ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ప్రారంభం అయ్యింది. ఈ టోర్నమెంట్ ప్రారంభ వేడుకలను అట్టహాసంగా, గ్రాండ్ గా నిర్వహించడానికి బీసీసీఐ సినీ తారలు మరియు బాలీవుడ్ గాయకులతో ప్రదర్శనలు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా నేషనల్ క్రష్ రష్మిక మందాన మరియు మిల్క్‌బ్యూటీ తమన్నా భాటియా తమ డాన్స్‌తో ఆడియెన్స్ ని అలరించారు.
ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట, పుష్ప సినిమాలోని శ్రీ వల్లి, సామీ సామీ, ఊ అంటావా మావా లాంటి పాటలకు రష్మిక, తమన్నా స్టెప్పులేసి అలరించారు. వీరిద్దరి పెర్ఫార్మెన్స్ తో స్టేడియం హోరేత్తింది.ప్రముఖ బాలీవుడ్ గాయకుడు అర్జిత్ సింగ్ కూడా తన పాటలతో ఆడియెన్స్ ని అలరించారు.
ఐపీఎల్ 16వ సీజన్లో మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఆడాయి. ఇక ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పై గుజరాత్ జట్టు 5 వికెట్ల తేడాతో గెలిచింది. అహ్మదాబాద్ లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టపోయి 178 రన్స్ చేసింది.
ఇక 179 రన్స్ లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు మికహ మొదటి నుండి కూడా అదరగొట్టారు. దాంతో గెలుపు సాధించారు. ఇది ఇలా ఉంటే ఐపీఎల్ టోర్నమెంట్ ప్రారంభ వేడుకలలో స్టార్ హీరోయిన్లు ష్మిక మందాన, తమన్నా భాటియా డాన్స్ చేయడం పై ప్రస్తుతం చర్చ మొదలైంది. అయితే ఈ వేడుకల్లో డాన్స్ చేసినందుకు గాను హీరోయిన్లు రష్మిక, తమన్నా భాటియా ఇద్దరు తలో నాలుగు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ విషయం వైరల్ అవుతోంది.
Also Read: రజనీకాంత్ మూవీ వల్ల నా కెరీర్ ముగిసిపోయింది.. వైరల్ అవుతున్న మనీషా కోయిరాల కామెంట్స్
















ఆమె తల్లిదండ్రులు ముఖర్జీ, జెన్నీఫర్. చెన్నై కళాక్షేత్రలో అమల బి.ఏ ఫైన్ ఆర్ట్స్ చేసారు. ఆమెకు క్లాసికల్ డాన్స్ అంటే ఆసక్తి ఉండడంతో చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నారు. అక్కినేని అమల ఇటీవల శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం సినిమాలో నటించింది. మూగజీవాల మీద ఉన్న ప్రేమతో బ్లూక్రాస్ సంస్థను స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అయితే అమల ఎప్పుడూ సింపుల్ గా ఉంటారు. అమల బంగారం ధరించినట్టు కూడా కనిపించదు. ఆమె మెడలో ఎప్పుడు నల్లపూసలు మాత్రమే కనిపిస్తాయి. అలాగే చెవులకు పోగులు, చేతికి గాజుల లాంటివి పెట్టుకోరు. అయితే బంగారం ఇష్టం లేక మాత్రం కాదంట. బంగారు నగలు వేసుకున్నప్పుడు చర్మానికి సంబంధించిన సమస్యలతో బాధపడినట్టు తెలుస్తోంది. అందువల్లే అమల ఎలాంటి బంగారు ఆభరణాలు ధరించరని సమాచారం.
Also Read: 

ఈ ఫొటోలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు ఉన్న బాబు ఎవరంటే హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్. శ్రీకాంత్ వారసుడిగా రోషన్ తెలుగు ఇండస్ట్రీలో నిర్మల కాన్వెంట్ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కొంచెం విరామం తీసుకుని దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో పెళ్లిసందడి చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాను మహిళా దర్శకురాలు గౌరీ రోనంకీ తెరకెక్కించారు. ఈ చిత్రంలో రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించారు. ఇక ఈ మూవీతో రోషన్ మరింత గుర్తింపును సంపాదించుకున్నాడు.
రోషన్ కి ప్రస్తుతం వరుస ఆఫర్లు తలుపు తడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రోషన్ వైజయంతి బ్యానర్ లో ఒక చిత్రాన్ని అంగీకరించినట్లుగా సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభించారని తెలుస్తోంది. రోషన్ ఈ చిత్రంతో పాటుగా సితార బ్యానర్ లోనూ ఒక మూవీని చేయడానికి ఒప్పుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక ఇప్పుడు రోషన్ మహేష్ బాబుతో ఉన్న ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.అయితే ఈ ఫోటో పై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబు పక్కన ఉన్న బాబు ప్రస్తుతం చాలా మారిపోయాడు. అయితే సూపర్ స్టార్ మహేష్ మాత్రం కొంచెం కూడా మారలేదు. అప్పటిలాగే అందంగా ఉన్నారని కామెంట్స్ పెడుతున్నారు.
Also Read:
రవితేజ ఈ విషయం పై మాట్లాడుతూ దాని గురించి తెలియదు. ఇప్పటివరకు అలాంటి ఆలోచన కూడా రాలేదు. మహాధన్ ఎంట్రీ విషయంలో తనకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. మహాధన్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే అతనికి ఆసక్తి కూడా ఉంది. కానీ ఎప్పుడు సినిమాల్లోకి వస్తాడో తెలియదని, ఒకవేళ సినిమాల్లోకి వస్తానంటే మాత్రం వెళ్లమని చెప్తా అని అన్నారు. అయితే సలహా మాత్రం ఇవ్వనని, ఇవ్వాల్సిన సలహాలు ఇప్పటికే ఇచ్చానని, కెరీర్ గురించి మహాధన్ పూర్తి క్లారిటీతో ఉన్నాడు
దీనిని బట్టి మహాధన్ త్వరలోనే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి. ఇక మహాధన్ ఎంట్రీ గురించి రవితేజ అభిమానులు సంతోషపడుతున్నారు. రవితేజ ఫ్యామిలీ నుండి ఆయన తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక రవితేజ హీరోగా సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా ‘రావణాసుర’. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యంగ్ హీరో సుశాంత్ ఈ మూవీలో కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 7న విడుదల కానుంది.
Also Read: 


ఈ సినిమా రంజాన్ పండగను సందర్భంగా ఏప్రిల్ 21 రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. అందువల్ల తెలుగు మార్కెట్ ని ప్రొడ్యూసర్స్ టార్గెట్ చేశారు. దానిలో భాగంగానే తెలంగాణ పువ్వుల పండుగ అయిన బతుకమ్మ మీద సాంగ్ ని పెట్టడమే కాకుండా డబ్బింగ్ చేయకుండా తెలుగులో ఆడియో రికార్డింగ్ మరియు పాటను చిత్రీకరించి విడుదల చేశారు. ఈ పాటలో వెంకటేష్, సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే, భూమిక, రోహిణి హట్టంగడితో పాటు క్యాస్టింగ్ అంతా పాటలో ఉంది.
ఈ సాంగ్ ను కేజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ కంపోజ్ చేశారు. ఈ సినిమాకి ఫర్హాద్ సమ్జీ డైరెక్షన్ చేశారు. ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు రీమేక్ అని ఎప్పటి నుండో అంటున్నారు. అయితే ఒక్క లైన్ తీసుకుని ఎన్నో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. హీరో వెంకటేష్ నటించడం వల్ల ఈ సినిమా తెలుగు వెర్షన్ ని కూడా భారీగా ప్రమోట్ చేయబోతున్నారు.
Also Read:
బొంబాయి మూవీతో దక్షణాది ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్న మనీషా కోయిరాలా, కోలీవుడ్ లో తను నటించిన చివరి పెద్ద సినిమా బాబా అని చెప్పారు. అప్పట్లో ఆ మూవీ భారీగా వైఫల్యం చెందిందని మనీషా తెలిపారు. ఆ మూవీ పై తను ఎన్నో ఆశలు పెట్టుకున్నానని, బాబా చిత్రం ఫ్లాప్ అవడంతో అక్కడ తనకు మరే సినిమాలోను అవకాశం రాలేదని మనీషా తెలిపారు.
బాబా మూవీతోనే దక్షణాదిలో తన కెరీర్ ముగుస్తుందని అనుకుంటే, ఆఖరికి అదే జరిగిందని ఆమె అన్నారు. బాబా మూవీకి ముందు కొన్ని చిత్రాలలో నటించి, వాటికి ప్రశంసలు అందుకున్నానని చెప్పారు. అయితే రీరిలీజ్ లో బాబా విజయాన్ని సాధించిందని ఆమె వ్యాఖ్యలు చేశారు. బొంబాయి చిత్రంలో మొదట్లో నటించకూడదని భావించానని, కెరీర్ మొదటలో తల్లి పాత్రలు పోషించవద్దని ఎంతో మంది చెప్పారని ఆమె చెప్పుకొచ్చారు.
అయితే సినిమాటోగ్రాఫర్ అయిన అశోక్ మెహతా తిట్టి మణిరత్నం చిత్రంలో అవకాశం వద్దనుకుంటే వెర్రిదానివని అన్నారని ఆమె తెలిపారు. ఆయన మాటలతో మనసు మార్చుకొని బొంబాయి మూవీలో చేశానని అన్నారు. బొంబాయి చిత్రంలో చేయడం ఇప్పటికీ ఎంతో సంతోషంగా ఉందని మనీషా తెలిపారు. ప్రస్తుతం ఆమె చెప్పిన విషయాలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
Also Read:
ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్‌ల కాంబోలో తెరకెక్కుతున్న SSMB28 రిలీజ్ డేట్ జనవరి 13 అని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఇప్పటి దాకా మహేష్ బాబు, ప్రభాస్ ఎన్నిసార్లు బాక్సాఫీస్ రేస్ లో తమ చిత్రాలతో పోటీ పడ్డారనే విషయం ఇంట్రెస్టింగ్ గా మారింది. సోషల్ మీడియాలో ఇద్దరి అభిమానులు ఈ విషయం గురించే చర్చలు జరుపుతున్నారు. మరి ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఎన్నిసార్లు బాక్సాఫీస్ రేస్ లో పోటీపపడ్డారో ఇప్పుడు చూద్దాం..
1.నాని – అడవి రాముడు:
2.పౌర్ణమి – పోకిరి:
3. ప్రాజెక్ట్ – K – SSMB 28:
Also Read: