Naga Chaitanya Upcoming and Latest Movie Details: అక్కినేని నాగ చైతన్య హీరోగా, దర్శకుడు చందూ మొండేటి ఒక చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ప్రొడ్యూసర్ బన్ని వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.
మత్స్యకారుల నేపథ్యంలో ఈ మూవీ స్టోరీ సాగుతుంది. ఈ మూవీ యూనిట్ ఇటీవలే కోస్టల్ ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళంలో కె.మత్స్యలేశం ఊరిని సందర్శించించి, అక్కడి మత్స్యకార కుటుంబాలతో మాట్లాడిన విషయం తెలిసిందే. మరి ఈ సినిమా స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
నాగ చైతన్య ఇటీవల నటించిన కస్టడీ మూవీ నిరాశపరిచింది. తరువాత తనకు ప్రేమమ్ మూవీతో హిట్ ఇచ్చిన దర్శకుడు చందూ మొండేటితో సినిమాను ప్రకటించారు. నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ప్రొడ్యూసర్ బన్నీ వాస్ ఈ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మత్స్యకార యువకుడిగా నాగ ఛైతన్య నటిస్తున్నారు.
సముద్రంలో చేపల్ని వేటాడే బోట్ డ్రైవర్ పాత్రలో నాగ ఛైతన్య నటిస్తున్నారని తెలుస్తోంది. ఇది యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ అని సమాచారం. 2018లో గుజరాత్ విరావల్ నుండి చేపల కోసం వేటకు వెళ్ళిన 21 మంది మత్స్యకారులను పాకిస్థాన్ కోస్ట్ గార్డ్స్ అదుపులోకి తీసుకున్నాయి. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరపడంతో పాక్ చెరనుండి ఆ మత్స్యకారులు బయటబడ్డారు. ప్రస్తుతం ఆ స్టోరీని ఆధారంగా తీసుకునే ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
పాక్ కోస్ట్ గార్డ్స్ అదుపులోకి తీసుకున్న మత్స్యకారుల్లో కె మత్స్యలేశంకు చెందిన మత్స్యకారుడు గణగల్ల రామరావు ఒకరు. గుజరాత్ నుండి సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళిన రామరావు పాకిస్తాన్ కోస్ట్ గార్డులకు చిక్కి, పాకిస్థాన్ లో రెండు సంవత్సరాలు జైలు జీవితాన్ని గడిపాడు. అక్కడి నుండి ఎలా బయటికి వచ్చాడు అనే కథ ఆధారంగానే చందూ మొండేటి ఈ సినిమాని రూపొందిస్తున్నారు. కె.మత్స్యలేశం గ్రామానికి వెళ్ళి, మత్స్యకారులతో మూవీ యూనిట్ చర్చించారు. ఆ ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
https://www.instagram.com/p/CvurD9KJQ7_/
Also Read: “పుష్ప” టీమ్ ని ట్రోల్ చేస్తున్న నెటిజెన్లు..! కారణం ఏంటంటే..?

రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ జంటగా నటించిన కన్నడ సినిమా సప్త సాగరదాచె ఎల్లో. ఈ మూవీ అందమైన ఎమోషనల్ ప్రేమకథ అని చెప్పవచ్చు. కథ విషయానికి వస్తే, మను (రక్షిత్ శెట్టి) శేఖర్ గౌడ (అవినాష్) అనే బడా వ్యాపారవేత్త దగ్గర కారు డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. మను లవర్ ప్రియ (రుక్మిణి వసంత్) గాయని కావాలని ప్రయత్నాలు చేస్తుంటుంది. ఎంతో కాలంగా ప్రేమించుకుంటున్న మను, ప్రియలు వివాహం చేసుకొని కొత్త లైఫ్ ను ప్రారంభించాలని నిర్ణయించుకుంటారు. అయితే ప్రియకు సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటుంది.
మను ఓనర్ కుమారుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఒక వ్యక్తి మరణిస్తాడు. అప్పుడు శేఖర్ గౌడ పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తానని, త్వరగా జైలు నుంచి విడిపిస్తానని మనుకి హామీ ఇవ్వడంతో, మను యాక్సిడెంట్ తానే చేసినట్టుగా ఒప్పుకుని జైలుకు వెళతాడు. ప్రియ ఎంత వారించినా వినకుండా, వచ్చిన డబ్బుతో తమకోసం ఇల్లు కట్టుకోవచ్చని ప్రియకు చెప్పి జైలుకు వెళ్తాడు. కానీ అతను జైలుకి వెళ్ళాక బెయిల్ దొరకకపోగా, గుండెపోటుతో శేఖర్ గౌడ మరణిస్తాడు.
మను బయటికి వచ్చాడా? మనును జైలు నుంచి విడిపించడానికి ప్రియ ఏం చేసింది? జైలులో మనుపై సోమ గ్యాంగ్ పగను ఎందుకు పెంచుకుంది? అసలు మను జైలు నుండి బయటికి వచ్చాడా? లేదా అనేది మిగిలిన కథ. మూవీ జైలు నేపథ్యంలో సాగుతుంది. చేయని నేరానికి జైలుకి వెళ్ళిన యువకుడు దాని నుండి బయటపడటం కోసమే కాకుండా తన ప్రేయసిని కలవడానికి పడే బాధను దర్శకుడు హృద్యంగా తెరపై చూపించారు.
సెప్టెంబర్ 10న చెన్నైలో నిర్వహించిన ‘మరక్కుమా నెంజమ్’ కాన్సర్ట్ లో ఏఆర్ రెహమాన్ పాల్గొన్నారు. సహజంగానే భారీగా జనాలు హాజరవుతారు. ఈ కన్సర్ట్ కూడా భారీ జనసందోహం రావడంతో తొక్కిసలాట జరిగింది. ఇందులో చాలామంది గాయపడ్డారు. మహిళలు మరియు పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ విషయం గురించి సోషల్ మీడియాలో మాట్లాడుతూ, రెహమాన్ విమర్శలు చేస్తూ, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వేలకు వేలు పెట్టి, టికెట్లు కొనుగోలు చేస్తే లోపలికి కూడా వెళ్లనివ్వలేదని, తొక్కిసలాటలో ఎవరైనా మరణిస్తే ఎవరిది బాధ్యత అంటూ రెహమాన్ పై విరుచుకుపడుతున్నారు. తాజగా తన పై, కన్సర్ట్ పై వస్తోన్న విమర్శల పై రెహమాన్ స్పందించి, క్షమాపణలు చెప్పాడు. అలాగే తన కాన్సర్ట్‌కు చూడలేకపోయిన, రాలేకపోయినా వారందరి డబ్బులు తిరిగి ఇస్తామని ప్రకటించాడు. జరిగిన మిస్టేక్ ను ఎవరో ఒకరి మీద వేయాలని అనుకోవడం లేదని రెహమాన్ చెప్పారు.
కన్సర్ట్ కి 46 వేల మంది వస్తారని నిర్వాహకులు అంచనా వేశారని, దానికి అనుగుణంగానే సీటింగ్ ఏర్పాటు చేశారని వెల్లడించారు. అయితే ఆ సీటింగ్ నిండిపోయిందని, ఆ తరువాత ప్రోగ్రాం ప్రారంభించామని తెలిపారు. స్టేజ్ పైన పాటలు పాడుతున్నానని, వెలుపల ఏం జరుగుతుందో తెలియలేదని అన్నారు. ఇక పై ఇటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తపడతానని, ముఖ్యంగా పిల్లల, మహిళల సేఫ్టీ పై మరింత దృష్టి పెడతాము అని రెహమాన్ వెల్లడించాడు.
యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్ట్ యాంకర్ గా పాపులర్ అయిన రష్మి, పలు సినిమాలలో నటించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మి, పలు సందర్భాల్లో సొసైటీ పరిస్థితుల మీద స్పందిస్తూ ఉండడం తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి, హిందూ దేవుళ్లను దూషించడం ఎక్కువైందని, అలా దూషించడం తప్పని చెప్పిన మాటలను రష్మీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. అప్పటి నుండి ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు.
రష్మి తన పై జరుగుతున్న ట్రోలింగ్ పై స్పందించింది. తాను ఈ పోస్ట్ చేయగానే టార్గెట్ చేస్తున్నారని, తాను తన నమ్మకాలు, ఇష్టాల గురించి చెబితే, ఎందుకు ఇలా ట్రోల్ చేస్తున్నారని, దేవుళ్లను మీరు ఎందుకు నమ్మరని అడిగానా? అంటూ ప్రశ్నించింది. తాను దేవుడ్నినమ్మితే మీరేందుకు అడుగుతున్నారు.



తెలుగు ఇండస్ట్రీలో మొదటిసారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సాధించిన హీరోగా రికార్డ్ సృష్టించిన అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 కోసం తెలుగు ఆడియెన్స్ మాత్రమే కాకుండా బాలీవుడ్ నుంచి కేరళ వరకు ఉన్న ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ డబ్బింగ్ రైట్స్ కోసమే ఊహించని స్థాయిలో కోట్లు పెట్టడానికి ప్రొడ్యూసర్లు కూడా సిద్ధమవుతున్నారు. బాహుబలి, కేజిఎఫ్ సినిమాల తరువాత మళ్ళీ ఆ రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటే ప్యాన్ ఇండియా సినిమాగా పుష్ప 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
తాజాగా ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటిస్తూ, పోస్టర్ ను రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ కుర్చీ మీద కూర్చున్న ఈ పోస్టర్ వైరల్ గా మారింది. ముఖాన్ని పూర్తిగా రివీల్ చేయకుండా, హీరో చేయి ఫోటోతోనే సస్పెన్స్ క్రియేట్ చేశారు. చూపుడు వేలుకు, ఉంగరం వేళ్ళకి రింగు ఉండగా, చిటికెన వేలు గోరుకు ఎర్రని నెయిల్ పాలిష్ తో హైలెట్ చేశారు. ఈ మూవీని 2024 ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్లు తెలిపింది.
అయితే ఈ పోస్టర్ పై కొందరు నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆ మధ్యన రిలీజ్ చేసిన పోస్టర్ ని కొంచెం మార్చి అల్లు అర్జున్ డ్రెస్ చేంజ్ చేసుకున్నట్టుగా ఈ పోస్టర్ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ ను సస్పెన్స్ గా ప్రకటించినపుడు ఇంకా మంచి పోస్టర్ ను ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తారు కదా అంటున్నారు. అది మాత్రమే కాకుండా శంకర్, రామ్ చరణ్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ కూడా అదే రోజు రిలీజ్ అన్నారు. రెండు క్లాష్ అవుతే రెండింటిలో ఏ మూవీ హిట్ అవుతుందనదే చూడాలి.
పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి సినీరంగంలో టాప్ హీరోగా మాత్రమే కాకుండా తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడిన వ్యక్తి. రాజకీయాల్లో అడుగుపెట్టి చరిత్ర సృష్టించి, తెలుగు వారి పేరును నలువైపులా వ్యాపింపజేశారు. ఆయనెవరో కాదు, నట సార్వ భౌముడిగా పేరుగాంచిన నందమూరి తారకరామారావు. తెలుగువారు ప్రేమగా అన్నగారు అని పిలుచుకునే ఎన్టీఆర్.
ఎన్టీ రామరావుగారితో ఉన్న వ్యక్తి ఆయన తాతగారు రామస్వామి చౌదరి. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏపీలోని కృష్ణ జిల్లాలో నిమ్మకూరులో నందమూరి కుటుంబంలో 1923లో మే 28న ఎన్టీ రామారావు జన్మించారు. ఎన్టిఆర్ తండ్రి పేరు లక్ష్మయ్య, తల్లి పేరు వెంకట్రావమ్మ. వీరికి ఇద్దరు పిల్లలు. వారే నందమూరి తారక రామారావు మరియు నందమూరి త్రివిక్రమరావు. ఎన్టీఆర్ చిన్నతనంలో తన తాత రామస్వామి చౌదరి వద్దనే పెరిగారు. 1928 లో హీరో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తాత బడిపంతులు అయిన గద్దె వెంకట సుబ్బయ్య దగ్గర అక్షరాలు నేర్చుకున్నారు.
పెద్దయ్యాక మనదేశం మూవీతోఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఎన్టీఆర్, ఆయన కెరీర్ లో పౌరాణిక, సాంఘిక, జానపద, సినిమాలలో ఎన్నో విభిన్న పాత్రలలో నటించి, మెప్పించారు. ఆయన తెలుగు, హిందీ, తమిళం భాషల్లో సుమారు 400 సినిమాలలో నటించారు. నిర్మాతగా, దర్శకుడిగా పని చేశారు. రాముడు, కృష్ణుడు లాంటి పౌరాణిక క్యారెక్టర్లతో తెలుగు వారి మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. రాజకీయాల్లో అడుగు పెట్టి, తెలుగుదేశం పార్టీని స్థాపించి, 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రజలకు సేవ చేశారు.
నాయట్టు సినిమా పొలిటికల్ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కింది. కుంచకో బోబన్ , జోజు జార్జ్, నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించారు. జాఫర్ ఇడుక్కి , అనిల్ నెడుమంగడ్, హక్కిం షాజహాన్ కీలక పాత్రల్లో నటించారు. 2021లో రిలీజ్ అయిన ఈ మూవీకి మార్టిన్ ప్రక్కత్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఈ సినిమాకి ఉత్తమ సినిమాగా, ఉత్తమ నటుడిగా జోజు జార్జ్, ఉత్తమ కథ మరియు ఉత్తమ ఎడిటర్ గా ఆ ఏడాది కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు వచ్చాయి.
ఈ మూవీ కథ విషయానికి వస్తే, ముగ్గురు పోలీసుల చుట్టూ తిరిగే కథ. రాష్ట్రంలో ఎన్నికల జరిగే సమయంలో ఒక చిన్న గ్రామంలో ఒక ఎస్సై, ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్‌కు, ఒక వర్గానికి చెందిన మనుషుల మధ్య పోలీస్ స్టేషన్ లో చిన్న గొడవ జరుగుతుంది. అయితే ఆ గోడవకు పాలిటిక్స్ తోడవడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి.
ఈ పరిస్థితుల్లో ఎస్సై మరియు కానిస్టేబుల్స్ ప్రయాణిస్తున్న జీపు మోటార్ బైక్ ను ఢీకొడుతుంది. దాంతో బైక్ మీద ఉన్న వ్యక్తి మరణిస్తాడు. అయితే అతను బిజు అనే లోకల్ గూండా స్నేహితుడు. దాంతో జీపులోని ముగ్గురిని అరెస్ట్ చేసి, మర్డర్ కేసు పెట్టమని ఆదేశాలు వస్తాయి. దాంతో ఎస్పై, ఇద్దరు కానిస్టేబుల్స్ అక్కడి నుండి తప్పించుకుంటారు. ఆ తరువాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ.
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న భక్త కన్నప్ప మూవీలో కృతి సనన్ చెల్లెలు నుపుర్ సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్న దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్ బాలీవుడ్ కి చెందిన వ్యక్తి. అతను టెలివిజన్ దర్శకుడు. ముఖేష్ కుమార్ సింగ్ బీహార్‌లో పుట్టి పెరిగాడు. డ్రామాటిక్ ఆర్ట్‌లో పోస్ట్-గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు. అందులో ముఖేష్ కుమార్ గోల్డ్ మెడల్ అందుకున్నాడు.
ఆల్ ఇండియా రేడియో, సాంగ్ అండ్ డ్రామా డివిజన్ ఆఫ్ ఇండియా మొదలైన వాటిలో ఎన్నో నాటకాలలో నటించాడు. దర్శకత్వం వహించాడు. ముఖేష్ 2000వ సంవత్సరంలో దర్శకుడు కావడం కోసం ముంబైలో అడుగుపెట్టాడు. ముఖేష్ కెరీర్ ప్రారంభంలో శ్రీ అధికారి బ్రదర్స్‌తో కలిసి పనిచేశాడు. ఆ తరువాత మొదట థ్రిల్లర్ ‘సురాగ్’ కు అవకాశం పొందాడు. ఆ తరువాత అనేక ప్రసిద్ధ పౌరాణిక మరియు చారిత్రక టెలివిజన్ షోలకు దర్శకత్వం వహించాడు.
ముఖేష్ ఇండియన్ టెలివిజన్‌లో అతి పెద్ద షో మహాభారతానికి దర్శకత్వం వహించాడు. ఇది 100 కోట్ల టీవీ షోగా గుర్తింపు పొందింది. మేరే సాయి, చంద్ర నందిని, రజియా సుల్తాన్, హనుమాన్, బంధన్, మీరా, రామాయణం, భాగ్య విధాత, ద్వారకాధీష్ వంటి షోలతో బుల్లితెరపై మ్యాజిక్ క్రియేట్ చేశాడు. భక్త కన్నప్ప మూవీతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు.


