హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ లో నటించిన సినిమా ‘మాయా పేటిక’. ఈ మూవీకి ‘థాంక్యూ బ్రదర్’ డైరెక్టర్ రమేష్ రాపర్తి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బేబీ ఫేమ్ విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్, సునీల్ కీలక పాత్రలలో నటించారు.
ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన మాయా పేటిక మూవీ టీజర్ మరియు ట్రైలర్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. జూన్ 30న రిలీజ్ అయిన ఈ మూవీ, ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
ఆర్ఎక్స్ 100తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్, ఆ మూవీ హిట్ అవడంతో వరుస అవకాశాలను అందుకుంది. ఆమె నటించిన లేటెస్ట్ మూవీ మాయా పేటిక. ఈ మూవీ కథ విషయనికి వస్తే, తెలుగులో స్టార్ హీరోయిన్ గా పాయల్(పాయల్ రాజ్ పుత్) రాణిస్తూ ఉంటుంది. ఒక ప్రొడ్యూసర్ పాయల్ కి ఒక స్మార్ట్ ఫోన్ ని గిఫ్ట్ గా ఇస్తాడు. ఆ స్మార్ట్ ఫోన్ పాయల్ కి బాగా నచ్చుతుంది.
అయితే ఒక రోజు ఆ ఫోన్ కు ఏదో సమస్య వస్తుంది. దాంతో ఆ ఫోన్ ను ఆమె తన దగ్గర పనిచేసే అసిస్టెంట్ కి ఇస్తుంది. ఆ ఫోన్ అసిస్టెంట్ దగ్గర నుండి చాలా మంది దగ్గరకి మారుతుంటుంది. ఆ ఫోన్ ఎవరెవరి దగ్గరికి వెళ్ళింది? ఆ ఫోన్ వల్ల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనేది మిగిలిన కథ.
ఈ మూవీలో ఇంట్రెస్టింగ్ విషయం డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్. అది మాత్రమే కాకుండా పలు కామెడీ సీన్స్ ఆకట్టుకుంటాయి. ప్రధాన పాత్రలో నటించిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మంచి నటనని కనబరిచింది. విరాజ్ అశ్విన్, సిమ్రాత్ కౌర్ లు తమ పాత్రలలో ఒదిగిపోయారు. యాక్టర్ శ్రీనివాస రెడ్డి ఎమోషనల్ సన్నివేశాలు కదిలిస్తాయి. మూవీ కాన్సెప్ట్ బాగున్నా, సరైన స్క్రిన్ ప్లే లేకపోవవడం, బాగా సాగదీసిన భావన కలుగుతుంది.
Also Read: “జూనియర్ ఎన్టీఆర్” పై నిరుత్సాహం వ్యక్తం చేస్తూ ఒక అభిమాని రాసిన లెటర్..! ఏం అన్నారంటే..?

పైన కనిపిస్తున్న ఫోటోలోని అబ్బాయి, బాలనటుడుగా ఎన్నో సినిమాలలో నటించి, పేరు ప్రఖ్యాతులను మాత్రమే కాకుండా ఒక హీరోకు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ను, క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. పెద్దయ్యాక తండ్రి వారసత్వాన్ని అందుకుని తెలుగు ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చి, తొలి సినిమాతోనే విజయాన్ని అందుకున్నారు. అమ్మాయిల కలల రాజకుమారుడిగా మారాడు. వరుస సినిమలలో నటిస్తూ, ఎన్నో హిట్ సినిమాలలో నటించి, ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తూ, అవార్డులు అందుకుని, తండ్రిలాగే సూపర్ స్టార్ గా పేరుగాంచారు. ఆయనే సూపర్ స్టార్ మహేష్ బాబు.
టాలీవుడ్ లో మహేష్ బాబుకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలు చేస్తూనే, యాడ్స్ లో నటిస్తూ ఎప్పుడూ బిజీగా ఉండే మహేష్ చేతిలో చాలా యాడ్స్ ఉన్నాయి. పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. టాలీవుడ్ లో ఎవ్వరు చేయనన్ని యాడ్స్ మహేష్ బాబు చేశారు. అలా యాడ్స్ చేయడానికి కారణం ఒక సందర్భంలో మహేష్ వివరించారు.
వాటి వల్ల సంపాదించే డబ్బుతో పేద పిల్లలకు ఫ్రీగా గుండె ఆపరేషన్స్ చేయిస్తారు. పిల్లల కోసమే ఒక ఫౌండేషన్ ను సొంతంగా ఏర్పాటు చేసి ఉచిత హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తున్నారు. అలా ఇప్పటివరకు వెయ్యికి పైగా చేయించారు. ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రెండు గ్రామాలను దత్తత తీసుకున్నాడు. కేవలం డబ్బు ఇచ్చే సంస్థల కోసమే కాకుండా సేవ చేసే పలు సంస్థలకు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ప్రస్తుతం మహేష్ గుంటూరుకారం మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు.
నటి తులసి బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆమె తల్లి, సావిత్రి, అంజలి దేవిలకు స్నేహితురాలు. వారు తరచూ తులసి ఇన్డీటికి వస్తుండేవారు. ఆ క్రమంలో తులసికి బాలనటిగా అవకాశం వచ్చింది. ఆమె చాలా సినిమాలలో బాలనటిగా నటించారు. శంకారాభరణం సినిమాతో తులసి మంచి గురింపు వచ్చింది. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ముద్ద మందారం మూవీతో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత నాలుగు స్థంబాలాట, శుభలేఖ, మంత్రిగారి వియ్యంకుడు, ప్రేమించు పెళ్ళాడు వంటి సినిమాలలో సెకండ్ హీరోయిన్ గా నటించింది.
శుఖలేఖ మూవీ సూపర్ హిట్ అయ్యి, శుభలేఖ సుధాకర్, తులసిల పెయిర్ కు మంచి పేరు వచ్చింది. దాంతో అదే తరహాలో తులసికి వరుస అవకాశాలు వచ్చాయి. అలా సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు, మురళీమోహన్, చంద్రమోహన్, రాజేంద్రప్రసాద్ వంటి హీరోల సినిమాలలో నటించి ఆకట్టుకున్నారు. ఆమె తెలుగులో మాత్రమే కాకుండా మలయాళ, తమిళ చిత్రాలలో కూడా నటించారు. పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలకు దూరం అయ్యారు.
2010 లో ప్రభాస్ హీరోగా నటించిన డార్లింగ్ మూవీతో రీఎంట్రీ ఇచ్చిన తులసి, స్టార్ హీరోలకు తల్లి పాత్రలూ చేస్తూ, బిజీ బిజీగా ఉన్నారు. తులసి కెరీర్ లో దాదాపు 700 పైగా చిత్రాలలో నటించారు. తాజాగా ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు పూర్తయ్యాయి అని హీరో నాని పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ కి నటి తులసి కామెంట్ సెక్షన్ లో “నాని నేను నటి తులసి (నేను లోకల్) నన్ను మీ తల్లిగా భావించి, మీలాంటి అద్భుతమైన నటుడితో కలిసి పనిచేసే అవకాశం ఇవ్వండి” అని రాసుకొచ్చింది. తులసి అలా ఆడగడంతో కొందరు ఆమెని పొగుడ్తున్నారు. కానీ కొందరు మీరు ఇలా అడగడం ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు.
ఆసియా కప్ లో ఆడుతున్న క్రికెటర్ల రెమ్యునరేషన్ వారి వారి జట్ల మ్యాచ్లలో ఆటగాళ్ల ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది. అంటే ఒక జట్టు ఎన్ని మ్యాచ్లు ఆడింది. అందులో ఒక క్రికెటర్ ఎన్ని మ్యాచ్లు ఆడాడు అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఈ రెండింటి మీద మ్యాచ్ ఫీజు అనేది ఆధారపడి ఉంటుంది. ఒక ప్లేయర్ మ్యాచ్లో ఆడనట్లయితే ఆ ప్లేయర్ ఆ మ్యాచ్ కు పారితోషికం అందుకోలేరు.
ఆసియా కప్లో ఇండియా కనీసం 5 మ్యాచ్లు ఆడుతుందని అంచనా. దాన్ని బట్టి అన్ని మ్యాచ్ లు ఆడే క్రికెటర్లు కనీసం 30 లక్షల రూపాయలు సంపాదిస్తారు. ఇక ఫైనల్ మ్యాచ్ లో ఆడిన క్రికెటర్ల సంపాదన మరింతగా పెరుగుతుంది. బోర్డ్ కాంట్రాక్ట్ ప్రకారం ఆసియా కప్ టోర్నీ ఆధారిత ఫీజు కాకుండా, కాంట్రాక్ట్ ప్రకారం ఇండియన్ క్రికెటర్లు శాలరీ పొందుతారు.
సాధారణంగా బీసీసీఐ క్రికెటర్లను A+, A, B, C గ్రేడ్లుగా విభజిస్తుంది. A+ కేటగిరీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా లాంటి టాప్ ప్లేయర్స్ ఉన్నారు. వారి ఏడాది శాలరీ రూ. 7 కోట్లు. ఆర్ అశ్విన్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, మహ్మద్ షమీ, అక్షర్ పటేల్ లాంటి గ్రేడ్ ఏ ప్లేయర్స్ ఏడాది శాలరీ రూ.5 కోట్లు ఉంటుంది.
మాధవి లత ‘నచ్చావులే’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 2008లో రిలీజ్ అయిన ఈ మూవీ విజయం సాధించింది. దాంతో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. అలా మాధవి నాని హీరోగా నటించిన స్నేహితుడా మూవీలో హీరోయిన్ గా నటించింది. ఆ తరువాత అరవింద్-2 మూవీలో నటించింది. అయితే ఆమె తొలిసారి నటించిన మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతిథి. ఈ మూవీలో హీరోయిన్ అమృతా రావ్ ఫ్రెండ్ గా నటించింది. ఆమె తెలుగులోనే కాకుండా కోలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించారు.
మాధవి లత 2018 లో రాజకీయాల్లో అడుగుపెట్టింది. బిజెపి పార్టీలో జాయిన్ అయ్యింది. సినిమాలకు ప్రస్తుతం ఉన్న మాధవి లత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ తో టచ్లో ఉంటూ, తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను తరచూ పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే నెటిజెన్లు ఆమెను తరచూ ఆమె పెళ్లి గురించి ప్రశ్నలు అడుగుతుంటారు.
ఈ క్రమంలోనే తాజాగా ఒక నెటిజెన్ మాధవి లత పై కామెంట్ చేశారు. ఆ కామెంట్ పై బాధపడిన, మాధవి ‘‘పెళ్లి పెటాకులు లేక కొవ్వెక్కి బలిసి కొట్టుకుంటున్నావ్ అన్నాడు. అందుకే వాడికి జవాబు చెప్తున్నా’’ అని ఒక వీడియోను ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.







పిజ్జా 3 మూవీలో అశ్విన్ కాకుమాను, పవిత్ర మరిముత్తు జంటగా నటించారు. మోహన్ గోవింద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ మూవీ కథ విషయానికి వస్తే, నలన్ (అశ్విన్ కకుమాను) ఒక ఫేమస్ రెస్టారెంట్ కు ఓనర్. అతను కయల్ (పవిత్ర) ను ప్రేమిస్తాడు. ఆమె యాప్ డెవలపర్ గా వర్క్ చేస్తుంటుంది. నలన్ కయల్ తో పెళ్లి గురించి ఆమె అన్నయ్య ప్రేమ్ (గౌరవ్ నారాయణన్) పోలీసు అధికారితో మాట్లాడగా, అతను నలన్ అవమానిస్తాడు.
నలన్ రెస్టారెంట్లో కొన్ని వింత సంఘటనలు జరగడం మొదలవుతాయి. నలన్ కు తెలిసిన వ్యక్తులు వరసగా చనిపోతుంటారు. వాటికి కారణం చిన్న ఈజిప్ట్ మమ్మీ బొమ్మ. వరుస మరణాలకు, ఈ బొమ్మకు ఉన్న సంబంధం ఏమిటి? ఆ బొమ్మలో ఉన్న ఆత్మ వారిని చంపడానికి కారణం ఏమిటి ? చివరకు ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.
అశ్విన్ కకుమాను ఇప్పటికే చాలా సినిమాలలో నటించి యాక్టర్ గా సత్తాను చాటుకున్నాడు. పలు హారర్ చిత్రాలలో నటించిన అశ్విన్ ఈ మూవీలో కూడా ఆకట్టుకున్నాడు. పిజ్జా 3 రొటీన్ హారర్ రివెంజ్ మూవీ. తమిళంలోనే యావరేజ్ గా నిలిచిన మూవీని తెలుగులో విడుదల చేశారు. ఇప్పటికే తెలుగు ఆడియెన్స్ ఇలాంటివి ఎన్నో చూశారు. దాంతో ఈ మూవీ చూస్తున్నప్పుడు తరువాత వచ్చే సీన్ సులభంగా ఊహించగలరు. హర్రర్ మూవీ అయినా అంతగా భయపెట్టలేదు. డబ్బింగ్ క్వాలిటీ బాగుంది.





