సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయంటే ఆ మూవీ హిట్టైనా, ఫ్లాపైనా కనీసం ఒకసారి అయినా థియేటర్లకి వెళ్ళి చూసేలా ఉంటాయని అనుకుంటారు. కానీ కొన్ని చిత్రాలు మాత్రం ఆడియెన్స్ కి సీరియల్ చూసిన ఫీల్ కలగడం ద్వారా ఫ్లాప్ గా నిలిచాయి.
తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సీరియల్ చూసిన భావన కలిగించిన సినిమాల జాబితా కొంచెం ఎక్కువగానే ఉంది. అందులో టాలీవుడ్ అగ్రహీరోల చిత్రాలు కూడా ఉండడం గమనార్హం. మరి అలాంటి టాక్ తెచ్చుకున్న 12 సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1.శాకుంతలం:
సమంత, దేవ్ మోహన్ జంటగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘శాకుంతలం’.ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు.ఈ మూవీ రీసెంట్ గా విడుదల కాగా, సీరియల్ లా ఉందని కామెంట్స్ వస్తున్నాయి.
2.వారసుడు:
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో నటించిన సినిమా వారసుడు. రొటీన్ ఫ్యామిలీ స్టోరీ కావడంతో ఈ మూవీకి కూడా సీరియల్ అనే టాక్ వచ్చింది. ఈ మూవీని నెటిజెన్లు సోషల్ మీడియాలో మీమ్స్ తో ట్రోల్ చేశారు.
3. ఆచార్య:
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఆచార్య’ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, పూజ హెగ్డే నటించారు. తెలుగు ఇండస్ట్రీలో భారీ డిజాస్టర్స్ లో ఒకటిగా ఈ చిత్రం నిలిచింది. అప్పటిదాకా ప్లాప్ ఎరుగని డైరెక్టర్ కొరటాల శివకి ఈ మూవీ డిజాస్టర్ ను పరిచయం చేసిందని చెప్పవచ్చు.
4.బ్రహ్మోత్సవం:
సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నటించిన చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఈ సినిమాలో సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. రిలీజ్ అయిన రోజు నుండే సీరియల్ అనే టాక్ తెచ్చుకుంది. దాంతో ఈ మూవీ మహేష్ కెరీర్ లోనే డిజాస్టర్ గా నిలిచింది.
5.శ్రీకారం:
శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించిన సినిమా శ్రీకారం. 2021లో విడుదలైన ఈ సినిమా కూడా సీరియల్ లా ఉందని టాక్ వచ్చింది. ఈ మూవీకి బి.కిషోర్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ప్లాప్ గా నిలిచింది.
6.వరుడు:
అల్లు అర్జున్ – గుణశేఖర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం వరుడు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా సీరియల్ అనే టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం ప్లాప్ అయ్యింది
7.ఇంటిలిజెంట్:
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. మొదటి షోతోనే మెగా అభిమానులు, ఆడియెన్స్ పెదవి విరిచారు. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించారు.
8.గోరింటాకు:
2008లో వి. ఆర్. ప్రతాప్ దర్శకత్వంలో రిలీజ్ అయిన కుటుంబకథా చిత్రం గోరింటాకు. అన్న చెల్లెల సెంటిమెంట్ తో రూపొందిన ఈ మూవీలో రాజశేఖర్, ఆర్తీ అగర్వాల్, మీరా జాస్మిన్, ఆకాష్ నటించారు.
9.సన్ ఆఫ్ ఇండియా:
డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన సినిమా ‘సన్ ఆఫ్ ఇండియా’. ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం పై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరిగింది. ఈ చిత్రాన్ని మంచు విష్ణు నిర్మించాడు.
10.టక్ జగదీష్:
శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా,రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో జగపతిబాబు కీలకమైన పాత్రలో నటించారు. టక్ జగదీష్ సినిమా 2021లో విడుదల అయ్యింది. ఈ మూవీ కూడా సీరియల్ టాక్ తో ప్లాప్ అయ్యింది.
11.థాంక్యూ:
‘మనం’ మూవీ తరువాత విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో నాగ చైతన్య హీరోగా నటించిన సినిమా ‘థాంక్యూ’. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, మాళవిక నాయర్ లు హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం మొదటి షో తోనే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది.
12.శ్రీనివాస కళ్యాణం:
సతీష్ వేగశ్న దర్శకత్వంలో నితిన్, రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’.
2018లో విడుదలైన ఈ మూవీ సీరియల్ టాక్ తో ప్లాప్ గా నిలిచింది. ఈ మూవీని నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై నిర్మించారు.

ఫ్యాన్ బ్లేడ్లను శుభ్రం చేసేముందు స్విచ్ ఆఫ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఫ్యాన్ ఆఫ్ అయిన తర్వాత, ముందుగా పొడి గుడ్డతో ఫ్యాన్ బ్లేడ్లను శుభ్రం చేసి, ఆ తరువాత తడి గుడ్డతో శుభ్రపరచాలి.
ఇలా చేసిన తరువాత పని చేయనట్లైతే, ఫ్యాన్ వేగాన్ని పెంచడం కోసం కెపాసిటర్‌ను మార్చవచ్చు. కెపాసిటర్ సాధారణంగా 70 నుండి 80 రూపాయల మధ్య ఉంటుంది. కెపాసిటర్ ను ఈ-కామర్స్ వెబ్ సైట్లలో కొనుగోలు చేయవచ్చు. అలాగే ఎలక్ట్రిక్ షాప్ లో కూడా లభిస్తుంది.
ఇక కెపాసిటర్ని మార్చడం అనేది కష్టమైన విషయం కాదు. మీరే మార్చవచ్చు. కెపాసిటర్ ఫ్యాన్ మోటర్ మీద ఉంటుంది. ఇక పాత కెపాసిటర్‌ను తొలగించేముందు దానికి ఉన్న వైర్లు ఎలా ఉన్నాయో గమనించాలి. ఆ తరువాత సరిగ్గా అలాగే కొత్త కెపాసిటర్‌ను సెట్ చేయాలి. ఆ తరువాత ఫ్యాన్ ఆన్ చేసి, వేగంగా తిరగడాన్ని గమనించవచ్చు.
Also Read:
టాప్ డైరక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘దొంగ దొంగ’ చిత్రంతో హీరాకు గుర్తింపు లభించింది. హీరా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీలో కూడా నటించి ఆకట్టుకుంది. ఆమె అన్ని భాషల్లో కలిపి దాదాపు యాబైకి పైగా చిత్రాలలో నటించింది. కమల్ హాసన్, మోహన్‌లాల్, అజిత్, ప్రశాంత్ లాంటి అగ్ర హీరోల పక్కన హీరోయిన్ గా నటించింది. అయితే హీరా హఠాత్తుగా సినిపరిశ్రమకి దూరమైంది.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, హీరా ప్రేమించుకున్నారని, కానీ ఆ ప్రేమ వివాహం దాకా వెళ్లలేదనే ప్రచారాలు అప్పట్లో బాగా వినిపించాయి. అందువల్లనే హీరా ఇండస్ట్రీకి దూరం అయ్యిందని టాక్. అమెరికాకు వెళ్లి, అక్కడే సెటిల్ అయ్యిందంట. అయితే హీరో అజిత్‌తో లవ్ ఫెల్యూర్ అవడంతో ఇప్పటికీ ఆమె సింగిల్‌గానే ఉందని సమాచారం. సామాజిక మధ్యమాలలో కూడా హీరాకు ఖాతా లేదు.
Also Read:
చత్రిపతి శేఖర్ జక్కన్న తొలి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 నుండి సింహాద్రి, చత్రపతి, సై, విక్రమార్కుడు, మర్యాద రామన్న, మగధీర, ఈగ, ఆర్ఆర్ఆర్ సినిమాలలో నటించాడు. ఇప్పటి దాకా రాజమౌళి 12 సినిమాలను తీయగా శేఖర్ 9 చిత్రాల్లో ఉన్నాడు. ప్రభాస్ హీరోగా వచ్చిన చత్రపతి చిత్రంలో శేఖర్ ప్రభాస్ ఫ్రెండ్ గా నటించి గుర్తింపు పొందాడు. అప్పటి నుండి ఈ సినిమా పేరే నుంచి ఆయన పేరుగా మారి చత్రపతి శేఖర్‌గా పాపులర్ అయ్యాడు.
కాగా జక్కన్న చిత్రాలలో శేఖర్ ఎక్కువగా నటించడానికి కూడా ఒక రీజన్ ఉందంట. రాజమౌళి మొదటిసారి డైరెక్షన్ చేసిన శాంతి నివాసం సీరియల్ టైమ్ లో శేఖర్‌తో పరిచయం ఏర్పడిందంట. అదే స్నేహంగా మారినదంట. అయితే శేఖర్ రాజమౌళిని ఎప్పుడు కూడా ఛాన్స్ ఇవ్వమని అడగలేదట. అయితే తనకు నటుడిగా సపోర్ట్ చేయాలని జక్కన్న తన చిత్రాలలో ఛాన్స్ ఇస్తుంటారని శేఖర్ ఒక సందర్భంలో తెలిపారు.
సినిమా ప్రారంభించిన తరువాత రాజమౌళి పిలుస్తాడని, అప్పటి దాకా ఆ మూవీ ఏమిటి, అందులో తన క్యారెక్టర్ ఏమిటనేది తనకు తెలియదని చెప్పారు. మొదటి సీరియల్ సమయంలో ఏర్పడిన పరిచయం, స్నేహానికి అంతగా ఇచ్చే విలువ గురించి తెలిసి నెటిజన్స్ రాజమౌళికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
Also Read:
ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్,సీనియర్ హీరోయిన్స్ మధుబాల, గౌతమి, అనన్య నాగళ్ల, సచిన్ ఖేడ్కర్, కబీర్ బేడీ, వర్షిణీ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె ‘అల్లు అర్హ’ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ప్రీమియర్ షోలు కూడా వేశారు. ఈ మూవీ ప్రీమియర్ చూసిన ఆడియెన్స్ సమంత శకుంతలగా చాలా నాచురల్ గా నటించిందని మెచ్చుకుంటున్నారు.
అయితే సోషల్ మీడియాలో కొందరు శకుంతలగా సమంత కన్నా, అలనాటి హీరోయిన్ జయప్రద బాగా నటించిందని, నిజంగా శకుంతల అంటే ఆమెలా ఉండాలని కామెంట్స్, పొస్ట్ పెడుతున్నారు. హీరోయిన్ జయప్రద ‘కవిరత్న కాళిదాసు’ అనే కన్నడ సినిమాలో శకుంతలగా నటించింది. దుష్యంతుడి పాత్రలో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ నటించారు. ఆ సినిమాకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘శాకుంతలం’ సినిమాలో నటించిన సమంతతో పొలుస్తున్నారు.



ఈ మూవీ చూసిన చాలామంది ఆడియెన్స్ ఈ సినిమా ‘ఆరెంజ్’ అనే టైటిల్ ఎందుకు పెట్టారనేది అర్థం కావడం లేదని కామెంట్ చేశారు. ఈ సినిమాకి ఆ పేరు ఎందుకు పెట్టారనే విషయం ఎవరికి తెలియదు. తాజాగా ఈ మూవీ దర్శకుడు భాస్కర్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో టైటిల్ పెట్టడం వెనుక ఉన్న కారణం ఇలా చెప్పుకొచ్చారు. “చిత్రం థీమ్ ప్రకారం మూవీ టైటిల్‌ను సెలెక్ట్ చేశాను. ప్రేమ అనేది కొన్ని రోజుల తర్వాత తగ్గుతుంది. అప్పుడు వేరొక వ్యక్తిని లవ్ చేయమని చెప్పడమే ఆరెెంజ్ మూవీ థీమ్. ఒకరి పట్ల ప్రేమ అనేది ఎల్లపుడూ ఒకేలా ఉండదు.
ఆ బంధంలో అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి. వీటినే సూర్యోదయం మరియు సూర్యాస్తమయంతో పోల్చాం. సూర్యూడు సన్ రైజ్, సన్ సెట్ లలో ఆరెంజ్ రంగులో కనిపిస్తాడు. సన్ రైజ్ ప్రేమ మొదలవడాన్ని సూచిస్తుంది. ఆ సమయంలో సూర్యూడు ప్రకాశవంతంగా ఉంటాడు. అలానే సన్ సెట్ లవ్ ముగింపుకు సూచన. అందువల్ల మా సినిమాకి ‘ఆరెంజ్’ అనే టైటిల్ పెట్టాం. మూవీ యూనిట్ అంతా టైటిల్ ఓకే చెప్పారు.” అని బొమ్మరిల్లు భాస్కర్ వెల్లడించారు.
ఈ సినిమాని అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగబాబు నిర్మించారు. ఈ మూవీలో హీరోయిన్ గా జెనీలియా నటించింది. ఒక మంచి ప్రేమ కథగా పేరు తెచ్చుకున్నా అప్పటి ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. కానీ ఇప్పటి జనరేషన్‌కు మాత్రం ఈ మూవీ చాలా కనెక్ట్ అయింది. మొదటిసారి రిలీజ్ అయినపుడు డిజాస్టర్ అనిపించుకున్న ఈ చిత్రం అందరు ఆశ్చర్యపోయేలా రీరిలీజ్‌లో హిట్ అయ్యింది. ఇప్పటి వరకు టాలీవుడ్ లో రీరిలీజ్ సినిమాలలో ఆల్ టైమ్ రికార్డ్ గా నిలిచింది.
జల్లికట్టు సినిమా 93వ అకాడెమీ అవార్డుల రేసులో నిలిచింది. చివరి రౌండ్ కు అర్హత సాధించలేకపోయింది. 2021 ఆస్కార్ కోసం మొత్తం 27 చిత్రాలు పోటీపడగా, మలయాళ సినిమా ‘జల్లికట్టు’ను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసింది. మలయాళ ఇండస్ట్రీ నుండి ఆస్కార్ కు వెళ్ళిన మూడవ సినిమాగా నిలిచింది.
సినిమా అనగానే ముందుగా అడిగే ప్రశ్న అందులో హీరో ఎవరు అనే. దాదాపుగా ప్రతి సినిమాలోనూ హీరోదే ప్రధాన పాత్రగా ఉంటుంది. ఆ హీరో పేరుతోనే సినిమాని జనాల్లోకి తీసుకెళ్తుంటారు. కానీ ‘జల్లికట్టు’ సినిమాలో హీరో అనే పాత్ర లేదు. హీరోని పెట్టకుండా సినిమాని తీయడానికి ఎంతో ధైర్యం కావాలి. దర్శకుడు ఈ విషయంలో సక్సెస్ అయ్యాడు.
2019లో విడుదలైన ఈ సినిమా భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్ర కథ గురించి చెప్పాలంటే కసాయి కొట్టు నుండి తప్పించుకున్న ఒక దున్నపోతు ఊర్లో ఎంతటి వినాశనం సృష్టించిందనేది స్టోరి. ఇక ఈ మూవీ అంతా దున్నపోతు చుట్టూ తిరిగుతుంది. కానీ ఈ సినిమాలో దున్నపోతును ఉపయోగించలేదు. చిత్రయూనిట్ యానిమేట్రానిక్స్ టెక్నిక్ ద్వారా దున్నపోతును చూపించారంట. ఇలా ఒక్కో దున్నపోతుకు దాదాపు 20 లక్షలు ఖర్చు అయ్యినట్టు తెలుస్తోంది.
‘జల్లికట్టు’ అనేది కసాయి నుండి తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఒక దున్నపోతు ఉత్కంఠగా పరిగెత్తే కథను చెప్పే సినిమా. దున్నపోతును పట్టుకోవడానికి మనుషులు వెంట పడటం చూస్తే ఆదిమ మానవుల నాటి పశు ప్రవృత్తి మనిషి జీన్స్ లో ఇంకా ఉందని, అవకాశం వచ్చినప్పుడు అది బయిటకు వస్తుందని అర్దమవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
1.ధోని:
2.అమిత్ మిశ్రా :
3.దినేష్ కార్తీక్ :
4.ఇషాంత్ శర్మ :
5.అంబటి రాయుడు :
దానివల్ల ఇదే అంబటి రాయుడు ఆఖరి ఐపీఎల్ సీజన్ అని అందరు భావిస్తున్నారని చెప్పవచ్చు.
జాబ్ చేస్తూ చదువుకుంటూ, ఇప్పుడిప్పుడే తన ఫ్యామిలికి అండగా ఉంటున్నాడు. అతను ఇపుడు చివరి సెమిస్టర్ చదువుతున్నాడు. ఇంకో 10 రోజుల్లో సాయేశ్ ఎమ్మెస్ పూర్తి అవబోతుంది. ఈనేపథ్యంలో అతను ఇంటికి వెళ్ళడానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నాడు. కానీ బుధవారం అర్దరాత్రి 12.50 గంటలకు గ్యాస్ స్టేషన్లో అతను విధులు నిర్వహిస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు సాయేశ్ పై కాల్పులు జరిపి అతని దగ్గర ఉన్న డబ్బును ఎత్తుకెళ్లారు. తీవ్రంగా గాయపడిన సాయేశ్ ను సిబ్బంది ఓస్థానిక ఆసుపత్రికి తరలించారు.
సాయేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతు కన్నుమూశాడు. త్వరలోనే ఇంటికి వస్తా అని చెప్పిన సాయేశ్, అంతలోనే కన్నుమూయడంతో ఆ ఫ్యామిలిలో విషాదం నెలకొన్నది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వీరా సాయేశ్ హెచ్-1బీ వీసాను కూడా తీసుకున్నాడు. అతను అందరితో చాలా కలివిడిగా ఉండేవాడని, ఎవరైనా అడిగితే లేదనకుండా సాయం చేసేవాడని అతని స్నేహితులు వెల్లడించారు. కాగా పోలీసులు కాల్పులు జరిపిన నిందితుల ఫొటోలను విడుదల చేశారు.
అతని స్నేహితులలో ఒకరు మాట్లాడుతూ అంత్యక్రియల కోసం సాయేశ్ మృతదేహాన్ని ఇండియాకి పంపుతున్నామని, దాని కోసం ఆర్ధిక సహాయం అవసరం అని చెప్పారు. డబ్బును సేకరించడం కోసం వారు GoFundMe ని క్రియేట్ చేశారు. వారు మాట్లాడుతూ ”డబ్బు సాయేశ్ ని తిరిగి తీసుకురాదని, కానీ అతని కుటుంబం కోసం మేము చేయగలిగేది ఇదే ” అని తెలిపారు.