సాళువ తిమ్మరుసు గొప్ప చక్రవర్తి అయిన శ్రీకృష్ణ దేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యానికి మంత్రిగా ఉండేవారు. ఆయనను శ్రీకృష్ణ దేవరాయలు అప్పాజీ అని ముద్దుగా పిలిచేవారు.
శ్రీకృష్ణ దేవరాయల సవతి సోదరుడు రాజు తుళువ నర్సింహ రాయల చనిపోయిన తరువాత అప్పాజీ రాయలను రాజును చేశాడు. అయితే అనారోగ్యంతో ఉన్న రాజు తుళువ నర్సింహ రాయల తన చిన్న కుమారుడిని రాజును చేయాలనే ఉద్దేశ్యంతో కృష్ణదేవ రాయలను అంధుడిగా చేయమని తిమ్మరుసుకు చెబుతాడు.
ప్రధాన మంత్రి తిమ్మరుసు రాజు అనంతరం సమర్ధుడైన పాలకుడిగా కృష్ణరాయలను భావించి, మేక కళ్ళను తెచ్చి రాజుకు కృష్ణరాయల కళ్ళుగా చూపిస్తాడు. వాటిని చూసి సంతృప్తి చెందిన రాజు ప్రశాంతంగా మరణించాడు. ఆ తరువాత తిమ్మరుసు కృష్ణదేవరాయ చక్రవర్తిగా చేశాడు. అప్పాజీ సహకారంతో కృష్ణదేవరాయ గొప్ప చక్రవర్తిగా ఎదిగాడు. విజయనగర సామ్రాజ్యా కీర్తిని నలు దిశలలో చాటుతూ, గొప్ప చక్రవర్తిగా పేరు గాంచాడు.
శ్రీకృష్ణ దేవరాయలకు తిరుమల దేవి, చిన్నాదేవి అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. ఆ తరువాత యుద్దంలో ప్రతాపరుద్ర గజపతిని ఓడించి, ఆయన కూతురైన తుక్కా దేవిని మూడవ భార్యగా స్వీకరించాడు. ఈమెనే కొందరు లక్ష్మీదేవి అని, జగన్మోహిని అని కూడా పిలిచేవారు. విజయనగరానికి లక్ష్మీదేవితో పాటు ఆమె పినతండ్రి కూడా రావడం జరుగుతుంది. బహుమనీ సుల్తానులు విజయనగరం మీదకు దండేతిన సమయంలో విజయనగర సామ్రాజ్యం గజపతులకు దక్కాలనే కుట్రతో లక్ష్మీ పినతండ్రి ఓ పన్నాగం పన్నుతాడు.
అతను అనుకున్నది జరగాలంటే అంటే మహామంత్రి తిమ్మారుసును రాజ్యానికి దూరం చేయాలని భావిస్తాడు. అతని తెలివితోనే విజయనగర సామ్రాజ్యం గొప్పగా మారిందని గ్రహించి రాయలకు తిమ్మారుసును దూరం చేయాలని అనుకుంటాడు. దానిలో భాగంగా రాయలు యుద్ధానికి వెళ్లేముందు కుమారుడు తిరుమల రాయలకు పట్టాభిషేకం చేయమని కుమార్తె లక్ష్మితో చెప్పిస్తాడు. అప్పాజీని అడిగి నిర్ణయం తీసుకుండామని చెప్పినా వినకుండా పదే పదే అడగడంతో కుమారును పట్టాభిషేకానికి రాయలు ముహూర్తం నిర్ణయిస్తారు.
అయితే తిమ్మరుసు మీద రాజద్రోహం ముద్ర వేయడం కోసం గజపతుల నుండి విషం తెప్పించి, పట్టాభిషేకానికి ముందు చిన్నపిల్లవాడైన తిరుమల రాయలకు విషయం తాగించి, ఆ పిల్లవాడిని తిమ్మరుసు ఉన్న ప్రదేశంలో వదలగా, బాధతో ఆరుస్తున్న తిరుమల రాయలను ఎత్తుకుని రాయల మందిరంలోకి తిమ్మరుసు తీసుకెళ్తాడు. కానీ ఆ లోపే తిరుమల రాయలు మరణిస్తాడు. అప్పుడు లక్ష్మీ పినతండ్రి తిరుమల రాయలను చంపింది తిమ్మారుసు అని చెప్పడంతో రాయలు కోపంతో అల చెప్పడానికి ఏదైనా సాక్ష్యం ఉందా అని అడుగుతాడు.
తిమ్మారుసుకి గజపతులు అంటే పగ అనే విషయం మీకు తెలుసు. లక్ష్మీ కుమారుడు రాజు అవడం ఇష్టం లేకపోవడం వల్లే చంపాడని చెప్తాడు. మిమ్మల్ని చంపానని చెప్పి, తరువాత రాజును ఎలా చేశాడో, అలాగే మీ కొడుకుని చంపి మీ తమ్ముడు అచ్యుత రాయలను రాజును చేయాలనుకున్నాడని అంటాడు. కుమారుడు చనిపోయిన బాధలో ఉన్న రాయలు దానిని నమ్మి తిమ్మారుసును బంధించమని, అది రాజద్రోహంగా భావించి తనను పెంచి పెద్ద చేసిన తిమ్మరుసు రెండు కళలు పొడిచేయమని ఆజ్ఞాపిస్తాడు.
అయితే కొంతకాలానికి గజపతుల వల్లే ఇది జరిగిందని తెలుసుకుని తిమ్మారుసుని క్షమించమని వేడుకుని రాజ్యానికి తీసుకురాగా, ఆయన ఇంకా మంత్రిగా ఉండలేనని తిరుపతికి వెళ్ళి చివరి రోజులు అక్కడే గడిపాడని శాసనాల ద్వారా తెలుపబడింది. రాయలు తప్పు చేశాననే తీవ్ర వేదనతో అనారోగ్యం పాలయ్యారు మరియు కొంతకాలానికి మరణించారు. ఇదే గొప్ప చక్రవరి అయిన శ్రీకృష్ణ దేవరాయల జీవితంలో చేసిన అతి పెద్ద పొరపాటు అని అంటారు.
Also Read: మొగల్ చక్రవర్తి బాబర్ కి శ్రీకృష్ణదేవరాయలంటే అంత భయమెందుకు..? విజయనగరంపై అందుకే కన్నేయలేదు.!

రీసెంట్ గా ‘బిహైండ్ వుడ్స్’ అవార్డ్స్ వేడుక జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో సినీ సెలబ్రిటీలు హాజరు అయ్యారు. ఇక ఈ వేడుకకు అల్లు అర్జున్ కూడా హాజరయ్యారు. ఈ అవార్డ్స్ ప్రధానంలో భాగంగా ‘గోల్డెన్ ఐకాన్ ఆఫ్ ఇండియన్ సినిమా’ అవార్డ్ కు అల్లు అర్జున్ ఎంపిక కాగా, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ అవార్డ్ ను బన్నీకి అందచేశారు. అవార్డ్ తీసుకున్న తరువాత అల్లు అర్జున్ మాట్లాడుతుండగా వేదిక పైకి తన చిన్ననాటి స్కూల్ టీచర్ రావడంతో అల్లు అర్జున్ ఆశ్చర్యపోయారు. అలాగే టీచర్ కి పాదాలకి నమస్కరించారు.
బన్నీ తన టీచర్ గురించి మాట్లాడుతూ “ఆమె పేరు అంబికా కృష్ణన్, 3వ తరగతిలో క్లాస్ టీచర్ అని, ఆమె తనకు చాలా విషయాలను నేర్పించారని తెలిపారు. మా తరగతిలో నేనే లాస్ట్ ర్యాంకర్ ను, అయినప్పటికీ తన టీచర్ ఎప్పుడు తనని ఏమి అనలేదని, లైఫ్ అంటే చదువు ఒక్కటే కాదని, జీవితం ప్రతి ఒక్కరికీ వరమని, దాన్ని అర్థం చేసుకుంటే తప్పకుండా నువ్వు గొప్ప స్థానానికి వెళ్తావని చెప్పేవారని” అన్నారు. తన టీచర్ ను ఇలా ఇక్కడ కలవడం చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు.
తనకు చిన్నతనం నుండి స్ఫూర్తి నింపే విధంగా చిన్న చిన్న కోట్స్ రాసే అలవాటు ఉంది. తాను రాసిన కోట్స్ లో ‘only kindness is remembered forever’ కోట్ రాయడానికి స్ఫూర్తి నా టీచరే అని వెల్లడించారు. అల్లు అర్జున్ తన టీచర్ గురించి మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.
పవన్ కల్యాణ్ పేరు వింటేనే ఆయన ఫ్యాన్స్ ఊగిపోతుంటారు. తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ కు ఉన్న క్రేజ్ అందరికి తెలిసిందే. ఇక దర్శకుడు హరీష్ శంకర్ కూడా పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. ఒక ఫ్యాన్ తమ అభిమాన హీరోతో మూవీ తీస్తే ఎలా ఉంటుందో ‘గబ్బర్ సింగ్’ తో హరీష్ శంకర్ నిరూపించాడు. ఇప్పుడు అదే విషయాన్ని ఇంకా గట్టిగా చెప్పేందుకు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో రానున్నాడు.
సరిగ్గా 11 సంవత్సరాల తరువాత వీరి కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే చిత్రం తెరకెక్కుతుంది. గబ్బర్ సింగ్ మూవీ విడుదల అయ్యి నిన్నటికి (మే 11 ) పదకొండు ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ గ్లింప్స్ మూవీ యూనిట్ విడుదల చేసింది. హరీష్ శంకర్ తన అభిమాన హీరోని వెండితెర పై ఆవిష్కరించిన విధానానికి ఈ గ్లింప్స్ స్మాల్ టచ్ అని, మూవీ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది.
ఈ గ్లింప్స్ మాస్ పోలీస్ ఆఫీసర్‌గా పవన్ కనిపిస్తున్నారు. “ఈసారి పెర్ఫార్మన్స్ బద్దలైపోతుంది” అని పవర్ స్టార్ చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దాంతో సోషల్ మీడియా వేదికగా అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఇటు టాలీవుడ్ సెలెబ్రెటీలు హరీష్ శంకర్ కు అభినందనలు తెలుపుతున్నారు.
అయితే రవితేజ పేరు ఉన్న ట్విట్టర్ ఖాతా నుండి ఒక యూజర్ “హరీష్ ఈసారి గబ్బర్ సింగ్ కంటే పెద్దగా ప్లాన్ చేస్తున్నావు. గుడ్ లక్” అని పోస్ట్ పెట్టారు. ఆ ఖాతాకి బ్లూ టిక్ ఉండడంతో హీరో మాస్ మహారాజ రవితేజ పోస్ట్ అనుకున్న హరీష్ శంకర్ ఎమోషనల్ గా, “అన్నయ్యా ఈ మొక్క నువ్వు నాటిన మొక్క.. ఎన్నిసార్లయినా చెప్తా ఇదే ముక్క” అని రిప్లై ఇచ్చారు. అయితే అది హీరో రవితేజ అకౌంట్ కాకపోవడంతో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూసుకోవాలి కదా అన్నా అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

రివ్యూ:
తొలి సీజన్ ఆరు-ఎపిసోడ్ల సిరీస్. స్టోరీ మొదలైన విధానం బాగున్నప్పటికీ, అదే ఇంటెన్సిటీ తో చివరి వరకు కొనసాగించలేకపోయారు. దర్శకుడు హీరో పాత్ర ద్వారా ఏం చెప్పాలని అనుకున్నాడో క్లారిటీ లేదు.రిపీటెడ్ సన్నివేశాలు, పొలిటికల్ సన్నివేశాలు అంతగా పండలేదు.నవదీప్, బిందుమాధవి పాత్రల నటన తప్ప మిగిలిన క్యారెక్టర్స్ నటన సహజంగా అనిపించదు. కథలో ఎస్ఐ ఎడ్విన్ పాత్ర ఎంట్రీ తరువాత కథనం కాస్త ఊపందుకుంది.
తొలి సీజన్ చివరలో ఎస్ఐకు శివకు మధ్య గొడవతో ఎండ్ చేయడంతో సీజన్ 2 పై కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. జర్నలిస్ట్ శివగా సీరియస్‌గా ఉండే పాత్రలో నవదీప్ ఒదిగిపోయాడు.సెటిల్డ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. శివను ఇష్టపడే నీల పాత్రలో బిందుమాధవి నటించింది. కానీ ఈ పాత్రకు తొలి సీజన్లో అంతగా ఇంపార్టెన్స్ లేదు. పోలీస్ ఆఫీసర్ ఎడ్విన్ క్యారెక్టర్ లో నంద గోపాల్ నటన అద్బుతంగా ఉంది. శివ స్నేహితులు నటన,కొన్ని డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.
మైనస్ పాయింట్స్ :
రవితేజ నటించిన రావణాసుర మూవీ రీసెంట్ గా విడుదలై, ప్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే రవితేజ తాజాగా తన పారితోషికాన్ని భారీగా పెంచినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు రవితేజ ఒక్కో మూవీకి 15 కోట్లు రెమ్యూనరేషన్ అందుకునేవారంట. అయితే ప్రస్తుతం 25 కోట్లు నిర్మాతలను డిమాండ్ చేస్తున్నారట. రీసెంట్ గా కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ తో రవితేజ ఒక సినిమాను చేయడానికి ఒకే చెప్పాడు. ఇక ఈ చిత్రం కోసం 25 కోట్లు పారితోషికం అడిగినట్లు సమాచారం.
రవితేజ డిమాండ్ కి మొదట ప్రొడ్యూసర్స్ షాక్ అయినప్పటికి, ఆ తర్వాత రవితేజ అడిగినంత ఇవ్వడానికి అంగీకరించారని సినీ వర్గాలలో టాక్. ప్రస్తుతం ఉన్న యువ స్టార్ హీరోలు 25 – 50 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నారు. ఇక ఇప్పుడు వాళ్ల కంటే కొంచెం సీనియర్ హీరో రవితేజ రెమ్యూనరేషన్ ఈ రేంజ్ లో డిమాండ్ చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ గా మారింది.
ఇటీవల రవితేజ సినిమా రావణాసుర ప్లాప్ అయినా ఆయన పారితోషికం పెంచడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. రవితేజ ప్రస్తుతం ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ షూటింగ్ పూర్తి చేసి, నెక్స్ట్ మూవీ ‘ఈగల్’ షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. సినిమాటోగ్రాఫర్ అయిన కార్తీక్ ఘట్టమనేని ‘ఈగల్’ మూవీతో డైరెక్టర్ గా మారుతున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20న రిలీజ్ కాబోతోంది.
1967లో ఎనిమిదో మరియు చివరి నిజాంగా ముకర్రం ఝా ప్రమాణం చేశారు. ఆ తరువాత ఆయనకు తన తాతయ్య నుండి డజనుకు పైగా ప్యాలెస్‌లు, మొగల్ కళాఖండాలు, వజ్రాలు, వంద కిలోల బంగారం, వెండి ఆభరణాలు, విలువైన రాళ్లు వారసత్వంగా సంక్రమించాయి. అయితే, ఆయన మరణించే ముందు రూ.4000 కోట్ల విలువైన ఆస్తిని కోల్పోయారు. ఆ సంపద ఎలా పోయిందనే విషయాన్ని “ద లాస్ట్ నిజాం: రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఇండియాస్ గ్రేటెస్ట్ ప్రిన్స్లీ స్టేట్” లో జాన్ జుబ్రిస్కీ వెల్లడించారు.
అయితే అప్పటికి పరిస్థితులు చాలావరకు మారిపోయాయి. ఎంతో సందపను నిజాం కోల్పోయారు’’ అని చెప్పినట్టుగా ఆ పుస్తకంలో తెలిపారు. ‘‘మా తాతయ్య మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సాయంత్రం ప్యాలస్‌లో ఉండే తోటకు వెళ్లేవారు. అప్పుడు ఆ తోటలోకి ఆయన భార్యలు అందరు వచ్చేవారు. అప్పుడు మా తాతయ్య ఏ రాణి భుజం మీద తెల్లని రుమాలు వేస్తే, ఆమె రాత్రి తొమ్మిది గంటలకు ఆయన గదిలోకి వెళ్ళేవారని’’అని ముకర్రం ఝా తనతో తెలిపినట్లుగా జుబ్రిస్కీ తన పుస్తకంలో రాశారు.
అయితే, ఈ విలాసాల మధ్య ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కుమారులు, మనవళ్ల సంఖ్య భారీగా పెరిగింది. ఆయన మరణించే నాటికి సుమారు వంద మంది దాకా వారసులు ఉండేవారు. అది 2005నాటికి 500 దాటిపోయింది. వీరిలో అనేక మంది ఆస్తిలో వాటా కోరుతూ చివరి నిజాం ముకర్రం ఝా పై కోర్టులో కేసులు వేశారు.
భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ప్రభుత్వం పాట సంస్థానాలన్నీటిని అధీనంలోకి తీసుకోవడం కొనసాగించారు. ఆ సమయంలో ముకర్రం ఝా ఇంగ్లాండ్, యూరప్ లలో వంతెనలు కట్టడం, మందు పాతరాలు పెట్టడం నేర్చుకుంటున్నారు. చివరికి 1967లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చనిపోయిన తరువాత నిజాం వారసుడిగా బాధ్యతలు తీసుకున్న ముకర్రం ఝా ఎన్నో సమస్యలు చుట్టుముట్టాయి. మా తాతయ్య వద్ద 14,718 మంది పని చేసేవారు. అలాగే ఆయన 42 మంది భార్యలు, 100 మంది పిల్లలున్నారు. వీరందరి ఖర్చులు ఎక్కువగా ఉండేవి.
చౌమహల్లా ప్యాలెస్ కాంప్లెక్స్‌లో దాదాపు 6,000 మంది సిబ్బంది ఉండేవారు. మరో 5,000 మంది రక్షణ సిబ్బంది ఉండేవారు. ఇక నిజాం వంట శాలలో రోజుకు 2,000 మందికి భోజనం తయారుచేసేవారు. దానిలో ఎక్కువ శాతం సేవకులు బయట హోటల్ లలో అమ్ముకునేవారని ఒక ఇంటర్వూలో చెప్పారు. నిజాం గ్యారేజీలో రోల్స్ రాయిస్ లాంటి ఖరీదైన కార్లు ఉండేవి. ఈ కార్ల కోసం పెట్రోలకు అప్పట్లోనే సంవత్సరానికి 90,000 అమెరికా డాలర్లు ఖర్చు అయ్యేది అని చెప్పారు.
ఇక 1968లో ముకర్రం ఝాకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మొదటిసారి ఎదురుదెబ్బ తగిలింది. నిజాం సంపదను వారసులంతా సమానంగా తీసుకోవాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసును వేసింది ముకర్రం ఝా సోదరి షెహజాదీ పాషా. ఆ తర్వాత, పశ్చిమ ఆస్ట్రేలియాలో డాక్టర్ గా పనిచేస్తున్న తన కేంబ్రిడ్జ్ ఫ్రెండ్ జార్జ్ హాబ్డేను ముకరం జా కలవడానికి వెళ్లారు. అక్కడ ఆయన జీవితం మరో మలుపు తిరిగింది. ఆయన అక్కడే ఓ ఫామ్ హౌజ్ తీసుకున్నారు. అప్పుడే ఆయనకు గొర్రెలను పెంచే ముర్చిసన్ హౌస్ స్టేషన్ గురించి తెలిసింది.
ఆ తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన హెలెన్ సైమన్స్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. హెలెన్ ఎయిడ్స్‌తో మరణించారు. కుమారుడు, ప్రిన్స్ ఒమర్ జా డ్రగ్స్‌ను ఓవర్ డోస్ తీసుకోవడంతో మరణించారు. ఇక ఆస్ట్రేలియాలో ఆయన ఎస్టేట్ 500 ఎకరాల్లో విస్తరించింది. ఇటు హైదరాబాద్‌లో ఆయన ఆస్తులను ఇతరులు ఆక్రమించడం క్రమంగా పెరిగింది. అయితే ఆస్ట్రేలియాలో ముకర్రం ఝా మిలియన్ డాలర్ల ఆస్తులు కొనుగోలు చేశారు. వీటిలో భారీ బుల్డోజర్లు, ఒక భారీ షిప్, లాండ్మైన్లను కనిపెట్టే యంత్రాలు, ఒక బంగారు గని ఉన్నాయి.
అయితే, ఖర్చులు పెరగడంతో తన దగ్గర ఉన్న విలువైన వజ్రాలు, ఆభరణాలను స్విట్జర్లాండ్ లో విక్రయించారు. ఆ తరువాత ఆస్ట్రేలియాలో ఖర్చులు రోజు రోజుకి పెరడడంతో డబ్బు కోసం ఆయన ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అప్పులు పెరగడంతో ముకరం ఝా దివాళా తీసే స్థితికి వచ్చారు. ఆ సమయంలో భారత ప్రభుత్వం నిజాం ట్రస్టుకు చెందిన విలువైన ఆభరణాలను అమ్మడం పై ఆంక్షలు విధించింది. 1996 లో ఆస్ట్రేలియా, యూరప్‌లలోని ఆస్తులను అమ్మేయాల్సి వచ్చింది. ఆయన నౌకను అక్కడి అధికారులు జప్తు చేసారు. బుల్డోజర్లు, కార్లను వేలం వేశారు.
ఆ ఏడాది ఒకరోజు శుక్రవారం నమాజ్ కు వెళ్తున్నానని సెక్రటరికీ చెప్పి వెళ్లారు. ఆ తరువాత ఆయన ఆస్ట్రేలియాలో కనిపించలేదు. తన మీద ఉన్న కేసులకు భయపడి తుర్కియేకు వెళ్లిపోయారు. ఆయన జీవితాంతం అక్కడే ఉన్నారు. 2002 లో భారత ప్రభుత్వం నిజాం ట్రస్టు నుంచి తీసుకున్న ఆభరణాలకు 22 మిలియన్ డాలర్లు చెల్లించినప్పటికి అది మార్కెట్ విలువలో కేవలం పావు వంతు మాత్రమే చెబుతారు. 2023 ప్రారంభంలో ముకరం ఝా మరణం, తరువాత ఆయనకు హైదరాబాద్ లో అధికార లాంచనాలతో అంత్యక్రియలను నిర్వహించారు.
కవల ఆడపిల్లలు పుట్టారని ఓ తండ్రి భార్యని, పిల్లలను వదిలిపెట్టాడు. దాంతో ఆ ఇద్దరు ఆడ పిల్లలను తాతయ్య, అమ్మమ్మలు చదివించారు. వారి కష్టం వృధా కాలేదు. ఆ ఆడ పిల్లలు బాగా చదువుకుని ఎస్ఎస్సి రిజల్ట్స్ లో 10 జిపిఏ తెచ్చుకున్నారు. కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం మండలంలోని కేశవ పట్నం అనే గ్రామానికి చెందిన రిటైర్ ఉద్యోగి అయిన అల్లంకి వీరేశంకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు.
వీరేశం కుమార్తె కవితను పెద్దపల్లి కలెక్టరేట్ లో ఔట్సోర్సింగ్ విభగంలో ఎలక్ట్రానిక్స్ జిల్లా మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు. 16 సంవత్సరాల క్రితం కవితను డెలివరీ కోసం ఏడవ నెలలో భర్త పుట్టింటికి పంపించాడు. అయితే కవితకు కవల ఆడపిల్లలు జన్మించడంతో భర్త ఆమెను పుట్టింట్లోనే వదిలేశాడు.
ఇక అప్పటి నుండి కవితను, ఆమె పిల్లలను అమ్మ వనజ, నాన్న వీరేశం చూసుకుంటున్నారు. ఇద్దరు ఆడపిల్లలు శార్వాణి, ప్రజ్ఞాని 5వ తరగతి వరకు ప్రైవేట్ బడిలో , 6 వ తరగతి నుండి మోడల్ స్కూల్లో చదువును కొనసాగించారు. తాజాగా రిలీజ్ అయిన 10 వ తరగతి ఫలితాల్లో శార్వాణి, ప్రజ్ఞాని 10 జిపిఏ తెచ్చుకుని రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా శార్వాణి, ప్రజ్ఞాని మీడియాతో మాట్లాడుతూ తమ అమ్మమ్మ తాతయ్యలు, తమ స్కూల్ ప్రిన్సిపాల్ జ్యోతి ప్రోత్సాహంతో బాగా చదివి 10 జిపిఏ సాధించగలిగామని వెల్లడించారు.
#1 గుజరాత్ టైటాన్స్:
#2 చెన్నై సూపర్ కింగ్స్:
#3 ముంబై ఇండియన్స్:
#4 లక్నో సూపర్ జెయింట్స్:
#5 రాజస్థాన్ రాయల్స్:
#6 కోల్‌కతా నైట్ రైడర్స్:
#7 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
#8 పంజాబ్ కింగ్స్.:
#9 సన్‌రైజర్స్ హైదరాబాద్:
#10 ఢిల్లీ క్యాపిటల్స్:
అయితే ఆ తర్వాత ఢిల్లీ తన ఆటను మెరుగుపరుచుకుని, 5 మ్యాచ్‌ల లో 4 మ్యాచ్ లు గెలిచింది. అయితే చెన్నై జట్టు చేతిలో ఓటమి పాలవడంతో ఈ జట్టు ప్లేఆఫ్స్ ఆశలు ఆవిరి అయ్యాయి. ఇక ఈ జట్టు ప్లేఆఫ్స్ చేరేందుకు కేవలం 2 శాతం ఛాన్స్ ఉంది.
నట సార్వభౌమ నందమూరి తారక రామారావు తెలుగు, హిందీ, తమిళం భాషలలో కలిపి సుమారు 400 చిత్రాలలో నటించి గొప్పనటుడుగా గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఆయన తన కెరిర్ లో నటించిన చాలా చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి, బాక్సాఫీస్ దగ్గర రికార్డులను సృష్టించాయి. ఎన్టీఆర్ నటించిన చిత్రాలలో ‘పాతాళభైరవి’ మూవీ ఒకటి. ఇప్పటికీ ఈ చిత్రం టీవీలో ప్రసారమైతే చూసేవారు చాలామంది ఉన్నారు.
తాజాగా ఈ చిత్రం గురించి టాలీవుడ్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన తన ఛానెల్ పరుచూరి పలుకుల్లో ఈ సినిమా గురించి మాట్లాడుతూ, ఈ మూవీ తరువాత ఎన్టీఆర్ కు ఎంతో మంది ఫ్యాన్స్ గా మారారని చెప్పారు. బి.నాగిరెడ్డి, కేవిరెడ్డి, చక్రపాణి వీరంతా చాలా గొప్పవారని అన్నారు. ఈ సినిమా అప్పట్లో అద్భుతమని అన్నారు. ధైర్యే సాహసే లక్ష్మి అనే పాయింట్ తో దర్శకనిర్మాతలు అప్పట్లో సంచలనం సృష్టించారని చెప్పారు.
ఈ చిత్రానికి ముందు వరకు జానపద చిత్రాలంటే అక్కినేని నాగేశ్వరరావు గారు గుర్తుకు వచ్చేవారని తెలిపారు. అయితే పాతాళ భైరవి సినిమా విడుదలైన తరువాత జానపదం అంటే ఎన్టీఆర్ అనేంతగా ఆయన ప్రభావం చూపారని వెల్లడించారు. జానపదం, సాంఘికం,చారిత్రకం, పౌరాణికం లాంటి చిత్రాలలో ఎన్టీరామరావుగారు జీవించేవారని చెప్పారు. ఇక పాతాళభైరవి చిత్రాన్ని ఎన్నిసార్లు చూసినప్పటికి, మళ్ళీ చూడాలనిపించేలా ఏదో కొత్తదనం ఈ సినిమాలో కనిపిస్తుందని తెలిపారు.
ఆ మూవీలోని డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని, ఆడియెన్స్ ని ఆకట్టుకుంటాయని అన్నారు. యస్.వి. రంగారావుని మాంత్రికుడిగా చూస్తే భయమేసేదని అన్నారు. రీరిలీజ్ చేసినా వంద రోజులు ఆడే చిత్రాల లిస్ట్ లో ఈ చిత్రం ముందు ఉంటుందన్నారు. ఈ చిత్రం ఓటీటీల్లో ఉన్నట్లయితే చూడమని అందరిని పరుచూరి కోరారు.
అయితే ఆస్ట్రేలియా పాకిస్తాన్ మధ్య జరిగిన ఒక మ్యాచ్ లో పాక్ బ్యాట్స్ మెన్ జావేద్ మియాందాద్ ఆస్ట్రేలియా బౌలర్ బిల్లీ వేసిన బంతిని ఎదుర్కొని రన్స్ కోసం పరుగెడుతున్న సమయంలో బిల్లీని ఢీ కొన్నాడు. చెప్పాలంటే బిల్లీ కావాలనే జావేద్ కు అడ్డుగా వచ్చాడు. అక్కడితో ఆగకుండా అంపైర్ దగ్గర ఉన్న స్వెటర్ తీసుకుంటూ పక్కనే ఉన్న జావేద్ ను కాలితో తన్నాడు. దాంతో జావేద్ కు కోపం వచ్చి బిల్లీని బ్యాట్ తో కొట్టబోయాడు. కానీ అంపైర్ అతన్ని ఆపి, ఇద్దరినీ కూల్ చేసి పంపించాడు.
2. ఇండియా పాకిస్థాన్ మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ లో పాక్ బౌలర్ షాహిద్ అఫ్రిది భారతజట్టులో ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లను అవుట్ చేసి, ఇండియాను ఓడించాలనే కోరికను తీర్చాడు. ఆ తరువాత మ్యాచ్ లో అఫ్రిది బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు పాక్ ఆడియెన్స్ ముందు మ్యాచ్ లో అవుతా అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కే ఎల్ రాహుల్ పేర్లను పదే పదే అరుస్తు ఉన్నారు. వారి అరుపులు విన్న అఫ్రిది ఆ ముగ్గురు బ్యాట్స్ మెన్స్ ఎలా అవుట్ అయ్యారో ఇమిటేట్ చేసి చూపించారు. ఇంటర్నేషనల్ ప్లేయర్ అయిన అఫ్రిది ఇలా చేయడం సిగ్గుచేటని చెప్పవచ్చు.
3. అతిధి దేవో భవ అని అంటుంటాం. కానీ ఈ విషయం ఇంగ్లండ్ ఫ్యాన్స్ మాత్రం పాటించలేదు. క్రికెట్ దేవాలయంగా భావించేటువంటి లార్డ్స్ మైదానంలో ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ లో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న కే ఎల్ రాహుల్ పై ఇంగ్లాండ్ ఫ్యాన్స్ షంపైన్ బాటిల్ క్యాప్స్ విసిరేశారు. దీన్ని చూసిన విరాట్ కోహ్లీ వాటిని తిరిగి వారి పైకి విసిరేయమని అన్నాడు. ఫ్యాన్స్ చేసింది చూసిన కామెంటేటర్స్ కూడా వాళ్ళు చేసిన పనికి వారిని అసహ్యించుకున్నారు.
4. క్రికెట్ లో అంపైర్ డిసిషన్ ని ఫైనల్ డిసిషన్ గా తీసుకుంటారు. కానీ కొన్నిసార్లు ప్లేయర్స్ అత్యుత్సాహంతో టెంపర్ మెంట్ ను అంపైర్ పై అరుస్తూ ఉంటారు. ఇలాంటిదే ఢాకా ప్రీమియర్ లీగ్ లో జరిగింది. ఒక మ్యాచ్ లో షకిబ్ అల్ హాసన్ బౌలింగ్ చేస్తూ ఎల్బిడబ్ల్యు కోసం పదే పదే అప్పీల్ చేశాడు. కానీ అంపైర్ స్పందించక పోవడంతో షకిబ్ అల్ హాసన్ కోపంగా వెళ్ళి స్టంప్స్ ని తన్నాడు.
5. ఇండియా శ్రీలంక మధ్య జరిగిన ఒక మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తున్నసెహ్వాగ్ సెంచరీకి ఇంకా ఒక పరుగు అవసరం ఉన్న సమయంలో సూరజ్ రందీవ్ సెంచరీని అడ్డుకోవడానికి చివరి బంతిని ఉద్దేశపూర్వకంగా నో బాల్ వేసాడు. సెహ్వాగ్ దాన్ని సిక్సర్ కొట్టాడు. భారత్ గెలిచింది. కానీ సెహ్వాగ్ సెంచరీ మిస్ అయ్యాడు. నో బాల్ వేసిన సూరజ్‌కు ఒక మ్యాచ్ నిషేధం విధించారు.
6. 2012 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియన్ ఫ్యాన్స్ విరాట్ కోహ్లీని అసభ్యకరమైన కామెంట్స్ చేశారు. వాటిని విన్న కోహ్లీ వాళ్ళకి తన మిడిల్ ఫింగర్ ను చూపించాడు. అలా చేసినందుకు కోహ్లీ మ్యాచ్ ఫీజ్ లో 50% కోత విధించారు. అలాగే ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడు. తరువాత తప్పు తెలుసుకుని ఇలా చేయడమే తప్పే, కానీ వాళ్ళు నీ తల్లి, చెల్లి అంటూ అసభ్యకరమైన మాటలు మాట్లాడితే ఏం చేయాలి అని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు.
7. 2009లో పాకిస్థాన్‌తో టెస్ట్ మ్యాచ్ కోసం శ్రీలంక జట్టు లాహోర్‌లోని గడాఫీ స్టేడియంకు వెళుతుండగా, తాలిబాన్లకు చెందిన ఉగ్రవాదులు వారి బస్సు పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఎనిమిది మంది మృతి చెందగా, ఆరుగురు శ్రీలంక ఆటగాళ్లు, సిబ్బంది గాయపడ్డారు. వెంటనే ఆ మ్యాచ్ ను రద్దు చేసుకొని, శ్రీలంక ప్లేయర్స్ ను క్రికెట్ గ్రౌండ్ లోనే హెలికాప్టర్ ఎక్కించి, శ్రీలంకకు తీసుకెళ్లారు. ఆ రోజును క్రికెట్ చరిత్రలో బ్లాక్ డే గా పరిగణించారు.
8. క్రికెట్ జట్టులోని ఆటగాళ్ల మధ్య స్నేహం, అవగాహన ఉంటే ఆ జట్టు రాణిస్తుంది. కానీ కొన్నిసార్లు ఆటగాళ్ల మధ్య తప్పుగా అర్ధం చేసుకోవడం జరుగుతుంది. ఇలాగే ఢాకా ప్రీమియర్ లీగ్ లో జరిగింది. ఒక మ్యాచ్ లో బ్యాట్స్ మెన్ కొట్టిన ఒక బాల్ ను పట్టుకోవడానికి బంగ్లాదేశ్ బౌలర్ నసుమ్ అహ్మద్, వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ ఇద్దరు వెళ్లారు. ఆ ప్రయత్నంలో ఇద్దరు ఢీకొన్నారు. రహీమ్ బాల్ ను పట్టుకున్నాడు. అయిన కోపంతో నసుమ్ అహ్మద్ ను కొట్టడానికి చేయి పైకి ఎత్తాడు. కానీ తనను తాను కంట్రోల్ చేసుకుని ఆగాడు.
9. 1981 లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలవాలంటే చివరి బంతికి 6 పరుగులు చేయాలి. అంటే చివరి బంతిని సిక్స్ కొడితే న్యూజిలాండ్, కొట్టలేకపోతే ఆస్ట్రేలియా గెలుస్తుంది. అయితే ఆసీస్ బౌలర్ బంతిని కొట్టడానికి వీలు లేకుండా వేశాడు. దాంతో న్యూజిలాండ్ ఓడిపోయింది. బ్యాట్స్ మెన్ కోపంతో బ్యాట్ విసిరేసి వెళ్ళిపోయాడు. బాల్ అలా వేయడం తప్పు కానప్పటికీ, క్రీడాస్పూర్తికి విరుద్ధం. న్యూజిలాండ్ ఫ్యాన్స్, తో పాటు ఆస్ట్రేలియా ఫ్యాన్స్ కూడా ఆ బౌలర్ పై ఆగ్రహించారు. రెండు దేశాల పీఎంలు కూడా దీన్ని విమర్శించారు. అయితే దీన్ని చాపెల్ బ్రదర్స్ కావాలని చేశారు.
10. 1996 లో ఇండియా శ్రీలంక మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో దేశమంతా సిగ్గుపడే సంఘటన జరిగింది. భారత్ 15.5 ఓవర్లలో 120 పరుగుల వద్ద 8 వికెట్లు కోల్పోవడంతో భారత అభిమానుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. గ్రౌండ్లో కి బాటిల్స్, చెప్పులు స్టేడియంలోకి విసరేసి, సీట్లకు నిప్పు అంటించారు.
మ్యాచ్ ను 30 నిమిషాల పాటు ఆపారు. తరువాత మ్యాచ్ మొదలు పెట్టగా పరిస్థితి అలాగే ఉండడంతో డిఫాల్ట్‌గా శ్రీలంక గెలిచినట్లుగా ప్రకటించారు. మార్చి 13, 1996, క్రికెట్ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోయింది. అలాగే షేమ్ ఫుల్ ఇన్సిడెంట్స్ లో ఈ సంఘటన ముందు వరుసలో ఉంటుంది.