దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన ‘ఏజెంట్’ మూవీ ఏప్రిల్ 28న విడుదల అయ్యింది. అయితే మొదటి షో నుండే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.
ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ రావడంతో కొంతమంది హీరో అఖిల్ పై, మరికొంత మంది సురేందర్ రెడ్డి పై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి కథను సమకూర్చిన రచయిత వక్కంతం వంశీ పై నెటిజెన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
అక్కినేని అఖిల్, సురేందర్ రెడ్డి కలయికలో వచ్చిన ఈ పాన్ ఇండియా మూవీ తెలుగుతో పాటు కన్నడ, తమిళ, హిందీ మలయాళ భాషల్లో కూడా ఒకేసారి విడుదల అయ్యింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా సాక్షి వైద్య నటించగా, మలయాళ మెగా స్టార్ మమ్ముట్టి ముఖ్యమైన పాత్రలో నటించారు. బాలీవుడ్ నటుడు డినో మోరియా విలన్ గా కనిపించారు. ఈ చిత్రం కోసం అఖిల్ అక్కినేని చాలా కష్టపడ్డాడు. పూర్తిగా తన లుక్ నే మార్చుకున్నాడు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ రిలీజ్ అయిన అన్ని చోట్ల నెగెటివ్ టాక్ వస్తోంది.
డైరెక్టర్ సురేందర్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన తీరు పై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. హీరో, డైరెక్టర్ ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. కొందరు అయితే డైరెక్టర్ సురేందర్ రెడ్డికి చేతకాకే ఇటువంటి చిత్రాన్ని తీశారంటూ తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. కొందరు హీరో అఖిల్ నటన పై ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి కథను అందించిన రైటర్ వక్కంతం వంశీని నెట్టింట్లో తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం ఈ మూవీ స్టోరీ కోసం వంశీ భారీగా రెమ్యునరేషన్ తీసుకునట్లు వార్తలు రావడమే.
వక్కంతం వంశీ గతంలో కిక్, ఉసరవెల్లి, ఎవరు, రేసుగుర్రం వంటి పలు హిట్ సినిమాలకు కథలు సమకూర్చారు. మంచి రచయితగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఏజెంట్ సినిమా స్టోరి కోసం వక్కంతం వంశీ 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దాంతో సోషల్ మీడియాలో వక్కంతం వంశీని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.
Also Read: అఖిల్ అక్కినేని “ఏజెంట్” సినిమాలో… మైనస్ అయిన 5 విషయాలు ఇవేనా..?




ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ నేతృత్వంలో తమ స్వగ్రామం అయిన నిమ్మకూరులో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటిలో పాల్గొన్న బాలయ్య మాట్లాడుతూ తెలుగువారి హృదయాలలో ఎన్టీఆర్ శాశ్వతంగా నిలిచిపోయారని అన్నారు. ఎన్టీఆర్ కు జన్మనిచ్చిన భూమి అయిన నిమ్మకూరు గ్రామాన్ని పర్యాటక స్థలంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. తమ నాయనమ్మ కట్టించిన ఒక దాబాను కూడా ఎన్టీఆర్ కి అంకితమిస్తున్నామని తెలిపారు.
అన్నగారు అని తెలుగువారు అప్యాయంగా పిలుచుకునే ఎన్టీఆర్ పుట్టిన ఇల్లు ఇప్పటికి నిమ్మకూరులో అలాగే ఉంది. ఆ ఇంట్లో ఆయనకు సంబంధించిన ఫోటోలు, కొన్ని వస్తువులు ఉన్నాయి. ఇక ఈ ఇంటి బాగోగులను హరికృష్ణ కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాకముందే నటుడిగా ఉన్న సమయంలోనే స్వగ్రామం కోసం తన వంతు కృషి చేశారని స్థానికులు తెలిపారు. తన పలుకుబడిని ఉపయోగించి రోడ్డు వేయించారని, వంతెన కట్టించారని అక్కడివారు అన్నారు. ఇక ముఖ్యమంత్రి అయిన తరువాత రెసిడెన్షియల్ స్కూల్, దేవాలయం, హాస్పటల్ కట్టించారని చెప్పారు.
రెసిడెన్షియల్ విద్యాసంస్థల వల్ల నిమ్మకూరుకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటికి కూడా ఈ స్కూల్ లో వందల మంది విద్యార్ధులు చదువుతున్నారు. రెసిడెన్షియల్ స్కూల్ ఇంచార్జ్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈ స్కూల్ లో చదివిన వారిలో డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఎఎస్, ఐపీఎస్, ఇస్రో పనిచేస్తున్నవారు కూడా ఉన్నారని తెలిపారు. మహిళల శిక్షణ మరియు ఉపాధి కోసం నిమ్మకూరులో నైపుణ్యాభివృద్ధి మరియు మహిళా సాధికారత కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పథకాలతో పాటు, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఎన్టీఆర్ తన కుమారుడు హరికృష్ణ నిమ్మకూరులోనే చదివించారు. హరికృష్ణతో కలిసి చదువుకున్నవారు ఇప్పటికి ఇక్కడ ఉన్నారు. అలాగే హరికృష్ణ కుటుంబ సభ్యులు తరుచుగా ఇక్కడికి వస్తుంటారు. శతజయంతి ఉత్సవాలలో భాగంగా బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు నిమ్మకూరులో ఎన్టీఆర్ కి నివాళులు అర్పించిన విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కూడా నిమ్మకూరులో స్థలం కొన్నట్టు తెలుస్తోంది.
ఎన్టీఆర్ హయాంలోనే బందర్ కాలువ వంతెన, వాటర్ ట్యాంక్, రోడ్డు మంజూరు చేయించారని, పనులన్నీ కూడా ఏడాదిలోనే పూర్తి అయ్యాయని స్థానికులు అప్పటి సంగతులను వెల్లడించారు. ఇలా నందమూరి తారక రామారావు గారు తనకు జన్మనిచ్చిన గ్రామం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.






ఢీ షో కొరియోగ్రాఫర్ చైతన్య నెల్లూరులోని ఒక హోటల్ గదిలో ఆదివారం నాడు ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పుల బాధలు తట్టుకోలేక ఇటువంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లుగా చైతన్య సెల్ఫీ వీడియోలో వెల్లడించాడు. అప్పుల తీర్చే శక్తి ఉన్నప్పటికి, ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నానని ఆ వీడియోలో తెలిపాడు. చైతన్య మరణ వార్త షాక్ కు గురి చేసిందని, అతనికి అప్పులు ఉన్నట్టు తమకు తెలియదని సన్నిహితులు అంటున్నారు.
డ్యాన్స్ మాస్టార్ చైతన్య మృతికి యాంకర్ రష్మి, శేఖర్ మాస్టర్, శ్రద్ధాదాస్ లతో పాటు ఢీ షో డ్యాన్సర్లు కూడా సంతాపం తెలుపుతున్నారు. అయితే చైతన్య మరణం గురించి తెలిసి ఢీ కంటెస్టెంట్లు, చైతన్య సన్నిహితులు అప్పుల వల్ల బలవన్మరణానికి పాల్పడ్డాడు అంటే నమ్మలేకపోతున్నాం. చైతన్యకు అప్పులు ఉన్నాయనే సంగతే తమకు ఇప్పటి వరకు తెలియదని, చైతన్య వాటి గురించి తమతో మాట్లాడి ఉంటే అందరం చర్చించుకుని ఈ సమస్యకు మార్గాన్ని ఆలోచించేవాళ్లం, అలాగే చైతన్యకు మద్దతుగా ఉండేవారమని తెలిపారు.
అయితే చైతన్య ఎప్పుడూ తన సమస్యను మాతో షేర్ చేసుకోలేదని, తనలోనే బాధపడి, ఆఖరికి ఇలాంటి డిసిషన్ తీసుకున్నాడని విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ చైతన్య తన సమస్యను, బాధను సన్నిహితులతో పంచుకుని ఉంటే ఇలా అయ్యేది కాదేమో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. తమ బాధని ఎవరితో పంచుకోకుండా తమలో తామే కుంగిపోతూ చివరికి ఇలాంటి నిర్ణయాలు తీసుకుని తమ జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ఇక డాన్స్ మాస్టర్ చైతన్య కూడా అటువంటి తప్పే చేశాడు. తన సమస్య గురించి కానీ, పరిస్థితి గురించి ఎవ్వరితో పంచుకోలేదు. తనలో తానే బాధపడుతూ ఆఖరికి ప్రాణం తీసుకున్నాడు. ఎంతో ఎత్తుకు ఎదుగుతాడనుకున్న కొడుకు తమ కళ్ళ ముందే మరణించడంతో చైతన్య తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు.
కొరియోగ్రాఫర్ చైతన్య బలవన్మరణానికి ఆర్ధిక ఇబ్బందులే కారణం అని తెలుస్తోంది. అప్పుల బాధను భరించలేక, ఆ ఒత్తిడిని తట్టుకోలేక ప్రాణం తీసుకుంటున్నట్లు మరణానికి ముందు చైతన్య సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. ఆ వీడియోలో తన బలవన్మరణానికి కారణాలను వెల్లడించాడు. కొరియోగ్రాఫర్‌గా మంచి భవిష్యత్ ఉన్న డాన్స్ మాస్టర్ చైతన్య ఇలా అర్ధాంతరంగా కన్నుమూయడం అందరినీ కలిచివేసింది.
చైతన్య మరణం పై పలువురు టెలివిజన్ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్త పరుస్తున్నారు. ఈ క్రమంలో చైతన్య మాస్టర్ మరణం పై డ్యాన్సర్ కండక్టర్ ఝాన్సీ తాజాగా స్పందించారు. ఆయన మరణం పై విచారం వ్యక్తం చేసింది. చైతన్య తీసుకున్న ఈ తొందరపాటు నిర్ణయంతో ఆయన ఫ్యామిలీ అంతా బాధపడుతోంది. చైతన్య డబ్బులు ఇవ్వవలసిన వారితో కూర్చుని తన పరిస్థితి వివరించినట్లయితే ఇలా జరిగి ఉండేది కాదేమో అని అన్నారు.
అందరూ చైతన్యతో కలిసి జర్నీ చేసినవారే. అందులోనూ కళాకారులు వేధించే అంత కఠినమైనవారు కాదు. ఆయన ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడో, చైతన్య తోటివారికి సహాయం చేసేవాడని తెలిపింది. నాలుగు రోజుల క్రితమే డాన్స్ మాస్టర్ చైతన్యను కలిసి ఢీ డ్యాన్స్ షోలో తనకు ఛాన్స్ ఇవ్వమని అడిగానని, దానికి ఆయన నెక్స్ట్ సీజన్ లో తప్పకుండా అవకాశం ఇస్తానని చెప్పారు. ఆయన తన కింద ఉన్న డాన్సర్లకు కూడా చాలా గౌరవం ఇస్తారని డ్యాన్సర్ ఝాన్సీ తెలిపారు.
1.జీవన తరంగాలు:
2.మీనా:
3.సెక్రటరీ:
4. అభిలాష:
5. ఏప్రిల్ 1 విడుదల:
6. ఛాలెంజ్:
7. సితార:
8. అహా నా పెళ్ళంట:
9. చంటబ్బాయ్:
10. ఆఖరి పోరాటం:
11. దొంగ మొగుడు:
12. జ్యోతి లక్ష్మి:
13. మిధునం:
14. జ్యో అచ్యుతానంద:
15. అ..ఆ:























టాలీవుడ్ లో ప్రస్తుతం వరుసగా మల్టీ స్టారర్ చిత్రాలు వస్తున్నాయి. కానీ దానికి కారణం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై నిర్మించారు. ఈ మూవీలో పెద్దోడిగా వెంకటేష్, చిన్నోడిగా మహేష్ నటించి మెప్పించారు. మహేష్ బాబుకు జంటగా హీరోయిన్ సమంత నటించగా, వెంకటేష్ కు జంటగా అంజలి నటించింది.
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రంలో కుటుంబాలు, కటుంబ సభ్యుల మధ్యన ఉండే అనుబంధాల గురించి చాలా బాగా చూపించారు. ఈ చిత్రంలోని పాత్రలను చాలా సహజంగా చూపించారు. ఎంతలా అంటే ఈ మూవీ మన ఇంట్లో లేదా పక్కింట్లోనో జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇక మహేష్, వెంకటేష్ నటన నిజంగా అన్నతమ్ముళ్ళేమో అన్న విధంగా నటించారు. వారి నటన ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అన్నతమ్ముళ్ళ మధ్య వచ్చే సీన్స్ వారి ఎమోషన్స్ ను కూడా చక్కగా చూపించారు.
కుటుంబ పెద్దగా ప్రకాష్ రాజ్, ఆయన భార్యగా జయసుధ తమ పాత్రలలో ఒదిగిపోయారు. ఆమె అత్తగా, హీరోలకి బామ్మగా సీనియర్ నటి రోహిణి హాట్టంగడి నటించారు. అత్తకోడళ్ల మధ్య అనుబంధాన్నిచక్కగా చూపించారు. అయితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను తొలగించారు. అయితే ప్రస్తుతం డిలీట్ చేసిన ఆ సీన్ ను సోషల్ మీడియాలో నెటిజెన్లు షేర్ చేస్తున్నారు.
ఆ సన్నివేశంలో ఒక మహిళ జయసుధను మీ అత్తగారు మీతోనే ఉంటుందా అని అడిగితే, దానికి జయసుధ ఆమె మాతో కాదు మేమే మా అత్తగారితో ఉంటున్నాం. ఆమె ఉండమంటే ఉంటాం. లేదంటే లేదు అంతా మా అత్తగారి ఇష్టమే అని చెప్తుంది. ఈ సీన్ చూసినవారు నిజంగా ఇలా ఉంటే ఎంత బాగుంటుందో అని కామెంట్స్ చేస్తున్నారు.