డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం లో వచ్చిన బ్యూటిఫుల్ చిత్రాలలో హ్యాపీడేస్ సినిమా కూడా ఒకటి. 2007లో విడుదలైన ఈ చిత్రం యువతకు బాగా అట్రాక్ట్ అయ్యేలా చేసింది. ఈ సినిమాలో అందరూ కొత్తవాళ్లే అయినప్పటికీ బాగా నటించారు. అయితే వీరిలో వరుణ్ సందేశ్, తమన్నా కి మంచి క్రేజ్ వచ్చింది.
అయితే వీరు కాకుండా మరొక జోడి రాహుల్, సోనియా దీప్తి కూడా ప్రేక్షకులకు బాగా గుర్తున్నారు. ముఖ్యంగా ఆమె రింగురింగుల జుట్టు (కర్లీ హెయిర్)కు చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు. అలాగే సోనియా వాయిస్ కూడా యూత్‌ను కట్టిపడేసింది. సోనియాది హైదరాబాదే. ఇక్కడే పుట్టి పెరిగింది. ఇక్కడే చదువుకుంది. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఒక ఐటీ సంస్థలో మూడేళ్ల పాటు సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేసింది.

అయితే ఒక ప్రమోషన్ ఈవెంట్లో సోనియాను చూసిన శేఖర్ కమ్ముల హ్యాపీడేస్‌లో స్రవంతి పాత్రకు సెలెక్ట్ చూశారు. ఈ పాత్రతో ఆమెకు మంచి పేరు తో పాటు వరుస అవకాశాలు కూడా వచ్చాయి. వినాయకుడు, బ్రహ్మ లోకం టు యమలోకం వయా భూలోకం తదితర సినిమాల్లో హీరోయిన్గా నటించి మెప్పించింది. అలాగే పలు సినిమాల్లో హీరో, హీరోయిన్స్ కి ఫ్రెండ్ పాత్రల్లో కూడా నటించింది.

సోనియా దీప్తి తెలుగు, తమిళం, కన్నడ, ఇంగ్లీష్ తదితర భాషలలో కలిపి దాదాపుగా 12 కు పైగా చిత్రాలలో నటించింది. 2016లో చిన్ని చిన్ని ఆశలు నాలో రేగేనే అనే తెలుగు సినిమాలో, 2017వ సంవత్సరంలో “పురియట పురియర్” అనే తమిళ చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. ఈమె నటించిన ఎక్కువ శాతం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అందువల్లనే సోనియా దీప్తి సినిమాలకు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది.

సినిమాల్లో కనిపించకపోయినా కొన్ని సామాజిక కార్యక్రమాలతో వార్తల్లో నిలుస్తోంది సోనియా. మహిళా సాధికారత, మోరల్ పోలీసింగ్‌లకు సంబంధించి ఆమె రిలీజ్ చేసిన షార్ట్ ఫిలిమ్స్‌కు మంచి పేరొచ్చింది. అయితే ప్రస్తుతం సినిమాల్లోకి మరోసారి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది సోనియా. అనుష్క, నవీన్ పొలిశెట్టి హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుంది.





















ఈ చిత్రాన్ని దాదాపు 80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం కనీసం 10 కోట్ల షేర్ సాధించలేకపోయింది. ఏజెంట్ సినిమా ఈ సంవత్సరం అతి పెద్ద డిజాస్టర్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం పై అంతటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్కినేని ఫ్యాన్స్ కూడా చాలా నిరాశ పడ్డారు. సాధారణ ప్రేక్షకులు సైతం మూవీ పై కామెంట్లు చేస్తున్నారు. విడుదల అయిన దగ్గర నుంచి మూవీ పై రకరకాలగా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ రిజల్ట్ పై ప్రొడ్యూసర్ అనిల్ సుంకర స్పందించారు.
ఏజెంట్ అపజయానికి బాధ్యత వహిస్తూ ఆడియెన్స్ కి క్షమాపణలు చెప్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సారాంశం ఏమిటి అంటే “ఏజెంట్ మూవీ ఫెయిల్యూర్ కి సంబంధించిన పూర్తి నిందను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ మూవీ మాకు పెద్ద టాస్క్ అని తెలిసినప్పటికీ, విజయం సాధించాలనే పట్టుదలతో ముందుకెళ్లాం. అయితే బౌండెడ్ స్క్రిప్ట్ తమ దగ్గర లేకుండా సినిమాని మొదలు పెట్టి పెద్ద పొరపాటు చేశాం. కోవిడ్‌తో సహా చాలా సమస్యలు రావడం వల్ల విఫలమయ్యాం.
ఫెయిల్యూర్ కు ఎలాంటి సాకులు చెప్పాలని మేము అనుకోవట్లేదు. అయితే ఈ కాస్ట్లీ తప్పు నుండి నేర్చుకుని, మళ్ళీ ఇలాంటి తప్పులను ఎప్పటికీ రిపీట్ కాకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాం. మాపై ఎంతో నమ్మకం ఉంచిన అందరికి మనస్పూర్తిగా క్షమాపణలు తెలియచేస్తున్నాను. రాబోయే సినిమాల విషయంలో పక్కా ప్రణాళికతో కష్టపడి నష్టాలను భర్తీ చేస్తామని తెలియజేస్తున్నాం” అని ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ట్వీట్ చేశారు.












అక్కినేని అఖిల్ ఏప్రిల్ 28 న ఏజెంట్ చిత్రం ద్వారా ఆడియెన్స్ ముందుకు వచ్చారు. సురేందర్ రెడ్డి డైరెక్టర్ కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాల ఏర్పడ్డాయి. అయితే ఈ మూవీకి నెగెటివ్ టాక్ రావడంతో మూవీ పై తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. కాగా అఖిల్ తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. అఖిల్ నెక్స్ట్ మూవీ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఉండబోతుందంట. ఈ చిత్రం ద్వారా అనీల్ అనే కొత్త డైరెక్టర్ టాలీవుడ్ కి పరిచయం కానున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని సమాచారం.
ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ నుండి ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్న అనీల్ గతంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి ఒక స్టోరీ చెప్పాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అనీల్ సాహో, రాదేశ్యామ్ చిత్రాలకు డైరెక్షన్ విభాగంలో పని చేశాడు. సాహో సమయంలోనే యూవీ ప్రొడ్యూసర్లకు ఒక ఐడియా చెప్పడం, వాళ్ళు ఒకే అనడం జరిగిందంట.
ఆ స్టోరీని ప్రభాస్ తో చేయాలని నిర్మాతలు భావించారంట. అయితే సాహో, రాధే శ్యామ్ సినిమాల ఫలితాల కారణంగా అనీల్ చెప్పిన స్టోరీ ప్రభాస్ తో చేయడం సరి కాదని భావించి, అఖిల్ తో ఆ మూవీ చేయనున్నారని టాక్. ప్రభాస్ కోసం తయారుచేసిన స్టోరీతోనే అనీల్ హీరో అఖిల్ తో మూవీ చేస్తున్నాడా ? లేదా వేరే కథతో చేస్తున్నాడా? అనేది తెలియాల్సి ఉంది.
యంగ్ హీరో అఖిల్ మంచి హిట్ కోసం ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాడు. తాజాగా రిలీజ్ అయిన ‘ఏజెంట్’ మూవీకి ప్లాప్ టాక్ వచ్చింది. దీంతో తదుపరి చేయబోయే చిత్రం విషయంలో అఖిల్ చాలా జాగ్రత్తగా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంతో అయినా అఖిల్ కు హిట్ వస్తుందని యూవీ ప్రొడ్యూసర్స్ భావిస్తున్నారంట.

