టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య తాజాగా నటిస్తున్న సినిమా “కస్టడీ”. ఈ చిత్రానికి కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా హీరోయిన్ కృతి శెట్టి నటిస్తోంది.
త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్ ప్రారంభించారు. ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య తాజాగా ఒక తమిళ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో నాగచైతన్య చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. అవి ఏమిటో ఇపుడు చూద్దాం..
నాగచైతన్య ప్రస్తుతం ‘కస్టడీ’ మూవీ ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు. సీనియర్ నటుడు అరవింద్ స్వామి ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. యాక్షన్ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీలో నాగచైతన్య పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం మే 12 రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ ను కోలీవుడ్ లోనూ జోరుగా చేస్తున్నారు. తమిళ యూట్యూబర్ ఇర్ఫాన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్య కెరీర్ మరియు వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడారు.
ఇక ఇంటర్వ్యూలో భాగంగా ఆడిన ట్రూత్ ఆర్ డేర్ గేమ్ లో రిలేషన్ షిప్ లో ఎప్పుడైనా తిరస్కరించబడ్డారా? అని నాగచైతన్య యాంకర్ ఇర్ఫాన్ ను అడిగారు. అతను దానికి సమాధానం చెప్తూ రెండున్నర సంవత్సరాల క్రితం ప్రేమించిన అమ్మాయి రిజెక్ట్ చేసిందని అన్నారు. అయితే మనం మంచి ఫ్రెండ్స్ గా కొనసాగుదామని చెప్పిందని వెల్లడించాడు. అది వినగానే నాగచైతన్య ఒక్కసారి తిరస్కరించిన వారితో మళ్ళీ ఫ్రెండ్ షిప్ అంటేనే తనకు చిరాగ్గా అనిపిస్తుందని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.
అలాగే ఇంటర్వ్యూలో యాంకర్ జీవితంలో ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా అన్న ప్రశ్నకి, తనకు ఎటువంటి రిగ్రెట్స్ లేవని చైతన్య తెలిపారు. జీవితంలో ఎదురైన ప్రతి సంఘటనను పాఠంగా భావిస్తానని తెలిపాడు. దీనిపై కొంచెం వివరంగా చెబుతారా అంటే తన కెరీర్ లో నటించిన రెండు మూడు చిత్రాల విషయంలో తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోలేకపోయానని వెల్లడించాడు.
Also Read: ఈ వారం OTT లో రిలీజ్ అవుతున్న 15 సినిమాలు..! ఏ సినిమా / సిరీస్ ఎందులో స్ట్రీమ్ అవుతుంది అంటే..?

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ఏజెంట్ మూవీ రీసెంట్ గా విడుదల అయ్యింది. ఈ చిత్రంలో మమ్ముట్టి ముఖ్యమైన పాత్ర పోషించగా, హీరోయిన్ గా సాక్షి వైద్య నటించింది. ఈ చిత్రం కోసం అఖిల్ తన లుక్ ను పూర్తిగా మార్చుకున్నారు. ఈ మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డే నుండే నెగెటివ్ టాక్ తెచ్చుకుని, డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్ర దర్శక నిర్మాతల పై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ ఒక వార్త వైరల్ అయ్యింది. ఈ చిత్రానికి మొదటి ఛాయిస్ అఖిల్ కాదని, టాలీవుడ్ స్టార్ హీరో అని వినిపిస్తోంది.
ఈ చిత్ర డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ మూవీ స్టోరీని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు వినిపించాడంట. కథ నచ్చినా, చరణ్ కి ఇతర చిత్రాల కమిట్మెంట్స్ వల్ల ఈ చిత్రాన్ని సున్నితంగా రిజెక్ట్ చేశాడంట. ఇక ఈ విషయాన్ని ఆ మధ్య రామ్ చరణ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. చరణ్ రిజెక్ట్ చేయడంతో సురేందర్ రెడ్డి అఖిల్ కి చెప్పడం, అతనికి కథ నచ్చడంతో ఈ చిత్రం తెరకెక్కింది. కానీ ఈ మూవీ మొదటి షోకే ఫ్లాప్ టాక్ వచ్చింది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో డినో మోరియా విలన్ గా నటించాడు. ఇక ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందించారు.
1. హనుమాన్:
2. అధీర:
4. విక్రమ్ – మల్లన్న:
5. విజయ్ – వేలాయుధం:
6. జీవా – మాస్క్:
7. శివకార్తికేయన్ – హీరో:
8. టోవినో థామస్ – మిన్నల్ మురళి:
పిడుగుపాటుకు గురై సూపర్ పవర్స్ పొందే టైలర్ పాత్రలో థామస్ నటించారు. తెలుగులో కూడా అదే పేరుతో రిలీజై ఆడియెన్స్ ని ఆకట్టుకుంది.
అంజు బాలనటిగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది. ఆ తర్వాత కాలంలో హీరోయిన్ గా చాలా సినిమాలలో నటించి ఆకట్టుకుంది. అయితే పదిహేడు ఏళ్ల వయసులో ఆమె వేసిన ఒక తప్పటడుగు అంజు లైఫ్ ని మార్చేసింది. అంజు వైవాహిక జీవితం గురించి ఇలా చెప్పుకొచ్చింది. బాలనటిగా, హీరోయిన్ గా 150కి పైగా చిత్రాలలో నటించాను. ఎన్నో చిత్రాల్లో నటించిన నాకు ‘రేంజర్’ అనే కన్నడ చిత్రంలో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాతోనే కన్నడ ప్రభాకర్ పరిచయం అయ్యారు. ఆ సమయంలో నాకు 17 ఏళ్లు.
ప్రభాకర్ నన్ను వివాహం చేసుకోవాలి అనుకుంటున్నట్లు నాతో చెప్పాడు. దాని గురించి నా తల్లిదండ్రులకు చెప్పాను. వాళ్లు అంగీకరించలేదు. అప్పుడు అతని కోసం ఇల్లు విడిచి వెళ్ళాను. ప్రభాకర్ ను ఎంతగానో నమ్మాను. ఇద్దరం ఏడాది కలిసి ఉన్నాము. అతనికి అప్పటికే 2 పెళ్లిల్లు అయ్యి, పిల్లలు కూడా ఉన్నట్టు తెలిసింది.
ఆ సమయంలో నేను ప్రెగ్నెంట్. తన గురించి అన్ని తెలిసి అడిగినందుకు చెడ్డదాన్ని అయ్యాను. ఇక ప్రభాకర్ తో ఉండలేక బయటకు వచ్చేశాను. నా బంగారం కూడా అక్కడే వదిలి వచ్చాను. వచ్చేటప్పుడు ప్రభాకర్ తో ఒకటి చెప్పాను. నన్ను చాలా చెడుగా చూపించావు. నువ్వు చనిపోయిన కూడా నిన్ను చూడను అని వచ్చాను. ఆయన చనిపోయినా కూడా వెళ్లలేదని అంజు చెప్పుకొచ్చారు.
Also Read: 
2. విరాట్ కోహ్లీ -మిచెల్ జాన్సన్ (2014):
ఆ తరువాత కోహ్లీ 84 పరుగుల దగ్గర ఉన్నపుడు జాన్సన్ వేసిన బంతిని డిఫెండ్ చేసాడు. అయితే వికెట్ పడట్లేదనే అసహనంతో జాన్సన్ బంతిని నేరుగా కోహ్లీ మీదకు విసిరాడు. అది కోహ్లీకి గట్టిగా తగలడంతో కాస్త ఇబ్బంది పడ్డాడు. ఆగ్రహించిన కోహ్లీ తరువాత బంతిని బౌండరీ కొట్టి జాన్సన్ కు గట్టిగా రిప్లై ఇచ్చాడు. అంతేకాకుండా జాన్సన్ బౌలింగ్ చేసినపుడల్లా బౌండరీలు కొట్టాడు. అలా సెంచరీ చేశాడు. 150 పరుగుల చేశాక ఫోర్ కొట్టి జాన్సన్ కి గాల్లోనే ముద్దులు పెట్టాడు.
వికెట్ తీసిన సంతోషంలో స్టోక్స్ తన చేత్తో నోటిని మూసుకుని కోహ్లీని ఎగతాళి చేస్తూ సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. అయితే కోహ్లీ న్యూటన్ థర్డ్ లాను అప్లై చేయడంలో దిట్ట. దాంతో అతను ఎక్కువ ఆలస్యం చేయలేదు. ఆ మ్యాచ్ 2వ ఇన్నింగ్స్ లో స్టోక్స్ 5 రన్స్ చేసి LBW అయ్యాడు. అయితే అంపైర్ దాన్ని అవుట్ గా నిర్ధారించలేదు. దాంతో కోహ్లీ రివ్యూ తీసుకుని బెన్ స్టోక్స్ కు సెండ్ ఆఫ్ ఇచ్చాడు. తన చేతిని నోటి పై పెట్టుకుని చూపిస్తూ బెన్ స్టోక్స్ కు దిమ్మతిరిగే విధంగా రిప్లై ఇచ్చాడు.
వారు అక్కడితో అయిపోయింది అనుకుని ఉంటారు. ఆ విషయన్నిగుర్తుపట్టుకున్న కోహ్లీ, సెకండ్ ఇన్నింగ్స్ లో వారికి మైండ్ బ్లోయింగ్ రిప్లై ఇచ్చాడు. జడేజా బౌలింగ్ లో ఆస్ట్రేలియా తొలి వికెట్ పడగానే కోహ్లీ ఆస్ట్రేలియా ఆటగాళ్లను ట్రోల్ చేసాడు. తన భుజాన్ని పట్టుకుని ఆవేశంతో ఊగిపోతూ సెలెబ్రేట్ చేసుకున్నాడు.
హైదరాబాద్ లో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో కోహ్లీ బ్యాటింగ్ వచ్చి విలియమ్స్ బౌలింగ్ లో కళ్లు చెదిరే సిక్స్ కొట్టాడు. ఆ తరువాత కోహ్లీ విలియమ్స్ చేసినట్టే ఇమాజినరీ నోట్ బుక్ లో రాసుకుని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ దృశ్యాన్ని చూసి షాక్ అయిన విలియమ్స్ నెక్స్ట్ ఇండియాతో ఏ మ్యాచ్ జరిగిన వికెట్ తీసినపుడు సెలబ్రేషన్ చేసుకోలేదు.
ఆ వన్డే సిరీస్ తరువాత జరిగిన టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ రూట్ కు తన స్టైల్లో సమాధానం చెప్పాడు. ఆ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ముందుగా బ్యాటింగ్ చేసింది. మొదటి ఇన్నింగ్స్ లో రూట్ 80 పరుగులు చేశాడు. అయితే సెంచరీకి సమీపంగా ఉన్న సమయంలో రూట్ కోహ్లీ వేసిన బంతికి రనౌట్ అయ్యాడు. కోహ్లీ రూట్ కు తన స్టైల్లో సెండ్ ఆఫ్ ఇచ్చి ప్రతీకారం తీర్చుకున్నాడు. మొదట సైలెన్స్ ప్లీజ్ అన్నట్టు సైగ చేసిన కోహ్లీ, తరువాత బ్యాట్ ఊహించుకుని ఆ బ్యాట్ ను పడేస్తున్నట్టుగా చూపించి రూట్ కు సమాధానం ఇచ్చాడు.
ఈ చిత్రాన్ని దాదాపు 80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం కనీసం 10 కోట్ల షేర్ సాధించలేకపోయింది. ఏజెంట్ సినిమా ఈ సంవత్సరం అతి పెద్ద డిజాస్టర్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం పై అంతటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్కినేని ఫ్యాన్స్ కూడా చాలా నిరాశ పడ్డారు. సాధారణ ప్రేక్షకులు సైతం మూవీ పై కామెంట్లు చేస్తున్నారు. విడుదల అయిన దగ్గర నుంచి మూవీ పై రకరకాలగా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ రిజల్ట్ పై ప్రొడ్యూసర్ అనిల్ సుంకర స్పందించారు.
ఏజెంట్ అపజయానికి బాధ్యత వహిస్తూ ఆడియెన్స్ కి క్షమాపణలు చెప్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సారాంశం ఏమిటి అంటే “ఏజెంట్ మూవీ ఫెయిల్యూర్ కి సంబంధించిన పూర్తి నిందను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ మూవీ మాకు పెద్ద టాస్క్ అని తెలిసినప్పటికీ, విజయం సాధించాలనే పట్టుదలతో ముందుకెళ్లాం. అయితే బౌండెడ్ స్క్రిప్ట్ తమ దగ్గర లేకుండా సినిమాని మొదలు పెట్టి పెద్ద పొరపాటు చేశాం. కోవిడ్‌తో సహా చాలా సమస్యలు రావడం వల్ల విఫలమయ్యాం.
ఫెయిల్యూర్ కు ఎలాంటి సాకులు చెప్పాలని మేము అనుకోవట్లేదు. అయితే ఈ కాస్ట్లీ తప్పు నుండి నేర్చుకుని, మళ్ళీ ఇలాంటి తప్పులను ఎప్పటికీ రిపీట్ కాకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాం. మాపై ఎంతో నమ్మకం ఉంచిన అందరికి మనస్పూర్తిగా క్షమాపణలు తెలియచేస్తున్నాను. రాబోయే సినిమాల విషయంలో పక్కా ప్రణాళికతో కష్టపడి నష్టాలను భర్తీ చేస్తామని తెలియజేస్తున్నాం” అని ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ట్వీట్ చేశారు.
అక్కినేని అఖిల్ ఏప్రిల్ 28 న ఏజెంట్ చిత్రం ద్వారా ఆడియెన్స్ ముందుకు వచ్చారు. సురేందర్ రెడ్డి డైరెక్టర్ కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాల ఏర్పడ్డాయి. అయితే ఈ మూవీకి నెగెటివ్ టాక్ రావడంతో మూవీ పై తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. కాగా అఖిల్ తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. అఖిల్ నెక్స్ట్ మూవీ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఉండబోతుందంట. ఈ చిత్రం ద్వారా అనీల్ అనే కొత్త డైరెక్టర్ టాలీవుడ్ కి పరిచయం కానున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని సమాచారం.
ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ నుండి ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్న అనీల్ గతంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి ఒక స్టోరీ చెప్పాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అనీల్ సాహో, రాదేశ్యామ్ చిత్రాలకు డైరెక్షన్ విభాగంలో పని చేశాడు. సాహో సమయంలోనే యూవీ ప్రొడ్యూసర్లకు ఒక ఐడియా చెప్పడం, వాళ్ళు ఒకే అనడం జరిగిందంట.
ఆ స్టోరీని ప్రభాస్ తో చేయాలని నిర్మాతలు భావించారంట. అయితే సాహో, రాధే శ్యామ్ సినిమాల ఫలితాల కారణంగా అనీల్ చెప్పిన స్టోరీ ప్రభాస్ తో చేయడం సరి కాదని భావించి, అఖిల్ తో ఆ మూవీ చేయనున్నారని టాక్. ప్రభాస్ కోసం తయారుచేసిన స్టోరీతోనే అనీల్ హీరో అఖిల్ తో మూవీ చేస్తున్నాడా ? లేదా వేరే కథతో చేస్తున్నాడా? అనేది తెలియాల్సి ఉంది.
యంగ్ హీరో అఖిల్ మంచి హిట్ కోసం ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాడు. తాజాగా రిలీజ్ అయిన ‘ఏజెంట్’ మూవీకి ప్లాప్ టాక్ వచ్చింది. దీంతో తదుపరి చేయబోయే చిత్రం విషయంలో అఖిల్ చాలా జాగ్రత్తగా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంతో అయినా అఖిల్ కు హిట్ వస్తుందని యూవీ ప్రొడ్యూసర్స్ భావిస్తున్నారంట.
అక్కినేని అఖిల్, సురేందర్ రెడ్డి కలయికలో వచ్చిన ఈ పాన్ ఇండియా మూవీ తెలుగుతో పాటు కన్నడ, తమిళ, హిందీ మలయాళ భాషల్లో కూడా ఒకేసారి విడుదల అయ్యింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా సాక్షి వైద్య నటించగా, మలయాళ మెగా స్టార్ మమ్ముట్టి ముఖ్యమైన పాత్రలో నటించారు. బాలీవుడ్ నటుడు డినో మోరియా విలన్ గా కనిపించారు. ఈ చిత్రం కోసం అఖిల్ అక్కినేని చాలా కష్టపడ్డాడు. పూర్తిగా తన లుక్ నే మార్చుకున్నాడు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ రిలీజ్ అయిన అన్ని చోట్ల నెగెటివ్ టాక్ వస్తోంది.
డైరెక్టర్ సురేందర్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన తీరు పై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. హీరో, డైరెక్టర్ ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. కొందరు అయితే డైరెక్టర్ సురేందర్ రెడ్డికి చేతకాకే ఇటువంటి చిత్రాన్ని తీశారంటూ తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. కొందరు హీరో అఖిల్ నటన పై ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి కథను అందించిన రైటర్ వక్కంతం వంశీని నెట్టింట్లో తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం ఈ మూవీ స్టోరీ కోసం వంశీ భారీగా రెమ్యునరేషన్ తీసుకునట్లు వార్తలు రావడమే.
వక్కంతం వంశీ గతంలో కిక్, ఉసరవెల్లి, ఎవరు, రేసుగుర్రం వంటి పలు హిట్ సినిమాలకు కథలు సమకూర్చారు. మంచి రచయితగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఏజెంట్ సినిమా స్టోరి కోసం వక్కంతం వంశీ 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దాంతో సోషల్ మీడియాలో వక్కంతం వంశీని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ నేతృత్వంలో తమ స్వగ్రామం అయిన నిమ్మకూరులో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటిలో పాల్గొన్న బాలయ్య మాట్లాడుతూ తెలుగువారి హృదయాలలో ఎన్టీఆర్ శాశ్వతంగా నిలిచిపోయారని అన్నారు. ఎన్టీఆర్ కు జన్మనిచ్చిన భూమి అయిన నిమ్మకూరు గ్రామాన్ని పర్యాటక స్థలంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. తమ నాయనమ్మ కట్టించిన ఒక దాబాను కూడా ఎన్టీఆర్ కి అంకితమిస్తున్నామని తెలిపారు.
అన్నగారు అని తెలుగువారు అప్యాయంగా పిలుచుకునే ఎన్టీఆర్ పుట్టిన ఇల్లు ఇప్పటికి నిమ్మకూరులో అలాగే ఉంది. ఆ ఇంట్లో ఆయనకు సంబంధించిన ఫోటోలు, కొన్ని వస్తువులు ఉన్నాయి. ఇక ఈ ఇంటి బాగోగులను హరికృష్ణ కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాకముందే నటుడిగా ఉన్న సమయంలోనే స్వగ్రామం కోసం తన వంతు కృషి చేశారని స్థానికులు తెలిపారు. తన పలుకుబడిని ఉపయోగించి రోడ్డు వేయించారని, వంతెన కట్టించారని అక్కడివారు అన్నారు. ఇక ముఖ్యమంత్రి అయిన తరువాత రెసిడెన్షియల్ స్కూల్, దేవాలయం, హాస్పటల్ కట్టించారని చెప్పారు.
రెసిడెన్షియల్ విద్యాసంస్థల వల్ల నిమ్మకూరుకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటికి కూడా ఈ స్కూల్ లో వందల మంది విద్యార్ధులు చదువుతున్నారు. రెసిడెన్షియల్ స్కూల్ ఇంచార్జ్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈ స్కూల్ లో చదివిన వారిలో డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఎఎస్, ఐపీఎస్, ఇస్రో పనిచేస్తున్నవారు కూడా ఉన్నారని తెలిపారు. మహిళల శిక్షణ మరియు ఉపాధి కోసం నిమ్మకూరులో నైపుణ్యాభివృద్ధి మరియు మహిళా సాధికారత కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పథకాలతో పాటు, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఎన్టీఆర్ తన కుమారుడు హరికృష్ణ నిమ్మకూరులోనే చదివించారు. హరికృష్ణతో కలిసి చదువుకున్నవారు ఇప్పటికి ఇక్కడ ఉన్నారు. అలాగే హరికృష్ణ కుటుంబ సభ్యులు తరుచుగా ఇక్కడికి వస్తుంటారు. శతజయంతి ఉత్సవాలలో భాగంగా బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు నిమ్మకూరులో ఎన్టీఆర్ కి నివాళులు అర్పించిన విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కూడా నిమ్మకూరులో స్థలం కొన్నట్టు తెలుస్తోంది.
ఎన్టీఆర్ హయాంలోనే బందర్ కాలువ వంతెన, వాటర్ ట్యాంక్, రోడ్డు మంజూరు చేయించారని, పనులన్నీ కూడా ఏడాదిలోనే పూర్తి అయ్యాయని స్థానికులు అప్పటి సంగతులను వెల్లడించారు. ఇలా నందమూరి తారక రామారావు గారు తనకు జన్మనిచ్చిన గ్రామం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.
ఢీ షో కొరియోగ్రాఫర్ చైతన్య నెల్లూరులోని ఒక హోటల్ గదిలో ఆదివారం నాడు ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పుల బాధలు తట్టుకోలేక ఇటువంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లుగా చైతన్య సెల్ఫీ వీడియోలో వెల్లడించాడు. అప్పుల తీర్చే శక్తి ఉన్నప్పటికి, ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నానని ఆ వీడియోలో తెలిపాడు. చైతన్య మరణ వార్త షాక్ కు గురి చేసిందని, అతనికి అప్పులు ఉన్నట్టు తమకు తెలియదని సన్నిహితులు అంటున్నారు.
డ్యాన్స్ మాస్టార్ చైతన్య మృతికి యాంకర్ రష్మి, శేఖర్ మాస్టర్, శ్రద్ధాదాస్ లతో పాటు ఢీ షో డ్యాన్సర్లు కూడా సంతాపం తెలుపుతున్నారు. అయితే చైతన్య మరణం గురించి తెలిసి ఢీ కంటెస్టెంట్లు, చైతన్య సన్నిహితులు అప్పుల వల్ల బలవన్మరణానికి పాల్పడ్డాడు అంటే నమ్మలేకపోతున్నాం. చైతన్యకు అప్పులు ఉన్నాయనే సంగతే తమకు ఇప్పటి వరకు తెలియదని, చైతన్య వాటి గురించి తమతో మాట్లాడి ఉంటే అందరం చర్చించుకుని ఈ సమస్యకు మార్గాన్ని ఆలోచించేవాళ్లం, అలాగే చైతన్యకు మద్దతుగా ఉండేవారమని తెలిపారు.
అయితే చైతన్య ఎప్పుడూ తన సమస్యను మాతో షేర్ చేసుకోలేదని, తనలోనే బాధపడి, ఆఖరికి ఇలాంటి డిసిషన్ తీసుకున్నాడని విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ చైతన్య తన సమస్యను, బాధను సన్నిహితులతో పంచుకుని ఉంటే ఇలా అయ్యేది కాదేమో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. తమ బాధని ఎవరితో పంచుకోకుండా తమలో తామే కుంగిపోతూ చివరికి ఇలాంటి నిర్ణయాలు తీసుకుని తమ జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ఇక డాన్స్ మాస్టర్ చైతన్య కూడా అటువంటి తప్పే చేశాడు. తన సమస్య గురించి కానీ, పరిస్థితి గురించి ఎవ్వరితో పంచుకోలేదు. తనలో తానే బాధపడుతూ ఆఖరికి ప్రాణం తీసుకున్నాడు. ఎంతో ఎత్తుకు ఎదుగుతాడనుకున్న కొడుకు తమ కళ్ళ ముందే మరణించడంతో చైతన్య తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు.