కరోనాతో ప్రపంచం అంతా అతలాకుతలం అవుతోంది..అది ఎలా వచ్చింది..ఎందుకు వచ్చింది, దానికి నివారణ ఏంటి? అనే దాని మీద ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల డాక్టర్లు, శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.. కానీ “కరోనా” అని పేరెత్తితే చాలూ.. చైనా అంటూ రాగం అందుకుంటున్నారు చాలామంది, వాళ్లు గబ్బిలాలు తినడం మూలంగానే కరోనా వచ్చింది అనేది WHO ఇచ్చిన ఆరోగ్య సూచనలకన్నా వేగంగా జనానికి చేరింది… కానీ కేవలం చైనాలోనే కాదు, మన దేశంలో కూడా గబ్బిలాలను ఆహారంగా తింటారు అనే విషయం మీకు తెలుసా?

ఆకుకూరలు మాత్రమే తినేవాడు చికెన్, మటన్ తినేవాన్ని కూడా ఇదే యాంగిల్లో చూస్తాడు ..వాడికి నచ్చకపోతే తిడతాడు..ఎవరి అలవాట్లు వారివి.. కానీ ఏధైనా విపత్తు వచ్చినప్పుడు ఇలాంటి కామెంట్స్ కి ఎక్కువ బలం చేకూరుతుంది.. సరే ఇప్పుడు టాపిక్ అది కాదు కాని ..మన దేశంలో వివిధ జాతులు,వివిధ తెగల వాళ్లున్నారు..వాళ్లు రకరకాల పండుగలు జరుపుకుంటుంటారు. అలాగే గబ్బిలాలను తినే పండుగ కూడా ఉంది. మన దేశంలోని ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ లోని మిమి ప్రాంతవాసులు జరుపుకునే వింత పండుగ జరుపుకుంటారు..

మిమిలో అక్టోబర్ నెల మధ్యలో జరిగే ఈ పండుగలో బోమర్ తెగ ప్రజలు పాల్గొంటారు.. ఆ పండుగ స్పెషల్ ఏంటంటే “పండుగ కాలంలో గుహల్లో వెతికి గబ్బిలాలను పట్టుకోవడమే లక్ష్యం, తర్వాత వాటిని వండి తినడం పండుగ లక్షణం” మిమిలో సుమారు 300 నుండి 400 అడుగుల ఎత్తులో నాలుగు పెద్ద గుహలు ఉన్నాయి. ఈ ప్రదేశం వన్యప్రాణులకు, గబ్బిలాలకు నివాసంగా ఉంది. ఈ గబ్బిలాలు భయానకంగా ఉంటాయి కానీ మనుషులకు ఎలాంటి హాని కలిగించవు. ఏడాదికి ఒకసారి వచ్చే ఈ పండుగలో పురుషులు మరియు స్త్రీలు సమానంగా పాల్గొంటారు.

మనం చికెన్ వండుకోవడం ఎలా సాధారణమో..వారికి గబ్బిలం మాంసం అలా సర్వసాధారణం..ఇంటికి వచ్చిన చుట్టాలకు ఇది పెట్టడమే కాదు..పండుగ తర్వాత మిగిలిన మాంసాన్ని , తర్వాత వాడుకోవడానికి వీలుగా నిల్వ చేసుకుంటారు. వీటి మాంసంలో ఔషధ గుణాలు ఉంటాయని మిమి గ్రామస్తుల విశ్వాసం.అనేక ప్రాంతాల నుండి ప్రజలు ఈ పండుగను తిలకించేందుకు పర్యాటకులు ఇక్కడికి వస్తారు..

గ్రామస్తులు వాటిని వేటాడడం, విందు భోజనంగా వండుకుని తినడం ప్రత్యక్ష్యంగా చూడవచ్చు.. ఆ గబ్బిలాలు భయంకరంగా ఉంటాయి కాని మనుషులకు ఏ హాని తలపెట్టవట..సో మీకు కూడా ఇంట్రస్ట్ ఉంటే, కరోనా కలకలం అప్పటికి తగ్గితే అక్టోబర్ లో ఒకసారి చలో మిమి టూర్ వేయండి.. మిమి గ్రామానికి చేరుకోవాలంటే ముందుగా నాగాలాండ్ యొక్క ముఖ్య నగరమైన దిమాపూర్ కు వెళ్లి అక్కడి నుండి కిపైర్ కి..అక్కడ ప్రైవేట్ బస్ లేదా టాక్సీ తీసుకుని మిమికి వెళ్లొచ్చు..సింపుల్..

పోయినేడాది కేరళలో వచ్చిన నిఫా వైరస్, ఇప్పుడు వచ్చిన కరోనా వైరస్ రెండూ గబ్బిలాల వలనే వచ్చాయని అంటున్నారు..మరి వీళ్లు ఏకంగా పండుగే చేసుకుంటున్నరు..వారికి ఏం కావట్లేదేంటో అని ఆశ్చర్యపోతున్నారా?? అందరిది అదే పరిస్థితి..
















కరోనా లాక్ డౌన్ కారణంగా సినీ ఇండస్ట్రీ సంక్షోభంలో కూరుకుపోయింది. సినిమా మీద ఆధారపడి జీవించే కొన్ని వేల కుటుంబాల జీవితాలు ప్రశ్నర్ధకంగా మారిపోయాయి. వేలాది మంది సినీ కార్మికులు ఉపాధి కోల్పోయి .. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 



యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సాబు థామస్ నేతృత్వంలో ఈ పరిశోధనలు కొనసాగుతున్నాయి.కరోనాను పసుపులోని కర్కమిన్ అనే పదార్థం నియంత్రించగలిగే శక్తి ఉందన్నారు.దీనికోసమని మూడు ప్రాజెక్టులు మీద పరిశోధనలు ప్రారంభం అయ్యాయి అని. థామస్ తెలిపారు.టైటానియం డైయాక్సైడ్తో మరి కొన్ని పదార్థాల మిశ్రమంతో పీపీ ఈ లు, మాస్కులకు అతి సూక్ష్మంగా పూత పూసి, కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు పరిశోధనలు చేస్తున్నామని తెలిపారు.






‘సరిలేరు నీకెవ్వరూ’ అని అనాల్సిందే.మూగ జీవాల కోసం ఆమె తరచూ ఎదో ఒకటి చేస్తూనే ఉన్నారు…ఇకపోతే దేశం పేస్ చేస్తున్న సమస్యల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది జనాభా నియంత్రణ గురించి ఇదే అంశం మీద రష్మీ ఒక నెటిజెన్ కి క్లాస్ పీకింది అదేంటో చూద్దాం రండి…దేశానికి ప్రస్తుత పరిస్థితి కరోనా లాంటి డిసాస్టర్ పరిస్థుతుల మీద నెటిజన్స్ తో గొడవకి దిగింది రష్మీ దీనికి స్పందిస్తూ ‘ప్రతి సమస్యకు ప్రభుత్వాలను వేలెత్తి’ చూపుతున్నారని ఏ ఒక్కరికి కూడా తమవ్యక్తిగత బాధ్యత తీసుకోరని రష్మీ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యింది..
కానీ వారు చదువుకోకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటుందని తిరిగి ప్రశ్నించగా రష్మీ.చివరిగా చెప్పేది ఏమంటే మన దేశంలో ఎన్నో సమస్యలకి పరిష్కారమంటే ఒక్కటే అదే నియంత్రణ .సాధ్యమైనంత వరకు అందరికి అర్థం అయ్యేలా చెప్పాడని మన జనాభాను నియంత్రణలో ఉండాలి అనే ఆలోచనను వివరించండి. డబ్బు ఉన్న వారు కనీసం దత్తత తీసుకోడానికి కూడా ముందుకు రారు..పైగా పిల్లల్ని కనడానికి సరోగసి మార్గాన్ని ఎంచుకుంటున్నారు
ఈ విషయం ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది.పేదవారిని తప్పించుకోవడానికి వీల్లేదు ఒక్కోరు ముగ్గురు,నలుగురు పిల్లల్ని కంటున్నారు..ఇంకొందరు అయితే అంతకంటే ఎక్కువ మందినే కంటున్నారు.ఇలా జరుగుతుంది కాబట్టే ఇంతటి కష్టసమయాల్లో ఇన్ని బాధలు పడుతున్నాము.ఇదే పరిస్థితి కొనసాగితే ఎలాంటి పథకాలు ఉపయోగపడని తెలిపింది.





