసింది. ఐశ్వర్యా రాయ్ చిన్నప్పటి పాత్ర ఈ అమ్మాయి చేసింది. ఇలా ఆమె నటించడంతో సోషల్ మీడియాలో పెద్దఎత్తున మీమ్స్ వస్తున్నాయి. అప్పుడు విక్రమ్ కి కూతురుగా నటించిన ఈ చిన్నారి ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ సినిమాలో క్రష్ గా నటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.



గత వారం యోగి మూవీని రీరిలీజ్ చేశారు. థియేటర్లు ఈ మూవీలోని ‘ఓరోరి యోగి’ పాటకు ఓ రేంజ్ లో ఊగిపోయాయి. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో ఈ ట్యూన్ ఒరిజినల్ కన్నడ పాట కూడా నెట్టింట్లో ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చింది. దాంతో తెలుగు సాంగ్ నే ఒరిజినల్ సాంగ్ అని అనుకున్నారు. తెలుగు పాటను కన్నడ సినిమా వాళ్ళు కాపీ చేశారనుకున్నారు.
అయితే ఆ సాంగ్ కన్నడలోనే ముందుగా వచ్చింది. కన్నడలో స్టార్ హీరో శివ రాజ్ కుమార్ హీరోగా నటించిన ‘జోగి’ మూవీ 2005 లో రిలీజ్ అయ్యి, బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ సినిమాలోని లవ్ సాంగ్ ట్యూన్‌నే తెలుగువాళ్ళు కాపీ చేశారు. కన్నడలో మూవీలో హీరోహీరోయిన్ల మధ్య వచ్చిన మంచి లవ్ సాంగ్ ను తెలుగులో ఐటం సాంగ్‌గా తెరకెక్కించారు.
ఇంత మంచి సాంగ్ ను ఐటం సాంగ్‌గా మార్చారు కదరా? అని నెటిజెన్లు ఈ పాట పై ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై మీమ్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. కన్నడ ఒరిజినల్ పాట ప్రస్తుతం తెలుగు పాట కన్నా ఎక్కువగానెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. అంతటా కన్నడ సాంగ్ నే వినిపిస్తోంది. ఈ సాంగ్ పై తీసిన రీల్స్, షార్ట్స్ తో కన్నడ పాట ట్రెండింగ్ లోకి వచ్చింది.

చంద్రయాన్-3 వల్ల ఇండియాకి కలిగే మరిన్ని ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..చంద్రయాన్ 3 సుమారు 41 రోజుల పాటు భూమి నుండి చంద్రుడి వైపు ప్రయాణించి ల్యాండర్ మాడ్యూల్ ‘విక్రమ్’ ఆగస్టు 23 సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లి పై అడుగుపెట్టింది. చందమామ పై అడుగిడాలనే భారత్ ఎన్నో ఏళ్ల కల సాకారం అయ్యింది. చంద్రయాన్-3 వల్ల దేశానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.



మహేష్ బాబు హీరోగా నటించిన ‘ఒక్కడు’ మూవీ 2003లో సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 15న రిలీజ్ అయ్యి, ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మహేష్ కి మాస్ ఇమేజ్ వచ్చింది ఈ చిత్రంతోనే అనవచ్చు. ఈ చిత్రంలో హీరోయిన్ గా భూమిక చావ్లా నటించగా, విలన్ గా ప్రకాశ్ రాజ్ నటించి, మెప్పించారు.
అయితే ఈ మూవీ హిట్ అవడానికి కారణం స్క్రీన్ ప్లేలో చేసిన మార్పులే అని తెలుస్తోంది. దర్శకుడు గుణశేఖర్ ముందుగా అనుకున్న స్టోరీ ప్రకారంగా, కొండారెడ్డి బురుజు దగ్గర హీరో విలన్ ఓబుల్ రెడ్డిని కొట్టే సన్నివేశమే హీరో ఇంట్రడక్షన్ సీన్ గా రావాలి. ఆ సీన్ తర్వాత స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుందట. అయితే ఈ కథ విన్న రచయిత పరుచూరి గోపాలకృష్ణ ముందుగా ఆ సన్నివేశం పెట్టడం సరి కాదని అన్నారంట.
సినిమా మొదట్లోనే అలాంటి పవర్ ఫుల్ సన్నివేశం పెట్టవద్దని గుణశేఖర్ కు సూచించారంట. దాంతో దర్శకుడు గుణశేఖర్ పరుచూరి గోపాలకృష్ణ చేసిన సూచనల ఆధారంగా కథలో కీలకమైన మార్పులు చేసి, ఇప్పుడు మనం చూస్తున్న సినిమాగా తెరకెక్కించారని తెలుస్తోంది. ఆ మార్పుల వల్లే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందట.
దక్షిణాది హీరోయిన్లలో నయనతార లేడి సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. వ్యక్తిగత విషయంలోనూ, సినిమాల విషయంలోనూ ఆమె ఎప్పుడూ తనదైన శైలిలో ముందుకు వెళ్తుంది. ఆమెకు సంబంధించిన విషయం ఏదైనా క్షణాల్లో వైరల్ గా మారుతుంది. అత్యధిక రెన్యుమరేషన్ అందుకుంటున్న హీరోయిన్ గా రికార్డు సృష్టించారు. గత ఏడాది దర్శకుడు విగ్నేష్ శివన్ పెళ్లి చేసుకుని వైవాహిక జీవితం ప్రారంభించిన విషయం తెలిసిందే. సరోగసి ద్వారా కవలలకు తల్లిదండ్రులు అయ్యారు.
ప్రస్తుతం నయనతార బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న జవాన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. ఇది ఇలా ఉంటే నయనతార గతంలో నటించిన ఒక ప్రకటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఈ యాడ్ లో ఆమె గుర్తుపట్టలేనట్టుగా ఉంది. ఆమె కాలేజీలో చదువుతున్న సమయంలో మోడల్‌గా పార్ట్ టైమ్ జాబ్ చేసింది. అలా నయనతార నటించిన ప్రకటనలలో కొన్నింటిని చూసిన దర్శకుడు సత్యన్ అంతిక్కడ్ తాను తీయబోయే మనస్సినక్కరే సినిమాలో కీలక పాత్రకోసం ఆమెను సంప్రదించాడు.
మొదట్లో నయనతార ఆఫర్‌ను రిజెక్ట్ చేసినప్పటికీ, ఆ తరువాత దర్శకుడు వదలకుండా ప్రయత్నించడంతో చివరికి ఆమె అంగీకరించింది. అలా నయనతార 2003లో మలయాళ సినిమా ‘మనస్సినక్కరే’ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ మూవీ హిట్ అవడం, వరుస అవకాశాలు రావడంతో సినిమాలలో నటిస్తూ టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఆమె కాలేజీ రోజుల్లో నటించిన యాడ్ ప్రస్తుతం నెట్టింట్లో షికారు చేస్తోంది.
చంద్రయాన్-3 విజయవంతం అయిన నేపథ్యంలో చంద్రుని పై భూమిని కొనుగోలు చేసే విషయం హాట్ టాపిక్ గా మారింది. ‘లూనార్ రిజిస్ట్రీ’ అనే వెబ్సైట్ ద్వారా చంద్రుని మీద భూమిని కొనుగోలు చేయవచ్చని అంటున్నారు. లూనార్ రిజిస్ట్రీ అధికారిక వెబ్సైట్ కు వెళ్ళి, అక్కడ వారు భూమిని కొనుగోలు చేయాలనుకుంటున్న ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చని తెలుస్తోంది.
కొందరు సినీ ప్రముఖులకు చందమామ పై ఇప్పటికే భూమి ఉందని తెలుస్తోంది. బాలీవుడ్ టాప్ హీరో షారూఖ్ ఖాన్ 52వ పుట్టినరోజు సందర్భంగా ఆస్ట్రేలియాలోని ఒక అభిమాని చంద్రుని పై భూమిని బహుమతిగా ఇచ్చాడని కొన్నాళ్ల క్రితం షారూఖ్ స్వయంగా వెల్లడించాడు. దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఖగోళ శాస్త్రం పై ఉన్న ఆసక్తితో చంద్రుని పై భూమిని కొనుగోలు చేశాడు. సుశాంత్ కొనుగోలు చేసిన ప్రాంతాన్ని మేర్ ముస్కోవియన్స్ లేదా సీ ఆఫ్ ముస్కోవి అని పిలుస్తారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చంద్రుడిపై 55 లక్షల విలువైన భూమిని కొనుగోలు చేసారట.
గోదావరిఖనికి చెందిన సింగరేణి ఉద్యోగి కుమార్తె సాయి విజ్ఞత ప్రస్తుతం అమెరికాలో జాబ్ చేస్తోంది. తన తల్లికి గిఫ్ట్ గా చంద్రుడిపై భూమిని ఆమె తల్లి వకుళాదేవి పేరుతో లూనార్ రిజిస్ట్రేషన్ ద్వారా 2022లో అప్లై చేసింది. అది సరిగ్గా ఆగస్టు 23న అంటే చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన రోజు వకుళాదేవి మరియు ఆమె మనువరాలు పేర్ల పై జాబిల్లి పై ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ అయ్యింది. చందమామ పై ఎకరానికి దాదాపు 35 లక్షల రూపాయలకు పైగా రేటు పలుకుతున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఏపీ మాజీ సీఐడీ ఛీఫ్
ఇలాంటి వాటికి కదా ఉత్తమ చిత్రాలనే పేరు పడింది. సిన్న తల్లులూ న్యాయం కోసం పోరాడండి అని చెప్పే ప్రమాదకర సందేశాన్ని అంగీకరిస్తారని ఎలా అనుకున్నారు ? మత్తులో ముంచే ప్రశ్న అనేదే తల ఎత్తనీయని, మనలను భయ పెట్టేవే బహు మంచి సినిమాలు మరి మన సినిమాలకు అవార్డ్ రావాలంటే?” అంటూ రాసుకొచ్చాడు. ఆ తరువాత మరో పోస్ట్ లో ” జై భీం కి అవార్డ్ ఇవ్వకూడదు అన్నది ఒక కాన్షియస్ డెసిషన్, మీరందరూ మరచిపోయినట్టున్నారు.
గత సంవత్సరం కూడా దళిత వాదం వైపు నిలబడ్డ, దళిత పౌరషం, రోషం చూపించిన పలాస సినిమాకి అవార్డ్ రాలేదు. కలర్ ఫోటో అని ఒక పెసిమిస్టిక్, చెత్త సినిమాకి అవార్డ్ ఇచ్చారు. ఈ ఉప్పెన సినిమాకి బాబు అది మూలాల్లోకి వెళితే… మన మాదిగ సోదరులు చేసి ఇచ్చే చెప్పుతో మనమే కొట్టుకోవాలి. మన సమస్యల మీద మన కళల మీద మనకి అనుకూలంగా మనం ఓట్లేసిన వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారా ? వాళ్ళు కదా మాట్లాడాలి మనం మాత్రమే సోషల్ మీడియాలో ఎందుకు చించుకోవాలి ?” అంటూ రాసుకొచ్చాడు.